Menu

మాస్కో,బెల్జియం

moscow-belgium అప్పుడెప్పుడో చూసిన Man Bites Dog అనే సినిమా తప్ప వేరే బెల్జియన్ సినిమాలేవీ చూసినట్టు నాకు గుర్తులేదు. Man Bites Dog కాకుండా నాకు పరిచయున్నఇంకొక బెల్జియన్ సినిమా L’Enfant. ఈ సినిమాకి 2005 లో Cannes లో ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ఈ రెండు సినిమాలు తప్ప బెల్జియన్ సినిమాల గురించి ఏమీ తెలియని నాకు మొన్న బుకరెస్ట్, రొమానియా లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఒకేసారి రెండు బెల్జియన్ సినిమాలు చూసే అవకాశం దొరికింది. ఇందులో ఒకటి Moscow,Belgium కాగా మరొకటి Eldorado అనే మరో సినిమా.

బెల్జియం సినిమా మాస్కో లో జరగడమేంటా అనుకున్నాను నేను. తీరా చూస్తే మాస్కో అనేది బెల్జియంలోని ఒక ప్రదేశమట. (ఇలాంటి టైటిల్ తో ఉన్న మరో సినిమా Paris,Texas. ప్యారిస్ అనేది టెక్సాస్ లోని ఒక ప్రదేశమట. ఈ సినిమాకూడా చాలా బావుంటుంది.)

Moscow,Blegium టైటిల్ బెల్జియంలో Aanrijding in Moscou అని ఉంటుంది. అంటే ఇంగ్లీషులో Collision/Accident in Moscow అని అర్థం.పేరుకు తగ్గట్టుగానే సినిమా ఒక యాక్సిడెంట్ తో మొదలవుతుంది.

Matty వయసు నలభై ఏళ్ళకు పైనే. పెళ్ళయి ముగ్గురు పిల్లలు కూడా. అంతా బావుందనుకుంటున్న సమయంలో భర్త ఆమెనొదిలేసి వేరే ఆమెతో సహజీవనం సాగిస్తుంటాడు. Johnny వయసు ముప్ఫై లోపే. వృత్తిరీత్యా ట్రక్ డ్రైవర్. తను రాత్రుళ్ళు ట్రక్ నడుపుకుంటూ ఎక్కడెక్కడో తిరుగుతుంటే అతని ప్రియురాలు వేరే అతనితో వెళ్ళిపోతుంది. భర్త తననొదిలేసాడన్న దిగులుతో ఒక రోజు షాపింగ్ చేసి ఇంటికి తిరిగొస్తూ Matty తన కారుతో Johnny ట్రక్ ని గుద్దుతుంది. అలా మొదలవుతుంది Johnny మరియు Matty ల పరిచయం.

యాక్సిడెంట్ లో పాడయిన Matty కారు డిక్కీ ని ఫ్రీగా రిపేర్ చేసిపెడ్తానంటూ ఇంటికొస్తాడు Johnny. పని పూర్తయ్యక డిన్నర్ చేసి వెళ్తానంటాడు. డిన్నర్ చేసాక వారాంతంలో పబ్ కెళ్దామంటాడు. కాదంటూనే అవునంటుంది Matty. వారాంతానికి ఇద్దరూ బాగా దగ్గరవుతారు.
ఇదిలా ఉండగా Matty ని వదిలివెళ్ళిన ఆమె భర్త Werner పిల్లలను చూడ్డానికి తరచుగా ఇంటికొస్తూ Johnny గురించి తెలుసుకుంటాడు. తన భార్య వేరే వాడితో తిరగడం జీర్ణించుకోలేకపోతాడు, అదీ కాక తన ప్రియురాలితో తరవుగా గొడవలు పెట్టుకుంటూ ఉండడం వల్ల మళ్ళీ పాత జీవితానికి తిరిగ్చ్చేద్దామా అనే ఆలోచనలో ఉంటాడు. One night stand అనుకుని Johnny తో Matty ఏర్పరుచుకున్న పరిచయం అంతటితో ఆగదు. ఒక వేళ ఆపాలనుకున్నా Johhny ఆగనివ్వడు. ఒక వైపు తన జీవితంలోకి తిరిగొచ్చేస్తాననే భర్తను అహ్వానించాలా లేక తన జీవితంలోకి కొత్తగా ప్రవేశించిన Johnny తో కొత్త జీవితం ఆరంభించాలా అనే అనుమానంతో సతమతమైపోయే Matty కథ ఈ Moscow, Belgium.

సినిమా కథ వినడానికి రొమాంటిక్ కామెడీలా ఉన్నప్పటికీ సినిమా చాలా మలుపులతో అద్యంతం ఆసక్తికరంగానూ, హాస్యభరింతంగానూ సాగుతుంది. కథ చిన్నదైనా కథనం మనం అనుకోని మలుపులతో సాగుతుంది.ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశం స్క్రిప్ట్. రొమాంటిక్ కామెడీలో ఉండాల్సిన అన్ని cliche లు ఈ సినిమాలో ఉన్నప్పటికీ అవన్నీ కూడా తెచ్చిపెట్టినట్టుగా (హాలీవుడ్ సినిమాల్లోలాగా) ఉండవు.

ఉదాహరణకు Matty ని కలవడానికి Werner ఇంటికొచ్చిన ప్రతిసారీ అతని ప్రియురాలు ఫోన్ చేస్తుంటుంది. అయితే కథ లో ఉన్న ఈ అవకాశం చూసుకుని బోలెడు కామెడీ సీన్లు రాయొచ్చు కానీ ఈ సినిమా లో మాత్రం Werner మరియు Matty లు కలుసుకున్న ప్రతిసారీ కూడా ఫోన్ SMS వచ్చినట్టుగా బీప్ చేస్తుంటుంది. సినిమా మొత్తంలో వాళ్ళు కలుసుకున్న ప్రతీ సారి ఇలానే జరుగుతుంది. అంటే డైలాగులేవీ లేకుండానే ఈ సన్నివేశాల్లో చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు రచయిత.

అలాగే ఈ సినిమా స్క్రీన్ ప్లే రచయితలను మరో విషయంలో అభినందించాలి-అది పాత్రల రూపకల్పన. ఈ సినిమాలో పాత్రలు సినిమా చివరకి వచ్చేసరికి మనకు ఎంత పరిచయస్థులుగా అనిపిస్తారంటే Matty చివరకి Johnny తో ఉండిపోవాల్సి వస్తే అయ్యో ఎందుకు ఇలా చేస్తుందీమె? తప్పు తెలుసుకుని తిరగొచ్చేస్తున్న భర్తతో హాయిగా కాపురం చేసకోవచ్చుకదా చెప్పాలనిపిస్తుంది. ఒక వేళ ఆమెకి కూడా అలానే అనిపించి భర్తతోనే ఉండిపోదామనిపిస్తే ఒకసారి వదిలివెళ్ళిన వాడు కుదురుగా ఉంటాడని నమ్మకమేంటి? అదేదో హాయిగా చిన్నవాడైనా మంచి వాడిలా అనిపిస్తున్న ఆ Johnny తో ఉండడమే మేలు కదా అని చెప్పాలనిపిస్తుంది.

ఒక విధంగా Matty పాత్ర అనుభవించే గందరగోళాన్ని మనం అనుభవించేలా చేస్తారు దర్శక-రచయితలు. ఎలా ఐతే ఆమె Johnny మరియు Wener ల మధ్య ఒక నిర్ణయానికి రాలేకపోతుదో ప్రేక్షకుడు కూడా చివరకు అదే గందరగోళంలో ఉంటాడు. ఒక్క Matty పాత్రనే కాకుండా అన్ని పాత్రలకూ మంచి/చెడులు కలిసిన రంగులద్దడం ద్వారా ఫలానా పాత్ర మంచి, ఫలానా పాత్ర కాదు అని ప్రేక్షకుడు (సినిమాలో పాత్రలలాగే) ఎటూ నిర్ణయించుకోలేకపోతాడు. నేనీ విధంగా సినిమాలోని పాత్రల్లో ఎవరిని సపోర్ట్ చెయ్యాలని సతమతమైన మరో సినిమా (Crying Fist అని ఒక కొరియన్ సినిమా) ఉంది. దాని గురించి మరోసారి.

ఈ సినిమాలో Matty, Johnny, Werner ల పాత్రలు కాకుండా Matty పెద్ద కూతురుగా టీనేజ్ అమ్మాయి పాత్ర Vera ది సినిమాలోకెల్లా నాకు బాగా నచ్చిన పాత్ర. అటు సీరియస్ గానూ ఉండక మరీ ఫన్నీగానూ ఉండక ఎప్పుడూ ఒకరకమైన చిలిపితనం కలిగిన చూపుతో చాలా బాగా తీర్చిదిద్దారు ఈ పాత్రను. ఒక వైపు పెద్ద వాళ్ళు ఇలా ఎందుకు తమ జీవితాలను కాంప్లికేట్ చేసుకుంటారో అనుకుంటూనే తన జీవితంలో కొత్తరకమైన కాంప్లికేషన్ కొనితెచ్చుకునే పాత్ర ఈమెది.

Matty పాత్రలో Barbara Sarafian అద్భుతంగా పోషించింది. ఆమె నటన కోసమైనా ఈ సినిమా ఒక సారి చూడొచ్చు.

చిక్-ఫ్లిక్, రొమాంటిక్ కామెడీ genre సినిమాలలో రొటీన్ ఉండే కథను నమ్మదగిన పాత్రల ద్వారా ఎంతో చాకచక్యంగా ఆ genre సినిమాలకు భిన్నంగా రూపొందించిన ఈ సినిమా దర్శకుడు Christophe Van Rompaey కి  ఇది మొదటి సినిమా. గత సంవత్సరం cannes లో రెండు (ACID మరియు Grand Golden Rail) అవార్డులు గెలుచుకుందీ సినిమా.

వీలైతే తప్పక చూడాల్సిన సినిమా. నా మాట మీద నమ్మకం లేకపోతే రోటన్ టొమాటోస్ లో చూడండి 96%  ఫ్రెష్ రేటింగ్ ఉందీ సినిమాకు.

చివరిగా,  సినిమా ఆఖరు రీలు వరకూ నాకు బాగానే ఉంది. కానీ ఎంత కాదన్నా చివర్లో చాలా సినిమాల్లాగే cilched అనిపించింది నాకు.

2 Comments
  1. Jonathan April 2, 2009 /