అధో గతి నేత (రివ్యూ)

adhineta

adhinetaహమ్మయ్య…ఎలక్షన్స్ అయిపోయాయి…హోరెత్తిన వాగ్ధానాలకు, బురద జల్లుకోవటాలకు,కోట్లాటలకు ఇక తెరపడినట్లే.. అని కాస్త రిలాక్సు అవుదామని సినిమాకు వెళితే…మళ్ళా అక్కడా అదే సీన్లు..అదే అధినేత ప్రేక్షకుడు పాట్లు. ఓ సామాన్యుడు అనుకోని పరిస్ధితుల్లో సిఎం అయితే ఎలా ఉంటుంది అనే పాయింటుతో వచ్చాం అని పబ్లిసిటీ చేసిన ఈ చిత్రం చివరకు బోర్ మిగుల్చింది. అయినా మల్లెపూవు వంటి చెత్తను తీసిన సముద్ర అంతకు మించి ఆశించటం అనవసరమే అనిపించేలా చేసాడు. ప్రారంభం నుంచి ఎటునుంచి ఎటువెళ్తుందో అర్ధం కాని కథ,సన్నివేశాలు,డైలాగులతో సినిమాని పూర్తిగా నింపేసారు. అప్పటికీ సీనియర్స్ పరుచూరి బ్రదర్స్ సాయం తీసుకన్నా ఫలితం లేకపోయింది. అలాగే 2006 లో వచ్చిన మరాఠి సినిమా Na. Mukhyamantri Ganpya Gawde నుంచి అసలు పాయింట్,మొయిన్ సీన్స్ లిఫ్ట్ చేసినా వర్కవుట్ కాకపోవటం మరో మైనస్.

కథలోకి వెళ్తే సూరిబాబు(జగపతిబాబు) అనే పెళ్ళికాని నిరుద్యోగి ఎక్కడ,ఎవరికి అన్యాయం,అక్రమం జరిగినా తట్టుకోలేడు. ఈలోగా శ్రీరాములు(పరుచూరి గోపాలకృష్ణ) అనే పొలిటికల్ పెద్దాయన రికమెండేషన్ తో ముఖ్యమంత్రి(ఆహుతి ప్రసాద్) పి.ఎ గా జాయిన్ అవుతాడు. అక్కడుండగానే శ్రీరాములు అధికార పక్షం చేత మర్డర్ చేయబడతాడు.అయితే చనిపోయే ముందు శ్రీరాములు తన శిష్యుడు లాంటి సూరిబాబుని పిలిచి ఓ తన రాజకీయ వారసుడువి అవమని ప్రామిస్ చేయించుకుంటాడు. దాంతో స్నేహితుల సాయింతో ఇండిపెండెంట్ గా ఎలక్షన్లో నిలబడి ఎమ్మల్యే అవుతాడు.అనంతరం జరిగిన రాజకీయపరిణామాలతో ముఖ్యమంత్రి అవుతాడు. అక్కడ నుంచి అతను ఏ విధంగా ప్రజలకు తోర్పడ్డాడు…ఎలా ప్రత్యర్ధుల కుట్రకు బలై తిరిగి లేచి నిలబడ్డాడు..తన రాజకీయ గాడ్ ఫాధర్ హత్య ముడి ఎలా విప్పాడు..అనేది మిగతా కథ. అంతేగాక ఇలాంటి కథలో హీరోయిన్ లవ్ ట్రాక్ ఎలా పెట్టారు..కామెడీ ఎక్కడ వచ్చే అవకాశం ఉందన్నది తెలియాలన్నా ఓపిగ్గా సినిమా చూడాల్సిందే.

స్ట్రైయిట్ నేరేషన్లో చెప్పిన ఈ కథలో జగపతిబాబు పాత్ర సెకండాఫ్ సగం దాకా సమస్యలోకి వెళ్ళదు. దాంతో కాంప్లిక్ట్ లేక డ్రామా పుట్టలేదు..అది బోర్ కి దారితీసింది. అలాగే హీరోయిన్ పాత్రని పస్టాఫ్ లో కేవలం డ్రీమ్ సాంగ్స్ కే పరిమితం చేసారు. ఎక్కడా హీరోని ఒక్కసారి కూడా కలవటం కూడా జరగదు..ఇది మరి ఎడిటింగ్ సమస్యో..మరేమో అర్ధంకాదు. అలాగే ఈ సినిమా కోసం తీసుకున్న మరాఠి సినిమా కామెడీ చిత్రం. అందులో హీరో సామాన్యులకు ప్రతినిధి…కాస్త అమాయికత్వం పాళ్ళున్నవాడు. దాంతో అలాంటి వాడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కితే ఏం చేస్తాడు..సమస్యలను ఎలా ఎదుర్కొంటాడు అనే ఉత్కంఠ ఏర్పడింది. అదే ఇక్కడకొచ్చేసరికి హీరో చాలా తెలివైన వాడు..అన్యాయాలు..అక్రమాలు ని చీల్చి చెండాడేస్తూంటాడు. అలాంటి వాడు ఏదైనా చెయ్యగలడనిపిస్తుంది. అలాగే సూపర్ హిట్ ఒకే ఒక్కడు చిత్రంలోంచి అర్జున్ మారువేషం గెటప్,కొన్ని కీలకమైన సీన్లు తీసుకున్నారు. కానీ అవేమీ అందంగా అతకలేదు.పొలిటికల్ చిత్రం అంటున్నారు కాబట్టి సంగీతం వదిలేయవచ్చు.

అంతేగాక సముధ్ర గత చిత్రం ఎవడైతే నాకేంటిలో ముమైత్ లాంటి పోలీస్ పాత్రను మళ్ళీ పెట్టారు..కానీ అదీ కథలో కలవలేదు. ఇలా ఏ సీన్ కా సీన్ విడిగా ఉండటం విసుగు తెప్పించే అంశం. పొలిటికల్ సెటైర్ డైలాగులుకు పెట్టింది పేరైన పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రంలోనూ అక్కడక్కడా తమ కలం బలం చూపారు. ఏ ప్రాజెక్టుకీ మన గవర్నమెంట్ తెలుగు లెజెండ్స్ పేరు పెట్టలేదు..అంతా డిల్లీ నాయకుల పేర్లే పెడతారు.కొత్త గవర్నమెంట్ వస్తే ఆ పరిస్దితి మారుస్తారేమో అని అంటారు ఓ చోట..మరో చోట ఉదయించే సూర్యుడు,మార్పు కోరుకుంటున్నాం అంటూ పీఆర్పీ ని గుర్తు చేస్తారు. అలాగే పోగ్రస్ పార్టీ,ఆంధ్ర దేశం పార్టీ,మా దేశం పార్టీ అంటూ పేర్లు పెట్టి పార్టీలపై కొన్ని చురకలు వేసారు.వీటికి తోడు సముద్ర సినిమాలు టెక్నికల్ గా పూర్ గా ఉండంటం,అతి బిల్డప్ లు పాత తమిళ చిత్రాలను గుర్తుకు తెస్తూంటాయి.కెమెరా,ఎడిటింగ్ వంటివి కథకు తగ్గట్లే ఉన్నాయి. అయితే నిర్మాత చేత మాత్రం బాగా ఖర్చు పెట్టించినట్లు తెలిసిపోతూంటుంది.

ఈ సినిమాను ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ చేసారంటూ చాలా మంది బాధ పడుతున్నారు..కానీ ఎప్పుడు రిలీజ్ చేసినా దీని ప్రభావం ఏమీ ఉండదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏ విషయంపైనా స్పష్టమైన సెటైర్స్ గానీ,మెసేజ్ గానీ ఇవ్వలేకపోయారు. ఎవరైనా లీనమై ఈ సినిమా చూస్తే పొరపాటున ముఖ్యమంత్రి కాకూడదని మాత్రం డిసైడ్ అవటం ఖాయం. ఇక ఓటేయని వారని ఈ సినిమాకి పంపితే సరైన శిక్ష వేశినట్లే.

బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌
నటీనటులు: జగపతిబాబు, శ్రద్ధాదాస్‌, హంసానందిని, నీలిమ, పరుచూరి గోపాలకృష్ణ, ఆహుతి ప్రసాద్‌, ఆనంద్‌రాజ్‌, చలపతిరావు, అన్నపూర్ణ, శివపార్వతి తదితరులు.
నటీనటులు జగపతిబాబు,శ్రధ్ధా దాస్,హంసా నందిని,నీలిమ,ఆహుతి ప్రసాద్,ఆనంద్ రాజ్,పరుచూరి గోపాల్ కృష్ణ,చలపతి రావు,అన్నపూర్ణ,శివపార్వతి తదితరులు.
సంగీతం :శ్రీకాంత్ దేవా
కెమెరా :ప్రసాద్ బాబు
ఎడిటర్ :నందమూరి హరి
ఫైట్స్ రామ్ లక్ష్మన్
కథ,మాటలు : పరుచూరి బ్రదర్స్
సమర్పణ: సదాశివుని రవి
నిర్మాత: కె.కె.రాధామోహన్‌
స్క్రీన్ ప్లే..దర్శకత్వం: వి.సముద్ర
రిలీజ్ డేట్ : 24/04/2009

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

4 Comments to “అధో గతి నేత (రివ్యూ)”

  • Ah! వెల్. చాలా బాగా చెప్పారు. పొద్దున్న ఆ అదృష్టం కొద్దిలో తప్పింది. ఈ మధ్యన కనబడటం లేదేన్టండీ?

    పేపర్ ప్రకటన ఇద్దామనుకున్నా. :-D

    Review is excellent. You told the right story. I have seen the Marathi movie.

    >>>ఇక ఓటేయని వారని ఈ సినిమాకి పంపితే సరైన శిక్ష వేశినట్లే.
    *** *** ***

    ఎంతమాటన్నారండీ బాబూ. నేను ఓటెయ్యలేదు. దానికి బలమైన కారణం ఉంది. అయినా చూడటం చూడక పోవటం నా చేతుల్లో పని. నేను చూడను గాక చూడను. మీరు చెప్పెశారుగా. ;-)

  • జోస్యులగారూ సుస్వాగతం. మీరు లేకపోతే కొత్త సినిమాలు నవతరంగంలో కరువేసుమా!

  • నేను, నా పేరు చైతన్య , నవతరంగం వెబ్ సైట్ మొత్తం ఇవాలె చూసాను మరియు చదివాను. నాకు అర్దమయింది ఎందుకు ఇండియా ఇంకా ఇక్కడే ఉంది అని.. ఒక తప్పు గురించి వంద మంది మట్లాడతారు.. వంద మంచి పనులను గురించి ఒక్కడు మట్లాడతాడు. ఎందుకు అంటె ఈ వెబ్ సైటే చూసిన ప్రతి ఒక్కరు ఎదొ ఒక తప్పు గురించి చెప్పడం చూసాను.. మీకు నచ్చిన విషయం ఒకిటి కూడ లెదా ? సినెమాలు మారడం కాదు మీరు మారండి మీతొ కూడ సినెమాలు మారుతాయి.. సినెమాలతొ కొంచం అన్నా ఇండీయ మారుతుంది.. ! !! Everybody thinks of changing humanity…… n nobody thinks of changing himself !!

  • Chaitanya,

    There are plenty of things that we like. Please read the articles. You will find a lot of articles written in positive light.

    The aim of the site is to promote good films. Most of us are interested making a good film someday.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories