Menu

డిజిటల్ డెమొక్రసీ-ఇది డిజిటల్ సినిమాల శకం

రండి తెలుసుకుందాము. నిర్మిద్దాం .ప్రదర్శిద్దాం. లాభాలు అందుకొందాం

digital-lead‘డాన్’ సినిమా ‘డాన్ నెం 1’ పేరు తొ ను,’లక్ష్మి ‘ సినిమా  ‘మేరి తాకత్ ‘ పేరు తొ ను,’మాస్’ సినిమా ‘ మేరి జంగ్’ పేరు తొ ను,’నిజం’ సినిమా ‘మేరి అదాలత్ ‘ పేరు తొ ను, ‘పొకిరి’ సినిమా  ‘ఇంటర్నెషనల్ ఖిలాడి the iron man ‘ పేరు తొ ను. హింది లొ రిలీజు ఎలా అయ్యాయో తెలుసా..?

ఇవే కాకుండా తమిళ్ , హింది, తెలుగు , ఇతర భాషలలొ నిర్మితమయ్యే సినిమాలు డైరెక్ట్ రిలీజు కూడ డిజిటల్ లొ అవుతున్నాయి కదా..వాటిగురించి.. ఎలా అయ్యాయో తెలుసుకుందామా?

బహుశా చాల మందికి అసలు అవి హిందిలో కి కూడ డబ్ అయినవా అని సందేహం వస్తుండవచ్చు.. కొంతమంది కి డబ్ అయిన విషయం తెల్సుండవచ్చు, కాని అవి డిజిటల్ పధ్ధతిలొ రిలీజు అయినవని తెలుసుండక పొవచ్చు. తెలిస్తే..చాల మంచిది , ఈ వ్యాసం తెలుసుకొవాలనుకొనే వారికొసం మాత్రమే.

ప్రపంచవ్యాప్తముగా  ఎంతో విశేషముగా ఆదరణ పొందుతున్న డిజిటల్ సినిమా ఇప్పుడిప్పుడే..మనదేశం లొ కొన్ని రాష్ట్రాల తొ పాటు మన తెలుగు గడ్డ పైన కూడా విజయవంతమవుతున్న శుభతరుణములో ఒక చిన్న పరిచయం అసలు డిజిటల్ సినిమా అంటే ఏమిటో తెలుసుకుందాము.

డిజిటల్ సినిమా అంటే.. రెండు రకాలుగా చెప్పుకోవచ్చు.

ఒకటి-సినిమాని డిజిటల్ కెమేరాతో తీస్తున్నవి

రెండు-35 ఎం ఎం ఫార్మాట్ లొనే తీసి డిజిటల్ గా మార్చి శాటిలైట్ ల ద్వార నేరుగా రిలీజు చేస్తున్న సినిమాలు .ఇలా ఇప్పటికే..మన రాష్ట్రం లొ 300 పైగా ధియేటర్లలొ కొత్త సినిమాలు రిలీజు అవుతున్నయి.బహుశా మీరు ఈమధ్య ఏదైనా తెలుగు సినిమా చూసిఉంటే అది డిజిటల్ అయ్యుండొచ్చు.ప్రస్తుతము మేము చర్చించ బొయేది ఈ రెండో విషయం గురించి.

పూర్తిగా డిజిటల్ కెమేరా తొ సినిమా చేయ్యడం గురించి మరొ సారి మాట్లాడుదాము.

డిజిటల్ సినిమా ప్రొజెక్షన్ :

35 ఎం ఎం ఫార్మాట్ లోనే ఇలా సినిమాను తీసిన తరువాత పొస్ట్ ప్రొడక్షన్ అన్ని పనులు జరిగాకా ఏమవుతుంది?

ఇప్పటివరకు సినిమాలు తీసి అన్ని కార్యకరమాలు అయ్యాక వాటిని కావల్సినన్ని ప్రింట్లు తీసి ధియేటర్లకు పంపుతారు. ఐతే ఈ డిజిటల్ విధానములో లాబ్ నుంచి వచ్చిన సినిమాను టెలిసీని ద్వారా ప్రాసెస్స్ చేస్తారు . ఇక్కడంతా క్వాలిటి చెక్ ప్రధానంగా చేస్తారు. ఇక్కడ కంప్రెషన్ పధ్ధతి ఉపయోగపడుతుంది.

ఐతే దీనితొ ఇంకొ క లాభము ఏమిటంటే పైరసి కాకుండ  కాస్త నిరొధించవచ్చు.దీనికొసం సినిమా హార్డ్ డిస్క్ ఫైల్ ను ఒకరిద్దరు ,లేదా మనకు నచ్చినంత మంది వద్ద జాగ్రత్త గా ఉంచేందుకు దొహద పడేదే ఎన్ క్రిప్షన్ .

అత్యంత క్వాలిటిని నిలుపుకొగల డి 5 అనే టేపుల్లో ఎక్కిచ్చిన సినిమాను తరువాత అందరికి తెలిసిన MPEG-4ఫార్మాట్ లొ మారుస్తారు. ఈ ఫార్మట్ గురించి కెమెర మొబైల్ ఉన్న ప్రతిఒక్కరికి తెల్సిందే. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా కంప్రెషన్ కొసం ఈ ఫార్మట్ ఉపయోగిస్తారు.

తరువాత అత్యధిక బ్యాండ్ విడ్త్ తొ శాటిలైట్ కి ఎక్కిస్తారు.అంతే!

ఇంకేముంది తరువాత ఎవరెవరికి, ఏ ఏ ధియేటర్ వారికి సినిమా కావాలో వారికి అనగా ఎగ్జిబిటర్స్ కి, డబ్బులు ఇచ్చిన తరువాతే లెండి, ఈ ఎంక్రిప్టెడ్ విధానం లో ఉన్న సినిమా ఫైల్ డౌన్లోడ్ చేసుకునేందుకు పాస్ వర్డ్ లు ఇస్తారు. అంతే అత్యంత నాణ్యమైన దృశ్యం,ధ్వని ,కల్గిన సినిమా తెరమీద ప్రత్యక్షం ఇలా ప్రతి ఆట జరుగుతుంది.

రీళ్ళు మార్చుకోవడం , ప్రతిసారి వెనక్కు ముందుకు తిప్పుకొని వుంచుకొవడం.ఇవేమి తిప్పలు ఉండవు.

దీనివలన నష్టం ఏమిటంటే..

1.ఇన్ని ప్రింట్లు వేసాము . అన్ని ప్రింట్లు వేసాం అని గొప్పలు చేప్పుకొలేమన్నమాట.

2.పెద్దహీరో ల వీరాభి మానులు , సినిమా రిలీజు రొజున బస్ స్టాండు , రైల్వే స్టెషన్ల నుండి ,లేక డిస్టిబ్యూటర్ ఆఫీసుల నుండి, బాజా భజంత్రీలతో ఊరుమొత్తం రిక్షాలో తిప్పుకొని హారతులిచ్చి సినిమ ప్రొజెక్షన్ వద్దకు తీసుకెళ్ళడం అస్సలు కుదరదు.

లాభాలేమున్నాయి?

కంప్యూటర్లో ఉంటుంది కదా మాములు సినిమా లా ఏవరైనా కాపి చెయ్యాలి అనుకుంటే కుదరదు. ఏందుకంటే ఒరిజినల్ ఫైల్ వచ్చేసి చాలా మెమొరిని కల్గి వుంటుంది. ఇందాకే చెప్పినట్టు ,కన్వర్షన్ ఏంక్రిప్షన్ ల లాంటి ప్రక్రియలతొ ఏన్నో జాగ్రత్తలు ఉంటాయి .దీనికి తోడు ప్రతి ధియేటర్ కి ప్రేక్షకుల కంటి కి కనిపించని వాటర్ మార్కు ఉంటుంది. ఎక్కడ ఏ ధియేటర్ నుంచి సినిమాని విడియో కెమేరాతొ షూట్ చేసారొ చేప్పవచ్చు.

ప్రేక్షకులకు లాభాలేమున్నాయి?

ప్రస్తుతము ప్రేక్షకులు ఒరిజినాలిటి క్వాలిటి కొరుకుంటున్నారు కాబట్టి మంచి క్వాలిటి గల దృశ్యాలను,ఆడియో ను బాగా ఎంజాయ్ చెయ్యవచ్చు.

నిర్మాతకు లాభమేంటి?

1.భవిష్యత్తులో గదులు నిండిపొయేంతగా లేక సరిగా కాపాడుకోలేక ఎంతో శ్రమతో చేసిన సినిమాల రీళ్ళు అరిగి పొవడం,పాడైపోవడం,గీతలు పడిపొవడం ,అక్కడక్కడ జంపు కావడం, ఫంగస్ రావడం ఇలాంటి బాధలు ఉండవు.

2.ప్రింటు అవసరముండదు కాబట్టి అసలు ప్రింట్లు వేసే ఖర్చే వుండదు కదా.

అసలు ఒక్క ప్రింటు కూడ వెయ్యకుండా ఏక కాలములో ప్రపంచవ్యప్తముగా సినిమాని రిలీజు చేసుకొవచ్చు. అసలు ప్రింట్లతో దుబారా లేదన్నప్పుడే డబ్బులు మిగులుతున్నాయి.అంటే లాభమన్నట్లే కదా. అలాగే పెట్టిన డబ్బుకు రెట్టింపు లాభాలు కూడా!

3. మల్టిప్లెక్స్ ల వంటి వాటికైతే ఒకే ధియేటర్లో సినిమాలన్నీ శాటిలైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని సమయానుకూలంగా ఎన్ని సినిమాలనైనా ప్రదర్శించ వచ్చు.

4 .స్ట్రైట్ సినిమా రిలీజు లే కాకుండా ఎన్నో తెలుగు సినిమాలు హింది లొకి మరియు ఇతర భాషలలొనికి ఇదేవిధానములొ అతితక్కు వ ఖర్చుతొ రిలీజు అవుతున్నాయి. డబ్బింగ్ చాలా తక్కువ ఖర్చుతో చేసుకొని ఇతర భాషల్లొ కూడ ఈ పధ్ధతిలొ విడుదల చేసుకుంటున్నారు.

అంటే సినిమారిలీజు రోజు బాక్సుల కొసం ఎదురుచూపులు లేకుండా, నిర్మాతలకు ఖర్చులు తగ్గిస్తూ ఎగ్జిబిటర్లకు శ్రమ తగ్గిస్తూ, ప్రేక్షకులకు క్వాలిటి పరంగా సంతృప్తి ని కలిగిస్తూ డిజిటల్ సినిమా శరవేగంగా దూసుకొస్తుంది. దానిని అందుకొవడం తరువాయి.

ఈ ప్రొజెక్టర్లను ధియేటర్ వారు కొనుగొలు చేసేందుకు రుణాలు కూడ లభిస్తున్నాయి. అలాగే….ప్రొజెక్టర్ ఆపరేటర్ ఒక్కరు చాలు,చదువు రాని వాళ్లయినా చాల త్వరగా, అంటే వారం రొజులలోగా పూర్తిగా తర్ఫీదు పొందవచ్చు. ఇలాంటి విషయాలలొ రియల్ ఇమేజ్,యు ఎఫ్ ఒ,ఇంకా కొన్ని సంస్థలు ఈ దిశలో సహాయ సహకారాలు అందిస్తున్నాయి.ఏన్నో రకాలుగా సహాయ పడుతున్నాయి.

ఐతే….

సాంకేతికంగాను,క్వాలిటి పరంగాను అన్నీ ఇప్పుడు సంసిధ్ధంగా ఉన్నాయి.కావల్సిందల్లా క్వాలిటి కధలు ,క్వాలిటీ గల ఆలోచనలున్న నవ యువ తరంగం.

ఆల్ ద బెస్ట్.

7 Comments
  1. cbrao February 8, 2009 /
  2. shree February 9, 2009 /
  3. rayraj February 10, 2009 /