Menu

Monthly Archive:: February 2009

రెవల్యూషనరీ రోడ్

అసలీ సినిమా గురించి వ్రాయడం వేస్ట్. అలా అని ఈ పేరుతో వచ్చిన సినిమా కానీ పుస్తకం కానీ వేస్ట్ అని కాదు నా ఉద్దేశం. నాకు తెలిసిన వాళ్ళకయితే బలవంతంగా ఈ సినిమా చూపించాను. బలవంతంగానైనా పుస్తకం చదివేలా చేశాను. రెండూ అంతగా నచ్చాయి నాకు. కాకపోతే ఈ సినిమా గురించి గానీ పుస్తకం గురించి గానీ వ్రాయడం ఎందుకు దండగ అన్నానంటే కొన్నింటి గురించి ఎంత చెప్పినా వ్రాసినా ఆయా పుస్తకాలో సినిమాలో చూసినప్పుడు

నిళల్ కుత్తు(షాడో కిల్)-మరో సమీక్ష

ఉపోధ్ఘాతం: హత్యచేయడం నేరమే!కాని ఒక వ్యక్తిని చంపిన కారణంచేత హంతకుణ్ణి చంపేస్తే, అతన్ని చంపినందుకు ఎవర్ని శిక్షించాలి? చావుకు చావే సమాధానమా? ఒక వేళ మరణశిక్ష అమలయ్యాక హంతుకుడు నిర్దోషి అని తెలిస్తే పోయిన ప్రాణాన్ని తిరిగి తేగలమా? అసలు మరణశిక్ష అవసరమా? ఇలాంటి ప్రశ్నలు మీ మస్కిష్తంలో ఎప్పుడైనా ఉదయించాయా? అయితే అదూర్ గోపాల కృష్ణన్ దర్శకత్వం వహించిన నిళల్ కుత్తు  (shadow kill)సినిమా చూడండి.పై ప్రశ్నలన్నంటికీ ఈ సినిమాలో సమాధానం దొరక్కపోవచ్చు గానీ, మనసున్న ఏ

Frost/Nixon

ఫ్రాస్ట్/నిక్సన్-2008 లో నేను చూసిన అత్యుత్తమ సినిమాల్లో ఒకటి. గత సంవత్సరంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి; ఇలాంటి అంటే ప్రముఖల జీవితాలు లేదా వారి జీవితాల్లోని వివిధ ఘట్టాల ఆధారంగా వచ్చిన సినిమాలు. ఉదాహరణకు జార్జి బుష్ గురించి వచ్చిన ‘W’, చే గువెరా గురించి వచ్చిన రెండు సినిమాలు ’చే-1′ మరియు ’చే-2′, ఇటలీ మాజీ ప్రధాని Giulio Andreotti జీవితం ఆధారంగా వచ్చిన ’Il Divo’ అనే ఇటాలియన్ సినిమా, Harvey Milk

ఎవరి దృష్టిలో మార్పు రావాలి?

’రూపవాణి వారి ఆనాటి అమూల్యమైన రచనలు నేటితరానికి అందించేందుకు నవతరంగం పునఃప్రచురణగావిస్తున్న విషయం గతంలో కొన్నిసార్లు ప్రస్తావించడం జరిగింది. తరం మారినా మన సినిమా ప్రమాణాలు మారాలని కోరుకునే సినిమా ప్రేమికుల అభిరుచులు అప్పుడూ,ఇప్పుడూ మారలేదనడానికి ఈ రచనలే నిదర్శనం. ఎందరో ప్రముఖులు వ్రాసిన ఈ రచనలను ప్రచురించే అనుమతి ఇచ్చిన S V శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.అచ్చులో ఉన్న ఈ వ్యాసాలను డిజిటైజ్ చెయ్యడంలో పాలుపంచుకుంటున్న నవతరంగం రచయితలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ కార్యక్రమంలో

నిషల్కూత్తు – షాడో కిల్

ఈ మధ్య భారతీయ కళాత్మక చలన చిత్రాల మీద కొంచెం దృష్టి పెట్టాను. ముందుగా సత్యజిత్ రే గారి చారులత చూశాను. నా ఖర్మకాలి అదొక దిక్కుమాలిన డీవీడీ. సినిమానించి డీవీడీలోకి జరిగిన మార్పు పరమ దరిద్రంగా జరిగింది. నలుపు తెలుపు చిత్రమేమో, కాంట్రాస్టు సరిగ్గా లేకపోయేప్పటికి అస్సలు చూడలేక పోయాను. అతి ఘనత వహించిన రే గారి ప్రముఖ చిత్రం గతే ఇలా ఉంటే ఇక మిగతా పాత చిత్రాల పరిస్థితి ఎలా ఉంటుందని ఊహించవచ్చు?