Menu

స్మరించుకొవటం …కాదు… ఇప్పుడు..కాస్త సహకరించుదాం.

dada-saheb-phalkeశ్రీ దాదా సాహెబ్ ఫాల్కే .
ఈ పేరు కి ఉపోద్ఘాతం అవసరం లేదు.
(మాకు అమెరికన్ సినిమా చరిత్ర మొత్తం తెలుసు కాని…ఇక్కడ..ఆయనెవరో మాకు తెలియదు,ఎక్కడో ఈ పేరు విన్నట్లుంది…అని అనే వారి సౌలభ్యం కోసం…అనుకొనే వారి కోసం…షార్ట్ లో…..)
ఎన్నో రిస్కులను అధిగమించి.. భారత దేశానికి తొలి మూకి చిత్రం రాజా హరిశ్చంద్ర (1913)అందించిన భారత సినిమా పితామహుడు.. శ్రీ దాదా సాహేబ్ ఫాల్కే గురించి తెలియని వారు ఉండరు…భారత దేశపు సినిమా ప్రపంచపు గాంధి ఆయన. ప్రతి సంవత్సరం… ఆయన పేరిట స్మారక అవార్డుని తీసుకునే….ప్రముఖులు ఎంతో మంది, ఆయన పెట్టిన భిక్ష సినిమా మాధ్యమం తో కోట్లు సంపాదించుకున్న ప్రముఖులు …… తమిళ, తెలుగు ,హింది, కన్నడ,మలయాళ, …ఎన్నో భారతీయ భాషా సినిమాల తోఆదర్శనాయకులైన.. వారు ఎంతో మంది.. ప్రస్తుతం.. శ్రీ దాదా సాహెబ్ ఫాల్కే …. గురించి తెలుసుకోవాల్సిన మరో అసలైన విషయం…

ప్రతి హీరో కి అభిమాన సంఘాలు…మొత్తం భారత దేశాన్ని లెక్కలోకి తీసుకుంటే…తమ తమ హీరోల సినిమాలు రిలీజు అయిన రోజు ఎన్నో కోట్ల రూపాయలని ఖర్చు చేస్తూ.. కట్అవుట్ లు , బ్యానర్లు…,వగైర వగైర… భారీ ఖర్చులు చేసే అఖిల భారత అభిమాన …(ప్రపంచ అభిమానులు కూడా..) ప్రస్తుతం .. శ్రీ దాదా సాహెబ్ ఫాల్కే గురించి తెలుసుకోవాల్సిన మరో అసలైన విషయం… చెత్త సినిమాలను వందలకు వందలు పోస్తున్న కోట్ల మంది సినిమా ప్రేక్షకులు మనం… ..
ప్రస్తుతం .. శ్రీ దాదా సాహెబ్ ఫాల్కే గురించి తెలుసుకోవాల్సిన మరో అసలైన విషయం…ఈరోజు భారత దేశ సినిమా ప్రపంచ స్థాయి కి ఎదిగి ఎన్నో అవార్డులు గెలుచుకుంటుందని.. గర్వంగా… చెప్పుకుంటున్న ప్రస్తుత తరుణములో…
శ్రీ దాదా సాహెబ్ ఫాల్కే గురించి తెలుసుకోవాల్సిన మరో అసలైన విషయం…కళామ తల్లి ముద్దు బిడ్డలమని చెప్పుకునే..వాళ్ళంతా.. శ్రీ దాదా సాహెబ్ ఫాల్కే గురించి తెలుసుకోవాల్సిన మరో అసలైన విషయం…ఆయన చివరి దశలో ఆయనను ఆదుకోని సినిమా ప్రేమికులు , ఆయన పేరుతొ స్మారక అవార్డులు పెట్టుకొని తమ పబ్బం గడుపుకొనే.. ఎన్నో సినీ, సాహిత్య ,సాంస్కృతిక సంస్థలు ఆయన కుటుంబ పరిస్థితి మాత్రం బాగో లేదట. ఇండియన్ సినిమా కి నిజమైన…కింగ్, షహెన్షా…, బాద్షా, అయిన..ఆయన చివరి రొజులు చాల ఆర్ధిక …కష్ట నష్టాలతో… చాల దారిద్ర్యము ,పస్తులతో.. గడిచాయి , అలాగే…
ఇప్పటికి కూడ.. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏ మాత్రం మారలేదు,వారి జీవితాలు ఏ మాత్రం… బాగో లేవట. ఇంకా.. దారిద్రం వారింట రాజ్యం ఏలుతుందట.. శ్రీ దాదా సాహెబ్ ఫాల్కే కుటుంబాన్ని ఆదుకోవటానికి ఎవరో ఒకరిద్దరు … తప్ప.. పెద్దగా… ఎవరు అలోచించడమే.. లేదు. ఎవ్వరూ ఆ కుటుంబానికి
ఆర్ధిక సహాయం అందించేందుకు ముందుకు రావడం లేదని కొన్ని భారతీయ ప్రింట్,వెబ్ పత్రికలు.. ఆయన కుటుంబ వాస్తవ విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నాయి. ఆ మహనీయుని కుటుంబ పరిస్థితి ప్రస్తుతం బాగోలేదని ఆయన పేరిట అవార్డులు తీసుకున్నవారు పెద్ద పెద్ద మనసున్న నటులు ఎంతో మంది… , ఆయన సంస్మరణ సభలు పెట్టి మీడియా ముందు గొప్పలు పొయే వారు ఎంతొ మంది. , వీళ్ళెవరికి.. ఇప్పుడు నిజంగా.. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలనే.. ఆలోచన కూడ రాకపోవడం..నిజంగా.. సిగ్గుచేటైన..విషయం. ఈ విషయాలను ఈమధ్యే నేను ఒక వార పత్రికలొ చదివాను. అందుకే…ఆయన పేరిట…సభలు సన్మానాలు,అవార్డులు,కమర్షియల్ టీ ఆర్ పీ లకొసం ప్రొగ్రాములు చేసె టీ వి వాళ్ళు.. కళాసేవ చేస్తున్నామనుకునే వారు,
సంస్కృతిరక్షకులు, దేశ ప్రేమికులు. వగైర వగైర… వాళ్ళందరకి ఈ ఒక ప్రకటన……………ఈ ఒక విజ్ఞాపన………ఈ ఒక విన్నపం,…………ఈ ఒక అభ్యర్ధన,…….ఈ ఒక గమనిక ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనుకునే.. ప్రతి మనసున్న భారతీయునికి ఆయన కుటుంబ ప్రస్తుత చిరునామా..(మరింతగ ఆయన గురించి ఆయన కుటుంబ జీవన స్ఠితిగతుల గురించి ..గూగుల్ లొ శోధించి తెలుసుకోవచ్చు )ఎప్పుడు..(ఎక్కువగా..) పత్రికలవారికి ఇంటర్వ్యూ లు ఇవ్వడం ఇష్టపడని..ఆయన ఒక సారి ఒక ఫిల్మ్ మ్యాగజైను జర్నలిస్ట్ ఎవరొ ఇంటర్వ్యూ కు వెళితే… “The industry to which I gave birth has forgotten me. You may also do the same.” అని చెప్పారట.. నిజమే కదా..ఎంత పాపులర్ హీరోలము..కళాకారులము
.నాయకులము కాదు పాపులర్ పాపులం మనము. భారత తొలి సినిమాలొ … తొలి పాత్ర… రాజ హరిశ్చంద్రుణ్ణి పొషించిన శ్రీ దాదా సాహెబ్ ఫాల్కే చివరకు చెప్పింది కూడ సత్యమే.. కావడం…ఆశ్చర్యం కదూ.
m.chandra sekharpusaalkar.
S/o Vrunda Pusalkar
D.No; 3/77, Sagar Co-operative society ,
6 th floor,Near Rehaza hospital
Mahima (w).MUMBAI. 400016
CONTACT; 022-244459, MOBILE; 09819111625