13B-ధ్రిల్లింగ్ పాయింటే కానీ..

13b

మీరు రెగ్యులర్ గా ఇష్టపడి చూసే టీవీ సీరియల్ కేవలం మీ ఇంట్లోనే వస్తోందని తెలిసింది.. అంతేగాక ఆ టీవీ సీరియల్లో జరిగే సన్నివేశాలు జెరాక్స్ కాపీలా మీ లైఫ్ లో జరిగిపోతున్నాయి. అప్పుడేం చేయాలి..ఎవరికి చెప్పుకోవాలి..ఆ సమస్యనుండి ఎలా తప్పించుకోవాలి. సరిగ్గా ఇదే సమస్యే మనోహర్ (మాధవన్)ని గత కొద్ది రోజులుగా వేధిస్తోంది. ఎంతో మోజుపడి,లోన్స్ పెట్టి ఓ పెద్ అపార్ట్ మెంట్లో 13B అనే ప్లాట్ కొనుక్కున్నాడు. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబం మెయింటైన్ చేసే ఈ మిడిల్ క్లాస్ మనోహర్ ఇక తన జీవితం అద్దె ఓనర్ల ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుందనుకున్నాడు. దాంతో కొత్త పెళ్ళాం(నీతూ చంద్ర)తో సరసాలాడుతూ ,కొత్త కారులో తాను ఇంజినీరుగా పనిచేసే కంపెనీకి ఝామ్మని వెళ్ళిపోతూంటాడు.మిగిలిన ఇంట్లో వాళ్ళు(తల్లి,చెల్లి,అన్న,వదిన,వాళ్ళ పిల్లలు) కూడా అంతా హ్యాపీ.

అందులోనూ ఆ ఇంటిలోకి చేరగానే అన్నగారికి పదివేలు హైక్ చేస్తూ ప్రమోషన్ వచ్చింది.ఎప్పుడూ పరీక్షలు ఒక సబ్జెక్టు మించి పాస్ కాని చెల్లి మంచి మార్కులుతో పాసయ్యింది. అంతేగాక అన్నిటినీ మించి మనోహర్ భార్య భార్య గర్భవతి అయింది. అంతా బావుంది. కానీ ఒకటే అతని సమస్య. ఆ ఇంట్లో అతను తన సెల్ తో ఫొటో దిగితే మొహం తిరగేసి,చక్రంలా పడుతుంది.అంతేనా..అంటే అతను లిఫ్ట్ ఎక్కితే పనిచేయదు. దేముడు ఫొటోలు పెడదామని మేకులు కొడితే దిగవు. ప్రక్కింటి కుక్క ఆ ఇంటి గుమ్మం తొక్కటానికి భయపడి ఆగిపోతుంది. అన్నిటికీ మించి వాళ్ళ టీవీలో మధ్యాహ్నం ఒంటిగంటకి ‘సబ్ కరియత్ హై’ అనే సీరియల్ దానంతట అదే స్టార్టయి వచ్చేస్తూంటుంది. ఆ సమయంలో రిమోట్ పనిచేయదు. కరెంట్ లేకపోయినా సీరియల్ ఆగదు.

పోన్లే హ్యాపీనే కదా సీరియల్ ఆగకుండా వచ్చేస్తే ఎంజాయ్ చేయవచ్చు కదా అనుకుంటే..ఆ సీరియల్లో పాత్రలన్నీ మనోహర్ ఫ్యామిలీ మెంబర్స్ వయస్సులో కొంచెం అటూ ఇటూలో అలాగే ఉంటారు. అలాగే ఆ పాత్రలు కూడా అట్లానే బిహేవ్ చేస్తూంటారు..సంఘటనలూ సేమ్ జరుగుతూంటాయి.మంచి జరిగితే ఎలాగోలా సర్దుకోవచ్చు. అయితే వరసగా చెడు సంఘటనలు జరుగుతూంటాయి.అది మనోహర్ ఒక్కడే గమనిస్తాడు. ఇంట్లో ఎవరికన్నా చెబితే ఎలా రియాక్ట్ అవుతారోనని చెప్పుకోడు. అలాగే తమ ఇంట్లో వచ్చే సీరియల్ బయిట ఎవరిట్లోనూ రాకపోవటం చూసి షాకవుతాడు. ఏం చేయాలి? ఏ రీజన్ కీ అందని ఆ సీరియల్ ని ఎలా ఆపుచేయాలి? తన ఇన్సెపెక్టర్ మిత్రుడు శివ(మురళి శర్మ)ని సంప్రదిస్తాడు. అతను నవ్వి మొదట కొట్టి పారేస్తాడు.

మనోహర్ బలవంతం మీద అతనింటికి వస్తాడు. సరిగ్గా అదే సమయంలో టీవిలో ఆ సీరియల్ వస్తూంటుంది. అందులో ఈ పోలీసు పాత్ర ఇంటికి రావటం కనపడ్తుంది. అంతేగాక ఆ సీరియల్లో పోలీస్ కి ఇంటినుండి గ్యాస్ బండ పేలి భార్య చనిపోయిందంటూ ఓ ఫోన్ కాల్ వస్తుంది. దాంతో అంత కబుర్లు చెప్పిన పోలీస్ ఆఫీసర్ కీ టెన్షన్ తో చొక్కా తడిసి ఇంటికి పరుగెడతాడు. ఇలా అందరినీ భయపెడ్తూన్న ఆ సీరియల్ వెనక ఉన్న శక్తి ఏమిటి.ఆ శక్తి ఏం ఆశిస్తోంది. అనేది మిగతాది తెరపై చూడాల్సిన సస్పన్స్ ఎలిమెంట్.

స్టోరీ లైన్ ఇంత బాగుంది..గ్యారింటీగా లీనమై భయపడ్తాం కదా..సినిమా సూపర్ హిట్టవ్వాలి కదా అంటే..ఇంత బాగా ముడులు వేసుకుంటూ వచ్చిన దర్శకుడు వీటిని విప్పటంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అలాగే మధ్యలో వచ్చే పాటలు కూడా అడ్డమయ్యాయి. అప్పటికీ ప్రముఖ ఛాయాగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ తన కెమెరా పనితనంతో అధ్బుతం చేసాడు. ఆడియోగ్రఫి కూడా చాలా బాగుంది. మాధవన్ ఎలాగయినా బాలీవుడ్ ని గెలవాలన్న కసితో నటించాడని స్పష్టంగా తెలిసిపోతుంది. నీతూ చంద్ర ఉన్నంతలో బాగానే చేసింది. అన్నిటి కన్నా ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో చోటు చేసుకనే ఒక్కసారి హఠాత్తుగా సైలెంట్ అయి ఏ కెవ్వు కేకో,కుక్క అరుపో వినపడటం,విచిత్రమైన ఆకారాలు కనపడం వంటివి లేకుండా చూసుకుని వర్మ స్కూల్ ని దాటాడు.

ఇక ఈ చిత్రం చూస్తూంటే సూపర్ హిట్ జపనీస్ హర్రర్ ‘ది రింగ్’ చిత్రం గుర్తుకు వస్తుంది. దర్శకుడు ఆ చిత్రాన్నే ఫాలో అవుతూ ముళ్ళు విప్పతీసే ప్రయత్నం చేసాడని అర్ధమయిపోతూంటుంది.అయితే అందులో ఉన్నట్లు సస్పెన్స్ స్టెప్ బై స్టెప్ పెరగటం చూపలేకపోయాడు. అంతేగాక మన హీరో ఒక్కడనే ఆ శక్తి ఎందుకు టార్గెట్ చేస్తుందో స్పష్టం చేయడు. అన్నటి కన్నా ముఖ్యంగా అలాంటి సమస్యలు ఉన్న ఇల్లు వదిలిపెట్టకుండా ఉండటానికి బలమైన కారణం వివరించడు. ది రింగ్ లో అధ్బుతంగా పేలిన క్యారెక్టర్ గ్రోత్ (పేరెంటింగ్ సమస్య)ని వదిలివేసాడు.అయితే ఓ విషయంలో ఈ సినిమాను మెచ్చుకోవచ్చు. ధైర్యంగా మూసని వదిలి కొత్త వైపు అడుగులు వేశాడు. గ్రిప్పింగ్ గా ఫస్టాఫ్ లో సీన్స్ అల్లుకుని ఆకట్టుకున్నాడు.

ఓ స్క్రీన్ ప్లే రచయిత చెప్పినట్లు ప్రారంభంలో అధ్బుతంగా టెన్షన్ క్రియేట్ చేయాలని సంఘటనలు క్రియేట్ చేస్తే…తర్వాత ఆ ముడులు విప్పతీసే క్రమంలో వివరణాత్మక సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. దాంతో అప్పటి దాకా టెన్స్ తో పైపైకి వెళ్ళిన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోతుంది. ఈ సినిమా చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది. అలాగే ఈ మధ్యనే వచ్చిన రాజ్-2 కూడా ది రింగ్ నే ప్రేరణగా తీసుకోవటంతో అది చూసిన వారికి ఇది పెద్ద కిక్కు ఇవ్వదు. ఊహకు అందని ట్విస్ట్ క్లైమాక్స్ లో ఉంది కానీ అది సరైన రీజన్ అనిపించకపోవటం కూడా కొంత సినిమా వర్కవుట్ కాకపోవటానికి కారణం.

అలాగే ఏ గంటన్నరో ఉంటే బాగుండును అనిపించే ఈ చిత్రం రెండున్నర గంటలు పైగా సాగటం మరో మైనస్.లిప్ట్ ఎందుకు ఆగిపోతుందో,సెల్ లో ఫొటో అలాగ ఎందుకు పడుతుందో వివరించలేదు.అలాగే సబ్ ప్లాట్ లేకపోవటం,ఇంట్లో వారికెవ్వరికీ ఈ సమస్య తెలియదని దాచటం,టీవీని దెయ్యాలు ఎందుకు మీడియం గా ఆశ్రయిస్తాయో సరిగ్గా వివరించలేకపోవటం,ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ కి అప్పటివరకూ సినిమాలో హీరోకి జరుగుతున్న సంఘటనలకూ (ఎందుకంటే హీరో పాపం ఎవరికీ అన్యాయం చేసే వ్యక్తి కాదాయే)లింకు వివరించకపోవటం స్క్రిప్టు మైనస్ లుగా మారి క్లైమాక్స్ ని మహానసగా మార్చేసాయి.

ఏదైమైనా ఓ కొత్త తరహా హర్రర్ చిత్రం చూడాలనుకుంటే మరో ఆలోచన లేకుండా ఈ చిత్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఎక్కువ ఎక్సిపెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళితే తక్కువ నిరాశతో బయిటకు వస్తారు. అయినా ఇంటికి వచ్చాక టీవీ చూస్తూంటే గ్యారింటీగా ఆ సీరియల్లో పాత్ర మనల్ని పోలి ఉందేమోనని పోల్చుకోబుద్దేస్తుంది.అంటే కొంత గెలిచనట్లేగా.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

8 Comments to “13B-ధ్రిల్లింగ్ పాయింటే కానీ..”

  • ఈ సినిమా నేను నిన్న రాత్రి చూసాను. చాలా బాగా నచ్చింది. నేను రాసేలోపే మీరు ఇక్కడ రాసారు. ఇంకా సినిమా లొ మైనస్ లు ఎక్కువ కనపడలేదు కానీ చాలా బాగా నచ్చింది. రొటీన్ నుంచి కొంచెం బైటకు లాగిన సినిమా…మాధవన్ ఆక్షన్ కూడా చాలా బాగుంది.

  • ఈ సినిమా నేను నిన్న రాత్రి చూసాను. చాలా బాగా నచ్చింది. నేను రాసేలోపే మీరు ఇక్కడ రాసారు. ఇంకా సినిమా లొ మైనస్ లు ఎక్కువ కనపడలేదు కానీ చాలా బాగా నచ్చింది. రొటీన్ నుంచి కొంచెం బైటకు లాగిన సినిమా…మాధవన్ ఆక్షన్ కూడా చాలా బాగుంది…

  • ఈ సినిమా నేను నిన్న రాత్రి చూసాను. చాలా బాగా నచ్చింది. నేను రాసేలోపే మీరు ఇక్కడ రాసారు. ఇంకా సినిమా లొ మైనస్ లు ఎక్కువ కనపడలేదు, కానీ చాలా బాగా నచ్చింది. రొటీన్ నుంచి కొంచెం బైటకు లాగిన సినిమా…మాధవన్ ఆక్షన్ కూడా చాలా బాగుంది….

  • Nice

  • ఇది హారర్ అనుకుని తీసిన కామెడీ సినిమా. ఒక సారి చూసి నవ్వుకుని రావొచ్చు.

  • oka pani chyee tammudu cinemaa pirated kani original rip kani untee pettu nee site lo ee review perutho motham cinemaa story rayadam deniki

    • ఏడిశావులే….పన్జూడు బ్రదర్

    • @ harsha

      well said bro

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories