పోస్టర్ చూసి కథ రాయండి

picture-2

చిన్నప్పుడు సినిమా పోస్టర్ చూసి కథ ఊహించుకునేవాళ్ళం. మరికొంత పెద్దయ్యాక పోస్టర్ చూసి ఊహించిన కథ దాదాపు సినిమాలో ఉండేది. ఈ మధ్యకాలంలో పోస్టర్లను బట్టి కేవలం కొన్ని సినిమాల కథలే చెప్పగలుగుతున్నాం. కొంత పొంతన లేనితనం కారణమైతే మరికొంత, కేవలం “లుక్ అండ్ ఫీల్” తప్ప కథ ఎక్కడా చూపని పోస్టర్ల డిజైనింగ్ మొదలవ్వడం కూడా కారణం కావచ్చు. ఈ నేపధ్యంలో మొన్న ఒక వెబ్ సైట్లో పై పోస్టర్ చూసి చాలా ఆసక్తి కలిగింది. ఇదొక కొరియన్ సినిమా పోస్టర్.

picture-2

ఆ పోస్టర్ చూసి ఈ సినిమా కథ ఏమయ్యుంటుందో ఎవరైనా ఊహించి రాయండి చూద్దాం!

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

K మహేశ్ కుమార్

రచయిత:

పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లి. పెరిగింది కుప్పం, పీలేరు మరియు వాయల్పాడు గ్రామాలలో. ఆరోతరగతి నుండీ 'నవోదయ విద్యలయం' లో చదివా. ఈ సెంట్రల్ స్కూల్ పుణ్యమా అని హర్యాణా లోని హిస్సార్ జిల్లాలో రెండు సంవత్సరాలూ, అనంతపురం జిల్లా లేపాక్షి లొ రెండు సంవత్సరాలూ విద్యగడించి, స్కూలు (12th class) ముగిసే సరికీ కాస్త బయటి ప్రపంచంతోపాటూ హిందీ భాష కూడా వంటబట్టింది. ఇక నా జివితంలో సినిమాలంటారా! తమిళ నాడు బార్డరు మా పక్కనే కాబట్టి చిన్నప్పుడే తెలుగు సినిమాలతో పాటూ వాటినీ సాధించాం. అప్పట్లో మనం చూడని సినిమా లెదని నా నమ్మకం. "ఆ సినిమా బాగాలేదు" అని ఎవరైనా అంటే "ఎందుకు బాగాలేదో చూద్దాం" అని వెళ్ళే రకంగా మనకు ప్రసిద్ధి. ఇలా సినిమాలపై దండయాత్ర సాగిస్తుండగానే, కాలేజి చదువులకని మైసూర్ 'రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్' లో చేరటమూ, ఆటోమేటిక్ గా అక్కడి Film Club లో చేరడమూ 1994 లో జరిగిపోయాయి. అప్పటికే తెలుగు,తమిళ సినిమాకు దాస్యం చేస్తున్న మన బుర్రకు అక్కడే భారతీయ, ప్రపంచ సినిమాలు పరిచయమై, దాస్యాన్నితోలగించి కొంత మంచి సినిమా జ్ఞానాన్ని ప్రసాదించాయి. ఇలా సంపాదించిన సినిమా జ్ఞానంతో "ఇక సినిమాలు తియ్యడమే జీవిత లక్ష్యమ్" అనుకుని FTII కలలుకనగా, ఏదో సమస్య వలన ఆ సంవత్సరం అక్కడ "0 year" అయ్యి కూర్చ్ఘుంది. ఏమైతేనేం అని హైదరాబాద్ సెంటల్ యూనివర్సిటీ లో 'MA Communication' 2000 సంవత్సరంలో ముగించి కనీసం "డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్" అనిపించేసాం. ఆతరువాత టివీ చానళ్లలో, సిరియల్స్ లో కొంత 'ప్రయత్నం' చేసినా నిరాశ తప్ప నా ఆశను సాధింఛే మార్గం దొరకక, ఆర్ధికంగా కూడా గిట్టుబాటుకాక `Social/Development Communication Consultant' గా అవతారమెత్తి ఇప్పటిదా బ్రతుకుదెరువు కానిస్తూ, సినిమా కళాపోషణ చేస్తూ కలలు కంటున్నాను. అదేదో కృష్ణవంశి సినిమాలో సంగీత అన్నట్టు మనమూ "ఒక్క ఛాన్సిస్తే" అంటూ నవతరంగంలో చేరి "ఆ చాన్స్ మనమే కల్పింఛుకుందాం" అనే స్థితికి చేరి ఎదురుచూస్తున్నాం.

5 Comments to “పోస్టర్ చూసి కథ రాయండి”

  • I wish that you would have given the Title of the film.

    Anyway if you rotate the image after saving in the system…it looks different…below i try to write my analysis…

    a. it is clearly known that it is a Crime-passion-thriller related genre or film.

    b.if you rotate it looks like she kills anyone after having sex…so if it is correct…the story may go like this…

    she might want something, it may be revenge,money, or anything which is very important to her…or she may be doing this in the line of her duty(if she is an officer)….obviously the other person would be the “hurdle or obstacle” for her goal…it is clearly shown above he is not feared…

    or it may go like this…

    Her parents or friends or something which is very important to her , were taken away by the villain( he may belong to mafia or anything which is not so easily reached by a simple woman).She wants to take revenge…for that she might have chosen the path “thrill and kill”.Her ultimate goal would be the person shown above….

    or

    Two persons shown above might be partners…striving for common goal(money,power or for good if they are officers)….after getting something they split and try to kill one another…for the same goal…

    or

    She is brutally killed by the person shown above and she became the ghost( according to indian traditions a person becomes a “pretaatma” if she is a girl she becomes “kaamatama” or something like that if he or she died with grudge..according to the flowers given in the film “Arundhathi”)….and she may be after him….killing everyone in her way….

    or

    they may be lonely hearts…psychos…kill and thrill type…

    or

    He might be the husband of that woman…and she has some illegal contacts with her colleagues…and they(she and new one) want to kill him…and he is trying to escape…

    or

    it might be basic instinct….

    or

    He might be millionire…and she is sent to thirll him and after that she might be killed and the villain may be after him blackmailing him for money…(or exactly reverse she might be rich…)

    or

    according to me koreans like fantasy films(especially love letters and time travel films) according to that…they may make it fantasy too…like she is an ghost…killing everyone…he might be trying to escape…

    or

    I am completely wrong….

    Thank you…

  • @శ్రీ: ఈ సినిమా పేరు “డ్రాక్యులా” ఇప్పుడు మీ కథ మారుతుందేమో చూద్దాం.

    • if your poster really have some meaning..then he might be changing into beautiful girl at night and kills people for blood…may be that is why they posted her in reverse….whatever it may be…the director should tell story with blood…that is for sure…

  • అయ్యో కధ ఏంటో చెప్పే అవకాశం నాకు లేకుండా పోయింది. ఈ సినిమా ప్రి ప్రొడక్షన్‍లో ఉండగానే విశేషాలు చదివెయ్యడం వల్ల. వచ్చే నెల్లో రిలీజ్ అయ్యే ఈ సినిమా కోసం నేను ఎదురుచూస్తున్నా. పార్క్ చన్ వ్యూక్ వెన్జెన్స్ ట్రయాలజీ చూసినవాళ్ళంతా ఇదే స్ధితిలో ఉంటారని నా అభిప్రాయం. అన్నట్టు ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ ’థ్రస్ట్(thirst)’ కదా, మిరేంటీ డ్రాక్యులా అంటున్నారు. మిస్‍లీడ్ చెయ్యాలనా ;)

  • @శంకర్: పట్టేసారే!

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories