గుండెల మీద చెయ్యివేసుకుని చెప్పండి.. తెలుగు సినిమా కధ ఎప్పుడైనా మార్చటం జరిగిందా. నాకు తెల్సి చాలా కొద్దిసార్లు మాత్రమే జరిగింది..ఈమధ్య కాలంలో కణ్ణన్ తీసిన “నా ఊపిరి”, శేఖర్ తీసిన “హ్యపీ డేస్”. సి సి రెడ్డి తీసిన “మీ శ్రేయోభిలాషి” మదన్ తీసిన ” ఆ నలుగురు” క్రిష్ తీసిన “గమ్యం”ఆ మధ్య విశ్వనాధ్ సి నిమాలు. సంవత్సరానికి వచ్చే ఒకటో రెండో ఇతర సినిమాలు ..ఇదేంటి నేను అన్ని విజయవంతమైన సినిమాల గురించే మాట్లాడుతున్నాను. మెజారిటీ నిర్మాతలు, డైరక్టర్లు, హీరో లు కధ మారిస్తే ప్రేక్షకమహాశయులు చూడరని ఎప్పుడు ఘోషిస్తారు. మరి నేను తప్పుగా ఆలోచిస్తున్నానా లేక వాళ్ళే మనని తప్పు దారి పట్టిస్తున్నారా. ఒక్క సారి నిండా మునిగి చూద్దామా. (కంగారు పడకండి.. ఒడ్డు చేర్చే బాధ్యత నాదే)
గుడ్డు ముందా..కోడి పిల్ల ముందా.. ఈ ప్రశ్న కు బదులు కష్టం. మన కధా రచయితలు సరియైన కధలు రాయలేక పోతున్నారంటారా. లేక డైరక్టర్లు వా ళ్ళ చేతులు క ట్టేస్తున్నారా. లేక మన హీరో గారు వీళ్ళందరిని మూల కూర్చోపెట్టి శాసిస్తున్నాడా. నిర్మాత ఎలాను నిమిత్తమాత్రుడే కదా… ఓ చేత్తో అప్పుల పట్టీ మరో చేత్తో తల గోక్కుంటూ. నామటుకు ఇది తిరగబడినట్లుంది ఒక్క నిర్మాత విషయం తప్ప. హీరో గారు ఇక్కడ కింగ్ పిన్. అంతా ఆయన చెప్పు చేతల్లో నే నడుస్తాయి. మీరు సరియైన కధ తీసుకు రాక పోతే ఆయన డేట్లు ఇవ్వడాయె.. ఇచ్చిన కధలో కూడా అభిమానుల కోసం మార్పులు చేర్పులు చేయిస్తాడు. అటు వంటప్పుడు తప్పెవరిదంటారు.. నాది కాదండి బాబోయ్.
మొన్నోసారి 1955 లో తీసిన ఒక హిందీ సినిమా చూశాను. పేరు గుర్తులేదు. ఆసినిమా కధ కి ఇప్పుడు వస్తున్న సినిమా కధలకి ఏ మాత్రం తేడాలేదు. అంటే 55 సంవత్సరాలు గడచినా కధ లో ఏమాత్రం మార్పు రాలేదు. ఒక అతి మంచి హీరో .. హీరోయిన్ అతన్ని మాత్రమే మొదట్లో అపార్ధం చేసుకున్నా తర్వాత మనస్పూర్తిగా అర్దం చేసుకుంటుంది. విలన్ ఓ చవట.. చివరికి తన్నులు తినటానికి తప్ప దేనికి పనికిరాడు. ఇదే కధ ఈనాటికి చూస్తున్నామంటే, ఎంత గొప్ప కధో ఆలోచించండి.
నిర్మాత కు కధ బాధ్యత లేదా. ప్రస్తుత పరి స్తితి గమనిస్తే అతను పూర్తిగా డైరక్టరు మీద ఆధార పడినట్లే ఉంది. ఓ సారి ఓ సినిమా షూటింగ్ చూడటానికి పద్మాలయ కి వెళ్ళాను. అప్పుడు కనబడిన ఫ్రెండ్ – భగవాన్ అన్నాడు మందు పిచ్చి, పిల్ల పిచ్చి ఉంటే గాని ఈ ఫీల్డ్ లోకి రాకు అని. అంతే ఆ తర్వాత మళ్ళీ నేను అటు చూడలేదు. చెప్పోచ్చేదేమిటంటే ఓ నిర్మాత దీనికి మాత్రమే పరిమిత మవుతున్నాడా అని. ఆమధ్య ఓ న్యూస్ చదివాను. జగడం నిర్మాత ప్రీవ్యూ చూసిన రోజు ఇటువంటి చెత్త సినిమా తీస్తావా అని డైరక్టర్ సుకుమార్ తో గొడవ పడ్డాడుట. అంటే అప్పటి వరకు ఆయని ఏ సినిమా తీస్తున్నాడో కూడా తెలియదా. చాలా మంది నిర్మాతలు డైరక్టరు చేతిలో అంతా పెట్టేసి చేతులు కాల్చుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకు సినిమా తియ్యాలనే తాపత్రయమే తప్ప సినిమా పరిజ్ఞానము లేకపోవటమే. ఎన్నో చిత్రాల నిర్మాత అట్లూరి పూర్ణచందరరావు గారు ఎన్నో రోజుల తర్వాత తేజ చేతిలో ఘోర పరాజయం పొందలేదా. భారీచిత్రాల నిర్మాత అశ్వనీదత్ సినిమాలు చూడండి. చాలా భారీ ఖ ర్చుతో తియ్యబడినవే.. కానీ కధ విషయానికి వస్తే మాత్రం ఏ మాత్రం భారీ తనం కనపడదు. సేమ్ ఓల్డ్ (కానీ ఆయన ఓ మాట అనచ్చు.. అయ్యా ఈ మధ్య కధ మార్చితీసిన కధానాయకుడు సంగతి ఏమి ఆలోచించారు అని. నిజమే అది హిట్ అవ్వలేదు గదా.. కానీ దాని కారణాలు వేరే గా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ). ఎందుకు నిర్మాత లు కధ గురించి పట్టించుకోవడం లేదు.. డైరెక్టర్ మీద నమ్మకం..వేరే వ్యాపకాలతో బిజీ..వెర్రి ప్రేక్షకుల మీద నమ్మకం.. చచ్చినట్లు సినిమా చూస్తారని.
ఇక డైరక్టరు సంగతి చూద్దాము. ఇతనికి అన్నిటితో పాటు కధ మీద కూడా పూర్తి పట్టు ఉండాలి. కాని చాలామంది పైన చెప్పిన 1955 కధను మాత్రమే నమ్ముకొంటున్నారు. దీనికి పెద్దగా మార్పులు చేర్పులు చెయ్యక్కర్లేదని. ఎటొచ్చి కొత్త హంగులు అద్దటం తప్ప. కొత్త లేక పిల్ల హీరో లతో చేసే సినిమాలలొనే కాస్త వైవిధ్యమైన కధలు కనబడుతున్నాయి. ఇక పెద్ద హీరో ల కధలన్నీ మూసపోతలే. పరుచూరి ప్రెస్ నుంచి బయటకు వచ్చేవే. 1955 కధ కు ఆకులు అలములు కప్పి.. డైరెక్టర్ ఎదురు చెప్పగలిగే సాహసం చెయ్యగలడా. ఒక యువ హీరో కి సొంత స్టోరీ టీం ఉందట. మీరు ఇచ్చిన కధ కు వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకుంటారు మీ అభిప్రాయలను పట్టించుకోకుండా. మరి అటువంటప్పుడు డైరక్టరు ఏం చెయ్యగలడు. హీరో ని మార్చుకోవటం లే క సినిమా వదులుకోవ టం లేక తానా తందానా అనటం తప్ప. జరిగేది ఎప్పు డూ చివరిదే. అదే మన ఖర్మ. . ఓ మంచి సినిమా చూడలేకపోవటానికి.
రాఘవేంద్రరావు గారి లాంటి వారికి అవకాశాలు కొల్ల. అయన హీరో ని శాసించగలడు. అయినా ఆయన ఏ మాత్రం ఏటికి ఎదురు ఈదాలని ప్రయత్నం చెయ్యలేదు. అన్నమయ్య, రామదాసు లో కూడా రసికత చూపగలిగాడు. కొంతలో కొంత పెళ్ళిసందడి లాంటి మంచి సినిమా తీశాడు. కానీ ఆయన కొడుకు సూర్యప్రకాష్ తీసిన మార్నింగ్ రాగా రొటీన్ కి భిన్నంగానే ఉంది. ఇహ విశ్వనాధ్ గారు ఎన్నో మంచి చిత్రాలు నిర్మించాడు. కాని ఆయన కమల్ లాటి డేరింగ్ హీరో తో లే క చిన్న హీరో లతో ఎన్నో విజయాలు సాధించగలిగాడు. కానీ చిరంజీవి తో ఏమీ సాధించలేకపోయాడు. ఈ మధ్యకాలంలో చిరంజీవి తో సినిమా తీసిన ఏ దర్శకుడు విజయం సాధించలేకపోయాడు. కారణం ఆలోచిస్తే కధ ను హీరో కు అనుగుణంగా మార్చాలనే తాపత్రయమే తప్ప హీరో కి తగిన కధలు తీసుకోలేకపోయారనిపిస్తుంది.
గమనించాల్సిన విషయం ఏమిటంటే మార్నింగ్ రాగా లో హీరో లేడు. నిజమే.. ఆలోచించండి. విశ్వనాధ్ గారి సినిమాలలో కూడా కమల్ తప్ప సూపర్ హీరో లు లేరు.. పైన పేర్కొన్న సినిమాలు వేటిలోను నవతరం హీరో లు లేరు. నా ఊపిరి లో సినిమాలు లేని నవీన్, హ్యపీ డేస్ లో అంతా కొత్తవారే. మిగిలిన వాటిలో హీరో కాని హీరో రాజేంద్ర ప్రసాద్. ఈయన హీరోయిన్ విషయంలో పేచీలు పెట్టగలడేమో గానీ కధ విషయంలో కలుగ చేసుకునే సాహసం చెయ్యలేడు కాబట్టే ఆ మంచి సినిమాలు చూడగలిగాము.
అంటే సూపర్ హీరో లేకపోతే రొటీన్ కు భిన్నమైన సినిమాలు చూడగలమంటారా.. ఓ మంత్ర..ఓ అనుకోకుండా ఒక రోజు..ఓ అరుంధతి.. ఇవన్నీ పెద్ద హీరో లేనివే. అలాఅని చిన్నహీరో ఉన్నంత మాత్రాన మంచి సినిమాలు వస్తున్నాయా అంటే అదీ లేదు. ఆదిత్య తీసిన రెయిన్ బో, తేజ పెట్టిన కేక, వియ్యాలవారి కయ్యాలు – ఏదీ హిట్ కొట్ట లేదు. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా 1955 కధ బేస్ చేసుకున్నవే.. అయితే హంగులు సరి పడలేదనుకోవాలి. ఇవే కొత్త కధలతో తీస్తే సూపర్ హిట్ లు అయ్యేవేమో.
సరే ఇక హీరో సంగతి చూద్దాము. ఓ చట్రం గీసుకుని దాని మధ్యలో బొంగరంలా తిరుగుతారు తప్ప ఓ కొత్త ప్రయోగం చెయ్యాలని చూడరు. ఒక్క కమల్ హసన్ తప్ప. ఏదైనా అంటే అభీఅమానుల మీద తోసేస్తారు.చాలారోజుల క్రితం క్రిష్ణ ని ఎవరో అడిగారు. అమితాబ్ లాగా మీరు యాంటీ హీరో పాత్రలు చేస్తారా అని. దానికి ఆయన ఏమన్నాడో తెలుసా.. అభిమానులు అలాచేస్తే ఊరుకోరు అందుకని చెయ్యలేను అని. కాని ఈ మధ్య ఆయన సినిమాలు అభిమానులు కూడా చూడటంలే దు. మహేష్ బాబు చూడండి..పోకిరీ తర్వాత అతిధి.. నాకు రెండింటికి పెద్ద తేడా కనిపించలేదు.. వయొలెన్స్ ఎక్కువ అవ్వటంతప్ప. ఇక ఎన్టీఆర్ జూ. వయొలెన్స్ సినిమాలు తప్ప వేరే చెయ్యడాయె. రవితేజ వెటకారం సినిమాలు, చివరికి నితిన్ తండ్రి ని కించపరిచే రోల్స్ తప్ప మరేదైనా వేశాడా అంటే వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. వెంకీ సినిమాలన్నీ బేస్ లైన్ ఒక్కటే. పాటలు, హీరోయిన్ లు మాత్రమే మారుతారు. అయ్యా నేనెవరి అభిమాని గాదు. ఎవ్వరిని కించపరచట్లేదు. తప్పు పట్టకండి. ఏ ఒక్క పెద్ద హీరో తోను విభిన్న కధాంశంతో సినిమా రాలేదన్నది వాస్తవం. విక్రం లాగా ఏ ఒక్క హీరో సాహసించి ఓ పితామగన్ లో యాక్ట్ చెయ్యగలిగారా. ఆగండి.. మరి రాజశేఖర్ రీమేక్ చేసిన శేషు కి ప్రేక్షకులు కరువయ్యారే. ఇదే సినిమా విక్రంతో తమిళ్ లో సూపర్ హిట్ అయ్యిందే.
ఇదేదో తీగలాగితే డొంక కదులుతున్నట్లుంది. కధ బాగుందంటే సక్సెస్ గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి కనబడుతోంది. సుచిత్రాబోస్ తీసిన పల్లకీ లో పెళ్ళికూతురు చూశారా. చక్కని పాటలు, హాస్యం సమపాళ్ళలో పండాయి. ఇంటిల్లపాది కూర్చుని చూడతగిన సినిమా. కానీ ఏమాత్రం నడవలేదు. దీన్ని సాకుగా తీసుకుని 1955 కధ తోనే కంటిన్యూ అవుదామనే వాళ్ళే అంతా. ఏమిటో మాష్టారూ.. ఇదేదో బ్లాక్ హొల్ లా ఉంది. ఎండ్ కనపడట్లేదు. వెనక్కి పదండి. కాని ఒక్క మాట. ఒక మంచి కధతో సినిమాచూసిన మజాయే వేరుగా ఉంటుంది.. ఓ తూర్పు పడమర.. ఓ మేఘసందేశం..ఓ ఆనందభైరవి.. ఓ సాగర సంగమం.. ఓ అంతపురం గుర్తు తెచ్చుకోండి.
ఒకసారి అమితాబ్ ఏమన్నాడంటే.. మా ప్రేక్షకులు నిజ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూంటారు. అటువంటి వాడికి అవే మళ్ళీ సినిమాలో చూపించలేము. అందుకనే మాసినిమాలు వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయి అని. మళయాళీ లకు కష్టాలు లే వా. వాళ్ళ సినిమాలు వాస్తవికత ను ప్రతిబింబిస్తాయే.
అయినా ఈ మధ్య హిందీ లొ కూడా ఎన్నో విభిన్న కధలతో ముందుకు వస్తున్నారు దర్శకులు. హలీవుడ్ లో ఎన్ని విభిన్నమైన కధలు వస్తున్నాయో కాస్త అలోచించండి. వాళ్ళకే మండీ చాలా పెద్ద మార్కెట్.. తెలుగు మార్కెట్ చాలా చిన్నది అని తేల్చిపారేయకండి. వెడ్నస్ డే ని తెలుగులో తియ్యాలని పయత్నిస్తున్నారంటే మనకు మంచి రోజులు వస్తున్నట్లా.. లేక ఓ బుధవారం అని ముందే మనమే ఎందుకు తియ్యలేకపోయామని బాధ పడాలా.
ఏతా వాతా తేల్చి చెప్పేది ఏమిటంటే: మంచి కధ ఉన్న సినిమా అనేది సమిష్టి బాధ్యత కాని అది డైరెక్టర్ కి ప్రధమ బాధ్యత కావాలి:
నిర్మాత కు ఒక అభిరుచి ఉండాలి. మంచి సినిమా తియ్యాలనే కాంక్ష తప్పనిసరి. డాంబికాలకు పోకుండా ఓ అసలు సిసలు తెలుగు సినిమా తియ్యగలగాలి. ఎన్ని సినిమాలు తీశానని చూసుకోకుండా ఎన్ని మంచి సినిమాలు తీశానా అని ఆలోచించుకోగలగాలి.
డైరెక్టరు కూడా వైవిధ్యమైన సినిమాలు తియ్యాలని చూడాలి. కధ కు తగ్గ హీరో ఉండాలి గాని..హీరో కోసం కధ కాదు.
ఇక హీరో గారు చట్రం బయటకు వచ్చి మంచి సినిమాలలో నటించాలనే తాపత్రయం పెంచుకోవాలి. ఊహాజనితమైన అభిమానుల గురించి ఆలోచనలు తగ్గించుకుని, నిజమైన అభిమానుల గురించి మాత్రమే ఆలోచించగలగాలి. పది మంచి సినిమాలు చేస్తే చాలదా.
ఇక అప్పుడు ఎందుకురావండి మంచి సినిమాలు. ప్రతీదీ ఓ వివిధ్య చిత్రమే అవుతుంది. ఇక కధలంటారా వాటికి కొదవ ఏముందండీ. మన రచయిత లు మనని నిరుత్సాహ పరుస్తారని నేనెప్పుడు అనుకోను. అంతగా కావాలంటే రమ్మ నండి రాత్రికి రాత్రి ఓ మంచి కమ్మని అసలు సిసలు తెలుగు కధ రాసి ఇస్తాను.
అమ్మయ్య.. ఒడ్డు మీద పడ్డాం. ఏమిటో నా ఈ కంఠశోష.. ఎవడు పట్టించుకుంటాడు..ఏదో కాసేపు చదువుకుని మర్చిపోండి.. ఇక శెలవ్..
—వెంకట్ ఉప్పలూరి
teja says:
గత శుక్రవారం, “నేనే దేవుణ్ణి” అనే సినిమా విడుదలయింది.
తమిళనాడులొ అ సినిమాకి అన్ని positive రివ్యూలే.
కానీ అదే సినిమాకి తెలుగులొ ఇంతవరకు ఒక్క positive రివ్యూ కూడా రాలేదు.
వైవిధ్యాన్ని మన ప్రేక్షకులు ఎంత వరకు ప్రొత్సహిస్తున్నారు ?
Marthanda says:
>>>మొన్నోసారి 1955 లో తీసిన ఒక హిందీ సినిమా చూశాను. పేరు గుర్తులేదు. ఆసినిమా కధ కి ఇప్పుడు వస్తున్న సినిమా కధలకి ఏ మాత్రం తేడాలేదు. అంటే 55 సంవత్సరాలు గడచినా కధ లో ఏమాత్రం మార్పు రాలేదు. ఒక అతి మంచి హీరో .. హీరోయిన్ అతన్ని మాత్రమే మొదట్లో అపార్ధం చేసుకున్నా తర్వాత మనస్పూర్తిగా అర్దం చేసుకుంటుంది. విలన్ ఓ చవట.. చివరికి తన్నులు తినటానికి తప్ప దేనికి పనికిరాడు. ఇదే కధ ఈనాటికి చూస్తున్నామంటే, ఎంత గొప్ప కధో ఆలోచించండి.>>>
एक् सिनेमा हिट् होगया तो, उस् की कहानी को कापी कर् के सौवे सिनेमाये बनाते है. కొత్త తరహా కథలతో సినిమాలు తియ్యడం మన భారతీయులకి బొత్తిగా చేతకాదు.
చందు says:
simply superb article వెంకట్ గారు
మన తెలుగు సినిమాకు “హీరోల మాఫియా” పెద్ద అడ్డంకి. వయసుమళ్ళిన మాఫియా హీరోలు వెళ్ళిపోతున్నారు కానీ వారి వారసులు మళ్ళీ అదే పని చేస్తున్నారు. వెర్రి అభిమానులు ఆ పిచ్చి చేష్టలకు జేజేలు కొడుతున్నంతవరకు ఈ పరిస్థితి మారదు. కొన్నిసార్లు “హీరో” నే సినిమాకు హీరో అవడంలో తప్పులేదు కానీ, ఎప్పటికీ సినిమాకు హీరో “కథ మరియు కథనం” అని గ్రహించాలి తీసేవాళ్ళు, చూసేవాళ్ళు.
shree says:
వాల్ల తప్పేముందండి…దీనినే….నేను Object Oriented Approach అని అంటాను….
Stop Delivering What You Have…!!!
Start Delivering What They Need…!!!
Think Business…!!!
మర్చిపొయారా…. దీన్నే మన వాల్లు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు or పాటించారు….
కాని మన వాల్లు కొద్ది రోజులుగా “What They Need” అనే దాని మీదనే “Finalize” కాలేక పొతున్నారు…..
ఒక అరుంధతి, కొత్త బంగారు లోకం,Happy Days చూసాక నైనా మన జనాలు అంత వెర్రి వాల్లు కారని తెలుసుకొవాల్సిన అవసరం ఎంతైనా వుంది….
“What They Need” is the Biggest Question…???? at least for me…????
Uttara says:
ఇన్ని లేఖి సినిమాలు రావడనికి కారనం మన దర్షక నిర్మతలకి డబ్బు సంపాదన తప్ప వెరే ద్యాస ఉండదు, రియల్ ఎస్తెట్ లొ డబ్బు పెట్టె వాడె సినిమాలకి పెట్టుబడి పెడుతున్నాడు. దర్షక నిర్మతాలు హిరొ కంఢబలం హిరొయిని పిక్కబలం చూపడనికి ఉన్న అత్రుత సినిమా కతలమిద ఊండదు.
We have escapist cinema and oral sex cinema (Hindi cinema is very good at it). We have real estate producers. We have great heroes who want us to see their films, who want us to vote for them, who want we burn over lives for their popularity, and they want slaves who consume whatever they shit in our faces. They want lot of money for showing their body and booty dance.
sharma says:
“విశ్వనాధ్ గారు ఎన్నో మంచి చిత్రాలు నిర్మించాడు. కాని ఆయన కమల్ లాటి డేరింగ్ హీరో తో లే క చిన్న హీరో లతో ఎన్నో విజయాలు సాధించగలిగాడు. కానీ చిరంజీవి తో ఏమీ సాధించలేకపోయాడు.”….
కె.విశ్వనాధ్ చిరంజీవితొ తీసిన చిత్రాల్లో “శుభలేఖ” “స్వయంకృషి” బాగ ఆడిన సినిమాలు అనిగమనించగలరు.
అసలు ఎం సాధించాలి? చిరంజీవి మూస సినిమాలుచెసిన మాట వాస్తవమె! కాని మంచి చిత్రాలు కూడా చెసాడు. పైన చెప్పిన వాటితొ పాటు రుద్రవీణ(ఇది అతని అభిరుచి మేరకు సొంతగా నిర్మించిన సినిమ) ,అభిలాష, చాలెంజ్, చంటబ్బాయ్… etc
wowchiru says:
@sharma,
avunandi chiru meeru cheppina cinemalu chesi prapanachaaniki chaalaa goppa seva chesaaru. Nobel ledaa bharata ratna ledaa Oscar life time achievement ichi satkariddaamaa?
sharma says:
WOWchiru… గారు,, అసలు ఎం సాధించాలి అంటె దానర్ధం ఇంక సాధించడానికి ఎమీ లేదు అని కాదు.
చెప్తున్నా కదా.. చిరంజీవి మూస సినిమలు చాలానె చేసాడు అని! చిరుని సమర్ధించట్లేదు. విశ్వనాధ్ చిరుతో చేసి ఏమీ సాధించలెకపోయాదు అంటే.. అతనితో చేసిన రెండు మంచి సినిమాలను ఉదహరించాను.
నోబెల్, భారతరత్న,ఆస్కార్.. మాట్లాడుతున్న సందర్భం ఎమిటి? ఏమిటీ విపరీతం!!
Telugu Abhimmani says:
@sharma,
Babu Sharma gaaru…. I’m not trying to hurt you but, mee comments lo Chiru great baaga chestahdu ani cheppali annni usthahame kanipisthundhi kaaani…. manchi cinemalu gurinchi cheputhunna feel ledhu..
Allaa choosthe prathi edhavaa telugu hero konni manchi cinemale theesaru…..
Even Raviteja got more good(different) movies than chiru…when compare the ration with nUmber of movies.
Vekat gaari lekha lo CHiranjeevinooo Balakrishannoo thittali anoo..vaaalu waste anoo cheppaledhu…
entha sepatiki maa hero ni thakkuva chesadu..edho comment raasi maa vadu super anipinchukovali ane feeling thappithe… ayana emi chepparu..enthaa bagaaa explain chesaru (pressent situation) ani thinking ledhu.
it’s time to change, and wish for good movies.
come on growup.
if I hurt you..i’m really sorry…
మార్తాండ says:
మన సినిమా నిర్మాతలకి కళాత్మక దృష్టి లేదు. ఎవడు ఎంత వితండవాదం చేసినా ఇది మాత్రం కాదనలేని నిజం. ఎంత రొమాంటిక్ కథలైనా అల్లొచ్చు. కానీ ఒకే మూసలో వందలాది కథలు అల్లితే చూసే వాళ్ళకి అదోలా ఉంటుంది.
sharma says:
chiru baaga chesthaadu anna uthsaaham kaadu adi evadoooo kaadanaleni nijam. okadu certificate ichedenti??
next.. meeku nenu chiranjeevini support chesesthunnaanemo ane uthsaaham thappa asalu em maatlaaduthunnaano gamaninchatledu. alaage venkat gaari lekha gurichi, just viswanadh chiru tho chesina rendu manchi chithraala gurichi cheppenu.. anthe! athani lekha lo manchi chithraala patla aayana thapathrayam naaku ardhamaindi. aayana em raasaaro kooda ardhamaindi, athani maatalatho ekeebhavisthunnaanu. nenu chiru abhimaanine kaanee anthakante mundu manchi cinemalaki abhimaanini. edo oka comment raasi raasinantha maathraana evaroo super herolu avaru, modata idi gurthinchandi.
meeru sorry cheppakkharledu.. endukante nenu hurt avaledu. meeku nenu annadi sariga ardham kaaledu kaabatte cheppaalsi vachindi.
hero says:
@chandu
enti nayana edo verri abhimanulu antu matladutunnaru..abhilandaru verri vallu anna mee abhiprayam 100% tappu…ye pedda hero ayina mundu valla abhimanulani satisfy cheyadaniki try cehstaru taruvaate migata prekshakula kosam chustaru…endukante vallaki anthati gouravanni ichindi aa abhimanule kabatti…vallaki aa abhimanam panchindi verriga matram kadu , valla talent ni vallu eppudo nirupinchukunnaru..prastutam valla kartavyam industry lo unna konni rojulu prekshakulani especially fans ni satisfy cheyadaniki…endukante evvadu chusina chudakapoyina…prapamcham lo e moolana unna valla cinema lu tappakunda chusedi abhimanule kabatti…
topic ni ekkadi nunchi ekkadiko divert chesi nannu kuda divert cheyincharu..
regards,
oka hero abhimani
చందు says:
@hero, హీరో గారు, నవతరంగానికి స్వాగతం
sharma says:
manam maatlaadaalsindi kadhaa viluvalu unna manchi chithraala gurinchi. topic ekkadiko vellindi.. anduku nene baadhyudini.. Sorry for that. idi ikkaditho vadileddaam! abhimaanulu herolu ane prapancham nundi bayataki vachi vere prapancham kooda chooddaam:-)
Venkat says:
మోహనక్రిష్ణ తీసిన అష్టాచెమ్మా కూడా సూపర్ హిట్టే. కలర్ స్వాతి ఏదో కాస్త తెలుసు తప్ప మిగతా వారంతా కొత్త వారే. రవితేజ నటించిన నా ఆటోగాఫ్ పరిస్థితి మర్చిపోలేదుగదా. అదే రవితేజ నటించిన విక్రమార్కుడు.. మూస సినిమా అయ్యినా సూపర్ హిట్టే. ఏతావాతా తేలిందేమిటంటే తప్పు మనదే. కధ బాగుంటే నటులు తెలీయకపోయినా సూపర్ హిట్ చేస్తున్నాము. అదే ఓ పెద్ద నటుడు నటిస్తే కధ బాగున్నా తిప్పికొట్తున్నాము. నవదీప్ ఓ ‘మాస్’ సినిమా చేస్తే చూడలేము. అలాగే నాగార్జున ‘మొదటిసినిమా’ చేసినా మనం చూడలేము. మనమే ఇమేజ్ అనే ముసుగు వాళ్ళ మీద కప్పుతున్నాము. మనకు హీరో వర్షిప్ తగ్గినప్పుడు మంచిసినిమాలు తప్పక వస్తాయి. ఓ ప్రేక్షక మహశయా తప్పు నీదేనయ్యా. తెలుసుకుని నిన్ను నువ్వే సరిదిద్దుకో.. అప్పుడు పెద్ద హీరోలు చేసే వెర్రిమొర్రి సినిమాలు కాస్తయినా తగ్గుతాయి.