Menu

Monthly Archive:: March 2009

స్వర్గసీమ

ఐదున్నర దశాబ్ధాల క్రితమే సామాజిక విలువల గురించి, పురుషుడిలో పొడసూపే వివాహేతర సంబంధాల గురించి, కుటుంబ సంబంధ విలువల గురించి చర్చించి వివరించే కళాత్మకమైన చిత్రాన్ని బి.ఎన్.రెడ్డి నిర్మించారు. ఆ కాలంలో హీరోకి చెడు లక్షణాల్ని ఆపాదించి చిత్రం నిర్మించడమే పెద్ద సాహసం. అంతే కాకుండా ఒక స్త్రీ మంచి అవకాశాలు రావడం కోసం తన కెరీర్‌ను నిర్మించడం కోసం ఒక వ్యక్తిని నిచ్చెనగా వాడుకుని, ప్రేమించి, లాలించి, ఆ తర్వాత వదిలించిన వైనాన్ని స్వర్గసీమలో వి.ఎన్.

ఈ తెలుగు చిత్రాలు చూడకండి

ప్రచురణ: రూపవాణి , ఫిబ్రవరి 1946 రచయిత: వి.యస్. దేవర్, బి.ఏ ఏ పనికైనా నిపుణతి, సాహసము, ఓర్పు, త్యాగము ఉండాలి. మనలో సత్తువలేక పొరుగువానిపై బడి ఏడిస్తే లాభమేమున్నది. అంతకంటే అవమానకరమున్నదా? అరవచిత్రాలు చూడవద్దని మొరపెట్టుకొనే బదులు మన ఇల్లు చక్కబెట్టుకోవడం చాలా ఉత్తమమైన విషయము. స్టూడియోలలో ఎక్కడ జూచినా కుళ్ళు, వాసన, అంతా వీధిబడి మనుష్యులు. ఇక వికాసము, విజ్ఞానము ఎక్కడనుండి వస్తుంది? స్వలాభముకోసమో, స్వంతకోరికలు తీర్చుకొనుటకో ఈసినీవృత్తి అవలంబించి కొందరు పెద్దమనుష్యులు డబ్బు

ఉమ్రావ్ జాన్

లక్నో పేరు వినగానే గత కాలపు సంస్కృతి, సంగీతపు ఘుమఘుమలు, నృత్యాలూ, కవితావేశాలూ స్ఫురిస్తాయి. నవాబులూ, “పహలే ఆప్ పహలే ఆప్” అంటూ ముందుకు సాగే వారి గుర్రపు బగ్గీలూ, వారి మర్యాదలూ అన్ని గుర్తుకొస్తాయి. అంతే కాదు లక్నో అనగానే అక్కడ సాగే గజల్లూ, అభిమానుల వహ్వాలు గుర్తొస్తాయి. ఇంతగా గత కాలపు సంస్కృతి చిహ్నంగా కనిపించే లక్నోను నేపధ్యంగా తీసుకొని ముజఫర్ అలీ నిర్మించిన సంగీత నృత్య రసాత్మకమయిన చిత్రం “ఉమ్రావ్ జాన్”. ఒక

ఈ పంథా మార్చకపోతే ప్రేక్షకులు సమ్మె చేస్తారు! జాగ్రత్త

రచయిత: కన్నా చలపతిరావు ప్రచురణ: రూపవాణి “ఏన్నాళ్ళో యీ బందిఖానా” అని కారాగార విముక్తులైన మన నాయకులతోపాటు మనముకూడా స్వతంత్ర మందమారుతములను మేయు సమయములలో కూడా మన తెలుగు డైరక్టర్లలో మార్పేమీ కనుపించదు. “నీవే దిక్కు ఆపద్భాంధవా” అన్నట్లు సి.య.ఆర్, అద్దంకి, బందా, ఆరణి, కన్నాంబ, పుష్పవల్లి కోటిరత్నం. బ్రతికియుంటే పాపం రామతిలకం తప్ప మెరవరూ మోక్షమివ్వరుకాబోలు మనదర్శకులకు. యమా యమీలనుకొన్న పాదుక తారాగణమే వీళ్ళ పసచాటింది. నేడు హిందీ ఫిల్ములు అభివృద్ధి చెందుతున్నాయంటే ఆ దర్శకులేమి

The other side of the wind

సిటిజెన్ కేన్ దర్శకుడు ఆర్సన్ వెల్స్ దర్శక్త్వంలో వచ్చిన చిట్టచివరి సినిమా ’The Other side of the wind’. ముప్ఫై ఏళ్ళ క్రితం వెల్స్ రూపొందించ తలపెట్టిన ఈ సినిమా దురదృష్టవశాత్తూ పూర్తికాలేదు. ఈ సినిమాలోని పూర్తయిన భాగాలు చూసిన వారి అభిప్రాయాల ప్రకారం ఈ సినిమా విడుదలయ్యుంటే వెల్స్ మొదటి సినిమా ’సిటిజెన్ కేన్’ అంత సెన్షేషనల్ సినిమా అయ్యుండేదట. ఫిల్మ్ వితిన్ ఫిల్మ్ టెక్నిక్ ఉపయోగించి రూపొందించిన ఈ సినిమా గురించి మరిన్ని