Menu

సినిమాపరిశ్రమలోనికి రావాలనుకుంటున్నారా?

సినిమా పరిశ్రమ ఎంతో మందికి కలల సౌధం, కొంత మంది కలకంటూనే జీవతం గడిపేస్తారు, మరికొందరు ప్రయత్నాలు చేయ్యటం గురించి ఆలోచిస్తారు, ఇంకొందరు ప్రయత్నాలలోనే అలసిపోతారు, కాని ప్రతి ఒక్కరి కల చాలా అందంగా ఉంటుంది, అ కల నిజమయినప్పుడు కలిగే అనుభూతి జన్మనిచ్చే తల్లికి కలిగే అనుభూతి స్థాయిలో ఉంటుంది అంటే సాధారణ జనులకు వింతగా అనిపించినా అలా కలలు కనే వారికి, ఆ కలలు సాకారం చేసుకున్న వారికి ఇట్టే అర్దమవుతుంది.

సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టబోయే వారికి అక్కడ ఉన్న విధి విధానాలు, విభాగాలు తెలియటం మంచిది అని నేను విశ్వసిస్తాను అందుకు మనకు అందుబాటులో ఉండేలా ప్రతి విభాగం గురించి, అందులో ఎలాంటి మనస్తత్వం వంటివారు ఇమడటానికి అవకాశం ఉంటుంది అని బేరీజు వేస్తూ సినీ మ్యాన్ అనే వెబ్ సైట్లో వచ్చిన వ్యాసావళిని తెలుగు పరిశ్రమకు అన్వయిస్తూ రాస్తున్నాను

ఇక విషయానికి వస్తే…మీరు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలనుకుంటే ముందుగా మిమ్మల్ని మీరు “నాకేం వచ్చు?” అని ప్రశ్నించుకోవాలి. ఇక మీలో మీరు కనుక్కున్న సమాధాన్ని బట్టి మీరు పరిశ్రమకు ఎలా ఉపయోగపడతారో తెలుసుకోండి.

నాకు వచ్చినవి అంటూ ఏమిలేవు :

ఇది అస్సలు పెద్ద సమస్యేకాదు ఎందుకంటే ఇప్పుడూ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళలో మీ అంతటి ప్రభుద్దులు వేలల్లో ఉంటారు. వాళ్ళలో కొంతమంది సినిమా సెట్ తయారీలలో, సినిమా ప్రోడక్షన్ లలో పని చేస్తుంటారు. అది సినిమాకు సంభందించి ఏమి నేర్పించకపోయిన సినిమా నిర్మాణంలో ఉన్న సంత్రుప్తికి కలుగ జేస్తుంది. ఆ పనిలో ఎక్కువకాలం పని చేయ్యలేరు, చెయ్యరు, ఒక వేళ చేసినా వారు సినిమా పట్ల చాలా ఆశక్తి కలిగి ఉండాలి లేదా బాగా చలాకీగా కలసిపోయే వారయినా అయి ఉండాలి లేదా అందంగా ఉండి(నటన తెలిసి) సినిమాల్లో అవకాశం కోసం చూస్తున్న వారయినా అయి ఉండాలి లేదా పైన చెప్పిన వన్నీ కలసి ఉండాలి.

ప్రస్తుతానికి ఏమీ రావు, కానీ నేర్చుకోగలను.

శుభం, ఈ ర్యాంకు బాపతు చదువులు ఎటూ జనాలను చెడగొడతాయి తప్ప ఒరిగేది ఏంలేదు ఎందుకంటే మనకి ఎప్పుడూ మెదటి స్థానం రాదు. పోనీ ఎంతో కొంత ర్యాంకు తెచ్చుకున్నామనుకోండి.. ఇంకొద్దిగా వొళ్ళు వంచితే మెదటి ర్యాంకు వచ్చేది అంటారు. అదేంటో మెదటి ర్యాంకు ఒక లక్షమందికి ఇచ్చేట్టు.ఒక వేళ కసి కొద్దీ చదివినా అది మనకి రాదు పక్కనోళ్ళ దెప్పులకు మన మీద ఉన్న నమ్మకంతో బాటు,చదువుకూడా బోగిమంటల్లో పడేసి ఊరుకుంటాం. అలాక్కాదు నాకు ర్యాంకు వచ్చిందీ అంటారేమో..అలా వస్తే ఈ వ్యాసం తప్పకుండా చదవటంకుదిరేది కాదు. ఇకపోతే తప్పునీది కాదు కనుక నిన్ను ప్రూవ్ చేసుకోవటానికి చూస్తున్నావు కనుక ఇప్పటి వరకు నీకు మరో అలోచనలేక పోతే..సత్తా చూపటానికి సినీపరిశ్రమకు ఎప్పుడూ ఆహ్వానం ఇస్తూనే ఉంటుంది(ఈ మాట అందరు ఒప్పుకోరు కాని, అవకాశలు ఇంటికి రావు మనం అవకాశాలు వెతుక్కోవాలి అని నమ్మేవాళ్ళు తప్ప).

మరీ అంత కాదు గాని లెక్కలు బాగా చేయ్యగలను ….

ఇలా అన్నారు బాగుంది.. సినిమా లక్మికి గుర్రాల్లాంటోరు ఈ అకౌంటెంట్లు, లెక్కకు మిక్కిలిగానే ఉంటారు. హస్తలాఘవం,బుర్ర వంటివి ఉంటే మిగుల జీతం బానే ఉంటుంది. సినిమాతో నేరుగా సంబంధం లేకపోయినా రెమ్యూనరేషన్ దగ్గరనుంచి రిక్షా అద్దాల దాకా రక రకాల స్థాయిల్లో పని చేస్తారు. కాని ఏకారణం చేతైనా సినిమా అగిపోతే మెదటపీకే వాళ్ళ పేర్లు మీవి ఖచ్చితంగా ఉంటాయి. అదీ కాక ప్రోడ్యూసర్ కి కోపం వచ్చినప్పుడల్లా చమటపోసే వాళ్ళలో మీరు ఉంటారు. ఉద్య్గోగస్థిరత్వం తక్కువ అయినప్పటికీ.డిమాండ్, డబ్బులు పుష్కలంగానే ఉంటాయి.. కాంటాక్ట్స్ బాగా ముఖ్యం.

నాకు చదవటం అంటే మహా పిచ్చి:

చాలా బాగుంది, అవకాశాలు మెరుగ్గానే ఉంటాయి, అభిరుచి కలిగిన నిర్మత గాని నిర్మాణ సంస్థ దగ్గరకాని పనిలో కుదిరితే అనందం లక్ష్మి, ధన లక్ష్మి బాగానే సహకరిస్తారు. కాకపోతే అప్పుడప్పుడూ కోపిష్టి లక్ష్మి ని తట్టుకోవాలి.తెలుగు పరిశ్రమలో ఔత్సాహిక రచయితలు,నిర్మాతలు, దర్శకత్వం మాత్రమే చేసే మంచి దర్శకులు తక్కువ కనుక మన పరిశ్రమలో అంతగా అవకాశాలు ఈ కాలంలో లేవనే చెప్పాలి. కానీ మీ అబిరుచికి మంచి ఉద్యోగం ఇది.

మీకు కేవలం చదవటం వస్తే సరిపోదు ఒక అమోదయోగ్యమయిన అభిప్రాయం చెప్పగలగాలి. అంటే ఆ కధ గిట్టూబాటు కధోకాదో చెప్పాలి. ఈ కంప్యూటర్ కాలంలో ఆ కధ హిట్టో ఫట్టో చెప్పేసే సాప్ట్ వేర్లు కూడా వచ్చాయి మరి(అన్ని సార్లు సరిగ్గా చెప్పదు కాని, ఎనబై శాతం వరకు బానే చెబుతుంది). నిర్మాణ సంస్థ అభిరుచులు, పరిశ్రమ దోరణి పాత కధల వివరాలు మంచి వాక్దాటి ఉంటే విజయలక్మీకూడా మీదే మరి. గొప్ప నవలా కారుడు సిడ్నీ షెల్డన్ కూడా తన జీవితాన్నీ ఈ ఉద్యోగంతోనే మెదలు పెట్టాడు మరి.

ఇక్కడ ఒక సంగతి చెప్పాలి.కొంత మంది డబ్బుకోసం సినిమాలు తీసేవారుంటారు, కొంతమంది ఖర్చుపెట్టడంకోసం తీసేవాళ్ళు ఉంటారు, గుర్తెరిగి మరీ మీ స్తానం ఎంచుకుంటే తదుపరి చక్రం తిప్పడం సులువవుతుంది. పాత కధలు కొత్తగా వచ్చిన కధలు, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ (పరిశ్రమ భాష) బాగా గుర్తుపెట్టుకుని మాట్లాడితే విలువ బాగా ఉంటుంది మరి.

నాకు రాయంటం ఇష్టం:

నిజానికి డైరక్టర్ సినిమా ప్రారంభానికి నాంది అంటారు కాని,న్యాయానికి కధా రచయితే మూల స్థానం. సమస్య ఏంటంటే వీళ్ళకు అంతగా మాట్లాడే అవకాశం రాదు, అప్పుడప్పుడు పరుచూరివారు, చిన్నికృష్ట గారు మాట్లాడటం కనిపించినా. వీరు సినిమా జరుగుతున్న సమయంలో ప్రచారానికి అనర్హులు, వీరికి దక్కాల్సినదంతా దర్సకులు గ్రహిస్తారు.మరి వారే కదా సంధానకర్తలు మరి. అరకొర నిజాలు చెప్పే అలవాటు ఉన్న వాళ్ళకే మీడియా ముందుకు వచ్చే అర్హతు ఉంటుంది. ఉదాహరణకు హీరో గురించి మాట్లాడేప్పుడు, ’ఈ కధకోసమే వీళ్ళ అమ్మ ఈయన్ని కనింది’ అనలేకపోతే మీరు దర్శకులు అవ్వటం ఒకింత డేంజరే(మీకు). కధా రచయితలకు మీడియా ముందు అంత నైపుణ్యం ఉండదని వీరు పెద్దగా మాట్లాడరని నానుడి.(పరుచూరి గోపాల కృష్ణగారిని గుర్తు తెచ్చుకోకండి మహ ప్రభో… వారు త్రికాల వేదులు అందుకే అన్నేళ్ళు మనగలిగారని అన్నయ్య ఎప్పుడో చెప్పారు).

సినిమాకి కదా రచయిత,మాటల రచయితలు అవ్వటంలో కష్టం గురించి కంటే వైవిధ్యం గురించి ఇక్కడ చెప్పాలి. ఇది ఒక నవల రాసినట్టుగానో లేక, ఒక వ్యాసం రాసినట్టుగానో కాక మరోలా ఉంటుంది బాణి అందరికీ తెలిసినా గుర్తుంచుకోవాల్సినది మాత్రం మీరు రాసింది ఒకటి కావచ్చు, తెరమీద చూసేప్పుడు మరొకటి ఉండచ్చు కనుక రచన పట్ల మమకారం మచ్చుకయినా ఉందకూడదు(కొత్తవారిలో ముఖ్యంగా). దర్శకుడు మార్చవచ్చు,హీరో,నిర్మాత వీళ్ళలో ఎవరయినా మార్చవచ్చు,మార్చమని అడగవచ్చు.లేదా నువ్వు రాసింది చూడాలి అనుకుంటే మాత్రం డైరక్టర్వికూడా నువ్వే కావాలి మరి(మన త్రివిక్రమ్ లాగా). కాని అలా రెండు పదవులూ చేసి రాణించిన వారు తక్కువనే చెప్పాలి. ఎందుకనగా దర్శకుని లక్షణాలకు,రచయిత లక్షణాలకు మధ్య ఉండే స్వభావం బేధం.రెండీనీ సమపాళ్ళలో కుదించగలిగే వారు లేకపోలేదు వారు ఆదర్శప్రాయులు.కాని అరుదు.

చివరగా ముఖ్య విషయం ఏంటీ అంటే: “మీరు (జాతికి)ఎదన్నా చెప్పాలకున్నాప్పుడు మీ కలం కదులుతుంది” అన్నది వాస్తవమయితేనే ఈ వృతి ఎంచుకోండి. ఎందుకంటే కొంతకాలానికి. తిప్పి తిప్పి తిరగమాత పెట్టే కధలు రాసుకుని కాలాన్ని వ్యర్దం చేసుకున్న వారవ్వుతారు.. (ఇప్పుడూ తెలుగు పరిశ్రమ ఈ తిరగమాత పరిస్త్తిలోనే ఉంది).

నేను గొప్ప సంధానకర్తని(ఆర్గనైజర్):

ప్రోడక్షన్ అఫీస్ లు వెతకండి మరి. నిర్మాత విమాన టిక్కెట్ల దగ్గరనుంచి, అవుట్ డోర్ అవసరాల వరకు విభిన్న శాఖలు మీకు వేదికలు. పి.ఏ (ప్రొడక్షన్ అసిస్టెంట్) లు ఎక్కువ ఆర్జించే వారు పిరమిడ్ లో. నిర్మాత ఫోన్ ఎత్తటం, తన దినసరి కార్యక్రమాలు క్రమాంకితం చేయంటం వంటివి ఈ పి.ఏ ల ముఖ్యపనులు. అస్సలు పి.ఏ అనే తెలుగువారికి (సినిమాల ప్రభావం వలన) ఎదో చిన్నతనంగా అనిపించినా వీళ్ళూ మహా ఘటికులు. దేవుడు గుళ్ళో పూజారుల టైపు, దేవుడు హుండీలో వెయ్యకపోయిన హారతి పళ్ళెంలో వెయ్యకపోతే శఠగోపురం దక్కదంతే-అంత రాయల్ మరి. ఉరుకులు పరుగులు పెట్టించే ఉద్యోగం మంచి చాలెంజింగ్ జాబు మరి. ఆర్గనైజర్ గా అనుభవంలో ఉండేవే కాని ఇక్కడ చిక్కేంటీ అంటే…..మీ పనుల్లో మీ శారీరక శ్రమతో బాటు మీ ఆశక్తి,చాక చక్యం,సూక్ష్మభుద్దికూడా ఉద్యోగానికి ఎంతో అవసరం. పలు భాషలు తెలిసి ఉన్నట్టయితే మంచి అవకాశాలు వుంటాయి. ఇంగ్లీషు తప్పని సరి అవుతుంది మన తెలుగు పరిశ్రమలో కూడా ఈ మధ్య ఔట్ డోర్లు ఎక్కువగా ఉన్నాయి కదా మరి.

ఇందులో చిరాకు విషయం ఏంటీ అంటే అంతా చేసినా ఒక్కోసారి సరి అయిన సమయానికి డబ్బులు మీకు అందవు(హస్తలాఘవంతో వచ్చినవి కాకుండా). ఎక్కువ శాతం మీ వాహనాలు(పెట్రోలుకూడా) వాడాల్సి రావచ్చు. అంత చిరాకులో కూడా మీ పైవాడికి నవ్వుతూ (మనసులోతిట్టూకోండి అంతక్కావలంటే) కనిపించాలి. ఇది కొత్తల్లో కొద్దిగ కష్టంగా ఉన్నా. మన తెలుగు పరిశ్రమలో హస్తవాసి సెంటిమెంటు మీ మీద పని చేసిందా …చాలు… మీ జేబు ఘల్లు ఘల్లు మంటం ఖాయం…..

చంద్రమౌళి కందుకూరి

10 Comments
  1. shriedhar January 13, 2009 /
  2. వీబీ January 14, 2009 /
  3. Reddy Ganta January 16, 2009 /
  4. hero January 21, 2009 /
  5. kolord97@gmail.com February 28, 2009 /
  6. uma reddy March 21, 2009 /
  7. mukesh May 6, 2009 /