Menu

“యుద్ధం” లో పాలు పంచుకోండి

అదేంటి..ఇది సినిమాలకు సంబంధించిన సైటు కదా.. ఇందులో యుధ్ధమేంటి అందులో  “పాలు” పంచుకొవడం ఏంటి అని తిక మక పడుతున్నరా లేక భయ పడుతున్నారా?ఆశ్చర్యపొతున్నారా…!!! ఆగండాగండి.ఇది ఏక్కడో బోర్డర్ లో జరిగే యుధ్ధ ప్రకటన కాదు “ఇది నాతో నాకు మొదలైన యుధ్ధం” అని అంటున్నారు వైజాగు కి చెందిన నవ యువ దర్శకుడు సత్య జగదీష్. సహృదయ క్రియేషన్స్ బ్యానర్ పై రిజిస్టర్ చేసిన కొత్త సినిమా పేరు యుద్ధం.

****************

ముందుగా నవ యువ దర్శకులు అనే ఈ శీర్షిక గురించి.

పాత సినిమాల గురించి ఏన్నొ కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము.ఇప్పుడున్న కొత్త సినిమాల గురించి పాత విషయాలు ఎన్నో చదువుతున్నాం. మరి భవిష్యత్తు సిన్మాల గురించి కూడ రాయాలి అనుకొని చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది.వీటిలో ఏన్ని భారి కటౌట్లుగా ప్రాణం పొసుకుంటాయో.ఏన్ని గోల్డెన్ జూబ్లిలు చేసుకుంటాయో లేక ఎన్నింటికి పురిట్లొనే వందరొజులు నిండుతాయో అంతా సమయమే చేప్తుంది కాని ఆ నవయువ దర్శకుల ప్రయత్నాలకు కాస్త ఉత్సాహాన్నిద్దామని మా ప్రయత్నం.

(అన్నీ గొల్డెన్ జూబ్లి జరుపుకొవాలనే మా నవతరంగం ప్రార్థిస్తోంది)

***************

సాఫ్ట్ వేర్ బూం తగ్గినట్టుంది కానీ ఇంకా క్రిష్ణా నగర్ ,ఫిల్మ్ నగర్ ,ఇందిరా నగర్, ఈ ఏరియాల్లో ఇంటి అద్దెలు తగ్గలేదు. అంతేకాదు ఇక్కడకు వచ్చే వారి సంఖ్య ఇంకా పెరిగింది కూడా. ప్రస్తుతం సినిమా,టీ వి చానల్స్ ఆఫిసులవద్ద బీ టెక్ ,ఎం టెక్ చేసి న వారు కూడా, వారి వారి రంగాలలో ఉద్యొగాలు తగ్గి పొవడంతోనో ఏమోకానీ తమ అదృష్టం  ఇక్కడేమైనా రాసి పెట్టివుందేమో అని ప్రయత్నాలు చేస్తూ కొంతమంది కనిపిస్తున్నారు.

తెలుగు సినిమాలలో తమకు నచ్చిన శాఖలో తమ ప్రతిభను చూపేందుకు ప్రస్తుతము ఫిల్మ్ నగర్ , కృష్ణా నగర్, ఇందిరానగర్, లలొ సినిమా ఏన్ని కష్టాలు పడైనా సరే…..రేపటి సినిమా ప్రముఖు నటులుగా, సాంకేతిక నిపుణులుగా వారి వారి రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకోవడం కోసం తెర వెనుక తమను తాము సాన పెట్టుకుంటున్న వారిని మొదటగా గుర్తించి ప్రపంచానికి తెల్పాలన, వారికి తోడ్పాటు ఇవ్వాలని నవతరంగం చేస్తున్న కృషి ఇది.

మరొవైపు సినిమా మొదలు నుంచి విడుదలవరకు నవతరంగం పాఠకులకు అన్ని విషయాలను తెలియజెప్పాలనికూడ అనుకొని నవ యువ దర్శకుల గురించి మొదలుపెడుతున్నాను.

ఇలా రేపటి ప్రముఖ దర్శకులను ఇంటర్వ్యూ చేసిన ఘనత నవతరంగానిదే. అలాగే రేపటి సినిమాల కోసం సమాయత్తమవుతున్న కొంతమంది నవయువ దర్శకుల గురించి పరచయం చేయడమే మా ప్రయత్నం.

****************

ఐతే…ఈ శీర్షిక మొదటి సారి కాబట్టి అసలీ ఆలోచన ఎలా పుట్టిందో  చెప్పాలి.ఏదో పని మీద మొన్న సార్దధి స్టూడియోలొ అడుగుపెట్టగానే అక్కడ తన ల్యాప్ టాపులో ఏవో ఫోటోలు చూపుతూ మిత్రులతో కూర్చోని నవ యువ దర్శకుడు,మిత్రుడు సత్య జగదీష్ కలిసారు.సరే మా కళ్ళుకూడ పడ్డాకా తప్పుతుందా అనుకొని మాక్కూడా తన ల్యాప్ టాపులో ప్రముఖ పోస్టర్ డిజైనర్ ధని ఏలే చేత డిజైన్ చెయించిన తన సినిమా “యుధ్ధం ” టైటిల్ లోగో ని చూపించారు.

మాకు అక్కడున్న మరో ఇద్దరికి కూడా అవి చూడగానే సూపర్ హిట్ సినిమా అనే భావన కల్గింది.అది first impression అయినా lets wait and see how boxes come out అనుకున్నాం. ధని ఏలే డిజైనింగ్ ప్రత్యేకతతో పాటు అలా కావల్సిన విధం గా డిజైన్ చేయించుకున్న జగదీష్ గారి టేస్ట్ ఏమిటొ తెల్సింది.(అన్నట్లు త్వరలొనే ధని ఏలే ఇంటర్వ్యూ కూడ ఇక్కడ చదువుతారు.)

వెంటనే నవతరంగంలో రాబొయే సినిమాలు, కళాకారుల గురించి రాయొచ్చు కదా అని అలోచన వచ్చింది, వెంకట్ గారిని అడగటం, ప్రొసీడ్ అనడం, వెళ్ళడం-కట్ టూ కట్ సీన్ లాగా చకా చకా ఆ రోజు రాత్రే సత్య జగదీష్ గారికి ఫోన్ చెసి ఆయన ఫ్లాట్ కి వెళ్ళడం జరిగి పొయింది.

****************

ఫ్లాట్ లో అడుగు పెట్టగానే నేను వెంటబెట్టుకెల్లిన నా జూనియర్ మిత్రుడు సాయి ఆశ్చర్య పొయాడు.”ఒక సిగరెట్ ముక్క కాని, ఒక బీరు బాటిల్ కాని కాన రాని , నేను చూసిన మొట్ట మొదటి సినిమా ఫ్లాట్ మీదే సారు” అని పొగడ్తలు మొదలెట్టాడు. సమాజములొ నవ యువ దర్శకుల ఫ్లాట్లంటే ఊహలు వేరేగ ఉంటాయి కదా మరి.

సత్య జగదీష్ గారిని ఇంటర్వ్యూ విషయం చెప్పాను. “ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సొమలింగం అన్నట్లు, బాబు మీకు నేనే  దొరికానా.ఇంకా నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు” అంటే, “తప్పకుండా వారి ఇంటర్వ్యూలు కూడా తీసుకుంటాను. నాకు ఆలోచన వచ్చినప్పుడు మొదట కనిపించింది మీరే  కదా. అందుకే మీతొ నే మొదలుపెడ్దామని…” అంటే “సరే ఒక్క షరతు ఐతే” అన్నారు. “ఏంటని ” అడిగాను. “సినిమ రంగానికి సంబంధించి అభిరుచి ఆసక్తి ఉన్నఅందరికీ నా యుధ్ధం లొ పాలు పంచుకునే ఆహ్వానం కూడ ఇవ్వాలి అన్నారు” . ” సరే ”  అన్నాను.
“సరే ఏమడుగుతారు అడగండి ” అన్నారు.

“మరేం లేదండి..ఎన్నో చెత్త చినిమాలు వచ్చి ప్రేక్షకుల సమయాన్ని, డబ్బుని నష్టం చేస్తున్న ఈ తరుణం లో ఈ సినిమా మీరు తియ్యకపొతే  ప్రపంచానికి వచ్చే నష్టం ఏంటో ముందు చెప్పండి?” అనగానే.

“ప్రపంచాని కి కాదు సినిమా తియ్యక పొతే ముందు నాకు నేనే నష్టం చేసుకున్నట్లు అందుకే..” అన్నారు.

“అంటే..?”

“అంటే, మరేం లేదు. పుట్టుకకు మరణానికి మధ్య వుండేది ఏంటి చెప్పండి ” అని తిరిగి నన్నే ప్రశ్నించారు.

“జీవితమే కదా ఇంకేంటి ” అడిగాన్నేను.

“కాదు. నాకైతే సినిమా అంటాను.”
“సినిమానా.!!! ”
“అవును.ఇంకా అర్ధం కాలేదా “అన్నట్ల్లు నా వైపు  చూసారు జగదీష్.
ఇంకా అర్ధం కాకపొవడమా..? మాంటేజు లా మొత్తం అర్ధమైంది 🙂

***************

అవును!

ముఫ్ఫై సంవత్సరాల క్రితం వైజాగులో శ్రీమతి రాజేశ్వరి, శ్రీ సూర్యనారయణ ఇంట పుట్టినా సత్య జగదీష్ అనే అతనికి మీ స్కూల్ ఏది? కాలేజేంటి అని అడిగితే చెప్పే పేర్లు ఏంటో తెలుసా?

జగదాంబ, మినర్వా,ఇంకొ రెండు మూడు వైజాగు సినిమా ధియెటర్లు.

యెస్ నాకు అవే విద్యాలయాలు, దేవాలయాలు. సర్టిఫికేట్ ల కోసం చదివింది ఆర్కిటెక్చర్. ఆసక్తతో చదివింది బీ ఏ తెలుగు సాహిత్యం. అందరికి దేవుళ్ళో లేక దెయ్యాలోఆవహిస్తారట! కాని నాకు మాత్రం చలం, తిలక్ ఆవహించారు. కవిత్వం నన్ను నన్నుగా జీవించేలా చేసింది. అదే పదకొండు సంవత్సరాలుగా ఇక్కడ ఇండస్ట్రీలో ఇలా యుధ్ధం చేసేందుకు మానసికంగా తీర్చిదిద్దింది.

అనుభవం 11 సంవత్సరాలు.

రచయితగా 1998లో రామోజి ఫిల్మ్ సిటిలో ఉషాకిరణ్ మూవీస్ స్టొరీ డిపార్ట్ మెంట్ లో సినిమా జీవితం ప్రారంభం. తరువాత, డైరెక్టర్ సాన యాది రెడ్డి,డైరెక్టర్ వెంకి, మిత్రుడు ఘటికా చలం, డైరెక్టర్ బి జయ ల వద్ద దర్శకత్వ విభాగములో కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసారు.జీవిక కొసం సురేష్ ప్రొడక్షన్స్ వారి కొన్ని సినిమాలకు, డైరెక్టర్ పూరి జగన్నాధ్ గారి సినిమాలకు, ఇంకా కొన్ని పెద్ద సినిమాలకు ప్రింట్ మీడియా కాపిరైటర్ గా చేసాను.అలాగే  5 సంవత్సరాల క్రితం ఇంగ్లీషు నుంచి తెలుగు లోకి డబ్ అయిన చాలా సినిమాలకు ట్రైలర్లు చేసాను.

అది సరే…మీ “యుద్ధ” నీతి చెప్పండి..

రెండునెలల్లో పక్కా స్క్రిప్ట్ తో సెట్స్ మీదకు వెళ్ళాలని ఒక ప్రముఖ హీరొ డేట్స్ కొసం ప్రయత్నంలో ఉన్నాము. మనిషి తన జీవితం తొ చేసే యుద్ధం.చెడు మీద మంచి చేసే యుధ్ధం.రోజు రోజు కి మారిపొతున్న ఈ ఆధునిక ప్రపంచములో మనసున్న ప్రతి మనిషి రోజు తనతో తాను యుద్ధం చేసుకోవాల్సి వస్తుంది.అలా ఈ సమాజముతో మరియు పరిస్థితులతో చేసే యుధ్ధం. ఒక యువకుని కి కొత్తజీవితానికి నాంది పలికిన యుధ్ధం.

ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువేం చేప్పలేను.కానీ నా ఈ యుధ్ధం సినిమా కి మీ నవతరంగం వారు ఎవరైన ఏ రంగములో నైనా పనిచెయ్యాలనుకుంటే సాదరంగా అహ్వానం పలుకుతున్నాను. సరే హీరో వగైరా వారి గురించి కూడా ఫైనలైజ్ అయ్యాక మొదట చెప్పేది నవతరంగానికే అన్నారు.

“ఇప్పటికి ఎన్ని సార్లు స్క్రిప్ట్ రాసుకున్నరని ” అడిగితే, “ప్రస్తుతం తనకు స్క్రీన్ ప్లే అంటే ఏమిటో జ్ఞానోదయం కల్గించిన కొమ్మనాపల్లి గణపతి రావు గారి సూచనలు సలహాలతో  స్క్రీన్ ప్లే రెండో వర్షన్ రాస్తున్నాను ఇంకా డైలాగ్స్ జొలి కి పొలేదు” అన్నారు.

“ఇన్ని సార్లు రాసుకోవడం అవసరమా ?” అడిగాను.

“రెండు సార్లకే మీరు ఇట్లా అడుగుతున్నారు. నిర్మాత ,హీరో,దర్శకుడు ముగ్గురికి నచ్చాలంటే తప్పదు “అని చెప్పుకొచ్చారు.

వేరే ఏ ఉద్యోగం, ప్రాజెక్ట్ కాని, వర్క్, కాని తీసుకోకుండా పూర్తిగా ఈ సినిమా కధ మీదే గత రెండు సంవత్సరాలనుంచి పనిచేస్తున్నారనే విషయం తెల్సి  ఆశ్చర్యపోయాడు సాయి.

సినిమా మొదలయ్యాక రన్నింగ్ డాక్యుమెంటరీ లా, అయ్యాక కూడా, ఒక సినిమా నిర్మాణం తదనంతర కార్యక్రమాల విషయాలు అన్ని నవతరంగ పాఠకులతో పంచుకొవాలని కోరాను. ఎందుకంటే ఇంట్లో కూర్చొని సినిమా కు సంబంధించిన అన్ని విషయాలను తెలియజెప్పే ఏకైక సైట్ నవతరంగం కదా.

స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందని త్వరలోనే అన్ని విషయాలు చెబుతానని అన్నారు. యుధ్ధం అనే సినిమా కధ స్క్రిప్ట్ వర్క్ ఎలా జరుగుతుందో చదివారు కదా. సెట్స్ పైకి ఎలా వెళ్తుందో, ఆన్ ది సెట్స్ వర్క్ ఎలా జరుగుతుందో,పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడ ఎలా జరుగుతుందో, వీలయితే చిత్రాలు,వీడియోతో చెప్పే ప్రయత్నం చేస్తాను. సినిమా కు ముందు జరిగే ప్రసవ వేదన గురించి చెప్పాలని ఈ చిన్న ప్రయత్నం.

అందరికి శుభం కలగాలని కోరుకుంటూ….అమీన్.

40 Comments
 1. శంకర్ February 22, 2009 /
 2. అబ్రకదబ్ర February 23, 2009 /
 3. nehaarika February 23, 2009 /
 4. apfilmreporter February 23, 2009 /
 5. J.Satyadev February 23, 2009 /
  • shree March 5, 2009 /
 6. vamsi February 23, 2009 /
 7. DHANI AELAY February 23, 2009 /
 8. suman February 23, 2009 /
 9. balu, USA February 23, 2009 /
 10. Jonathan February 23, 2009 /
 11. Jonathan February 23, 2009 /
 12. Ram, asst. director February 23, 2009 /
 13. kommanapalli ganapathi rao February 23, 2009 /
 14. kommanapalli ganapathirao February 23, 2009 /
 15. Sai Brahmanandam Gorti February 24, 2009 /
 16. రవి February 24, 2009 /
  • అబ్రకదబ్ర February 24, 2009 /
  • kiran February 27, 2009 /
  • saif ali gorey March 3, 2009 /
 17. Anirudra Reddy February 24, 2009 /
 18. narasaiah February 24, 2009 /
 19. Malik khan February 24, 2009 /
 20. RAMA RAO February 24, 2009 /
 21. KAMAN NAIDU February 24, 2009 /
 22. well wisher February 24, 2009 /
  • shree March 5, 2009 /
 23. kavitha February 24, 2009 /
 24. Sinu February 24, 2009 /
 25. V.C.Narendar February 27, 2009 /
 26. reddy g February 28, 2009 /
 27. ARUN March 2, 2009 /
 28. Raju March 2, 2009 /
 29. saif ali gorey March 3, 2009 /
 30. shree March 5, 2009 /
 31. mouli March 6, 2009 /
 32. viswanath Goud March 29, 2009 /
 33. ramana April 18, 2009 /