వినాయకుడు-స్క్రిప్ట్ చదువుతారా?

గత సంవత్సరం తెలుగులో వచ్చిన అతి కొద్ది మంచి సినిమాల్లో వినాయకుడు ఒకటి. ఈ సినిమా గురించి నవతరంగంలో ఒక సమీక్షతో పాటు ఈ చిత్ర దర్శకునడు సాయికిరణ్ అడివి తో ముఖాముఖిని రెండు భాగాలుగా ప్రచురించాము. ఇప్పుడు ఈ సినిమాయొక్క స్క్రిప్టుని నవతరంగంలో అందిస్తున్నామని తెలియచేయుటకు సంతోషిస్తున్నాము.

అడగ్గానే కాదనకుండా స్క్రిప్టు అందించిన సాయికిరణ్ గారికి, ఈ ప్రయత్నంలో సహాయం చేసిన కత్తి మహేశ్ కుమారికి ధన్యవాదాలు. వీలైతే రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు చెయ్యాలని ఉంది. ఈ ప్రయత్నంలో మీరేమైనా సహాయం చెయ్యగలిగితే navatarangam at gmail dot com కి మైల్ చెయ్యగలరు.

గమనిక:ఈ స్క్రిప్టు scribd.com లో హోస్ట్ చెయ్యబడిఉంది. కాబట్టి scribd.com బ్లాక్ చేసిన చోట ఈ స్క్రిప్టు చదవలేకపోవచ్చు. ఒక వేళ మీరు ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటుంటే ఈ స్క్రీన్ ప్లే pdf ఫైల్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ అవకాశం ప్రకామ్య సభ్యులకు మాత్రమే.

అలాగే మీరు ఈ స్క్రిప్ట్ చూసినప్పుడు ఒక విషయం గమనిస్తారు. ఇది తెలుగు స్క్రిప్ట్ అయినప్పటికీ ఆంగ్లంలో వ్రాసి ఉంది ఇది. అంటే ఆంగ్లం కూడా  తెలుగుని ఇంగ్లీషులో రాయడం. ఇది ఫైనల్ డ్రాఫ్ట్ సాఫ్ట్ వేర్ ఉపయోగించడం వల్ల జరిగుండొచ్చు. ఎందుకంటే ఫైనల్ డ్రాఫ్ట్ లో ప్రస్తుతానికి యూనికోడ్ సపోర్ట్ లేదు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఫైనల్ డ్రాఫ్ట్ చాలా రోజులుగా ప్రపంచం మొత్తం ఉపయోగిస్తున్న స్క్రిప్ట్ రైటింగ్ సాఫ్ట్ వేర్. అయితే కొన్నాళ్ళ క్రితం celtx అనే ఒక సాఫ్ట్ వేర్ విడుదలయింది. ఇది ఫైనల్ డ్రాఫ్ట్ లాగానే స్క్రిప్ట్ రైటింగ్ కి ఉపయోగించవచ్చు. ఇందులో అయితే హాయిగా తెలుగులోనే రాసుకోవచ్చు. అంతే కాకుండా మొత్తం సినిమా ప్రీ ప్రొడక్షన్ లో చెయ్యాల్సిన పనులన్నింటికీ(స్టోరీ బోర్డ్, షెడ్యూలింగ్, బడ్జట్) కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ కాబట్టి ఉచితం కూడా. celtx సాఫ్ట్ వేర్ ఎక్కడ దొరుకుతుందో, ఎలా వినియోగించాలో తెలియచేస్తూ నవతరంగం సభ్యుడు శంకర్ ప్రచురించిన ఈ వ్యాసంలో మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు.

—నవతరంగం