కత్తి యుద్ధాల వీరుడు, ఒక తరం పిల్లల చందమామ, తెలుగు వారి రాకుమారుడు, కాంతారావు, ఇక లేరు. ఇప్పుడే నేను న్యూస్ లో చూశాను. బాధనిపించింది.
అమ్మ చెప్పే కథలూ, నాయనమ్మ చెప్పే కబుర్లూ, నాన్న నేర్పే జీవితం, బుడుగు, చందమామ కథలు ఎలాగో తెలుగు పిల్లలకి ఒక తరంలో కాంతారావు కూడా అలాగ.
అక్కినేని, నందమూరి, తరువాత మంచి డిమాండ్ ఉన్న నటుడుగా కాంతారావు, పౌరాణిక, జానపద, సాంఘిక, క్రైం, అలా అన్ని రకాల నటననూ ప్రదర్శించి, ఒక ఆల్ రౌండర్ గా నిలిచారు.
నెట్ కూడా పగ బట్టినట్టు ఎంత వెతికినా మంచి ఫోటో దొరకనీయలేదు. ఇప్పటి తరంలో ఆయన చేయదగ్గ పాత్రలని సృష్టించే సత్తా ఎటూ లేదు. (ఉన్నమాటే… ఆయనకీ ఆ ఓపిక లేదు చేయగలిగేందుకు).
కానీ జానపద చిత్రాలకి చిరునామాగా నిలచిన ఇద్దరూ ఇక లేరనేది మాత్రం ఒక చేదు నిజం.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ…
పెద్దలెవరన్నా పూనుకుని ఒక మంచి వ్యాసంతో నివాళి అర్పిస్తే బావుండునేమో కదా?
venkat B says:
nijamgane..
diniki ..kathi mahes nadum biginchali..
mitrma..
plz write a gud essay about our great silver screen fighter yar
S L K says:
“అమ్మ చెప్పే కథలూ, నాయనమ్మ చెప్పే కబుర్లూ, నాన్న నేర్పే జీవితం, బుడుగు, చందమామ కథలు ఎలాగో తెలుగు పిల్లలకి ఒక తరంలో కాంతారావు కూడా అలాగ.”
చదవటం రాని రోజుల్లో ఆయన సినిమాలే పిల్లలకి ఒక పెద్ద చందమామ.
ఎవరన్నా రాస్తే నిజంగానే బాగుంటుంది.
Priya Iyengar says:
మీరే రాయొచ్చుగా?