“ఓరి దొంగసచ్చినోడా!” అని చిరంజీవి నుంచీ రాజేంద్రప్రసాద్ వరకూ తెలుగు తెరపై అందరి హీరోలనూ నోరారా ప్రేమగా గద్దించి, గదమాయించి, అలిగి,కోపగించి పిలివగలిగిన అమ్మ, బామ్మ – నిర్మలమ్మ గారిక మనకు లేరు.
నిర్మలమ్మ అసలు పేరు రాజమణి. 1950లో తన పదహారేళ్ల వయసులో గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి నటించారు. ఆ తరువాత సుమారు వెయ్యి సినిమాల్లో నటించారు.శంకరాభరణం, యమగోల, పదహారేళ్ల వయసు, మావిచిగురు, గ్యాంగ్‌లీడర్, శుభసంకల్పం, ఆపద్భాంధవుడు, స్వాతిముత్యం,చినరాయుడు,మాయాలోడు చిత్రాలు వీరి సహజనటనకు కొన్ని ఉదాహరణలు. మయూరి, సీతారామరాజు సినిమాలకు నంది పురస్కారాన్ని అందుకున్నారు. చిరంజీవి నటించిన ‘స్నేహం కోసం’ వీరి పూర్తి నిడివి పాత్రగా చెప్పుకోవచ్చు.
నిర్మలమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆరోగ్యం విషమించి 10 ఫిబ్రవరి,2009 రోజున మృతిచెందారు. నవతరంగం నిర్మలమ్మ గారికి అశృనివాళి అర్పిస్తోంది. తెలుగు తెర అమ్మ,బామ్మ- నిర్మలమ్మకు శ్రద్ధాంజలి ఘటిస్తోంది.
venkat says:
nijamga chala manchi grand maa ni we lost…it is very sad…but…passing away from here is unavoidale …
your sould may rest in peace granda maa
Rao Vemuri says:
“గయ్యాళి” సూర్యాకాంతమ్మ పరమపదించినప్పుడు ఎంత బాధ పడ్డానో ఇప్పుడూ, “బామ్మ” నిర్మలమ్మ మరణ వార్త విని అంతగానూ కలవరపడ్డాను. ఆమె శంకరాభరణం సినిమాలో పెళ్ళి చూపుల సన్నివేశంలో చూపిన నటన అద్వితీయం.