Menu

Monthly Archive:: February 2009

అక్షరాలా లక్ష

గత సంవత్సరం ఆగష్టు 25 న నవతరంగం లక్ష పేజీ వ్యూస్ మైలు రాయి ని దాటింది. అప్పటికి నవతరంగం 35 వేల విజిట్స్ రిజిస్టర్ చేసుకుని వుంది. ఆ తర్వాత గడిచిన ఆరునెలల్లో నవతరంగం మూడు లక్షలకి పైగానే పేజ్ వ్యూస్ దాటి ఇప్పుడు మొత్తం లక్షకి పైగానే విజిట్స్ ని రిజస్టర్ చేరుకుంది. నవతరంగం వెబ్ సైట్ స్థాపించిన 14 నెలల్లోనే లక్ష విజిట్స్ చేరుకున్న ఆనంద సమయంలో పాఠకులకూ, సభ్యులకూ మరియు నవతరంగం

నవతరంగం-ప్రచార సామాగ్రి

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది. పనిలో పనిగా నవతరంగం గురించీ ప్రచారం చేసేస్తే ఎలా ఉంటుంది? ఎలాగూ సినిమా వాళ్లందరూ రాజకీయాల్లోకొస్తున్నారు కాబట్టి అప్పటికి నవతరంగం సినిమా సైటు నుంచి రాజకీయ సైటు గా మారినా మారొచ్చు. అప్పటికి మనమంతా కలిసి ఒక పార్టీ స్థాపించే స్థాయికి ఎదిగామనుకోండి మళ్ళీ ఫ్రెష్ గా ప్రచారం మొదలుపెట్టే కంటే ఇప్పటి నుంచే నవతరంగం గురించి చిన్నగా ప్రచారం మొదలుపెడ్తే బావుంటదనిపిస్తుంది. అందుకే…. అందుకు కాదు కానీ నవతరంగం కొత్తగా

తెలుగు సినిమా అమ్మ,బామ్మ- నిర్మలమ్మ ఇక లేరు

“ఓరి దొంగసచ్చినోడా!” అని చిరంజీవి నుంచీ రాజేంద్రప్రసాద్ వరకూ తెలుగు తెరపై అందరి హీరోలనూ నోరారా ప్రేమగా గద్దించి, గదమాయించి, అలిగి,కోపగించి పిలివగలిగిన అమ్మ, బామ్మ – నిర్మలమ్మ గారిక మనకు లేరు. నిర్మలమ్మ అసలు పేరు రాజమణి. 1950లో తన పదహారేళ్ల వయసులో గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి నటించారు. ఆ తరువాత సుమారు వెయ్యి సినిమాల్లో నటించారు.శంకరాభరణం, యమగోల, పదహారేళ్ల వయసు, మావిచిగురు, గ్యాంగ్‌లీడర్‌, శుభసంకల్పం, ఆపద్భాంధవుడు, స్వాతిముత్యం,చినరాయుడు,మాయాలోడు చిత్రాలు వీరి

ఓ నిర్మాత కధ

నా పేరు సింహాచలం అండీ. మా ఊరు పాలకొల్లండి. నాకు ఓ వంద ఎకరాల మాగాణి ఉండేదండి. నలుగురు పిల్లలతో కడుపులో చల్ల కదలకుండా చక్కగా గడిచిపోయేదండి. మా ఆవిడ పే రు సావిత్రి అండీ. నాకు అక్క కూతురే నండి. చిన్నప్పటి నుంచి తెల్సినదవ్వటం వల్ల నా మీద చాలా డామినేషనేనండి. ఏదో పైలాపచ్చీసు గా నడిచిపోతున్న నా జీవితం లో కొరివి పెట్టింది నా తోడల్లుడే నండి, నాపాలిట తోడేలు గాడు. సంక్రాంతికి మా

ది రెజ్లర్

కొంతమంది దర్శకులుంటారు. వాళ్ళొక్క సినిమా తీస్తారు. ప్రపంచాన్నంతా ఆకర్షిస్తారు. అప్పట్నుంచి ఈ దర్శకుడు ఇక ఎలాంటి సినిమాలు తీస్తాడో,తర్వాత సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అని, అందరూ కాకపోయినా, కొంత మంది వీరాభిమానులయినా ఎదురు చూసేలా చేస్తారు. అంతే కాదు ఈ సినిమా మూందూ ఆ దర్శకుడు ఏయే సినిమాలు తీసాడని వెత్కించేలా చేస్తారు. అప్పట్లో క్రిస్టోఫర్ నోలన్ ముందు ఒక ఇండీ ఫిల్మ్ ‘ది ఫాలోయింగ్’ తీసి ఆ తర్వాత ‘మొమెంటో’ తీసాక ఇదే పరిస్థితి. కాకపోతే