Menu

Monthly Archive:: April 2009

గుడ్డీ

ఒక స్కూలు విద్యార్థిని. అల్లరి పిల్ల. ఇద్దరన్నల ముద్దుల చెల్లెలు, కాస్త గారాబం. సినిమాలంటే పిచ్చి. అందునా ధర్మేంద్ర అంటే పడి చస్తుంది. ధర్మేంద్ర అంటే దేవుడు. అతనికంటే గొప్పవాళ్లు లేరు . అతని సినిమాలన్నీ శ్రద్ధగా చూస్తుంది. స్కూలు ఎగ్గొట్టి తోటి స్నేహితురాళ్లతో సినిమా షూటింగ్ కి వెళుతుంది. స్కూలు చదువు అయ్యాక బంధువుల అబ్బాయితో పెళ్లి చేస్తామంటే కాదంటుంది. కారణం తన జీవితంలో ధర్మేంద్ర తప్ప వేరే వ్యక్తికి స్థానం లేదంటుంది. ఇదే విషయం

ప్రయోగాత్మకత ప్రయోజనమెంత?

రెండు సంవత్సరాల క్రితం FTII, పూణే వారు చేసిన కొన్ని లఘు చిత్రాలు చూడటం తటస్థించింది. అంత క్రితం దూరదర్శన్ లో ఇలాంటి సినిమాలు చూసినా, ఆ సినిమాలు తీసిన వారితో చర్చించే అవకాశం ఇప్పుడు కలగడంతో , నా అక్కసు వెళ్ళగక్కుకున్నాను. ఆ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు తీసిన ఒకటొఅరా సినిమాలు తప్ప మిగతావన్నీ నా మెట్టబుర్రకు అర్థం కాని చిత్రాలు. విషయవస్తువులు abstract గా ఉండటం, కథన రీతులు పాత్రల తీరుతెన్నుల మీద మాత్రమే కాకుండా

ఇక సినిమాలూ పాఠ్యాంశాలే..

వెధవకు పాఠాలు కన్నా సినిమాలు బాగా గుర్తుంటాయి..అంటూ మన నాన్నలు తిట్టే అవకాశం ఇక ఉండకపోవచ్చు..ఎందుకంటే NCRT వారు స్కూల్లో ,కాలేజీల్లో సినిమాలను పాఠ్యాంశాలుగా చేర్చే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పిల్లలకు చిన్నతనం నుంచే సామాజిక సమస్యలమీద సరైన అవగాహన ఉండాల్సిందే. అలా ఉంటే వారు పెద్దయ్యాక గొప్ప వ్యక్తులవుతారని…అందుకు మార్గం సామాజిక సందేశాలు,హిస్టారికల్ ఫిల్మ్స్ అని NCRT వారు భావిస్తున్నారు. సినిమాను ఎడ్యుకేషన్ టూల్ గా ఉపయోగించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

లేడీస్ టైలర్

తెర మీద సగ౦ మన రాజే౦ద్రుడి కళ్ళజోడు(ఒక కన్నే), మిగతా సగ౦ కుట్టు మిషను చేతి చక్ర౦ కనిపిస్తు౦టాయి. కుట్టు మిషను టప టప మని శబ్ధ౦ చేసుకు౦టా ఏదో కుట్టేస్తూ ఉ౦టు౦ది. అలా కుడుతున్న మిషిన్ ఉధృతికి దార౦ అటు ఇటు ఎగసి పడుతూ ఉ౦టు౦ది. మిషిన్ కి అటువైపు ను౦చి ఇటు వైపుకు దూసుకువస్తున్న జాకెట్ మీదే రాజే౦ద్రుడి దృష్ట౦తా ఉ౦టు౦ది. సరిగ్గా అప్పుడు టైటిల్స్ ప్రార౦భమవుతాయి. దానికి తోడు ఇళయ రాజా గారి

అరుంధతి(A) బాధితుల సంఘం

మీకు అరుంధతి సినీమా మాయాబజారు తరువాత అంతటి గొప్ప చిత్రం అనిపిస్తే మీరు దయచేసి ఈ టపా చదవద్దు. ఇది మీకు పరుషంగా అనిపించవచ్చు. చదివింతరువాత “మీ నవతరంగం ఇంతే, ఇక్కడ రచయితలు ఓర్వలేనితనంగా వ్రాస్తారు, ఈ రచయితని అది చేయండి ఇది చేయండి, ఇది రివ్యూ కాదు, సీరియస్ సైటులో వుండాల్సింది కాదు”, వంటి వ్యాఖ్యలు చేస్తే నాది కాదు పూచి. “ఎంత గొప్ప సినిమా అయినా అందులో మెఱుగులకు అవకాశం వుంటుంది, అసలే ఇదంత