మేస్త్రి

mestri

మేస్త్రి లో చిరంజీవి ప్రజారాజ్యంపై సెటైర్స్ ఉన్నాయట కదా.. అనే ఒకే ఒక్క ఆసక్తి జనాల్ని కొద్దిలో కొద్ది ధియోటర్స్ వైపు లాగిందన్నది నిజం. అయితే దర్శకుడు తప్ప అన్నీ తానైన దాసరి మాత్రం ఈ విషయాన్ని (ప్రేక్షకులు ఏదైతే ఆశించి వచ్చారో) వదిలేసి పస్టాఫ్ అంతా పాతకాలం డ్రామాతో నింపేసారు. ఇక ఇందులో అలాంటివేం లేవురా వెళ్ళిపోదాం అని ప్రేక్షకుడు డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ సెటైర్స్ బాణం తీసి ప్రయోగించారు. ఇక ఇందుకు మినహాయింపు ఎందుకనుకున్నాడో ఏమో దర్శకుడు సురేష్ కృష్ణ సైతం పాతకాలం టేకింగ్ ని తీసుకొచ్చి,ఈ పాత కాలం కథకు న్యాయం చేసాడు. అయు పూర్తి రాజకీయ వ్యంగ్యం గానూ లేక,ఇటు రెగ్యులర్ మశాలా చిత్రంగానూ మిగలక,రెండుగంటల సేపు దాసరి షో గా మిగిలింది చిత్రం. ఇక చిరుపై వేసిన సెటైర్స్ బయిటకు వచ్చి పాపులర్ అయితేనే కలెక్షన్స్ పై ఆశ.

పాలకొల్లు(దాసరి)వైజాగ్ షిప్ యార్డ్ లో కూలీగా అన్యాయాలను అక్రమాలను తన అధ్బతమైన తెలివి తేటలతో అంతం చేసేస్తూంటాడు. పనిలో పనిగా అక్కడి వర్కర్స్ కి సంభందించిన భూమి కబ్జా కావటంతో దాని గురించి పోరాడుతూ నాయుకుడుగా( మేస్త్రి) మారిపోతాడు. ఆ క్రమంలో ఓ రెండు పాటలు పూర్తి చేసుకుని ఫార్ములా ప్రకారం అక్కడి కాంట్రాక్టర్స్ సుబ్బరాజు(ప్రదీప్ రావత్),ఆదిరాజు(షాయాజి షిండే)లతో తలపడతాడు. అనంతరం సుబ్బరాజుని చంపేస్తాడు. అవును ఎవరితను ఇలా అర్దం పర్దం లేకుండా మర్డర్స్ చేసేస్తున్నాడు. అంటే అప్పుడు సమరసింహా రెడ్డిలా తన ఐడెండిటీ మేజర్ నరసింహం అని బయిటపెట్టుకుంటాడు. నరసింహనాయుడులా తన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తుచేసుకుంటాడు. అంతేగాక తాను గాంధేయవాది గోపాలకృష్ణ(విజయ్ కుమార్)ని చంపటానికి వచ్చానంటాడు. ఈలోగా దాసరిని చూసి విలన్స్ వణికిపోతూంటారు. ఇంతకీ ఈ మేజర్ ఎవరు..మేస్త్రి గా ఎందుకు అవతారం ఎత్తాల్సివచ్చింది…ఇంతకీ మోహన్ బాబు,శ్రీహరి పాత్రలు ఏమిటి,చిరుపై సెటైర్స్ ఎక్కడ వేసారు వంటి ప్రశ్నలకు సమాధానం తెరపై చూడాల్సిందే.

ఇక బాషా వంటి సూపర్ హిట్ తో తెలుగు తెరకు ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ పరిచయం చేసిన సురేష్ కృష్ణ ఈ చిత్రాన్ని చిరకాల విరామం తర్వాత డైరక్ట్ చేయటంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.అయితే ఈ చిత్రంలోనూ అదే భాషా నేరేషన్ ని ఫాలో అవటంతో లేనిపోని కన్ఫూజన్ ఏర్పడిపోయింది. అలాగే ఎక్కడో సెకండాఫ్ లో సగం దాకా విలన్ ఎవరో తెలియకుండా కథనం నడుపుతాడు . దాంతో విలన్ కి ప్రధాన పాత్ర దాసరి కీ మధ్య జరగాల్సిన ఎత్తుకు పై ఎత్తు డ్రామాకి ప్లేస్ లేకుండా పోయింది. అందులోనూ సినిమాలో ప్రతీ పదినిముషాలకోసారి ప్రక్కకు వెళ్ళి చిరుపై సెటైర్స్ ,ఓటు తప్పని సరిగా వెయ్యాలంటూ పాట,రోడ్ షో లపై విమర్శలంటూ కథకు సంభందం లేకుండా వస్తూండటం చికాకు కల్గించే అంశం.

ఇవన్నీ ఇలా ఉంటే ఇంతకీ చిరుపై సెటైర్స్ ఎక్కడ,ఎలా వేసారన్నది మరో ఆసక్తికర అంశం. విజయ్ కుమార్ పాత్ర ఓ గాంధీయవాధి..ఓ సెలబ్రేటి..అతనికి ముఖ్యమంత్రి కావాలని జీవితాశయం. అందుకోసం కొత్త పార్టీ పెడతాడు. తమ ఎజెండా అందరికీ సామాజిక న్యాయం అని ప్రకటిస్తారు. అప్పుడు మీడియావారు సామాజిక న్యాయం అంటే ఏమిటీ అని అడుగుతారు. దానికి విజయ్ కుమార్..మేధావులను చర్చకు వేశాం చెప్తాం..అంటూ సమాధానం చెప్తూ నసుగుతాడు.మరో చోట ‘ప్రత్యేక తెలంగాణపై మీ అభిప్రాయమేమిటి?’ అంటే “కమిటీ వేశాం. మేధావులతో శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నాం” అంటాడు.మరి ప్రత్యేక రాయలసీమ అంటున్నారు…మేధావులతో శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నాం” అని మళ్ళీ అంటాడు. అలా సామాజిక న్యాయం అవగాహన లేదంటూ దెప్పిపొడుస్తాడు. అలాగే ఇన్నాళ్లూ “అందరి వాడివి అనుకున్నావు.. కొందరి వాడివి అయిపోయావు”.

అలాగే మహానుభావులు ఫోటోలు వెనకాల పెట్టుకున్నంత మాత్రాన,కలాం మాటలు చెప్పినంతమాత్రాన మనం మహానుభావులం అవుతామా..పెంచుకునే కుక్కకి టైగర్ అనే పేరు పెట్టినంత మాత్రాన కుక్క పులి అవుతుందా అని విమర్శలు చేసారు. అలాగే ఓ చోట విజయ్ కుమార్ పాత్రను మీడియా వ్యక్తులు మీ పార్టీ వారు సీట్ కి కోటిరూపాయలు చొప్పున తీసుకుంటున్నారట కదా అని అడుగుతారు. దానికి ప్రక్కనున్న షాయేజి షిండే..ఈ విలేఖర్లు సరిగ్గా ఏమీ తెలుసుకోరు..ఎమ్మల్యేకి ఐదు కోట్లు,ఎంపికి మూడు కోట్లు తీసుకుంటున్నాం అంటాడు. అలాగే మరో చోట విజయ్ కుమార్ ని పార్టీ ప్రతినిధులు(అభిమానులు) కొందరు ఏంటి సీట్లు అన్నీ రియల్ ఎస్టేట్ వారికీ, గూండాలకి, వెధవలకీ ఇచ్చారంటూ నిలదీస్తారు. దానికి విజయ్ కుమార్..మనం పార్టీ పెట్టిందే డబ్బు కోసం అన్నట్లు చెబుతూ మీ నెత్తి మీద రూపాయి పెడితే పావలా కి కూడా కొనరు..మీమీద నాలుగైదు కోట్లు ఖర్చుపెట్టి గెలిపించుకోవాల్సిన పని ఏముంది అంటాడు. అప్పుడు వాళ్ళు ఇన్నాళ్లూ మీ వెనక ఉన్నాం అంటే..దానికి నేను గొప్పవాడ్ని అయ్యాక మీరంతా చేరారంటూ హేళన చేసి గెంటించేస్తాడు.అలాగే విజయ్ కుమార్ చేత మరో చోట నా వెనుక కుల బలం ఉందంటూ చెప్పించారు.

“జనమే నన్ను రమ్మంటున్నారు. జనం రాజకీయాల్లోకి రమ్మంటున్న తొలి వ్యక్తిని నేనే”.. అంటే వెనకనుంచి ఎన్టీఆర్ విజువల్ చూపెట్టి నీకన్నా ఆయనే ముందు వచ్చారని ఎగతాళి చేస్తాడు.అలాగే మరో సన్నివేశంలో హీరోల రోడ్‌ షోకు వెళ్లేందుకు కొంతమంది కుర్రాళ్లు తండ్రి సుత్తివేలు నుంచి డబ్బు తీసుకువెళ్ళటానికి రెడీ అవుతాడు. అప్పుడు..దాసరి “వెండితెర వేషగాడు.. ఫాక్షనిస్టు, పాలెగాడు కాకూడదు నీ హీరో.. నీ లైఫుకు నువ్వే హీరోగా నిలువు తమ్మీ, రోడ్‌షోల కోసమని వెళ్లి యాక్సిడెంటులో చనిపోతే.. మీ తల్లిదండ్రులను ఏ హీరో ఆదుకోడు” అని పాట పాడి వారిలో రియలైజేషన్ తెస్తాడు.

అంతేగాక ఓ వికలాంగుడు పాత్రను పెట్టి అతని చేతే పార్టీ ఓపినింగ్ రోజున జై కొట్టించుకుని ఆ తర్వత తరిమేస్తాడు. ఆ తర్వాత ఆ వికలాంగుడే విజయ్ కుమార్ హత్య చేస్తాడు. ఈ సన్నివేశాల్లో వికలాంగుడుని చూస్తుంటే..ప్రజారాజ్యం పార్టీ ప్రారంభంలో వికలాంగుడు కు పార్టీ సభ్యత్వం ఇవ్వటం అందరికీ గుర్తు రావటం ఖాయం. వీటన్నిటికీ తోడు రోడ్ షో లపై సెటైర్ చేస్తూ..అభిమానులు సినీ హీరోల మోజులో పడి తమ జీవితం నాశనం చేసుకుంటున్నారంటూ పాట సైతం పెట్టారు. ఇక మొదట ఈ సినిమాలో పాత్రలు ఎవరినీ పోలి ఉండవని, పోలిక తేవద్దని చెప్తూ ప్రారంభించారు. అయితే సినిమాలో చాలా సెటైర్స్ చిరు పార్టీనే ఉద్దేశించి పెట్టారని సామాన్య ప్రేక్షకుడుకి సైతం అర్ధమవుతాయి.

ఉన్నంతలో ధర్మవరపు సుబ్రమణ్యం బాగా చేసారు. మోహన్ బాబు పెదరాయుడు గెటప్ మళ్ళి చూపించారు కానీ దళిత నాయుకుడుగా అతని పాత్రకు మొదలు,ముగింపు లేదు. శ్రీహరి ఫ్లాష్ బ్యాక్ అయితే చాలా చెత్తగా ఉంటుంది. ఇక డైలాగులు అక్కడక్కడా పేలాయి కానీ ఈ చిత్రానికి మరింత షార్పుగా ఉండలన్నది సుస్పష్టం. కెమెరా,ఎడిటింగ్,సురేష్ కృష్ణ గత చిత్రాల రేంజిలో లేవు. అయినా ఈ చిత్రం దాసరే స్వయంగా డైరక్ట్ చేసారేమో అనే సందేహం కొన్ని సందర్భాల్లో కలుగుతూంటుంది.

ఇక ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే రాకరాక వచ్చిన రాజకీయ వ్యంగ్య చిత్రం(పూర్తిగా కాదు) అనే ఆసక్తితో చూడాలి. అలాగే దాసరి ఇంతకీ ఏ సెటైర్స్ చిరుపై సంధించారో అనే ఆసక్తి తో వెళితే కొంతలో కొంత బెటర్ .లేకుంటే ఏదో దాసరి రాములమ్మ చిత్రాన్ని గుర్తు చేసుకునో బయిలుదేరితే మాత్రం పూర్తి స్ధాయి నిరాశే.

  • బ్యానర్ : సిరీ మీడియా
  • నటీనటులు: దాసరి,మోహన్ బాబు,శ్రీహరి,సుజిత,విజయ్ కుమార్,చంద్రమేహన్,షాయాజి షిండే,రాహుల్ దేవ్,ప్రదీప్ రావత్,ఎమ్.ఎస్,గిరిబాబు తదితరులు
  • సంగితం: వందేమాతరం శ్రీనివాస్
  • కెమెరా: సి.హెచ్ .రామరాజు
  • ఎడిటింగ్: గౌతంరాజు
  • ఆర్ట్: బి.వి.రావు
  • కథ,స్క్రీన్ ప్లే: దాసరి
  • దర్శకత్వం: సురేష్ కృష్ణ
  • నిర్మాత: కె.రామకృష్ణ ప్రసాద్
  • రిలీజ్ డేట్ : 12/03/2009

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

12 Comments to “మేస్త్రి”

  • అబ్బ ఈ సినిమా చూసే బాధ తప్పింది. జోస్యులు గారూ! నవతరంగానికి మళ్ళీ వచ్చేశారు. సంతోషం…

  • ఇవాళ టారో చూసుకుంటే పాత మిత్రుని ద్వారా కొత్త సంగతులు అని ఉంది.

  • Edisadu Dasari gadu kukkaa savu sastadu

    monnee savu anchula varaku velli vachadu

  • dasari okappudu goppa director kaavachemo kani , ippudu anni kolpoyina oka amayaka abhagyudu…inta kanna em matladina mana paruvu maname teesukunnattavutundi

  • D for Dasari
    D for Daridragottu yedhava..

    ilanti vedhava gurunchi matladatam kooda waste kani..ilanti sandarballo cheppaka thappadhu..

    yevari daggara vuntey akkada rangulu marchey voosaravelli gadu veedu kooda neethulu cheppey yedhavey..

    monna evaro annatu..

    Panta peragalantey penta kavaali…..

    Veedilantey penta gallu yentha vesina..nastam ledhu..
    :)

    rey dasari ..porapatuna ee review chadivi…inka adrustam vundi ee comments chaduvuthunnav anuko..
    Neekosamey ee matalu…

    ” Veeluntey okadini appriciate chey…..anthey kani ila donga edupulu yedavaku…”

    nuvvu papai vi so niku chirayyishu vuntundhi….brathikinantha kalam municipal drainage la kullu kampu kottudhi ni jeevitham…

  • Good…!!!

  • ఈ సినిమా వాళ్ళ మంచి పేరు కోందరి దగ్గరి నుంచే వస్తుంది.
    చెడ్డ పెరు అందరి దగ్గర నుంచి వస్తుంది.

  • గ్రేటాంధ్రా ఫోరం చూస్తున్నానా లేక నవతరంగం చూస్తున్నానా అని డౌట్ వచ్చింది పైన కామెంట్స్ చూస్తుంటే :)

    • pai comments antha tappuga emi levu …asalu great andhra……tho naake telisi ee prapancham lo…ee site ni polchalemu…assalu ee mathram ethics levu vallaki,,,,

      atuvanti site ni nava tarangam tho polchi….navatarangam sthaayi ni diga jaarchakandi……….

  • ‘ఇక బాషా వంటి సూపర్ హిట్ తో “తెలుగు తెరకు ఫ్లాష్ బ్యాక్ నేరేషన్” పరిచయం చేసిన సురేష్ కృష్ణ !’
    ఇది ఎవరు ఎప్పుడు ఎలా డిసైడ్ చేశారు!? ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ ఏంటి!?

    • భాషా వంటి కథాగమన విధానం పరిచయం చేసింది, “హమ్” అనే అమితాబ్ బచ్చన్ సినిమా. ప్లాష్ బ్యాక్ నెరేషన్ అనేది సైద్ధాంతిక స్క్రీన్ ప్లే ప్రక్రియ కాదుగానీ, ఇలా హీరో పాత్రకు భారీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందనే సజెషన్ ఇవ్వడం ద్వారా, ప్రేక్షకుల్ని expectation తో కూర్చోబెట్టడం భాషా తో మొదలై దాదాపు అందరి హీరోల సినిమాలకూ మన తెలుగులో అంటించింది ఈ సురేష్ కృష్ణ నే.

      “ఫ్లాష్ బ్యాక్ నేరేషన్” అనే పదం ఈ ప్రక్రియకు తెలుగు సినిమా జనాలు పెట్టుకున్న ముద్దుపేరు. అలా వాడెయ్యటమే తప్ప, దానికి scientific కారణంగానీ, తర్కంగానీ, విధానంగానీ లేవు.

  • మహేష్ గారు చెప్పిన సెన్స్ లోనే ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ అని నేనూ రాయటం జరిగింది. మరొకటి ఇదేమీ రీసెర్చి పేపరు కాదు కదా ..అనే ధైర్యంతో కాస్త చొరవ తీసుకుని కొన్ని పదాలు వాడేస్తాం..అయినా నా అనుభవాన్ని మరొకరితో షేర్ చేసుకునే ప్రయత్నమే ఈ రివ్యూ. ఇది ఒక వ్యూ మాత్రమే.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories