మన సినిమాల్లో పాటలు

our-films-their-films

సత్యజిత్ రాయ్ వ్యాసావళి “Our films, their films” తెలుగు అనువాదం లో భాగంగా వస్తున్న ఈ వ్యాసం “Those Songs” అన్న ఆంగ్ల వ్యాసం అనువాదం.

our-films-their-films

‘హిందీ సినిమాలా? ఏవీ ఆ పాటలూ అవీ ఉండేవేనా?’ అవును. ఈ ఉపమానం మనం ఊహించే స్థాయికంటే ఎక్కువగానే ప్రచారం పొందింది. నేను విదేశాలకి వెళ్ళినప్పుడు నేనెక్కడ బాధపడతానో అని కాస్త సంశయిస్తూ ఈ ప్రశ్నను అడిగిన వారెందరో. మీ సినిమాలు ఎందుకలా ఉంటాయని అడిగిన ప్రతిసారీ నాకు తట్టిన వివిధ రకాల జవాబుల్లో కొన్నింటిని చెప్పి సమాధానపరచడానికే ప్రయత్నించాను. భారతీయులకి సంగీతం అంటే చాలా ఇష్టం అన్న భావన వాటిలో ఒకటి. ‘వీళ్ళకి పాటలంటే ఇష్టం. వాటి కోసమే సినిమాకి మళ్ళీ మళ్ళీ వెళ్ళి వస్తూ ఉంటారు.’ కానీ, ఇలా అనగానె ఇంకో ప్రశ్న – ‘అంటే, పాటల్లేకుంటే సినిమా నడవలేనంత ఇష్టమా మీ జనాలకి పాటలంటే?’ ఇదిగో, ఇక్కడే ఇక జవాబు లేకపోయేది. భారతీయులకి ఏ ఇటాలియన్లో, ఫ్రెంచి వారో, రష్యన్లో అమెరికన్లో – వీరికంటే సంగీతం పై ఆసక్తి ఎక్కువ అని ఘంటాపదంగా చెప్పగల సాక్షమేమీ లేదు కదా!

రెండో రకం జవాబు ఊరికే భుజాలెగరేసి – “మీకు తెలియనిదేముంది? ఒక సినిమాలో ఏదో పాట బాగా హిట్టవుతుంది. తరువాత ఇంకోటి..తరువాత మరోటి..” అనెసి మళ్ళీ భుజాలెగరేస్తాను. ఈ జవాబులోని నిస్సహాయత తెలుస్తూనే ఉంది. ఇలా పెరుగుతూ పోయే సంగీతం మాయలో అసలు కళ సినిమా మరుగున పడిపోతోందన్న భావన కలిగిస్తుంది ఈ జవాబు. మూడో జవాబు, బహుశా ఇదే అసలు జవాబేమో – భారతదేశంలోని అసంఖ్య ప్రజానీకం లో చాలా మందికి సినిమా ఒక్కటే తక్కువ ఖర్చుతో దొరికే ఏకైక కాలక్షేపం. పాశ్చాత్యుల్లా వీరికి సంగీతం కచేరీలు, నాటకాలు, కన్సర్టులు, పర్మనెంట్ గా ఉండే సర్కస్ వంటి మార్గాలు లేవు. కానీ, ఒక్కోసారి ఇలాంటివి చూడాలన్న కోరిక నెరవేరాలి కదా. అది సినిమా తీర్చలేకపోతే ఇంకేదీ తీర్చలేదు.

ఇప్పుడిక మీకు పరిస్థితులు, ఈ ఫార్ములాకి మూలం అర్థమయ్యాయి కనుక సుశిక్షితులై, మంచి అభిరుచిని వృద్ధి పరుచుకోలేని వారి కోణం నుంచి సార్వజనీన కాలక్షేపం కోసం ఏం చేయాలన్నది ఆలోచిస్తే ఇలా అన్నింటినీ తనలో ఇముడ్చుకున్న సినిమాని మించిన మంచి మార్గం లేదని మీరు కూడా ఒప్పుకుంటారు. ఇక్కడ జరిగేదీ, కొన్నాళ్ళ వరకూ జరగబోయేదీ కూడా ఇదే. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటీ అంటే ఇది ఇలా ఎన్నేళ్ళుగా పాతుకుపోయిన సంప్రదాయమంటే మనం ఇది తెచ్చుకున్న ప్రత్యేకతలను కూడా గుర్తించలేము. ప్రపంచ సినిమాలో ఇన్ని మార్పులు జరుగుతున్నా కూడ చెక్కుచెదరకుండా ఉన్న ఈ ప్రత్యేకతలను ఓ సారి తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంగీతపరమైన కథ కాని సినిమాలో ఎలాగో ఓ ఆరు పాటల్ని జొప్పించమంటే నా వల్లకాదని నేను చేతులెత్తేస్తాను. బలవంతపెడితే నేను ఎదురుతిరుగుతానేమో. కానీ, సగటున సినిమాకి ఆరుపాటలు అన్నది ఇక్కడ సర్వసాధారణం. ఇన్నేళ్ళ చరిత్రలో దీన్ని గురించి అంత వ్యతిరేకత ఎదురవనే లెదు. అప్పుడప్పుడూ కొందరు చిన్న సంఖ్యలో వ్యక్తులు వీటి గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ చిన్న పత్రికల్లో వ్యాసాలు రాసినా కూడా, ఆ పత్రికల పాఠకులు చాలా తక్కువ. ఆ మధ్యోసారి ఓ అమెరికన్ పత్రిక లో హిందీ సినిమా పై ఓ విమర్శ చదివాను. అందులో ఇలా పాటలు ఉండడాన్ని పొగుడుతూ ఇలాంటివాటివల్లే పాఠకుడికి ఇదంతా నిజం కాదన్న అనుభవం వస్తుంది అని అభిప్రాయపడ్డాడు. దీన్నే Brechtian Alienation Effect అంటారు.
“భారతీయ అవాస్తవికతా సంప్రదాయం లో భాగమైన ఈ కళ చాలా ఆసక్తికరమైనది” అని వ్యాఖ్యానించాడతడు. మన సినిమాలు తీసేవాళ్ళు నిజంగా మన పాటల గురించి ఇలా ఆలోచిస్తారేమో నాకు తెలీదు. పాటలు సినిమా కథలో భాగమైనంత వరకూ నాకు వాటితో ఏ సమస్యా లేదు వ్యక్తిగతంగా. అలాగే, కళాత్మకత పరంగా కూడా పర్వాలేదు.

మనకిక్కడ ఉండే ఓ వింత సంప్రదాయమేమిటంటే మన ప్రేక్షకులు సినిమాల్లో ఎవరు పాట మొదలుపెట్టినా ఆ పాట అప్పటికే నేపథ్య గానాల రాజ్యాన్నేలుతున్న ఓ అరడజను మంది గాయనీ గాయకుల గొంతుకల్లోనే ఉన్నా కూడా అంగీకరించడం. జన్మానికో శివరాత్రికి పాడె గొంతుక ప్రదర్శించే గొంతుకకు నప్పవచ్చు కానీ, అలా నప్పాలని ఎవరూ ఆశించరు. ఈ ప్రక్రియ తో సంబంధం లేని వారికి ఈ వ్యవహారమంతా వింతగా కనిపించవచ్చు కానీ, మన వారికి అసలు షాక్ తగిలేది కొత్త గాయకుల గొంతుకలు విన్నప్పుడు.

ఒక ఫాటని సినిమాలో ఎలా చూపాలి అన్న విషయం గురించి ఎంత ఆలోచనా, ఎంత శ్రమతో కూడా పని ఉంటుంది అన్నది ఆసక్తి కరమైన విషయం. పాటల చిత్రీకరణంటే కేవలం నృత్యాల విషయమే కాదు. ఆ పాట సంగతి కూడానూ. నృత్యాలని కెమెరా, ఎడిటింగ్ లలో ఎలాగో చూసుకోవచ్చు. చెట్టు చెట్టు వెంటో లేక కిటికీల వెంబడో పాడుకుంతూ తిరగడం, మధ్యలో ఏ స్థంబాన్నో కౌగిలించుకోడం – వీటికంతా కాలం చెల్లిపోయింది. ఇప్పుడు పాటలకి కూడా దర్శకులు ఉంటున్నారు. ఇప్పుడు పాట లోని ఒక్కో దృశ్యమూ ఒక్కో నేపథ్యంలో చిత్రీకరించినా ఆశ్చర్యం లేదు. సినిమా కథతో సంబంధం ఉన్నంత కాలం ఈ సాహసంతో నాకొచ్చిన సమస్యేమీ లేదు. అంటే సినిమా అంతా ఇలా ఉండాలని కాదు కానీ, ఇలాంటి పాటలు పెట్టడానికి అనువైన అవాస్తవికత సినిమాలో కొంతైనా ఉండాలి.

చివరగా, ఈ పాటల్ని రాసేవారు, వాటిని స్వరపరిచేవారూ -ఈ ఇద్దరు మేధావుల గురించి మాట్లాడతాను. మా అబ్బాయికి హిందీ సినిమా పాటల్లో ఉన్న ఆసక్తి వల్ల నేను హిందీ పాట ఎలా అభివృద్ధి పొందింది అన్నది చూస్తూనే ఉన్నాను. వీటిలో తరుచుగా కనిపించే కొత్తదనం నన్నెప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. కవిత్వం పరంగా చూస్తే బహుశా అవి గొప్పవేమీ కావేమో, కానీ, ఏ పాటల్ని మనం కవితలతో పోల్చగలం? నిజానికి ఓ మంచి పాటకి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం అందులో కవిత్వం పాలు తక్కువగా ఉండటం. ఎందుకంటే కవిత్వానికీ, సంగీతానికి మధ్య ఉండే సంబంధం వేరు. అయితే, ప్రత్యేకంగా గమనించాల్సినవి ఆ ట్యూన్లు మరియు ఆ ఆర్కెస్ట్రా పనిచేసే విధానము.

ముందుగా శాస్త్రీయ, జానపద, నీగ్రో, గ్రీక్, పంజాబి, ఛా-ఛా – ఇలా ప్రపంచంలోని ఏ సంగీత సంప్రదాయాన్నైనా సరే, దన్ని తిసుకుని మనకి తగ్గట్లు వాడుకోవడం. అంతే కాదు, రకరకాల సంగీత పరికరాలను ఉపయోగించి వీలైనంత వైవిధ్యం సృష్టించడం మాటలు కాదు. అందుకు వారికి కొన్ని ప్రశంసలు ఇవ్వాల్సిందే. ఆధునిక బెంగాలీ పాటలో సంగీతం అన్న పదానికి ఇవన్నీ అర్థాలే. అస్తమానం కొత్తదనం కోసం ఉండే ఒత్తిడిలోనే అప్పుడప్పుడూ బహుశా ఈ “ప్రేరణ” పొందడం వంటివి జరుగుతాయనుకుంటాను. అయ్తిఏ, మొజార్ట్ అత్యుత్తమ సింఫనీని తీసుకుని అందులోంచి ఓ సినిమా పాటను సృష్టించి మెప్పించగల స్వరదర్శకుడిని చూస్తే నాకు కోపం కలగడం కంటే కూడా ఎక్కువగా ముచ్చటేస్తుంది.

-1967
****************************************************************************

Disclaimer:
The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

సౌమ్య

రచయిత:

7 Comments to “మన సినిమాల్లో పాటలు”

  • ఆలోచించాల్సిన విషయమే! నిజంగా ఈ పాట అవసరమా? అని ఆలోచించి ఈ మధ్యకాలంలో ఎవరూ పాట పెట్టడం లేదు. ఆరు పాటలుంటేగాని ఆడియో క్యాసెట్ అవదు కాబట్టి అదే సంఖ్యలో సినిమాలో పాటల్ని జొప్పిస్తారంతే!

  • nice

  • ఓ సినిమాలో కథ నడపటానికి పాటలు అవసరమా అంటే లేదనే చెప్పొచ్చు. పైపెచ్చు, ‘పథేర్ పాంచాలి’ లాంటి సినిమాలను పాటలతో ఊహించుకోలేము. కథలో లీనమై చూసేటప్పుడు, అవి అడ్డంకిగా కూడా అనిపిస్తాయి. ఒకవేళ పాటలు పెట్టినా, అవి మన భారతీయ ప్రేక్షకులు మాత్రమే చూసి ఆనందిస్తారుగాని, ఎంత సబ్ టైటిల్స్ పెట్టినా, విదేశీ ప్రేక్షకులకు అవి అర్థం అవుతాయనుకోను. కథ ప్రేక్షకుడికి అర్థం అవటానికి పాటలవల్ల ప్రత్యేకంగా ఒనగూడే ప్రయోజనం ఏమి ఉండదు. అయితే, మరో కోణంలో ఆలోచిస్తే, పాటలనేవి మన భారతీయ చిత్రాల్లో ఎప్పటినుంచో ఒక అంతర్భాగమై పోయాయి. మన ప్రేక్షకులను అవి లేకుండా, సినిమా చూడమంటే, వాళ్లకు కఠినమైన పథ్యం పెట్టినట్టు ఉంటుంది. సత్యజిత్ రాయ్ కూడా ‘చారులత’ వంటి సినిమాలో పాటలు పెట్టారు (కథతో సంబంధించే అనుకోండి). పాటలు లేని సినిమాలు వ్యాపారపరంగా విజయవంతమైన సందర్భాలు కూడా మనకు తెలిసి దాదాపుగా లేవు. సినిమా పాటలు కవిత్వ స్థాయిలో ఉన్న సందర్భాలు చాలా తక్కువ అన్న రాయ్ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవించలేను. హిందీ, తెలుగు, తమిళం వంటి భాషల సినిమాల్లో కవిత్వస్థాయితొ తులతూగకల పాటలు ఎన్నో ఉన్నాయి. నిజానికి ఆ పాటలు రాసినవారు చాలావరకు సహజంగా కవులే. పాట ప్రత్యేకత పాటదే. సినిమా ఒక్కసారి కూడా చూడకుండా, కేవలం ఆ సినిమాలోని పాటలను విని ఆనందించే వాళ్ళూ ఉన్నారు. అయితే, వెనకటి సినిమాల్లో పాటలు కథకు సంబంధించే ఉండేవి. ఇప్పుడు మాత్రం అది ఫక్తు వ్యాపారధోరణి అయిపోయింది. ఇటువంటి పాటలవల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక సినిమా మనం చూసి ఆనందించాలంటే, పాటలు ఉన్నందువల్ల నష్టమేమి లేదు. అదే సినిమా, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రేక్షకులకు అర్థం కావాలంటే, పాటలు లేకపోవటమే మంచిది.

  • మనల్ని పాటలెంత ప్రభావితం చేస్తాయంటే, దెబ్బకి ఆ పాటలతో మనల్ని ఆనందింప
    చేసిన వారిని ఆల్మోస్ట్ కింగునో కింగు మేకర్నో చేసేంత!

    -చక్రపాణి

  • నాన్‌సెన్స్; తీయడం రాక వచ్చిన తంటాలు ఇవ్వన్నీను.సినిమాకి పాటలే ప్రాణం. అవి సరిగ్గా లేకపోతే, సినిమాయే లేదు అని నమ్మే మనిషిని నేను.

    అదే ’చారులత’ పాటలో స్వింగింగ్‌కీ, శ్రీదేవి “సిరిమల్లె పువ్వా..” పాటలో స్వింగింగ్‌కి తేడా మరి.

    పాటల్లేకుండా మంచి సినిమా తీసిన ఘనులు అసలు ఎంతమంది ఉన్నారు, చూపించండి! రామ్ గోపాల్ వర్మ హిట్ అయిన అన్ని చిత్రాల్లొనూ పాటలు కూడా హిట్ అయినాయి. చివరికి ఫైయిలైన సినిమాలో కూడా ఒకటి రెండు పాటలు హిట్ అయినాయి.వాడూ ఒకప్పుడిలాగా వాగినా, వాడు వదిలేయలేదే!

    ఫ్రెండ్స్! ది పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. మేక్ ది సాంగ్స్ మోర్ మీనింగ్ ఫుల్. అంతేగానీ, దాని అవసరం ఏంటీ? అని ప్రశ్నించుకొని వదులుకోవటం, మనదైన ఓ ప్రత్యేకతని ఎవడో ఏడిపించాడని వదులుకోవడమే ఔతుంది. కొత్త ప్రత్యేకతను సంతరించుకున్నప్పుడు, పాటల లేమి గుర్తించను కూడా గుర్తించలేనట్టు ఉండాలి మరి!

    ఆడియో బిజినస్ మోడల్ వేరేగా ఉందని గుర్తించండి చాలు!

    ఇఫ్ యూ రీడ్ కేర్ ఫుల్లీ, రే వజ్ నాట్ కంప్లీట్లీ ఎగైన్స్ట్ ఇట్. హీ ట్రైడ్ టు రీజన్ ఇట్ ఔట్. వాంటెడ్ ఏన్ ఎక్స్‌ప్లనేషన్ ఫర్ “దెమ్”. నాట్ ఫర్ అజ్! అండ్ టుడే, ఇట్ నీడ్ నాట్ బీ ఎక్స్‌ప్లైన్డ్. దే విల్ గెట్ యూజ్డ్‌ టు ఇట్. అండ్ విల్ ఎంజాయ్ టూ.

    • @రేరాజు: ఇక్కడ సమస్య “పాటలు ఉండాలా వద్దా” అని కాదనుకుంటాను. సినిమా నెరెటివ్ కు అనుగుణంగా పాటలు ఉంటున్నాయా లేదా అనిమాత్రమే.

      ఆడియో బిజినెస్ ఉందికాబట్టే ‘ఆరు పాటల ఫార్ములా’ మనదగ్గర ఉంది. అందుకే అవసరం ఉన్నా లేకపోయినా పాటలుంటున్నాయి. అవి సినిమా వ్యాపారగణితానికి ఉపయోగకరంగా ఉన్నా,కథా గమనానికి మాత్రం (మెజారిటీ) నిరోధకంగా ఉంటున్నాయి.

      రే సినిమాల్లో సంగీతానికి ఎప్పుడూ వ్యతిరేకి కాదు.కానీ ఈ అర్థంపర్థం లేని జొప్పించుడు మాత్రమే ఇబ్బందికరం అంటున్నారు.

      • నా కది అర్ధం అయ్యింది మహేష్. నా వ్యాఖ్యను మరొక్కసారి చదవండి.
        కాపీ కొట్టడంలో, పాటలెలా చొప్పించాలన్న ఆలోచనకే అలసిపోయి, పాటలనూ మానేస్తారామేనన్న భయం కనబడుతుంది. :) ఆ తర్వాత తెలుగు పాట కూడా మిగలదేమోనన్న కంగారు కనబడుతుంది.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories