Menu

నవతరంగం-ప్రచార సామాగ్రి

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది. పనిలో పనిగా నవతరంగం గురించీ ప్రచారం చేసేస్తే ఎలా ఉంటుంది? ఎలాగూ సినిమా వాళ్లందరూ రాజకీయాల్లోకొస్తున్నారు కాబట్టి అప్పటికి నవతరంగం సినిమా సైటు నుంచి రాజకీయ సైటు గా మారినా మారొచ్చు. అప్పటికి మనమంతా కలిసి ఒక పార్టీ స్థాపించే స్థాయికి ఎదిగామనుకోండి మళ్ళీ ఫ్రెష్ గా ప్రచారం మొదలుపెట్టే కంటే ఇప్పటి నుంచే నవతరంగం గురించి చిన్నగా ప్రచారం మొదలుపెడ్తే బావుంటదనిపిస్తుంది. అందుకే….

అందుకు కాదు కానీ నవతరంగం కొత్తగా చూసే వాళ్ళు చాలామంది ఇంతమంచి సైటు ఇన్నాళ్ళూ ఎలా మిస్సయ్యామనో, ఈ సైటు గురించి మీరు ఇంకా పబ్లిసిటీ ఇవ్వాలనో, నవతరంగం ప్రచారానికి ఏదైనా కొత్త మార్గాలు అన్వేషించాలనో అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే నవతరంగం ప్రచారం కోసం కొన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాము.

నవతరంగం @ ఫేస్‍బుక్
నవతరంగం కోసం ఇప్పుడు ఫేస్ బుక్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేశాము. మీరు ఫేస్ బుక్ లో సభ్యులైనట్టయితే నవతరంగం గ్రూపు లో చేరండి. అలాగే నవతరంగం గురించి మీ ఫేస్ బుక్ లోని మీ మిత్రులకూ తెలియచేయండి. ఫేస్ బుక్ లోని నవతరంగం గ్రూపులో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నవతరంగం విడ్జెట్
నవతరంగం లో కొత్త పోస్టులతో కూడిన ఒక న్యూస్ గెటర్ విడ్జెట్ తయారు చేశాము. ఈ విడ్జెట్ ద్వారా నవతరంగంలో కొత్త పోస్టుల గురించి ఎక్కువమందికి తెలియచేయవచ్చు. ఈ సైట్లో సైడ్ బార్ లో లేదా కింద ఉన్నట్టుగా నవతరంగం విడ్జెట్ ని మీ బ్లాగు/సైట్లలో ఉంచడం ద్వారా నవతరంగాన్ని మరింత మందికి చేరేలా చెయ్యడానికి మీ సహకారం కావాలి. ఈ విడ్జెట్ క్రింది భాగంలోని GETTHIS అనే బటన్ పై క్లిక్ చేస్తే ఈ విడ్జెట్ కి సంబంధించిన కోడ్ మీకు కనిపిస్తుంది. ఆ కోడ్ మీ బ్లాగ్ సైడ్ బార్ లో చేర్చడం ద్వారా నవతరంగం గురించి మరింత మందికి తెలియచేయొచ్చు.

నవతరంగం బటన్స్

నవతరంగం సైటుని మరింత మందికి చేర్చే ఆలోచనతో తయారుచేసినవే నవతరంగం బటన్స్. కూడలి, జల్లెడ, పొద్దు సైట్ల బటన్స్ ఎలా అయితే చాలా తెలుగు బ్లాగుల్లో ఉంటాయో అలాగే నవతరంగం నచ్చిన వారు ఈ క్రింది బటన్స్ లో ఏదైనా తమ సైట్లో పొందుపరిచి నవతరంగం గురించి ప్రచారం చెయ్యడంలో సహాయపడమని మనవి చేసుకుంటున్నాము.

ఈ బటన్ కి సంబంధించిన కోడ్ కోసం ఇక్కడ చూడండి.

ఈ బటన్ కి సంబంధించిన కోడ్ కోసం ఇక్కడ చూడండి.

ఈ బటన్ కి సంబంధించిన కోడ్ కోసం ఇక్కడ చూడండి.

ఇవి మాత్రమే కాకుండా నవతరంగాన్ని మరింతమంది పాఠకుల దగ్గరకు చేర్చడానికి మీ సలహాలు వ్యాఖ్యల ద్వారా తెలియచేయగలరని మనవి.

2 Comments
  1. శివాజీ March 1, 2009 /