Menu

Monthly Archive:: March 2009

బారా ఆణా – చిన్న(పెద్ద) సినిమా

సాయంత్రం 5:30 ఆట. అసలే అలవికాని సమయం, అందునా చాలా మందికి పేరైనా తెలీని “చిన్న సినిమా”. అక్కడక్కడా వినడంవల్ల, నసీరుద్దిన్ షా ఉన్నాడన్న ధైర్యంతో PVR లో వెళ్ళి కూర్చున్నాను. సినిమా మొదలయ్యే సరికీ ధియేటర్లో పట్టుమంటే పది మందికూడా లేరు. సినిమా మొదలయ్యింది, ఇంటర్వెల్ వచ్చించి, సినిమా ముగిసింది. ఇంటికొచ్చేశాను. రెడ్రోజులయ్యింది. కానీ…ఆ సినిమా చూసిన అనుభవం ఇంకా నాదగ్గరే ఉంది. ఆ సినిమా పేరు “బారా ఆణా”. మరణించి మళ్ళీ బ్రతుకుతున్న ఒక

సత్యమే శివం (2003)

అసలు ’సత్యమే శివం’ అంటే – కమల హాసన్ ఎప్పట్లాగే ఘోస్టు డైరెక్షన్ చేసిన ఓ సినిమా కమ్యూనిస్టు సినిమా ఏమిటో, కాస్త బోరు కొడుతుంది అసలదేం సినిమా? ఎప్పుడొచ్చింది? వావ్! మంచి సినిమా! – వీటిలో ఏ స్పందన వచ్చిన మనిషిని చూసినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే అన్ని స్పందనల్నీ విని ఉన్నా కనుక. ఈ సినిమా 2003 లో వచ్చిన తమిళ సినిమా “అన్బే శివం” కు తెలుగు అనువాదం. తారాగణం: కమల హాసన్,

పోస్టర్ చూసి కథ రాయండి

చిన్నప్పుడు సినిమా పోస్టర్ చూసి కథ ఊహించుకునేవాళ్ళం. మరికొంత పెద్దయ్యాక పోస్టర్ చూసి ఊహించిన కథ దాదాపు సినిమాలో ఉండేది. ఈ మధ్యకాలంలో పోస్టర్లను బట్టి కేవలం కొన్ని సినిమాల కథలే చెప్పగలుగుతున్నాం. కొంత పొంతన లేనితనం కారణమైతే మరికొంత, కేవలం “లుక్ అండ్ ఫీల్” తప్ప కథ ఎక్కడా చూపని పోస్టర్ల డిజైనింగ్ మొదలవ్వడం కూడా కారణం కావచ్చు. ఈ నేపధ్యంలో మొన్న ఒక వెబ్ సైట్లో పై పోస్టర్ చూసి చాలా ఆసక్తి కలిగింది.

కాంతారావు మరణం.

కత్తి యుద్ధాల వీరుడు, ఒక తరం పిల్లల చందమామ, తెలుగు వారి రాకుమారుడు, కాంతారావు, ఇక లేరు. ఇప్పుడే నేను న్యూస్ లో చూశాను. బాధనిపించింది. అమ్మ చెప్పే కథలూ, నాయనమ్మ చెప్పే కబుర్లూ, నాన్న నేర్పే జీవితం, బుడుగు, చందమామ కథలు ఎలాగో తెలుగు పిల్లలకి ఒక తరంలో కాంతారావు కూడా అలాగ. అక్కినేని, నందమూరి, తరువాత మంచి డిమాండ్ ఉన్న నటుడుగా కాంతారావు, పౌరాణిక, జానపద, సాంఘిక, క్రైం, అలా అన్ని రకాల నటననూ

కత్తిఫైటింగ్ కాంతారావు ఇక లేరు

చిన్నప్పుడు ఎన్.టి.ఆర్ పౌరాణికాలకన్నా టి.ఎల్.కాంతారావు జానపదాలు నాకు బాగా నచ్చేవి. కత్తిఫైటింగులు,కర్రసాములూ, మాయమంత్రాలూ, అందమైన రాకుమార్తెలూ (ముఖ్యంగా రాజశ్రీ), మాయలమారి మాంత్రికులూ, జ్వాలాద్వీపాలూ అబ్బో! అదో అందమైన లోకం. వాటిల్లో విహరించే కాంతారావంటే నాకు మహా అభిమానం ఒకపాలు ఈర్షకూడా ఉండేది. ఇప్పటికీ గండరు గండడు, అగ్గివీరుడు, సప్తస్వరాలు వంటి సినిమాలు టీవీలో వస్తే అన్నీ వదిలేసి చూస్తాను. అంతటి నా అభిమాన హీరో ‘కత్తిఫైటింగ్’ కాంతారావు గారు ఈ రోజు కాలంచేసారు. తాడేపల్లి లక్ష్మీ కాంతారావుగా