Menu

కత్తిఫైటింగ్ కాంతారావు ఇక లేరు

kantarao

kantharao

చిన్నప్పుడు ఎన్.టి.ఆర్ పౌరాణికాలకన్నా టి.ఎల్.కాంతారావు జానపదాలు నాకు బాగా నచ్చేవి. కత్తిఫైటింగులు,కర్రసాములూ, మాయమంత్రాలూ, అందమైన రాకుమార్తెలూ (ముఖ్యంగా రాజశ్రీ), మాయలమారి మాంత్రికులూ, జ్వాలాద్వీపాలూ అబ్బో! అదో అందమైన లోకం. వాటిల్లో విహరించే కాంతారావంటే నాకు మహా అభిమానం ఒకపాలు ఈర్షకూడా ఉండేది. ఇప్పటికీ గండరు గండడు, అగ్గివీరుడు, సప్తస్వరాలు వంటి సినిమాలు టీవీలో వస్తే అన్నీ వదిలేసి చూస్తాను. అంతటి నా అభిమాన హీరో ‘కత్తిఫైటింగ్’ కాంతారావు గారు ఈ రోజు కాలంచేసారు.

తాడేపల్లి లక్ష్మీ కాంతారావుగా నల్గొండ జిల్లా గుడిబండ గ్రామంలో నవంబరు 16,1923 లో జన్మించిన వీరు, ఈ రోజు (22 మార్చ్,2009) రాత్రి 9.50 గంటలకు కేన్సర్ కారణంగా కన్నుమూసారు. వీరి మొదటి చిత్రం నిర్దోషి 1951 లో విడుదలయ్యింది. ప్రతిజ్ఞ (1953) చిత్రంతో హీరో అయ్యారు. అప్పటి నుండీ కొన్ని వందల చిత్రాల్లో నటించారు. మహానటుడు ఎన్.టి.రామారావు గారితో దాదాపు 50 చిత్రాలలో కలిసి నటించారు. కృష్ణుడి పాత్రలకు పెట్టింది పేరైన ఎన్.టి.ఆర్ ప్రముఖపాత్ర వహించిన నర్తనశాల సినిమాలో కృష్ణుడి పాత్రలో కాంతారావు గారు నటించడం ఒక ఛాలెంజ్. అలాగే, నారదుడిగా వీరు చేసిన సినిమాలు కూడా ప్రత్యేకమైనవిగానే చెప్పుకోవాలి. లవకుశ చిత్రంలో లక్ష్మణుడిగా వీరి నటనకు రాష్ట్రపతి అవార్డునందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరికి రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డునిచ్చి సత్కరించింది. 2007 వ సంవత్సరంలో వీరు రాసిన “అనగనగా ఒక రాజకుమారుడు” పుస్తకానికి నంది పురస్కారాన్ని అందుకున్నారు. వీరి ఆఖరిచిత్రం, చిరంజీవి నటించిన “శంకర్ దాదా జిందాబాద్”.

ఈ తెలుగు జానపద రాకుమారుడికి నవతరంగం అశ్రునివాళి అర్పిస్తోంది.

12 Comments
  1. గీతాచార్య March 22, 2009 /
  2. సూర్యుడు March 23, 2009 /
  3. అరిపిరాల March 23, 2009 /
  4. మేడేపల్లి శేషు March 23, 2009 /
  5. S L K March 23, 2009 /
  6. మార్తాండ March 25, 2009 /
    • శ్రీనివాస్ March 26, 2009 /
  7. మార్తాండ March 26, 2009 /
  8. chaitu March 27, 2009 /
  9. Ramesh May 15, 2009 /
  10. Lakshminarayana June 13, 2012 /
  11. Suresh June 16, 2012 /