Menu

సత్యమే శివం (2003)

anbe-sivam-wallpaperఅసలు ’సత్యమే శివం’ అంటే –
కమల హాసన్ ఎప్పట్లాగే ఘోస్టు డైరెక్షన్ చేసిన ఓ సినిమా
కమ్యూనిస్టు సినిమా
ఏమిటో, కాస్త బోరు కొడుతుంది
అసలదేం సినిమా? ఎప్పుడొచ్చింది?
వావ్! మంచి సినిమా!
– వీటిలో ఏ స్పందన వచ్చిన మనిషిని చూసినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే అన్ని స్పందనల్నీ విని ఉన్నా కనుక.

ఈ సినిమా 2003 లో వచ్చిన తమిళ సినిమా “అన్బే శివం” కు తెలుగు అనువాదం. తారాగణం: కమల హాసన్, మాధవన్, కిరణ్ రాథోడ్, నాజర్ మొదలైనవారు. దర్శకత్వం: సుందర్ సి. కథ-కమలహాసన్,మదన్, సంగీతం-విద్యాసాగర్. సినిమా విమర్శకుల ప్రశంసలూ అవీ పొందినా కూడా అంతగా డబ్బులు రాబట్టలేదనుకుంటా. తెలుగులో ఐతే అసలు రాబట్టి ఉండదు.

కథ: సదాశివం అనబడు కమ్యూనిస్టు నాయకుడు (కమలహాసన్), తన పేరులోని సత్యాన్ని ఇష్టపడక పేరు పొట్టిచేసుకున్న ఎస్.నంద్ అనబడు అమెరికా రిటర్న్డ్ యాడ్ ఫిల్మ్ దర్శకుడు (మాధవన్) విమానాశ్రయంలో అనూహ్య పరిస్థితుల్లో కలవడంతో సినిమా మొదలౌతుంది. సదాశివం ఐందానికీ, కానిదానికి అవతలి మనిషిపై శ్రద్ధ తీసుకుని వారికి ఇష్టమో లేదో పట్టించుకోకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఎన్నారై నంద్ కి ఇది చిరాకు పుట్టిస్తూ ఉంటుంది. ఇంతకీ, అక్కడ ఒరిస్సా వరదల వల్ల వాళ్ళ ఫ్లైట్ లేటౌతుంది. ఓ హోటెల్లో రూమ్ ఇస్తారు ఆ రాత్రికి. అనుకోని పరిస్థితుల్లో వీరిద్దరూ ఓ రూం చేరతారు. శివాన్ని వదిలేసి నంద్ పొద్దున్నే రైల్వే స్టేషన్ వెళ్ళిపోతాడు. ట్రాక్ కూడా నీళ్ళలో మునగడంతో ట్రైన్ కూడా దొరకదు అక్కడ. ఇంతలో అతని సామాను దొంగ ఎత్తుకుపోతూ ఉంటే శివం ఎంటరై దొంగని ఆపే ప్రయత్నం చేస్తాడు. దొంగ డబ్బులు తీసుకుని పారిపోతాడు.

వీళ్ళిద్దరూ ఇక్కణ్ణుంచి వీలైనంత త్వరగా హైదరాబాద్ చేరుకోవాలి. ఎందుకంటే, నందు కి నాల్రోజుల్లో పెళ్ళి. శివం పనులు అతనివి. ఓ చోట ట్రైన్ కోసం కూర్చుని ఉన్నప్పుడు శివం తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. తను, తన ఉద్యమాలూ, ప్రేమా, అందమైన తన మొహం ఇప్పుడు నిండా గాట్లతో నిండిన వైనం – ఇదంతా గుర్తు తెచ్చుకుంటాడు. కథంతా ఇక వీళ్ళ తిరుగు ప్రయాణం లో ఎదుర్కున్న అనుభవాలు, వీరిద్దరి మధ్యా జరిగిన తగువులు, ఈ ప్రయాణం ముగిసే సరికి నంద్ ప్రపంచాన్ని చూసే విధానంలో వచ్చిన మార్పూ – ఇదీ ఈ చిత్ర కథ.

ఇలా చెప్పానని ఏముందీ? అని చప్పరించేయకండి. చాలా ఉంది. వినసొంపైన హాస్యం ఉంది. డీసెంట్ అనిపించే సంగీతం ఉంది. ఒక ఆలోచనా స్రవంతికి పరిచయం ఉంది. ప్రేమకథ(లు) ఉన్నాయి. ఓ ఆశయం కోసం పోరాడే సైన్యం ఉంది. వారి మధ్య ఉండే స్నేహాలు ఉన్నాయి. మనిషికీ మనిషికీ మధ్య ఉండాల్సిన బంధం గురించి చర్చలు ఉన్నాయి. నా వ్యక్తిగత కోణం నుండి చూస్తే, ఒక విధమైన బ్రతికే విధానం కూడా ఉంది. ఈ కథ చాలా బాగా తయారుచేసారు అనిపించింది. దానికి తగ్గట్లుగా స్క్రీన్‍ప్లే, సంభాషణలు కూడా చాలా బాగా కుదిరాయి. కమల్, మాధవన్ ఇద్దరూ చాలా బాగా చేసారు. మిగితా అందరూ కూడా పాత్రలకి సరిగ్గా సరిపోయారు. కథే హీరో కానీ పాత్రల ఎంపిక కూడా ఈ సినిమాకి చక్కగా అమరింది.

నాకు బాగా నచ్చేసిన సన్నివేశాలు:
-కమల్-మాధవన్ మధ్య నడిచిన ప్రతి సంభాషణా :కామెడీ అయినా, సీరియస్ అయినా
-కమల్ నాజర్ ఆఫీసులో శివుడు-గంగ ఈ కాన్సెప్ట్ తో మార్క్సిజంని చూపిన తీరు (ఈ భావనకి మూలం ఇక్కడ)
-సత్యం శివం…పాట (ఈ సినిమా ఫిలాసఫీకి మూలస్థంభం)
-చివరిలో కమల్ మాధవన్ కి రాసిన లేఖ
-నాజర్ పై వ్యంగ్యాస్త్రంగా కమల్ గుంపు వేసిన వీథి నాటకం
-కమ్యూనిజం కూడా ఓ ఫీలింగ్”
-దేవుడు అన్న పదానికి కమల్ ఇచ్చిన అర్థం (ఈ డైలాగు చెప్పడమే ఈ సినిమా అసలు ఉద్దేశ్యం అని నా అభిప్రాయం)
– కమల్ కీ “శంకు” అనబడు కుక్కకీ పరిచయం అయిన దృశ్యం (ఇక్కడ కూడా ఈ సినిమా ఫిలాసఫీ బాగా అర్థమౌతుంది)

ఈ సినిమా తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ ఇప్పటికి చాలాసార్లు చూసాను. అయినా బోరు కొట్టక మళ్ళీ మొన్నాదివారమే చూశాను. నన్నడిగితే తప్పక చూడమంటాను. నా ఎదుటుండి నాకు చనువున్న మనిషైతే రెండు తిట్లు తిట్టి కూర్చోబెట్టి చూపిస్తాను. ఇలాంటి సినిమాలను ఆదరించకపోతే ఎలాగండీ! మనం మన భారతీయ సినిమా ప్రేమికులమే కాదిక! “అస్తికులైన హితులందరికీ శివమే సత్యమట. నాస్తికులైన స్నేహితులకు మరి సత్యమే శివమంట” – ఎంత నిజం! ఈ సినిమా చూడకుంటే నేను ఏమై ఉండేదాన్నో!

35 Comments
 1. shree March 25, 2009 /
 2. ashok March 25, 2009 /
 3. paro March 25, 2009 /
 4. రవి March 25, 2009 /
 5. Dreamer March 25, 2009 /
 6. Dreamer March 25, 2009 /
 7. Kishore March 25, 2009 /
 8. indhu March 25, 2009 /
 9. శంకర్ March 25, 2009 /
 10. Dhrruva March 25, 2009 /
 11. Vamsi March 25, 2009 /
 12. Madhuravani March 25, 2009 /
 13. అబ్రకదబ్ర March 25, 2009 /
 14. baleandu March 25, 2009 /
 15. suree March 28, 2009 /
  • రమణ మూర్తి March 28, 2009 /
   • రమణ మూర్తి March 29, 2009 /
 16. వేణు March 29, 2009 /
 17. mohan April 2, 2009 /
 18. learner April 15, 2009 /
 19. rayraj May 14, 2009 /
 20. raghav May 15, 2009 /
 21. sanjeev June 19, 2009 /
 22. david June 21, 2009 /
 23. saif ali gorey June 21, 2009 /
 24. Phani July 5, 2009 /
 25. sateesh May 28, 2010 /
 26. వ్యాస.. July 18, 2010 /
 27. pavan santhosh March 22, 2016 /