Menu

ఫ్రోజెన్-మేకింగ్ ఆఫ్…

గత 2007 లో వచ్చిన ఉత్తమ భారతీయ సినిమాల్లో ‘Frozen’ ఒకటి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. లండన్ , టొరాంటో చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడడమే కాకుండా ముంబాయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోనూ, గతంలో Osian’s-Cinefan Film Festival లో ప్రదర్శింపబడి జ్యూరీ అవార్డు కూడా గెలుచుకుంది.

వృత్తిరీత్యా స్టిల్ ఫోటోగ్రాఫర్ అయిన శివాజీ చంద్రభూషణ్ గతంలో కొన్ని చలనచిత్రాలు నిర్మీంచినప్పటికీ ‘Frozen’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

వైవిధ్యమైన కథనం, అధ్బుతమైన సినిమాటోగ్రఫీ, ఉత్తమ సాంకేతిక విలువలు ఈ సినిమాకి ప్రాణం. ఈ రోజుల్లో పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ లో సినిమా నిర్మీంచే ధైర్యం చేసి నలుపు తెలుపుల్లో ఎన్ని వర్ణాలో అనిపించేలా లడఖ్ ప్రాంతంలోని అందాలను అత్యంత సుందరంగా తెరకెక్కించి భారతీయ సినిమాకి అంతర్జాతీయ ఖ్యాతి కలిగించారు.

గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ’ఈ నెల సినిమా’ శీర్షికలో నవతరంగంలో పరిచయం చేశాము. అనేక చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిన తర్వాత దాదాపు రెండేళ్ళకు ఈ సినిమాను మన దేశంలో త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా ప్యాశన్ ఫర్ సినిమా సైట్లో ఈ మధ్యనే తెలియచేశారు ఈ చిత్ర దర్శకుడు శివాజి. అలాగే ఈ సినిమా నిర్మాణ విశేషాలను తెలియచేస్తూ కొన్ని వీడియోలు కూడా అందచేశారు.

ఈ సినిమా గురించి నవతరంగంలో వచ్చిన ఒక సమీక్ష ఇక్కడ చదవొచ్చు. ఈ సినిమా మేకింగ్ ఆఫ్ వీడియోలు కింద చూడవచ్చు.