అక్షరాలా లక్ష

one-lakh11

గత సంవత్సరం ఆగష్టు 25 న నవతరంగం లక్ష పేజీ వ్యూస్ మైలు రాయి ని దాటింది. అప్పటికి నవతరంగం 35 వేల విజిట్స్ రిజిస్టర్ చేసుకుని వుంది. ఆ తర్వాత గడిచిన ఆరునెలల్లో నవతరంగం మూడు లక్షలకి పైగానే పేజ్ వ్యూస్ దాటి ఇప్పుడు మొత్తం లక్షకి పైగానే విజిట్స్ ని రిజస్టర్ చేరుకుంది.

నవతరంగం వెబ్ సైట్ స్థాపించిన 14 నెలల్లోనే లక్ష విజిట్స్ చేరుకున్న ఆనంద సమయంలో పాఠకులకూ, సభ్యులకూ మరియు నవతరంగం విజయంలో పాలుపంచుకున్న అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.

nt-onelakh

సైట్ మీటర్ తో పాటు మరి కొన్ని సదుపాయాల ద్వారా కూడా నవతరంగం సైట్ స్టాట్స్ రికార్డు చేయడం జరిగింది, అందులో ఒకటయిన AW Stats ఇప్పటికి లక్షా యాభై వేల విజిట్స్, పది లక్షలకు దగ్గర్లో పేజ్ వ్యూస్ చూపెడ్తోంది.

nt-aw

అలాగే వెబలైజర్ అనే మరో టూల్ ఇప్పటికి రెండు లక్షలకు పైగా విజిట్స్, పది లక్షలకు దగ్గర్లో పేజ్ వ్యూస్ చూపిస్తుంది.

nt-stat1

పద్నాలుగు నెలల్లో లక్ష విజిట్స్ తక్కువా, ఎక్కువా అని పోల్చడానికి కానీ, లేదా మరొక సైటు కంటే మాకే ఎక్కువ హిట్లు వచ్చాయని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. నిజానికి ఒక రోజులోనే లక్ష విజిట్స్ వచ్చే తెలుగు సినిమా సైట్లు చాలానే ఉన్నాయి. అయితే నవతరంగం వాటికి ఎప్పుడూ పోటికాదు. కేవలం వతరంగంలో ప్రచురించే రచనలకు మంచి రీడర్‍షిప్ వుంది అని మాత్రమే సభ్యులకు, ఔత్సాహిక రచయితలకు చూపించి తద్వారా మరింత మందిని నవతరంగంలో సభ్యులుగా చేరమని ఆహ్వానం పలకడమే ఈ ’స్టాట్స్ ప్రదర్శన’ ఉద్దేశం.

నవతరంగంలో ఎలా సభ్యులు కావాలో తెలుసుకోడానికి ఇక్కడ చూడండి.

అలాగే నవతరంగం పాఠకులు తమ బ్లాగు/సైట్ల ద్వారా నవతరంగానికి ప్రచారం కల్పించాలనుకుంటే ఇక్కడ చూడండి.

ఈ శుభసందర్భాన పాఠకులు మరియు సభ్యులకు మరో మారు హృదయపూర్వక ధన్యవాదాలు.

చివరిగా, గత రెండు రోజులుగా నవతరంగం సైట్ డిజైన్ మారుస్తుండడం వలన చాలా సేపు నవతరంగం సైటు అందుబాటులో లేకపోవడమో లేక సైటు సరిగ్గా లోడ్ కాకపోవడమో జరిగుండొచ్చు. ఇప్పటికీ మీకు సైటు సరిగ్గా లోడ్ కాకపోతే ఒకసారి Ctrl+F5 నొక్కి చూడండి.అయినా కూడా మీకు సైటు సరిగ్గా కనిపించకపోతే వ్యాఖ్యల ద్వారా తెలియచేయండి. సరిచేస్తాము.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

5 Comments to “అక్షరాలా లక్ష”

  • నవతరంగం చాలా మందిని చేరుతోంది. బాగుంది.

    • @కె.మహేష్ కుమార్,
      చేరుతోంది సరే…ఫాస్ట్ గానా స్లోగానా?
      ఇప్పుడు సైటు నాకైతే చాలా ఫాస్ట్ గా లోడవుతుంది.
      మరి మీకో?

  • ఇది నవతరంగం కి చాలా సాధారణం,మామూలేగా అనుకున్నట్టున్నారు పాఠకమహాశయులు.కనీస స్పందనలేదు.ఇది ఒక అరుదైన విజయం,అసాధారణమైన లక్ష్యాన్ని వాణిజ్యపరమైన చిట్కాల సాయం,బూతుల గొడవ,గాసిప్పుల గగ్గోలూ లేకండా కేవలం అభిరుచి గల పాఠకులవల్ల సుస్సాధ్యమైన గౌరవం. ఈపురస్కారాన్ని సాధ్యం చేసిన అందరికీ ముఖ్యంగా వెంకట్ కి అభినందనలు.
    త్వరలో రెండులక్షలు అచ్చంగా అన్న టపా చదవచ్చన్నమాట ఇక్కడ :)

  • navatarangam pedda axaraalatho display avuthondhi, screen madhyalo navatarangam logo kanipisthondhi… sivajikcvag@gmail.com

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories