ఇతర బాణీల నుంచి ప్రేరణ పొందిన తెలుగు పాటలు-చివరి భాగం

గతంలో నవతరంగంలో ‘కాపీయా? ప్రేరణా? -ఓ సినిమా పాటా, నీ పేరేమిటి అని ఒక వ్యాసం ప్రచురించారు. ఈ వ్యాసం వ్రాసింది శ్రీ మేడేపల్లి శేషు గారు. ఇతర బాణీల నుంచి ప్రేరణ పొందిన పాటల గురించి ఆయన అందులో ప్రస్తావించడం జరిగింది. ఈ వ్యాసం దానికి పొడిగింపు అనుకోవచ్చు.

తెలుగులో వచ్చిన ఎన్నో పాటలు ఇతర బాణీలనుంచి ప్రేరణ చెందినవి ఉన్నాయి. కొన్ని హిందీ, బెంగాలీ, తమిళ భాషల నుంచి ప్రేరణ పొందితే మరికొన్ని పాశ్చాత్య భాషల పాటల ప్రేరణ చెందినవి ఉన్నాయి. ‘కాపీయా? ప్రేరణా?…’ వ్యాసంలో ప్రస్తావించబడిన శ్రీ కార్తీక్ శ్రీనివాసన్ లాగే మన రాష్ట్రంలోనూ ఇలాంటి పాటలను సేకరించిన వారున్నారు.ఇలాంటి వారిలో హైదరాబాదు కి చెందిన శ్రీ మధుసూదన శర్మగారు ప్రముఖులు.

శ్రీ మధుసూధన శర్మ గారి గురించి క్లుప్తంగా, వీరు 1941 లో జన్మించారు, ఏ.జి.ఆఫీస్ లో సూపర్ వైజర్ గా పనిచేసి పదవీ విరమణ చేసారు. వీరు 1964 నుండి 78 rpm రికార్డ్స్ సేకరణ మొదలు పెట్టారు. వీరివద్ద తెలుగులో 1934 లో వచ్చిన లవకుశ (హే రామ రాజీవ నయన), 1935 లో వచ్చిన క్రిష్ణ లీలలు, మాయాబజార్ మరియు 1937 లో వచ్చిన కనకతార రికార్డ్స్(త్వరలోనే ఈ పాటలు కూడా “నవతరంగం” పాఠకులకు వినిపిస్తాం) ముఖ్యమైనవి. ఇవే కాకుండా ఇంగ్లీష్, హిందీ రికార్డ్స్ కూడా వున్నాయి.

ఈయన సేకరించిన పాటలను నవతరంగం ద్వారా మీ అందరితో పంచుకోగలిగినందుకు ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఈ కలెక్షన్ అందచేసిన శ్రీ మధుసూధన శర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పాటల కార్యక్రమం మొదటి భాగంలో ఆరు పాటలను ఇక్కడ వినొచ్చు. ముందుగా ఏ పాటనుంచైతే ప్రేరణ చెందారో ఆ పాట (ఒరిజినల్), ఆ తర్వాత మన తెలుగు పాట ను రికార్డ్ చెయ్యడం జరిగింది.

ఈ శీర్షికలోని మిగిలిన భాగాలు

మూడవ భాగంలోనిపాటల వివరాలు:

అసలు పాట:Kay cera cera-Doris Day
ప్రేరణ:కే సెరా సెరా-భానుమతి

Kay cera cera

అసలు పాట:Violetara-The Troubadors
ప్రేరణ:మల్లెపూలు-రావు బాల సరస్వతి

Violetara

అసలు పాట:Ya Mustafa
ప్రేరణ:హలో హలో ఓ అమ్మాయి-ఘంటసాల,సుశీల

Ya Mustafa

అసలు పాట:Young ones-Cliff Richard
ప్రేరణ:ఈ వెన్నెల-ఘంటసాల,సుశీల

Young Ones

గమనిక: ఈ శీర్షికలో ఇదే చివరి వ్యాసం. ఇతరబాణీలనుంచి ప్రేరణ పొందిన హిందీ పాటల కలెక్షన్ త్వరలో నవతరంగంలో వినవచ్చు.

Filed Under: featuredleadఆడియో/వీడియోసంగీతం-సాహిత్యం

Tags: , , ,

Comments (4)

Trackback URL | Comments RSS Feed

  1. రమేష్ గారూ, స్వర్గసీమ లో భానుమతి గారు పాడిన ఓ పావురమా లేదా మీ కల్క్షన్ లో…బ్లడ్ అండ్ శాండ్ లో ఆ ఒరిజినల్ సాంగ్ ఎక్కడ్ వినొచ్చో చూడొచ్చో ఎవరైనా చెప్పగలరా?

  2. పరుచూరి శ్రీనివాస్ says:

    వెంకట్-గారు,
    Blood and Sand (1941) లోని Rita Hayworth హమ్మింగ్ కు భానుమతి/రజనీకాంతరావుగార్ల అపురూప సృష్టికి ఏమీ పోలికలు లేవు! — శ్రీనివాస్

  3. p h reddy says:

    telugu lipi naa daggara ledu, kshaminchali. Ee vyasam chadivaka udatha bhaktigaa nenu saitam edo cheppalani ee prayatnam. ‘Jeevitame saphalamu,Anarkali-from-Yeh Zindagi Usiki Hai,Anarkali’ is one example. Similarly. Oho Basthi Dorasaani_Abhimaanam from OLekePahalaPahalPyar-CID: Payaninche-Kuladyvam from hal ud jare panchi etc. There are also a few which have gone from telugu to hindi. A couple of them are HayiHayigaaamaniSaage to Kuhu Kuhu Bole Koyalia-SuvarnaSundari and SudhavolSuhasini-ChivarakuMigiledi to Yeh Nain Dare Dare-Khamoshi. Naa ee chinni prayatnam miku nachchutundani asa.

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.