హౌస్ ఫుల్-ట్రైలర్

housefull-lead

హౌస్ ఫుల్-అజయ్ భుయన్ దర్శకత్వంలో రానున్న సరికొత్త తెలుగు సినిమా. గతంలో ’ఆ నలుగురు’, ’మధుమాసం’ లాంటి సినిమాలకి దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు చంద్ర సిధ్ధార్థ నిర్మాణం లో త్వరలో మన ముందుకి రాబోతున్న ఈ సినిమా లో విపిన్, గౌరి పండిట్, వేగ, ఆర్యన్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Synopsis

పనికిమాలిన ఒక బాచిలర్ కుర్రాడు, ఒక ముదురు ప్రైవేట్ డిటెక్టివ్, పేరు చెప్తేనే జనాలు వణికిపోయే ఒక మాఫియా డాన్. వీళ్ళకి తోడు ఇద్దరమ్మాయిలు; ఒకరేమో మోసపోయిన ఆడది. మరొకరు మగవాళ్ళను తన చేతి వేళ్ళపై ఆడించగల వయ్యారి.ఒక్క రాత్రిలో వీళ్ళ జీవితాలు మారిపోనున్నాయి.ఒకరి కథ స్నేహం కోసం-మరొకరిది ధన దాహం. ఒకరికి కావాల్సింది పరువు-మరొకరికి ప్రేమ.

ముగ్గురు మగ వాళ్ళ జీవితంలో విడివిడిగా జరిగిన వేర్వేరు ఘటనలు. సంబంధం లేనట్టుగా అనిపించే కథనాలు. 24 గంటల క్రితం ఎవరికి వారే యమునా తీరే. కానీ తీగ లాగితే డొంకంతా కదిలిందెందుకని? వీళ్ళ జీవితాలను ముడివేసిన ఆ దారమేమిటో? నూతన బంధాలు, జటిల మానవ సంబంధాలు వెలుగులోకొచ్చే రాత్రి ఇదేనా?

హౌస్ ఫుల్-త్వరలో మీ అభిమాన థియేటర్లలో…

హౌస్ ఫుల్ – సినిమా వెబ్ సైట్

ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో విశే్షాలతో కూడిన ఒక వెబ్ సైట్ (http://housefull.navatarangam.com) రూపకల్పన కూడా జరిగింది.ఈ వెబ్ సైట్లో నటీ నటుల ఇంటర్వ్యూలు, ఇమేజ్ గ్యాలరీలతో పాటు ట్రైలర్లు, సంగీతం కూడా త్వరలోనే లభ్యమవనున్నాయి.

ఈ సైట్ చూసి మీ అభిప్రాయాలు తెలియచేయండి.

Trailer


ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

3 Comments to “హౌస్ ఫుల్-ట్రైలర్”

  • ఆర్యా

    తెలుగు సినిమాకు ఆంగ్ల సైటేల?

    • @chavakiran, ఆంగ్లసైటేలా అనటం కన్నా తెలుగులో‘కూడా’ ఉంటే బాగుండు అని నా అభిప్రాయం,అయినా అదేమి పెద్దపని కాదులెండి,రండి తలా ఒక చెయ్యేసి తెలుగుచేద్దాం :)

  • ఏదో ప్రయత్నించాం బ్రదర్. ఈ సారికి సర్దుకుపొండి. ఇంకా ఇలాంటి అవకాశాలొస్తే ఈ సారి పూర్తిగా తెలుగులోనే…

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories