స్టైల్ ఐకాన్ ఫిరోజ్‌ఖాన్‌ మృతి

feroze-khan

feroze-khanప్రముఖ బాలీవుడ్‌ నటుడు, నిర్మాత ఫిరోజ్‌ఖాన్‌ (69) ఆదివారం అర్ధరాత్రి బెంగళూరులోని తన ఫార్మ్‌హౌస్‌లో (తుమ్కూరు రోడ్) కన్నుమూసారు. గత కొంత కాలంగా కాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. సెప్టెంబర్‌ 25, 1939లో ఆయన బెంగళూర్‌లో జన్మించిన ఆయన 1960లో దీదీ చిత్రంతో ఫిరోజ్‌ఖాన్‌ బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసిన ఆయన ఖుర్బానీ,ధర్మాత్మా చిత్రాలతో సెటిలయి జాన్‌బాజ్‌, దయావన్‌, జానాషీర్‌, ఏక్‌కిలాడీ, ఏక్‌ హీసీనా, ఊంచేలోగ్‌, ఆర్జూ, ఆద్మీఅవుర్‌ ఇన్సాన్‌ వంటి సూపర్ హిట్స్ ని సృష్ఠించారు. అలాగే ఆయన టార్జాన్ గోస్ టు ఇండియా(1962) అనే ఆగ్ల చిత్రంలోనూ నటించి అందరి మన్ననలూ పొందారు.

పర్శనల్ జీవితానికి వస్తే..ఆయన సుందరి అనే డిజైనర్ ని 1965 లో వివాహం చేసుకున్నారు. వారికి లైలా,ఫర్ధీన్ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు .ఇరవై సంవత్సరాల వివహ జీవితానంతరం (1985)వారు విడాకులు తీసుకున్నారు. ఈ మధ్యే ఫర్ధీన్ నటాషా మధ్వానీని వివాహం ఆడారు. ఆమె ఒకప్పటి తార..ఫర్ధీన్ కొన్ని సినిమాల్లో జంటగా చేసిన ముంతాజ్ కూతరు. ఇక కూతరు లైలా ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ రోహిత్ రాజపాల్ ని వివాహం చేసుకుంది.

అక్షయ్ కుమార్ వెల్ కమ్ చిత్రంలో చివరిసారిగా నటించిన ఫిరోజ్‌ఖాన్‌ మరణ వార్తను బాలీవుడ్‌ జీర్ణించుకోలేకపోతోంది. ఆద్మి అవుర్ ఇన్సాన్ చిత్రానికి గానూ ఈయన 1970 లో ఫిల్మ్ ఫేర్ అవార్డుని అందుకున్నారు. 2000 వ సంవత్సరంలో లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డును పొందారు. అలాగే నటుడు ఫర్దీన్‌ఖాన్‌కు ఫిరోజ్‌ఖాన్‌ తండ్రి . దర్శక, నిర్మాతలు సంయ్‌ఖాన్‌, సమీర్‌ఖాన్‌, అక్బర్‌ఖాన్‌లు ఫిరోజ్‌ఖాన్‌ సోదరులు.సంజయ్ ఖాన్ కూతరునే హృతిక్ రోషన్ వివాహం చేసుకున్నాడు. నేడు బెంగళూరులో జాన్సన్ మార్కెట్ స్మసానంలో సాయిత్రం 5.30 ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

భారత సినీ చరిత్రలో స్టైల్ ఐకాన్ గా పేరొందిన ఫిరోజ్ ఖాన్ మరణం కి నవతరంగం మనసారా సంతాపం వ్యక్తం చేస్తోంది.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

4 Comments to “స్టైల్ ఐకాన్ ఫిరోజ్‌ఖాన్‌ మృతి”

  • హిందీ రంగంలో మొట్టమొదటి దక్షిణాది(బెంగుళూరు) హీరో మరణం కడు విచారకరం. నటుడిగా, నిర్మాతగా,దర్శకుడిగా ఫిరోజ్ ఖాన్ హిందీచిత్రరంగాన్ని కొన్ని కొత్త పుంతలు తొక్కించాడనడంలో ఎటువంటి సందేహం లేదు.

  • ఫిరోజ్ దక్షిణాది వాడని ఈ రోజే తెలిసింది – not that it makes any difference. అద్భుతమైన నటుడు కాకపోవచ్చు కానీ నిజంగానే స్టైల్ కింగ్.

  • ఫిరోజ్ ఖాన్ దక్షిణాదివారా….! ఇ౦త వరకు అస్సలు తెలీదు. ఆయన మరణ౦ విచారకర౦. నవతర౦గ౦ ద్వారా నా ప్రగాఢ స౦తాప౦ తెలియజేస్తున్నా.

  • I’ve read somewhere that Firoz khan Ancestors worked as Ministers under Nizam rulers. They migrated to Bangalore and Mysore during Razakar movement . It may not be entirely true.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories