Menu

ఇక సినిమాలూ పాఠ్యాంశాలే..

film-studyవెధవకు పాఠాలు కన్నా సినిమాలు బాగా గుర్తుంటాయి..అంటూ మన నాన్నలు తిట్టే అవకాశం ఇక ఉండకపోవచ్చు..ఎందుకంటే NCRT వారు స్కూల్లో ,కాలేజీల్లో సినిమాలను పాఠ్యాంశాలుగా చేర్చే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పిల్లలకు చిన్నతనం నుంచే సామాజిక సమస్యలమీద సరైన అవగాహన ఉండాల్సిందే. అలా ఉంటే వారు పెద్దయ్యాక గొప్ప వ్యక్తులవుతారని…అందుకు మార్గం సామాజిక సందేశాలు,హిస్టారికల్ ఫిల్మ్స్ అని NCRT వారు భావిస్తున్నారు.

సినిమాను ఎడ్యుకేషన్ టూల్ గా ఉపయోగించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జనవరి నుంచి ఆ తరహా ప్రయోగాలు ప్రారంభం కానున్నాయి. గరం హవా,హకీకత్,జంజీర్ వంటి కొన్ని ఎంపిక చేసిన సినిమాలు,మరికొన్ని చారిత్రక చిత్రాలతో సామాజిక సమస్యలమీద కొంత అవగాహన వచ్చే అవకాశముందని వారు ముందుకెళ్తున్నారు. అయితే ఇవి ఏ తరగతి నుంచి ప్రారంభించాలనే విషయంపై ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నాయి.

ఇంటర్ లో పొలిటికల్ సైన్స్ కి ఈ సినిమాలను స్టడీ మెటీరియల్ గా పెట్టాలని కొందరు మేధావులు ప్రపోజల్స్ పెట్టారు. ఇక ఈ విషయమై ఎన్ సి ఆర్ టి ప్రతినిధి డాక్టర్ మల్లా ప్రసాద్ మాట్లాడుతూ స్టూడెంట్స్ కి మేం పెట్టే సినిమాలను తప్పనిసరి అని అనం..అలాగే వీటిపై పరీక్షలు పెట్టం..కానీ మేం నెలల తరబడి చెప్పే విషయాలని ఇవి గంటల్లో ప్రభావవంతగా బోధిస్తాయనటంలో సందేహం లేదు..అందుకే జనవరి నుంచి ఎంపిక చేసిన కొన్ని కాలేజీల్లో ప్రయోగాత్మకంగా వీటిని ప్రారంభించనున్నాం అంటున్నారు.

ఇదే విషయంపై యోగీంద్ర యాదవ్(CSDS) మాట్లాడుతూ నాకు పర్శనల్ గా ఇప్పటికీ గుర్తు ఉంది. గరమ్ హవా సినిమా నాపై చాలా ప్రభావం చూపింది. నేను దేశ విభజన ను పుస్తకాల్లో చదువుకున్నాను కానీ ..నేను ఆ సినిమా చూసాక విభజన పరిణామాణ తీవ్రత , ముస్లిం కుటుంబాలు ఏ విధమైన ఇబ్బంది పడ్డారో స్పష్టంగా అర్ధమైంది. అలాగే ఆక్రోశ్ చూసాక ఆదివాసి అంటే ఏమిటో అర్ధం తెలిసింది అంటూ సినిమాలు..సమాజంపై ప్రభావం గురించి చెప్పుకొచ్చారు.

ఇక రీజనల్ పిల్మ్స్ లో మారాఠి సినిమా సింహాసన్,తమిళ రోజా,సత్యజిత్ రే పధేలీ పాంచాలి సినిమాలు పెడదామనే నిర్ణయానికి వచ్చారు. ఇక ఈ చిత్రాల ప్రదర్శన కోసం స్కూల్స్ లో కొన్ని పరికరాలు(టెలివిజన్ వంటివి) ఏర్పాటు చేయటానికి నిర్ణయించారు. ఇవన్నీ ఒకెత్తు అయితే మన తెలుగు సినిమా ఒక్కటీ ఈ లిస్టులో లేకపోవటం విచారకరం. ఇంతకీ మనకిక్కడ పాఠాలుగా సినిమాలు పెట్టాలంటే..ఏ సినిమాలు పెట్టవచ్చు అంటారు.

9 Comments
  1. మేడేపల్లి శేషు April 27, 2009 / Reply
  2. Malakpet Rowdy April 27, 2009 / Reply
  3. Malakpet Rowdy April 27, 2009 / Reply
  4. రాజశేఖర్ April 27, 2009 / Reply
  5. రాజశేఖర్ April 27, 2009 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *