దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు గ్రహీత,ప్రముఖ సినీ దర్శకుడు అయిన తపన్ సిన్హా(84) ఈ రోజు మరణించారు. దీర్ఘకాలికంగా bronco-pneumonia వ్యాధితో బాధపడుతున్న ఆయన కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిస్టూట్ డిసెంబర్ ఆరున చేరారు. నిన్న రాత్రి(బుధవారం)నుండి ఆయన పరిస్ధితి చాలా సీరియస్ గా మారిందని,పల్స్ రేట్ పడిపోయిందని,మందులు పనిచేయలేదని ఉదయమే ప్రాణం విడిచారని డాక్టర్స్ తెలియపరిచారు.
ఉపాహార్,సంగిన మహితో వంటి అధ్బుతాలు తీసిన తపన్ సిన్హా తన జీవిత కాలంలో పంతొనిమిది జాతీయ అవార్డులు పొందారు. అలాగే ఎన్నో అంతర్జాతీయ చిత్రోత్సవాలలో రకరకాల అవార్డులు అందుకున్నారు. ఆయన తీసిన అంకుష్,ఏక్ డాక్టర్ కి మౌట్,సఫేద్ హాధీ,కాబులీవాలా వంటి సినిమాలను ఈ సందర్భంగా అభిమానులు తలుచుకుని బాధపడుతున్నారు. ఆయనకి ఓ కుమారుడు ఉన్నారు. భార్య,నటి అరుంధతి దేవి 1990లో మరణించారు. తపన్ సిన్హా తన జీవిత కాలంలో 26 సినిమాలను డైరక్ట్ చేస్తే…పది సినిమాలకు రచన చేసారు.నిర్మాతగా Anokha Moti (2000) సినిమాను నిర్మించారు.
ఆయన గురించి:
తపన్ సిన్హాని మాస్టర్ స్టోరీ టెల్లర్ గా చెప్తూంటారు. అలాగే విభిన్న కధాంశాలతో సినిమాలు చేయటం,ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలను అన్వేషించటం ఆయనకే చెల్లిందంటూ బాలీవుడ్ ప్రముఖులు చెప్తూంటారు.అమెరికన్ ప్రముఖ దర్శకులు విలెయన్ వైల్డర్,జాన్ ఫోర్డ్ వంటి వారి సినిమాల ప్రభావంతో ఆయన సినీ పరిశ్రమలో ఓ టెక్నీషన్ గా ప్రవేశించారు. అంచెలెంచలుగా ఎదుగుతూ ఆయన నిర్మాతగా,దర్శకుడుగా,రచయితగా,కంపోజర్ గా ఆయన ఎనలేని పేరు గాంచారు. సాధారణంగా ఆయన కథలు సామాన్యుడు కోణంలోంచి సాగుతూండటంతో ప్రేక్షకలోకంలో ఓ ప్రత్యేకమైన ముధ్ర వేయగల్గారు.1954లో రిలీజైన అంకుష్ తో ఆయన సినీ ప్రస్దానం ప్రారంభించారు.కలకత్తా యూనివర్శిటీ నుంచి ఫిజిక్స్ లో ఎమ్.ఎస్.సి పూర్తి చేసిన ఈ సినీ మేధావి..న్యూ ధియోటర్స్ స్టూడియో (1946)లో సౌండ్ రికార్డిస్ట్ గా జాయిన్ అయ్యారు.
ఆ తర్వాత రెండేళ్ళకు కలకత్తా మూవీటోన్ స్టూడియోకి షిప్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆయనకు పైన్ వుడ్ స్టూడియో లండన్ లో(1950)లో పని చేసే అవకాశం వచ్చింది. అక్కడే ఆయన తన నిజమైన సినీ చదువు (స్టడీ)జరిగిందనేవారు. అక్కడ రెగ్యులర్ గా Federico Fellini, Vittorio De Sica సినిమాలు చూసేవారు. ఆ తర్వాత డైరక్టర్ Harles Cryton వద్ద సౌండ్ ఇంజనీర్ గా పనిచేసారు. అక్కడే సినీ మెళుకవలన్నీ అవగతం చేసుకుని అంకుష్(1954) తీసారు. అప్పటికి వేళ్ళూనుకుపోయి సమాజానికి చాలా ఇబ్బందికరంగా తయారైన జమిందారకి వ్యవస్ధను ఏనుగుగా భావించి తన సినీ అంకుశంతో పొడిచారు. అది భాక్సాఫీస్ వద్ద బాంబులా పేలింది.తర్వాత తీసిన ‘Upahaar’ (1955),‘Tonsil’ (1956) పెద్దగా సక్సెస్ కాకపోయనా 1957 లో తీసిన కాబూలివాలా మంచి విజయం తెచ్చి పెట్టి ఆయన కీర్తిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అంతే ఆయన వెనక్కితిరిగి చూసుకోలేదు. కాబూలీవాలా ..రవీంద్రనాధ్ ఠాగూర్ వ్రాసిన ఓ షార్ట్ స్టోరీ ఆధారంగా తీయబడింది. అప్పటి రాష్ట్రపతి గోల్డ్ మెడల్ పొందింది.
ముఖ్యంగా ఆయన సమకాలీనులు(రాజ్ కపూర్ ,సత్యజిత్ రే వంటి వారు) మెచ్చుకునే అంశం ఆయన కథ చెప్పటంలో చూపే నేర్పు. అలాగే కథని కాంప్లికేటెడ్ కాక చాలా సులభంగా చెప్పాలని తాపత్రయపడటం. మిడిల్ క్లాస్ బెంగాళి జీవితాలని స్పృశించే ఆయన సినిమాలు అక్కడ ఛానెల్స్ వారు ఇప్పటికీ వేస్తూండటం విశేషం.
ఇక ఎక్కువగా ఆయన కథలను సాహిత్యం నుండి తీసుకునే వారు. అలాగే ఆయన తన చెప్పబోయే సందేశం బాగా ప్రేక్షకుడుకి బాగా పట్టడానికి ఫాంటసీని తీసుకోవటానికి ఇష్టపడేవారు. అలా వచ్చిన చిత్రాల్లో ‘Galpo Holeyo Satyi’ (కాల్పనికే గానీ నిజం, 1977), ‘Ek Je Chilo Desh’ (ఒకప్పుడు దేశం ఉండేది, 1977), ‘Bancharamer Bagan’ (బంచారమ్ తోట, 1980) and ‘Ajab Ganyer Ajab Katha’ (విచిత్రమైన గ్రామం గురించి విచిత్రమైన కథ, 1998) పాపులర్ అయినవి.
అలాగే ఆయన పిల్లలంటే చాలా ఇష్టం. వారి కోసం సపేధీ హాథీ(తెల్ల ఏనుగు, 1977), ‘Sabuj Dwiper Raja’ (గ్రీన్ ద్వీపం రాజు, 1979), ‘Aj Ka Robinhood’ (‘ఇవాల్టి రాబిన్ హుడ్’, 1987) and ‘Anokha Moti’ (నమ్మశక్యం కాని ముత్యం కథ, 1999). అలాగే ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టిన షార్ట్ ఫిల్మ్ ‘Aadmi Aur Aurat’ (మగ మరియు ఆడ, 1984)దూరదర్శన్ కోసం చేసిపెట్టారు. ఆయన చేసిన ఆఫ్ బీట్ ఫిల్మ్ లో పాపులర్ అయినవి Nirjan Saikate (ఒంటరి ఒడ్డు, 1963)ఐదుగురు విధవల గురించి చెప్తుంది. తర్వాత చెప్పుకోదగినది చెయిర్ (1994)ఓ వికలాంగురాలైన అమ్మాయికి,మానసికంగా దెబ్బతిన్న డాక్టర్ కి మధ్య అనుబంధాన్ని వివరిస్తుంది.
అక్టోబర్ రెండు, 1924 లో త్రిబిదేష్ చంద్ర సింన్హా,పరిమళ సుందరిలకు జన్మించిన తపన్ సిన్హా సినిమాను స్టూడియోలను నుంచి అవుట్ డోర్ కి తీసుకెళ్ళిన తొలి బెంగాళి దర్శకుడు అనటంలో సందేహం లేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ‘నవతరంగం’ మనసారా కోరుకుంటోంది.
నవతరంగంలో తపన్ సిన్హా గురంచి వచ్చిన వ్యాసాలు:
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
మహా దర్శకుల జాబితా నుంచి మరొక్కరు నిష్క్రమించారు.తపన్ సిన్హా సినిమాల గురించి వినటం,చదవటం తప్ప చూడగలిగే అవకాశం ఎప్పటికి దొరుకుతుందో??నాబోటిజనానికి
సూర్యప్రకాష్ గారు మెరుపువేగంతో టైపు చేసినట్లున్నారు
శిద్దారెడ్డి వెంకట్ says:
@రాజేంద్ర కుమార్ దేవరపల్లి,
jaman లో తపన్ సిన్హా సినిమా వీల్ ఛైర్ ఉంది చూడండి
మేడేపల్లి శేషు says:
సూర్యప్రకాష్ గారూ, ‘మస్కా’ సమీక్ష రాసిన చేత్తోనే తపన్ సిన్హా గురించి చాలా మంచి వ్యాసం అందించారు. ఇలాంటి వాళ్ళనే ambidextrous people అంటారు ఆంగ్లంలో (వేటూరి సుందరరామమూర్తి గారి లాగా). చూడబోతే, భారతీయ సినిమా రంగంలో పెద్ద, పెద్ద తలకాయలన్నీ బెంగాల్లోనే ఉన్నట్టున్నాయి. ‘పథేర్ పాంచాలీ’ చూసిన తర్వాత బాంగ్లా (అసలైతే ‘బెంగాలీ’ కాదు) నేర్చుకోవాలని ఉబలాటం పుట్టి, కొద్ది ప్రయత్నం మీద లిపి చదవటం వరకూ నేర్చుకోగలిగాను. ఢిల్లీలో ఎవరైనా నేర్పించే వాళ్లు దొరికితే పూర్తిగా నేర్చుకోవాలని ఉంది. చక్రపాణి గారు కలకత్తా ఒక్కసారి కూడా చూడకుండానే, మదనపల్లి టి.బి. శానిటోరియంలో పక్క పేషంట్ అయిన బెంగాలీ పెద్దమనిషి దగ్గిర ఆ భాష నేర్చుకోవటమే కాకుండా, ఆయన ఆసుపత్రి నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ద్వారా పుస్తకాలు తెప్పించుకుని పూర్తిగా నేర్చుకున్నారట. కొన్ని బాంగ్లా నవలలు కూడా తెలుగులో చక్కగా అనువదించారు. మీకు తెలుసా, రబీంద్రనాథ్ టాగోర్ ‘జనగణమన’ ఊపిరి పోసుకున్నది మన మదనపల్లెలోనే. ఇకపోతే, తపన్ సిన్హా గారి సినిమాలు ఎక్కడైనా దొరికితే తప్పక చూస్తాను.