Menu

‘అరుంధతి’ ఎందుకు చూడాలి?

ఒక హీరో లేడు,ఒక డ్యూయట్ లేదు,లవ్ సీన్స్ లేవు,బ్రహ్మానందం కామిడీ లేదు,ఎక్సపోజింగ్ లేదు,ఫైట్స్ లేవు మరి అర్ధం లేకుండా అరుంధతి హిట్టవటం ఏంటయ్యా…చూస్తుంటే జనానికి మతి పోతున్నట్లుంది-ఓ సీనియర్ నిర్మాత .(ఆయన తీసిన ఫ్లాప్ లే కలా ఖండాలని..పెద్ద నమ్మకం…అయితే గిట్టని వాళ్ళు అవి కళా ఖండాలు కావు కాపీ ఖండాలు అంటూంటారు.

గ్రాఫిక్స్ మీద ఖర్చు పెట్టే నిర్మాత ఉంటే ఇంతకంటే అధ్బుతాలు సృష్టిస్తాను..ఇక్కడ అవకాశమున్నవాడే క్రియేటివ్ పర్సన్ ..కానివ్వండి-ఓ అచ్చ తెలుగు దర్శకుడు.

అయినా అరుంధతి,వినాయకుడు ఇలా రెగ్యులర్ ఫార్మెట్ లో లేని సినిమాలు హిట్టయితే తర్వాత మేం తీయబోయే సినిమాల పరిస్ధితి ఏమిటి-నేనొప్పుకోను(కాబోయే దర్శక,రచయిత).

ఏం సార్ ఇవాళ హిట్టని అంటున్నారే…నేను ఇలాంటి కథ చాలా మందికి చెప్పాను…(ఇదే కథ కూడా చెప్పేనేమో అని కూడా డౌట్) ఏ డైరక్టర్ కీ నచ్చలేదు. అది నిర్మాతగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు స్వయంగా రాసుకున్న కథ కాబట్టి వర్కవుట్ అయింది. ఛీ వెధవ బ్రతుకులు…మేం చెబితే ఎవరకీ నచ్చదు..తర్వాత సినిమా అంటే అలా ఉండాలంటారు..ఛీ…సీనియర్ (వయస్సులో) అయిన జూనియర్ రైటర్.

సినిమా అంతా కాపీమయం. ఆ డ్రమ్ డాన్స్ సీక్వెన్స్ హౌస్ ఆఫ్ ప్లయింగ్ డ్రాగన్స్ అనే చైనీస్ ఫిల్మ్ లోది,గ్రాఫిక్స్ లార్డ్ ఆఫ్ రింగ్స్ ట్రయాలిజీలోది, సెకెండాప్ లో వచ్చే కొన్ని సీన్స్ ఫైనల్ డెస్టినేషన్ లోవి కాదూ…కథనం అంటారా ఎక్సారిస్ట్ కాదూ?..చంద్రముఖి గుర్తుకు రాలేదు?…ఇక కథ ఎక్కడో రియల్ గా జరిగిందట. ఇంకా వీళ్ళ క్రియేషన్ ఏముంది..ఏదో కదలకుండా కూర్చోబెట్టాడు కాబట్టి కానీ-రెగ్యులర్ కామెంటర్.

ఏమయ్యా అరుంధతి లాంటి కథ ఉంటే చెప్పు..కథలు వినటమే నిర్మాత లక్షణమని(తీసిన ధాకలాలు లేవు) పూర్తిగా నమ్మే ఓ సినీ పక్షి.

“ఏమో నాకు చంద్రముఖి,ఎగ్జారిసిస్ట్ సినిమాలంటే ఇష్టం. ‘A Nightmare On Elms Street’నాకు నచ్చదు. కానీ నాకు ధ్రిల్లర్స్ అంటే విపరీతమైన ఇష్టం. హర్రర్ జెనర్ అనేది నేను అబ్సర్డ్ గా ఫీలవుతాను. భయం అనేది ఓ ఉద్వేగం. నాకు ఒకే సినిమాలో నవరసాలు అనే కాన్సెప్ట్ ఎక్కదు. ఒక ఎమోషన్ ని తీసుకుని పీక్ స్టేజీకి తీసుకెళ్ళితే బాగుంటుందని నా నమ్మకం. అందుకే మీకు కామెడీ,డ్యూయెట్స్ అనేవి మీకు అరుంధతి సినిమాలో కనపడదు. జంధ్యాల గారి శ్రీవారికి ఫ్రేమలేఖ సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడా ఆగకుండా కథనం పరుగెట్టడం ఫీలయ్యాను. అలాంటిదే ఉంటే బావుందనుకుంటాను. అందులోనూ తెలుగులో హర్రర్ ఫిల్మ్ అనేది చాలా తక్కువ మంది చూసే జెనర్. అందుకే ఆలా భయపెట్టడం ఇష్టంలేక హీరోయిన్ ఓరియెంటెడ్ గా ఫ్యామిలీ మొత్తం చూసేలా తీసాను. నేను దీనిలో క్లాసికల్ డాన్స్ కూడా కలిపాను. ఓ భావోద్వేగ చిత్రం గా రూపొందాలని భావించాను. రెండు సీన్లలో తప్పించి సినిమా మొత్తం ప్లెజంట్ గా చూసేలా చూసుకున్నాను….ఈ సినిమాలో అరుంధతికీ,పశుపతి(విలన్) పాత్రకీ సమానమైన ప్రాధాన్యత ఇచ్చాను. రెండు ఫవర్ ఫుల్ పాత్రలు కాబట్టే అంతలా పండాయి”-శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాత.

నో కాంప్లిక్ట్ … నో డ్రామా.. నో డ్రామా… నో సినిమా…అనేది స్క్రీన్ ప్లే మొదటి పాఠం. మొదటి సీన్ నుంచి అరుంధితి అదే ఫాలో అయింది. ఎక్కడా ప్రక్కగా వెళ్ళకుండా కథనాన్ని నడపటంతో ఎక్కడా ప్రక్క ఆలోచనలు రాకుండా పూర్తి స్ధాయిలో సినిమాలో లీనమై ఎంజాయ్ చేసాం. అయితే క్లైమాక్స్ లో మరో ట్విస్ట్ పడితే మరింత బాగుండేది. అలాగే చాలా చోట్ల షాయేజి షిండేకే ఎక్కువ రెస్పాన్స్ ప్రేక్షకులనుంచి వచ్చింది.అలా కాకుండా అతని సాయంతో (డైరక్ట్ సాయంతో కాకుండా)రెండో అరుంధతి విలన్ ని ఎదుర్కొని ఉంటే…ఇంకా బావుండేదేమో.అలాగే ఇంతలా ఆకట్టుకునే సినిమాలో ప్రధాన పాత్రలో (క్యారెక్టర్ గ్రోత్)లాంటిది తీసుకుని ఉంటే అదిరేది. అయినా ఇప్పుడు వచ్చిన లోటేం లేదు. సినిమా చూసిన వాళ్ళు అద్బుతమని పొగుడుతున్నారు-ఇది నేను.

సభాపతి(తమిళ దర్శకుడు-తెలుగులో పందెం డైరక్ట్ చేసాడు) మొదట ఈ చిత్రానికి దర్శకుడుగా అనుకున్నారు. అయితే మొదట క్లైమాక్స్ షూట్ చేయమని శ్యామ్ ప్రసాద్ రెడ్డి పురమాయించారు.కానీ ఆయన శ్యామ్ ని తృప్తి పరిచేలా చేయలేకపోయారు. కొంత గ్యాప్ తీసుకుని చేయమన్నారు. మళ్లీ ట్రై చేసారు. కానీ వర్కవుట్ కాలేదు. అప్పుడు సారీ చెప్పి కోడి రామకృష్ణ గారికి ఎంట్రీ ఇచ్చారు-ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు.

వెంకటగిరి సంస్ధానంలో అరుంధతి కథ జరిగిందని, అది తన అమ్మమ్మ(లేక నానమ్మ) ద్వారా విని శ్యామ్ గారు ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసారు. అలాగే అది నిర్ధారించుకునేందుకు ఆ ఊరు వెళ్ళారు కూడా. అయితే అక్కడ కథ డిఫెరెంట్ గా ఉంది. ఆ సంస్ధానం జమీందారు గారు తన కూతురు..అక్కడ పనిచేసేవాడుతో ప్రేమలో పడిందని,వాళ్ళు ఆ గదిలో ఉన్నారని కాపు కాచారు. కానీ ఇది గమనించిన లోపలి వాళ్ళు తలుపుతెరవలేదు. దాంతో సజీవ సమాధి చేసారని..దాదాపు నలభై ఎనిమిది రోజుల తర్వాత లోపలనించి అరుపులు వినపడ్డాయనేది ఓ కథనం. -విశ్వసనీయ లోకులు

ఏమో సార్..నాకివేం తెలియదు…సినిమా చాలా బాగుంది అంతే…మళ్ళీ చూడ్డానికి పోతున్నా-ప్రేక్షకుడు.

30 Comments
 1. VENKAT.B January 21, 2009 /
  • Somasekhar, Mahaboobnagar January 25, 2009 /
  • venkat B February 5, 2009 /
 2. Madhura vaani January 21, 2009 /
 3. కొత్తపాళీ January 21, 2009 /
 4. చందు January 21, 2009 /
 5. Sowmya January 21, 2009 /
 6. అబ్రకదబ్ర January 21, 2009 /
  • Satya SKJ January 22, 2009 /
 7. ఆత్రేయ January 21, 2009 /
 8. శ్రీ January 22, 2009 /
 9. Satya SKJ January 22, 2009 /
 10. shree January 22, 2009 /
 11. గిరి January 22, 2009 /
 12. sreenath January 22, 2009 /
 13. kalyan January 23, 2009 /
  • Somasekhar, Mahaboobnagar January 25, 2009 /
   • Satya SKJ January 26, 2009 /
   • kalyan January 26, 2009 /
 14. చందు January 25, 2009 /
 15. venkatachalapathi January 27, 2009 /
 16. shree January 27, 2009 /
 17. krishnarao jallipalli February 4, 2009 /
 18. Chetana February 6, 2009 /
 19. uma reddy March 21, 2009 /
 20. vinay April 15, 2009 /
 21. v.prathap reddy February 7, 2011 /