ఏందుకో జీర్ణించుకోలేకపోతున్నాను.కడుపు కుతకుత ఉడికిపొతుంది. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా చాలా బావుంది.మనం చూడడానికి నిరాకరించే ముంబాయిని వాస్తవానికి దగ్గరగానే కాకుండా చాలా ఆశావాద దృక్పధంతో చాలా చక్కగా చూపించారు.రెహమాన్ ఎప్పటిలాగే అదిరిపొయే డిస్కొల్లో గెంతులేసేందుక్కూడ పనికొచ్చేల చాల చక్కని సంగీతాన్నిచ్చారు.కాని ఒక్క విషయం మాత్రం అస్సలు సమజ్ కావడం లేదు.
అంతా బాగానే ఉంది. ముంబయిలోని ఓ మురికివాడలో నివసించే జమాల్ అనే వ్యక్తి తన ప్రేమను గెలిచేందుకు ఓ భారతీయ రియాల్టీషోలో పాల్గొని మొదటి బహుమతి గెలవటం దీని ఇతివృత్తం. ప్రపంచంలో మరోసారి భారతీయులని తల గర్వంగా ఎత్తుకునేలా చేసిన ఈ సంగీత సరస్వతికి దేశమంతా కృతజ్ఞతలు చెప్పుతూ అభినందనలు తెలుపుతోంది.కాని మేము మాత్రం ఒక్క విషయం పట్ల మాత్రం చాలా సీరియస్ గా ఉన్నాం. వందేమాతరం అంటూ గొంతు చింపుకుని నేటి యువ ప్రపంచానికి దేశభక్తిని కొత్తగా మేల్కొలిపిన రెహ్మాన్ సాబ్ కూడ ఈ ‘స్లమ్‌డాగ్ మిలియనీర్ పేరు విషయంలో కనీసం అలొచించలేదా అని.
కొన్ని వందల సంవత్సరాల పాటు మన ఆత్మ గౌరవాల్ని తొక్కేసి మనల్ని హింసించి ,పీడించి రాజ్యాం చేలాయించి సర్వస్వం చివరకు దేశాన్ని విడకొట్టిపొయిన ఒక బ్రిటీష్ వాడు ఈ సారి మన మీదకు కొత్త పధ్ధతిలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ అనే పేరు గల సినిమాతో వచ్చాడు.కధా అంతా బాగానే ఉంది.కాని స్లమ్‌డాగ్ మిలియనీర్ ఈ పేరేంటి..?
అసలే విదేశీయులు అంతా ఇండియా అంటే ఒక మురికి కూపమని ఒక పేద దేశమని ఆవులు రోడ్ల మీద తిరుగుతుంటాయని వగైరా వగైరా భావనలతో చూస్తుంటారు.చులకనైన దృష్టి తో చూస్తూంటే….అంటే చేప్పే విషయం ఏమిటంటే..ఆధునిక భారత దేశం పునాదులు ఈ స్లం ఏరియాల్లొనే ఉన్నయన్న విషయాన్ని మరవద్దు.మన మురికి వాడల్లో రేపటి గాంధి లు, రెహ్మాన్లు, ఏంతో మంది అష్ట కష్టాలు పడుతూ జీవన పొరాటాలు చేస్తున్నారు. ప్రత్యక్షంగానో పరొక్షంగానో దేశానికి ఎంతో కొంత సేవ చేస్తున్నారు. ఏంతో మంది ప్రముఖులు అలాంటి మురికి వాడలనుండి జీవితంలో పైకి వచ్చినవారే. ఇప్పుడు అలాంటి వారికి స్లమ్‌డాగ్ మిలియనీర్ పేరుతో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లు.అలాంటి వారి ఆత్మాభిమానాల్ని అలా కుక్క అనే బాహటముగా అంటూ అగౌరపరుస్తుంటే ఎవరికి ఏమి పట్టడం లేదేమిటి?
రేపటి రోజున స్లమ్‌డాగ్ ప్రైం మినిస్టర్ అని, లేదా స్లమ్‌డాగ్ హీరో అని లేక, స్లమ్‌డాగ్ ప్రెసిడెంట్ అని సినిమా తీస్తే కూడ ఇంతేనా?తమని తాము మిడిల్ క్లాస్ అని అనుకునే పట్టణ వాసులు కూడ ఒక సారి మున్సిపాలిటిలకు వెళ్ళి రికార్డులు చూస్తే తమ వీధి కూడ స్లం కిందే జమ అనే విషయం తెలుస్తుంది.
ఏన్నో రకాలుగా పేద్ద పేద్ద కార్పొరేట్ సంస్థలకు చేందిన గ్రౌండ్ లెవెల్ హ్యూమన్ రిసోర్స్ తో పాటు, జీరో బిజినెస్స్ అంతా జరిగేది ఈ మురికివాడల్లోనే.ఈ స్లం ప్రజలు లేని రోజు వారీ జీవితాలను ఊహించుకొవటం కష్టం.
అలాంటి స్లం వారిని ” కుక్క” అనే పదం తో పోల్చుతూ వారి ఆత్మాభిమానల్ని కించపర్చిన సినిమాను మనం ఎలా వహ్వా వహ్వా అంటున్నామో అర్థం కావటం లేదు. విదేశాల్లో, పెద్ద పెద్ద సొసైటీలలో మురికివాడలకు సంబంధించి ఆ పదాన్ని వాడుతుండొచ్చు గాక. కాని ప్రపంచ స్థాయిలో ఆ పదాన్ని సినిమా పేరు గా పోస్టర్ల మీద వేసి అందరి చేత ఆమోదయోగ్యం చేయించడం ఏమిటి?
ఇది పూర్తి జాతిక్కూడ వర్తిస్తుందే అని మేము బాధ పడుతున్నాము. మేమయితే పూర్తి జాతి ని ఆ బ్రిటీష్ వాడు “కుక్క” అన్నట్లే భావిస్తున్నాం.సరే తప్పులేదు అనుకుందాము.
BRITISH DOG, or… BRITISH SLUM DOG అని ఒక సినిమా తీస్తే వాడు సహిస్తాడా?
స్వదేశీ దర్శకనిర్మాతలు ఎదైనా సినిమా తీస్తే ఒక కులాన్నో మతాన్నో వర్గాన్నో మనోభావాలు దెబ్బతీసారని గోల గోల చేసే వారంతా ఈ విషయం లో ఎందుకు మౌనంగా ఉన్నారో?అలాగే మన పత్రికల వాళ్ళు,మన ఎలక్ట్రానిక్ మీడియ వాళ్ళు ఏం చేస్తున్నరో?
సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకులు అందరు ఖామోష్ గా ఎందుకున్నారో అర్ధం కావడం లేదు.మన భారతీయ సమాజములో అంతర్భాగమైన మురికివాడల ప్రజలని “కుక్క ” అనే హక్కు వాడికెవరు ఇచ్చారు? బహూశ కుక్కల ముందు ఎముకలు వేసినట్లు అవార్డులు వేస్తే వీళ్ళే మౌనంగా ఉంటారని అనుకున్నడేమో.కనీసం, కనీసం, కనీసం…….ఈ విషయాన్ని నవతరంగం అయినా చర్చకు పెట్టే ప్రయత్నం చేస్తుందని ఒక విశ్వాసం. గట్టి నమ్మకం.
ravi says:
lol…అత్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నదట ఒకామె…
srinivas says:
chaala manchi vaakyam raasaru telangaana lo.
అన్వేషి says:
ఇది భలే ఉంది. క్రికెట్ లో ఇండియన్స్ ని అండర్ డాగ్స్ అన్నారు (అప్పుడు మనం వరల్డ్ కప్ గెలిచినప్పుడు). అలాగే శ్రీలంక గెలిచినపుడూ అంతే…అంతమాత్రానికి మన వాళ్ళు డాగ్స్ అయిపోయారా?అసలీ సినిమా గురించి మనవాళ్ళ గోలేంటో అర్థం కావటం లేదు. సినిమాని సినిమాగానే చూడాలని గొంతు చించుకునే మన వాళ్ళంతా ఈ సినిమాని మాత్రం సినిమాగా ఎందుకు చూడలేకపోతున్నారో!
అసలు మన బాలీవుడ్ సినిమాల్లో మన వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఎక్కడ పడితే అక్కడ బిజినెస్ లు పెట్టి కోటీశ్వరులు అయిపోయు పెద్ద పెద్ద బంగ్లాల్లో నివసిస్తున్నట్టు చూపిస్తే పర్వాలేదు కానీ ఇండియాలో స్లమ్స్ ని చూపిస్తే మాత్రం తప్పైపోయింది.
అయినా ఈ సినిమాకి ముందు స్లమ్ డాగ్ అనే పదమే లేదు. అండర్ డాగ్ లాగా స్లమ్ డాగ్ అనే పదాన్ని ఒక మెటాఫర్ లాగా స్క్రీన్ రైటర్ సైమన్ క్రియేట్ చేసారు. సినిమా ఎలా ఉందో దాని గురించి చర్చించాలి గానీ ఈ డిస్కషనంతా అనవసరం.
అన్వేషి says:
అసలయినా ఇది కేవలం ఒక వినోదాత్మకమైన సినిమా. Q and A అనే ఒక మాదిరి నవలను ఎంతో నైపుణ్యంగా స్క్రీన్ ప్లే రాసిన సైమన్ దాన్ని అంతే నైపుణ్యంగా తెరకెక్కించిన డానీ ల గురించి మాట్లాడండి. నవలలో హీరో పేరు ఎంతో ఫోనీగా ఉంటుంది. క్రిస్టియన్, హిందూ, ముస్లిమ్ పేర్లన్నీ కలిపి. అలాగే నవలలో చాలా ఘట్టాలు కూడా…అసలు ఈ నవలను ఇంతబాగా తెరకెక్కించడం సూపర్. మనమా ఇలాంటి సినిమాలు తియ్యలేము. తీసిన వాళ్ళని అప్రిషియేట్ చెయ్యలేము. ఇతర దేశాల్లో రోడ్లు మీద జోకర్ల లా గెంతుతూ….అలా గెంతుతూంటే అక్కడి జనాలు మనల్ని వింతగా చూస్తుంటే మాత్రం మన దేశానికి చాలా గౌరవమా? ప్రపంచమంతా బాలీవుడ్ మయమైపోయిందనుకుని భ్రమలో ఉన్న మనవాళ్ళకి మన సినిమాలు చాల వరకూ పెద్ద లాఫింగ్ స్టాక్ మాత్రమే అని తెలుసుకుంటే మేలు….మీడీయా ఊదరగొట్టేస్తుంది..వాళ్ళకింకేం పని…అంత మాత్రాన మనం సినిమా పరంగా సాధించిన ప్రగతి ఏమీ లేదు. రహమాన్ కూడా ఇలాంటి అంతర్జాతీయ సినిమాకి పని చేసారు కాబట్టి ఆయనకి గుర్తింపు లభించింది.
Falling Angel says:
Anveshi is right. Basically Slumdog = Underdog from slum (a person who is expected to lose in a contest or conflict). Its just urban slang.
naresh says:
slumdog millionaire అన్న పదాన్ని అట్టడుగు నుండి అందలాన్ని చేరుకున్న వ్యక్తిని represent చేస్తుంది. మీరు చాలా negative గా తీసుకున్నట్టున్నారు.
rekha says:
I would like somebody to compare “slumdog..” and “bhadram koduko”. I watched “bhadram…” a long time back and I think both the movies are similar except that the kids don’t grow up but end up dead or something.
అబ్రకదబ్ర says:
>> “అసలే విదేశీయులు అంతా ఇండియా అంటే ఒక మురికి కూపమని ఒక పేద దేశమని ఆవులు రోడ్ల మీద తిరుగుతుంటాయని వగైరా వగైరా భావనలతో చూస్తుంటారు”
ఇదో అపోహ మాత్రమే. నాకు తెలిసిని విదేశీయులెవరూ అలా అనుకోరు, ఇండియా గురించి. అందరూ సినిమాలు చూసే ఒక దేశం గురించి అభిప్రాయాలేర్పరచుకుంటారనుకోవటం తప్పు. ఇరాక్ గురించి, సద్దాం హుస్సేన్ గురించీ బుష్ కన్నా భిన్నంగా వాస్తవికంగా ఆలోచించే అమెరికన్లెందరో నాకు తెలుసు.
>> “కొన్ని వందల సంవత్సరాల పాటు మన ఆత్మ గౌరవాల్ని తొక్కేసి మనల్ని హింసించి ,పీడించి రాజ్యాం చేలాయించి సర్వస్వం చివరకు దేశాన్ని విడకొట్టిపొయిన ఒక బ్రిటీష్ వాడు ఈ సారి మన మీదకు కొత్త పధ్ధతిలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ అనే పేరు గల సినిమాతో వచ్చాడు.కధా అంతా బాగానే ఉంది.కాని స్లమ్‌డాగ్ మిలియనీర్ ఈ పేరేంటి..?”
చిత్రమేంటంటే, ముప్పయ్యేళ్ల క్రితం అటెన్‌బరో గాంధీ సినిమా తీస్తున్నప్పుడూ ఇటువంటి మాటలే పడ్డాడు మనవాళ్ల నోటెంట. అది విడుదలై ప్రపంచవ్యాప్తంగా విజయవంతమై, అకాడెమీ అవార్డులు కొల్లగొట్టినప్పుడు మాత్రం అందరూ పొంగిపోయినోళ్లే.
సైఫ్ అలి గొరే. says:
మీరన్నట్లు , మీరంతా చేప్పింది వాస్తవమే…
ఈ సినిమా పుట్టుపూర్వొత్తరాలు..
మాకూ… తెలుసు.
slumdog millionaire అనే పదానికి ఇంగ్లీసు లొ ఎన్ని గ్రమటికల్ అర్ధాలు పెడర్ధాలు ఉన్నయో .అంతా….కూడ
అందరికి తెలుసు.
ఇక్కడ విషయం అది కాదు..
1. స్లం మురికివాడలు చూయించి, పేదరికం చూయించి అవార్డులు తీసుకుంటున్నారు అనే
చర్చ వేరు ఆ దృష్టికొణం లొ ఈ సినిమాని విమర్శించడం లేదు.
ఈ వ్యాసం రాయలేదు.
నేను నా దొస్తులు చేప్పాలనుకున్నవిషయం… మీకు అర్ధం కాకపొవచ్చు.
జిడ్డుకృష్ణ మూర్తి చేప్పినట్లు..
“అవగాహన అసలు సమస్య.” అందుకే. . ఈ విషయం లొ నేనెం వ్యాఖ్యానించలేను.
కాని…
వందల కొట్ల మంది మెధావులున్న ఈ పుణ్య భూమి.. ఇంత దౌర్భాగ్యంగా ఎందుకుందొ….అర్థమవుతుంది.
ఎదైన ఊరికి పొతే.. మజ్జిగో..మంచినీళ్ళొ దొరికే చొట.. ఇప్పుడు కనీసం మంచి నీళ్ళు దొరకడం లేదు కాని…కొక కొల, బీరు బాటిల్స్ ఎందుకు దొరుకుతున్నయో…
నా స్వదేశం …అడుగడుగున.. విదెశి అన్యాక్రాంతం ఎలావగల్గుతుందో..మాత్రం తెలుస్తుంది..
సర్వెజన సుఖినొభవంతూ..అమీన్
jai ho SLUM DOGS
అబ్రకదబ్ర says:
@సైఫ్ అలి గొరే:
మన వ్యవస్థ లోటుపాట్ల మీద మీ ఆవేశం అర్ధం చేసుకోదగ్గదే. కానీ దానికీ స్లమ్‌డాగ్ వంటి సినిమాలకీ లంకె ఏమిటి? మన సమస్యలకి కారణం విదేశీయులు కారు, మనమే. ఎవరినో అనుకుని ఉపయోగం లేదు.
మళ్లీ సినిమా దగ్గరికొద్దాం. దీని మీద విమర్శలు మొదలెట్టిన పెద్దమనిషి (at least, నాకు తెలిసి) అమితాబ్ బచ్చన్. మన దేశంలో మురికిని చూపించి సొమ్ములు చేసుకుంటున్నారు అన్నాడు. నిజమేననుకుందాం. మరి డెబ్భైల్లో సదరు అమితాబ్ గారి సినిమాలెలా ఉండేవో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆయనకి ‘యాంగ్రీ యంగ్ మాన్’ ఇమేజ్ ఎలా వచ్చి పడింది? దేశంలో ఎక్కడ చూసినా అవినీతి పేరుకు పోయినట్లూ, వాటిని వీర లెవెల్లో ఈయన ఒంటి చేత్తో ఎదిరించి పోరాటాలు చేసినట్లూ వరసెంబడి సినిమాలు తీసి మన ముఖాన కొడితే కాదూ? అమితాబ్ సినిమాలు అప్పట్లో రష్యాలో విడుదలై తెగ ఆడేసేవి (రాజ్ కపూర్ సినిమాల్తో పాటు) అని చిన్నప్పుడు మనోళ్లు గొప్పగా పేపర్లలో రాస్తే చదివేవాడిని. ఈయన సినిమాలద్వారా బయటి ప్రపంచానికి చూపించిందేమిటట మరి? మన దేశమంతా అవినీతి గబ్బు కొడుతుందనా? అమితాబ్ చేస్తే ఒప్పు, మిగతా వాళ్లు చేస్తే తప్పా?
లేనిది ఉన్నట్లు చూపిస్తే బాధ పడాలి, నిరసన వ్యక్తం చేయాలి. ఉన్నదున్నట్లు చూపితే ఉలుకెందుకు మనకి?
మీరొక సారి ‘చార్లీ విల్సన్స్ వార్’ చూడండి. తాలిబాన్ల పుట్టుకకి ఎనభైల్లో అమెరికా నడిపిన రాజకీయాలు ఎలా కారణమయ్యాయో సవివరంగా చూపారు. అది తీసిందీ అమెరికన్లే. అలాగే, ఈ మధ్య బిబిసి వాళ్లు తీసిన ‘హౌస్ ఆఫ్ సద్దాం’ చూడండి. సద్దాం హుస్సేన్ జీవితంలోని మరో కోణాన్ని ఎంత బాగా చూపారో తెలుస్తుంది. ఆ సినిమాల్లో, అవి తీసిన వాళ్లు వాళ్ల దేశాలని తప్పు పట్టటానికేమీ వెనుకాడలేదు మరి!
సైఫ్ అలి గొరే. says:
@అబ్రకదబ్ర,
అమితాబ్ , సాలమన్ రష్ది…ల వాఖ్యలు దృష్టిలొ ఉంచుకొని..ఈ వ్యాసం చదవకండి.
నేను కేవలం… కేవలం.. … కేవలం …… సినిమా పేరు గురించే …అడుగుతున్నాను
నవతరంగం లొ చదివినాక.. మా టీ వి …న్యూస్ నుంచి… ఒక మిత్రుడు ఫొన్ చేసి .. చేప్పినదేమంటే.. ..
ముంబాయి లొనొ.. పాట్నా లొనొ.., మురికివాడల సామాజిక కార్యకర్తలు ఎవరొ.. రెహమన్ , అనిల్ కపూర్ ల మీద కేసు కూడ వేసారట.
పూర్తి వివరలు రేపు తెలుసుకొంటాను వాటిగురించి.
సొ …చేప్పేదేమంటే..
నేను కేవలం ..పేరు గురించే.. వ్యాసం రాసాను. అది నిజంగా.. చాల చాలా సిగ్గుకల్గిస్తుంది ఏమి చెయ్యలేమే..అని.
అమితాబ్ వ్యాఖ్యలకు మేము వ్యతిరేకం..
ఇక మురికి వాడలను చూపి అవార్డులను …తీసుకొవడం అంటారా..
యౌ..సీ..
ఎవరికి చేతనైనది వారు చూపి , వారికి కావల్సింది ఈ ప్రపంచములొ తిరిగి పొందాలనుకుంటారు..
కొంతమంది మురికివాడలు పేదవారిని చూపుతారు..
కొంతమంది అందాలు, డిస్కో..లు,చూపుతారు…ఇలా చేప్పుకుంటూ పొతే… చాల వుంటది.తప్పదు.
నేను కేవలం .. పేరు గురించే.. వ్యాసం రాసాను.
ఇది ఆత్మ గౌరవాలకు సంబంధించిన విషయం అని మేము భావిస్తున్నాం…అంతే.
అబ్రకదబ్ర says:
@సైఫ్ అలి గొరే:
సరే. ఈ సినిమా పేరు ‘ది గ్రేట్ ఇండియన్ మిలియనైర్’ అంటే ఎలా ఉండేదో ఊహించుకోండి
నాకైతే స్లమ్‌డాగ్ మిలియనైర్ అనే దాంట్లో వివక్షలాంటివేమీ కనపడలేదు. అసలు, మనం స్నేహితుల్ని ‘అరే’, ‘ఒరే’ అనుకున్నట్లు అమెరికన్లు మిత్రుల్ని ‘డాగ్’ అనుకోవటం చాలా సాధారణం.
అన్వేషి says:
సైఫ్ గారూ
మీరు చర్చను దారి మళ్ళిస్తున్నారు.
మీరన్నట్టు ““కొన్ని వందల సంవత్సరాల పాటు మన ఆత్మ గౌరవాల్ని తొక్కేసి మనల్ని హింసించి ,పీడించి రాజ్యాం చేలాయించి సర్వస్వం చివరకు దేశాన్ని విడకొట్టిపొయిన ఒక బ్రిటీష్ వాడు….” గురించి ఇప్పుడు బాధ పడి అనవసరం. మీరే చెప్పినట్టు వర్రీ అవ్వాల్సిన విషయం కోకాకోలా పెప్సీల సంగతే…
ప్రీ ఇండిపెండెన్స్ కు ముందు దోపిడీ ఎలాగో జరిగిపోయింది…కానీ ఇప్పుడు జరుగుతున్న దోపిడీ సంగతేంటి?
మెక్ డోనాల్డ్స్ /కీఎఫ్సి పేరుతో పాతిక రూపాయలు కూడా ఖర్చులేనీ రొట్టెలను లొట్టలేసుకుంటూ వందలకి వందలు పెట్టి అమ్ముతూ దోపిడీ చేస్తున్న అమెరికన్ వ్యాపారస్తుల సంగతేంటి? వాళ్ళ సంగతి సరే డబ్బులు కోసం కక్కుర్తి పడి చేస్తున్నారు. ఎగేసుకుని వెళ్ళి స్టైల్ దొబ్బే మనవాళ్ళ సంగతేంటీ?
ఎందుకు మనఊర్లో మంచినీళ్ళకంటే కోకాకోలాలే ఎక్కువ దొరుకుతున్నాయి? వీటన్నిటికీ స్లమ్ డాగ్ సినిమాకీ సంబంధమేంటీ?
ఒక వేళ మీరు విదేశీయులు మన సినిమాలతో కూడా వ్యాపారం చేస్తున్నారని మీ వర్రీ అయితే అప్పుడు మీరు వర్రీ అవ్వాల్సింది చాందినీ చౌక్ టు చైనా లాంటి సినిమాల గురించి కానీ స్లమ్ డాగ్ లాంటి సినిమాల గురించి కాదు. చైనా వాడికి చాందినీ చౌక్ చూపించండి పాచిమొహంతో మన మొహం మీద ఉమ్మేస్తాడు.
Desperately Seeking Publicity! says:
డియర్ గోరే…ఏంటి మీ బాధ?
ఇదసలు పుణ్యభూమి అని సర్టిఫికేటిచ్చినవాడెవడు?మనం తప్ప మిగతా దేశాలన్నీ పాపభూములా?పుణ్యభూముల్లో కోకాకోలా బదులు గోపంచకం తాగుతారా?
ఇక్కడ వందల కోట్ల మేధావులున్నారా? మీరూ అందులో ఒకరా? మన దేశం జనాభా ఎంత?
ఈ ఇంటర్నెట్ ఎవడిది?మీరు వాడే మొబైల్ ఎక్కడిది? మీరు తియ్యబోయే సినిమాలూ, ఆ టెక్నాలజీ కనిపెట్టిందెవడు?
అసలు మీరు సినిమాలే ఎందుకు తీయాలనుకుంటున్నారు? సాంప్రదాయమైన తోలుబొమ్మలూ, చెక్కభజనలూ చేసుకోవచ్చుగా?
ఇలా రెచ్చ గొట్టే మురికి వ్యాసాలు రాసే బదులు మీ స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం చెయ్యండి.
మీకింత ఆవేదన కలిగితే వీధుల్లో దిగి ఆందోళనలు చెయ్యండి.మీరన్నట్టుగా పత్రికల వాళ్ళూ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లూ మీ చుట్టూ చేరతారు.మీరూ ఓ సెలబ్రిటీ అయిపోవచ్చు.ఆ స్టేటస్ ని ఉపయోగించుకుని ‘ వంకాయ ఫ్రైడ్ రైస్ ‘ అని సినిమాలూ తియ్యొచ్చు.
నవతరంగాన్ని మాత్రం ఇలాంటి వ్యాసాల నుంచి స్పేర్ చెయ్యండి.
సైఫ్ అలి గొరే. says:
మీరింత బాధ పడుతారు అనుకొలేదు…
అన్వేషి says:
@సైఫ్ అలి గొరే.,
ఇది మీ మీద కోపం కాదు లెండి. దేశంలో చాలా మంది అనవసరంగా అనవసరమైన విషయాల గురించి బాధపడ్తున్నారీ మధ్య. బైదివే పైన కామెంట్ నాదు కాదు.మా అందరిదీ ఒకటే బాధ.దేశంలో ఆలోచించాల్సిన బాధపడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి కాకపోయినా సినిమాల విషయానికొచ్చినా మనం కళాఖండమనుకున్న తారే జమీన్ పర్ సినిమాలు అస్కార్ దరిదాపుల్లోకి కూడా ఎందుకు వెళ్ళటం లేదో చర్చిద్దాం.అంతే కానీ ఇలా అనవసర విషయాల గురించి చర్చ అనవసరం. అలా అని చర్చ వద్దని కాదు…
సైఫ్ అలి గొరే. says:
@అన్వేషి, ఏంటండి..ఇది భాడ పడే విషయమే..కాదా..అనవసరమైన విషయాల?
నిజమే…నేను నవతరంగం..లొ సమయం వెచ్చించటం… వ్యర్ధమని … తెలుస్తుంది.
లేక పొతే ఏంటండి..ఆస్కార్ ఎందుకురావడం లేదని బాధపడే..అవసరం ఈ దేశకళాకారులకు లేదు.ఎవరొ ఆస్కార్ అవార్డు ఇస్తేనే…మన ప్రతిభ గొప్పదైపొతుందని నేను అనుకొను.
షారుఖ్ చెప్పినట్లు..
ఇన్ని భాషలు , ఇన్ని వందల సినిమాలు , ఇన్ని స్టుడియొలు ఉన్న మనము…
అసలు ప్రపంచానికి మనదైన…ఆస్కార్ ని మొదలు పెట్టాలి
అన్నట్లు…ఇంకొ విషయం… తెలుసా..తారే జమీన్ పర్ విషయం ప్రస్తావించారు కాబట్టి…
దర్శకుడి, సంగీత కారుడి,హీరొ , ల గురించి ఇంటర్వ్యూలు వస్తున్నాయి కాని.. ఈ సినిమాలొ మొదటి భాగం అంతా… అద్భుతమైన నటన ప్రదర్సించిన బాల కళాకారుల, అజహరుద్దిన్.. ,అయూష్ మహెష్, రుబీన అలి . గురించి ఎవరు ఎక్కడ ప్రస్తావించటం లేదు… కనీసం…జమీన్ పర్ ” దర్శిల్ .”ని ప్రశంసించినంతగా..కాక పొయినా…
ఇంకా వారి వర్తమాన పరిస్థితుల గురించి… కూడ ఈ మధ్య చాల చదువుతున్నము కదా>
ఆ బాల కళాకారుల గురించి .. ఎందుకు రావడం లేదు.. ” దర్శిల్ .”లా గా…
బహూశా వారు… స్లండాగ్స్ కాబట్టేమో… ఏమంటారు..
ఆవేశి says:
@అన్వేషి,
Am I over reacting?
Venkat says:
2003 లో నేను ఇండియా నుంచి తిరిగి వస్తున్నప్పుడు, బేగంపేట ఏర్ పోర్ట్ లో జనాలు అందరు గేట్ కి అడ్డంగా నిలబడి ఎంతకు కదలట్లేదు. విసుగేసి గట్టిగా ప్లీజ్ గెట్ అవుట్ అఫ్ మై వే అని అన్నాను. ఓ పెద్దమనిషికి చాలా కోపం వచ్చింది. గెట్ అవుట్ అంటారా అని. సర్ది చెప్పాల్సి వచ్చింది. అయ్యా గెట్ అవుట్ అంటే మీకు తప్పు మాట.. కాని నా ఉద్దేశ్యం మిమ్మల్ని కించపరాలని గాదు.. నా దారి నుండి తప్పుకోండి అని. ఈలోగా పోలీసులు వచ్చి లాటీ ల తో వాళ్ళందరిని తరిమారు. నా మాట తప్పు గా అను కున్నారే తప్ప, పోలీస్ లాటీ దెబ్బ తప్పుగా అనిపించలేదు వాళ్ళకి. కొన్ని మాటలు కొన్ని ప్రాంతాలకి తప్పు కావచ్చు. ఒక ఇంగ్లీష్ మాట ని మన భావాలకి వ్యతిరేకంగా అన్వయించుకోకండి. ఒక న్యూస్ చదివాను. స్లమ్ డాగ్.. ని తెలుగు లోకి డబ్ చేసి “ఊరకుక్క” అని పేరు పెట్టాలని ఆలోచిస్తున్నారని.. దాని కంటే స్లమ్ డాగ్ వినసొంపుగా ఉందేమో..
అన్వేషి says:
@సైఫ్
>>”ఆస్కార్ ఎందుకురావడం లేదని బాధపడే..అవసరం ఈ దేశకళాకారులకు లేదు.ఎవరొ ఆస్కార్ అవార్డు ఇస్తేనే…మన ప్రతిభ గొప్పదైపొతుందని నేను అనుకొను.
షారుఖ్ చెప్పినట్లు..
ఇన్ని భాషలు , ఇన్ని వందల సినిమాలు , ఇన్ని స్టుడియొలు ఉన్న మనము…
అసలు ప్రపంచానికి మనదైన…ఆస్కార్ ని మొదలు పెట్టాలి ”
ఇది చదివి నవ్వాలో ఏడ్వాలో తెలియటం లేదు. మొన్నొక సారి ఇలాగే ఎవరితోనే చర్చిస్తుంటే “మొన్న షారూఖ్ ఏం చెప్పాడో తెలుసా” అని మీలాగే ఏదో చెప్పుకొచ్చాడు. అసలు ఈ షారూఖ్ అమితాబ్ ఎవరండీ అసలు. వీళ్ళు చెప్పాలా అన్నీ మనకి. మనం అస్కార్ మొదలు పెట్టాలా? మనల్ని మనం ఉత్తుత్తి సన్మానాలు చేసుకుంటూ చేసే రకరకాల అవార్డులు (ఫిల్మ్ ఫేర్, ఐఐఎఫ్ ఐ లాంటివి) చాలవా?
ఇప్పుడు మీరేమంటారో తెలుసు. మనకి మంచి ఆర్టిస్టులు లేరంటారా? అని అడగొచ్చు. ఏమో సమాధానం మీకే తెలియాలి. నేను లేరనటంలేదు. ఉన్నారనటం లేదు.
Mohana says:
>>”ఆస్కార్ ఎందుకురావడం లేదని బాధపడే..అవసరం ఈ దేశకళాకారులకు లేదు.ఎవరొ ఆస్కార్ అవార్డు ఇస్తేనే…మన ప్రతిభ గొప్పదైపొతుందని నేను అనుకొను.
షారుఖ్ చెప్పినట్లు..
ఇన్ని భాషలు , ఇన్ని వందల సినిమాలు , ఇన్ని స్టుడియొలు ఉన్న మనము…
అసలు ప్రపంచానికి మనదైన…ఆస్కార్ ని మొదలు పెట్టాలి ”
Oh my God!!
రెడ్డి జి says:
Academy of Motion Picture Arts and Sciences (AMPAS) since 1929 has been presenting annually Academy awards or Oscars along with gold platted statuettes which are by far the oldest, best known, most influential, most prestigious, and famous of film awards in the world. Oscar award ceremony is one of the highly watched show in the world. Artists from all over the world consider this as the biggest honor of thier life time.
ఏ దేశం లో లేవు స్టుడియోస్? ఎక్కువ స్టుడియోస్ ఉన్నంత మాత్రన ఎవరికి వారే ఆస్కార్స్ ప్రకటించుకుంటీ ఎవరు పట్టించుకుంటారు? Sharukh khan అన్నంత మాత్రాన world agree చేస్తుందా?
ఈక slumdog సినిమా కి వస్తే, చాలా అమెరికన్స్ వాల్ల lifetime లో ఇంత మంచి సినిమా చూడలేదు అన్నారు. నేను్ రిలీస్ అయిన నెల తరువాత ఈ సినిమా కి వెల్లా(US lo), 80% theatre ఫుల్ అవడమ్ చూసి అస్చర్యపోయా. I saw many NRIs feeling proud that a movie made in India has got such a fame and is in the race for OSCARS. Our Indian is in the race for best original score..It is a proud moment for all of us.. What has Jai Ho to do with americans and english people they can not even understand it.. but still the media appreciated original score and the feel that music has brought to the movie..
సనిమా లో Indians అందరు millionares గా చుపించేస్తే India ki గర్వకారనమా? Amitab లాంటి వారు కూడా ఇలాంటి వ్యాక్యలు చేయడం సమంజసం కాదు. Danny rightly depicted slums in Mumbai even though he is from a different country and we should applaud him for that. Every country has rich, poor, middle class and slums and this movie is set in slums in India.. So why should we make a deal out of it?? Come on Guys!
Surya says:
డాగ్ అనే పదం యొక్క అర్థాన్ని వక్రీకరించి చూసినా (కేవలం చర్చ కొరకు) , విదేశీయులు మన దేశం గురించి ఏమనుకున్నా, ప్రస్తుతం మనమందరము మురికి కూపం లో ఉంటున్నాము అనే మాట మాత్రము తోసిపుచ్చలేని నిజం. ఏవడో ఎదో సినిమా కి ఇతివృత్తం గా మన పరిస్థితులను ఎంచుకుని పేరు సంపదిచుకున్నాడని బాధపడటం కంటే , వాళ్ళ మీద వ్యాజ్యాలు వేసుకుంటూ కాలం గడపటం కంటే,కనీసం మనమందరము ఏమిచేస్తే పరిస్థితులు బాగుపడతాయో ఆలోచించటం మంచిది.
kiran says:
Amitabh commenting on Slumdog Millionaire – “Sour grapes” syndrome.
Reddy G says:
Sour grapes syndrome! You Bet!!
రామేశబాబు says:
ఈ గురువింద కింద నున్న నలుపుని ఏమి చెయ్యాలో ఆలోచించండి అయ్యలారా! అప్పుడు బయటివాళ్ళు మనలని అనే అవకాశం ఎక్కడుంటుంది?
అన్వేషి says:
Now it is the turn of Priyadarshan. He says Danny Boyle did not care to show Marine drive and other beautiful things about India.I think his worry is not about Slumdog but about Kanjeevaram. Kanjeevaram is not a bad film but it is no classic too. With over done DI and purposeless non-linear narrative it is just an ok film. From the very look of it you can say that Priyadarshan made the film for ‘phoren log’.Now why worry when some one is cashing on India’s slums or whatever…when the same person is trying to sell India using a different context.
Slumdog… is trashy: Priyadarshan
http://movies.ndtv.com/newstory.asp?section=Movies&id=ENTEN20090082084
srikanth says:
సైఫ్ అలి గొరే సయ్యద్….
నీను మీతో ఏకీభవిస్తున్నాను….
అసలు వాడెవడు మనల్ని …స్లం డాగ్ అనడానికి…అంటే గింటే…మనం అనుకోవాలి కాని….
అంటే మన వాడు అదే టైటిల్ తో సినెమా తీస్తే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు…..
నేను కూడా…. “Millionaires-Who Are The Cause Of Slums” …..అని అమెరికన్స్ మీద సినెమా తీస్తే వొప్పుకుంటారా…
అసంఖ్య says:
నేను cinemark లో చూస్తున్నప్పుడు, చాలా మంది Americans లేచి వెళ్ళిపోయారు cinema మొదలైన ఒక పావుగంటలో. కొన్ని scenes అంత జుగుప్సకలిగించే రీతిలో ఉన్నాయి. కొన్ని senti scenes మన దర్శకులే ఇంకా బాగా తీస్తారనిపించింది. మొదట్లో runway దగ్గరనుంచి chasing లో constable నిస్సహాయతని సరిగ్గాచూపించలేదు. ఏమాత్రం commonsense ఉన్నవాడైనా, వీధిబాలల్ని అంతసేపు chase చెయ్యడు. slums ని చూపించడనికే అన్నట్టుంది ఆ scene మొత్తం. అన్నింటికన్నా background score అదిరింది.
అలాగే Benz Car ని part కి part ఊడదీసి అమ్మేసే scene లో, I will show you real America my son అని చెప్పి జేబులో ౧౦౦ ఎన్నే డాలర్ల నోటుపెడుతుంది దొరసాని. అప్పుడు కూడా, theatre లో ఏమాత్రం reaction లేదు.
దీనిమీద గొల్లాపూడి మారుతీరావు గారి అభిప్రాయం: http://www.koumudi.net/gollapudi/about_slum_dog.html
)
(అన్వేషిగారు: గొల్లపూడి ఎవరండీ అసలు మనకి చెప్పడానికి అనిమీరనరని నేననుకుంటున్నాను
అన్వేషి says:
@అసంఖ్య,
గొల్లపూడి గారు అసలు సినిమానే చూడలేదు. వాళ్ళబ్బాయి చెప్పిన సీను చూసి సినిమా హాలులో నాకు వాంతొచ్చేంత పనయింది. కానీ అదొక్క సీన్ వదిలేస్తే సినిమాలో అంత జుగుప్స కలిగించే సీన్లేవీ లేవు. అసలు ఈ సినిమా ఇండియా గురించి డాక్యుమెంటరీ లేదా ఒక విజువల్ డాక్యుమెంట్ అని ఎవరు చెప్పారసలు.ఎన్నో సినిమాల్ని సినిమాగానే చూడాలని వాదించే మనమంతా ఈ సినిమాని సినిమాగా ఎందుకు చూడలేకపోతున్నామో అర్థం కావటం లేదు.ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ నటించ్చిన బ్లాక్ అనే క్లాసిక్ గ్రేట్ వండర్ ఫుల్ తొక్కలో సినిమా ఎవరి కోసం తీసారు? అందులో చూపించిన ఇండియా ఇండియానా? అప్పుడెవరకీ ఈ అనుమానం రాలేదే? ఇండియా అంతా ఇలా రిచ్ గా ఉంటుందా? కాస్తా పేదరికాన్నీ చూపించొచ్చుగా అని వాదించలేదేమీ? ఈ సినిమానీ ఆస్కార్సో/గోల్డన్ గ్లోబ్స్ కోసమో తీసింది కాదా? స్లమ్ డాగ్ లో పేదరికాన్ని ఎక్కువచేసి చూపించడం తప్పైతే మన సినిమాలన్నింటిలో ధనవంతుల్నీ ఎక్కువచేసి చూపించడం కూడా అంతే తప్పు.
satya says:
@అసంఖ్య,
డానీ బొయల్ కి ఈ సినిమా ని సెంటిమెంటల్ గా తీయాలని లేదు. He wants to showcase the great “energy” in these masses living in slums besides they are facing lot of problems. అది తనే చాల వేదికలపై చెప్పాడు. రెహ్మాన్ కి కూడా సంగీతం విషయం లో తనకు సెంటి గా ఉండే మ్యూజిక్ వద్దని, edgy మ్యూజిక్ కావాలని చెప్పాడని స్వయంగా రెహ్మానే చెప్పాడు.
అసంఖ్య says:
గొల్లపూడి గారి అభిప్రాయము: http://www.koumudi.net/gollapudi/about_slum_dog.html
దానికి వివరణ (ఆయన మాటల్లోనే):
http://www.koumudi.net/gollapudi/slum_dog_explanation_020209.html
ravi says:
@అసంఖ్య,
గొల్లపూడి గారు చెప్పిన పథేర్ పాంచాలి గురించి కూడా కొంత మంది మహానుభావులు సత్యజిత్ రే భారతదేశపు పేదరికాన్ని విదేశాలకమ్మి అవార్డులు చేసుకున్నారని విమర్శించారు.
satya says:
చిత్రం! సినిమా చూడకుండానే గొల్లపూడి లాంటి వాళ్ళు కూడా ఒక సీన్ ఆధారంగా విమర్శించటం. మన ‘కాలాపాని ‘ సినిమా లో అండమాన్ జైలు లో ఉన్న ఒక స్వాతంత్ర్య సమరయోధుని నోటిలో మలం పొయమ్మని ఆదేశిస్తాడు.. ఆ ‘దృశ్యం ‘ కూడా చూపిస్తారు. మరి అక్కడ కలగని ఆత్మాభిమానం ఇక్కడెలా కలిగింది? ఎవరెన్ని విమర్శలు చేసినా స్లండాగ్ మిలియనీర్ నిజ్జంగా గొప్ప సినిమానే. కళ ని కళ గా చూస్తే ఏ గొడవలు ఉండవు.
satya says:
గొల్లపూడి గారి వివరణ లో కూడా ఈ కాలం నాటి ఆంగ్ల చిత్రాన్ని ఎప్పటివో చిత్రాలతో పోల్చి ‘అదీ కళంటే’ అని చెప్పటం ఏంటో అర్ధం కాలెదు. నేటి తెలుగు, బాలీవుడ్ చిత్రాలతో పోలిక పెట్టి చూస్తే తెలుస్తుంది.
వారు చెప్పినట్లు తెర మీద అనుభూతి చూపించేస్తే అది కళ అని, లేకపోతే కళ పరిమితులని దాటినట్లే అని చెప్పినప్పుడు, మన తెలుగు సినిమాల్లో మోతాదుకి మించి చూపిస్తున్న శృంగార సన్నివేశాలలో కళనే చూపిస్తున్నామా? .అనుభూతి చాలుగా
సైఫ్ అలి గొరే. says:
మీ అందరికి మరొ సారి విన్నవించేది ఏమంటే…
సినిమా కు సెన్సారు పరిమితులు హద్దులు, ప్రమేయాలు అనే విషయం మీద ప్రశ్నిస్తున్నవాళ్ళం మేము.
మళ్ళీ.. చెప్తున్నా …
ఈ సినిమా అద్భుతం.
సాధారణ ప్రజానికానికి ,(నాకు తెల్సి చదువుకున్న వాళ్ళకు కూడ..) ఈ దెశం విడిచి పొయినొల్లకు ఏమొ కాని…, పేరు గురించి మాత్రమే…నేను రాసినది. చర్చ కూడాను.
మన లొ , మీ లొ కొంతమందికి …, ,స్లండాగ్ అనిపించుకొవడం లొ ఏ మాత్రం ఇబ్బంది లేక పొతే.. చాల సంతొషం.
కేవలం కేవలం… టైటిల్..
రిక్షవోడు…అని సినిమా వచ్చినప్పుడు కూడ ఆపేరు గురించి మేము..ఇదే అభిప్రాయం చేప్పాము.
కనీస గౌరవం .చెప్తున్నాం.కధ పరంగా, పాత్రల పరంగా, ఓకే.
కాని…
leave it
topic is divirting to related amitab and …. priyadarshan views.
actually here thats not content.
మార్థాండ says:
నా ఆఫీస్ వెనకే ఒక స్లమ్ ఏరియా ఉంది. అక్కడి జనం క్రైస్తవ మిషనరీ స్కూల్ లో చదువుకున్న వాళ్ళే. నేను వాళ్ళని స్లమ్ డాగ్ అని జోక్ గా అన్నా వాళ్ళు నన్ను ప్రాక్టికల్ గా పట్టుకుతంతారు. ఆ సినిమా టైటిల్ లోనే పెద్ద వికారం కనిపిస్తుంది.
satya says:
@ మార్తాండ,
ఆర్.నారాయణమూర్తి ‘ఒరేయ్! రిక్షా..’ అని టైటిల్ పెట్టాడు. జనం నిజంగా అలా పిలవక పోయినా సమాజం లో రిక్షావాళ్ళ పట్ల ఉండే చిన్న చూపు ని తెలియచేసే విధంగా పెట్టిన టైటిల్. స్లండాగ్ కూడా అంతే. ఒకవేళ మనం ఒరేయ్ అని పిలిస్తే వీళ్ళూ పట్టుకొని తంతారు. ఇంక మీరు చెప్పిన ఉదాహరణ లో క్రైస్తవ మిషనరీ లో చదువుకున్నంత మాత్రాన ఇంగ్లీషోళ్ళు అయిపోరు. వికారం టైటిల్ లో లేదు..
Saty SKJ says:
ఒక విషయం గురించి నాకు అనిపిస్తుంది….
భావ స్వాత్రంత్యం ఉండాలి అంటె, విమర్శని కూడ మెప్పు లాగ స్వీకరించాలి!
ఇప్పుడు ఆ సినిమా SLUM’BOY’ MILLIONAIRE గా మారిస్తె ఈ విమర్శకులకి శాంతి గ ఉంటుందెమో?
shree says:
@Saty SKJ,
this title is superb…but slum dog is toomuch…you know it…
rekha says:
నాకు గొల్లపూడి గారు చెప్పింది చాలా వరకు సమంజసంగానే అనిపించింది. ఆయన సినిమా అనేదిartistic గా వుండాలి అని చెప్పారు. which is absolutely right. ఐతే నాకు title తో ఎమీ ఇబ్బంది లేదు. Its apt for the movie. ఈ సినిమా లో ఆ మలకూపం scene ఇంకా clean గా తియ్యొచేమో. మలకూపం లోకి దూకబోతుండగా కట్ చేసి, తరువాత scene జమాల్ అమితాబ్ autograph చూసి మురిసిపోవడం ఐతే బాగుండేది. అప్పుడు జమాల్ character establish అవుతుంది కాని ఆ episode అంత జుగుప్స కలిగే విధంగా వుండదు. A R Rehmaan music ఈ సినిమా లో అంత బాగుందా?! Its a good movie but not a great movie I think.
అసంఖ్య says:
@అన్వేషి, గారు: “మీరు అసలు షారుఖ్ ఖాన్ ఎవడండీ మనకి చెప్పడనికి” అన్నదానికి నేను గొల్లపూడి గారి లాంకె ఇచ్చాను. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. వాళ్ళు వాళ్ళ వాళ్ళ రంగాల్లో లబ్ధప్రతిష్టులు. మీరుకాకపోయినా, మనలో చాలామంది cinema ఇలాఉండలి, ఇలాఉండాలి, అని ideas, theories తప్ప అమలుచేసినవాళ్ళు, చెయ్యగల దమ్ము, దస్కం ఉన్నవాళ్ళుఎంతమంది. అందుకే వాళ్ళ అభిప్రాయానికి విలువ ఇవ్వాలి అంటాను. దాని ఉద్దేశ్యం వాళ్ళతో ఏకీభవించమని చెప్పడంకాదు.
@సత్య గారు, రవిగారు: నేను గొల్లపూడి వారి తరపున మాట్లాడలేను. కాని నా అభిప్రాయం చెబుతాను.
techincal గా చూస్తే, నాకు ఈ cinema చాలా నచ్చింది. slum లో chasing scene గానీ, police station లో TV/VCR తో Show ని interleave చెయ్యడంగాని, background score గానీ. చాలా intense movie. ఇంత పకడ్బందీగా తీసినందుకు మెచ్చుకోవాలి.
పాటలు నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు. అలేగా, పెద్దైన లతిక నటన. అక్కడక్క మంచి మెరుపులున్నాయి, eg, Do you know Gandhi కి సమాధానంగా I have heard about him అని జమాలి అన్నప్పుడు, బూటు తో తన్నడం లాంటివి.
content పరంగా చూస్తే, చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. బహుశా ఇక్కడే debate కి ఆస్కారం ఉంది (అందుకే ఆస్కార్ కూడా వస్తుందేమే
). ఇందులో నేను చూసిన చాలా విషయాలు, అసలు నేనెప్పుడూ ఇలా జరుగుతాయా అని కలలో కూడా అనుకోలేదు (నాకు సలాం బాంబే చాలా నచ్చింది both content & taking పరంగా). చాలామటుకి ఏమాత్రం నమ్మసక్యంగా లేవు. మన Bollywood వాళ్ళు పాటలు, ఫైట్లు పెట్టి సినిమాలు ఎలాతీస్తారో, ఈ హాలీవుడ్/బ్రిట్స్ ముఖ్యంగా మనలాంటి దేశాల పేదరికాన్నిచూపించి సొమ్ములు చేసుకుంటారు. ఆ రకంగా ఇది మూస సినిమానే.
నా అభిప్రాయం ప్రకారం: ఇది మామూలు సినిమాల్లొ గొప్పది. గొప్ప సినిమాల్లొ మాములుది.
hero says:
pakadbandeenaa? come on…dont think dat i m writin dis in english but cumin to point….cinema antha thopu kaadani naa feeling..endukante
1.main point anil kapoor ni negative shade lo chupinchalsina avasaram entha matramu ledu…anil kapoor toilet scene lo answer ivvadam…gosh really bad scenes and showin him in negative shade…
2.inka childhood nunchi love evo konni cases undochu le ani sarduku poyina and hero ni nite ki nite teesukelli interogate cheyamani cheppadaniki anil kapoor enduko naaku ardam kaaledu…..aa tv show ki edo interest create cheddamani police stations scenes…
3. konni questions ki answer cheyadam lo maree vetakaranga undi asalu..for example…ramudi right hand lo emuntadi ani adigite daaniki kuda edo chetha flash back avasaramaa…ramudi chetilo unnavatiki malli thokkalo options…inka nayam ..
wat will be there in RAMA’S hand?
A: ak47
B: perfume bottle
C:bow
D: seetha’s hand
hmmm gosh its really funny to show rivalry among hindu’s n muslims there…edo india andulonu mumbai annadu kabatti matha gharshanalu chupinchali ani chupinchinattunnadu…
ivanni brief ga konni points matrame….inka music ante matram songs antha khaas emi ledu but 2 tunes are catchy ga unnay and back score is gud….aa chinna cinema ki antha kanna emi kodtaru evaraina cheppandi..
anyhow direction ante matram not worth for indians…tella doralaki kotha ga undachemo kaani manollaki antha kotha ga emi ledu infact konchem ….oddulendi ippatike ekkuva cheppina…
thinkfloyd says:
@hero,
బాబూ హీరో,
నువ్వు రాస్తే తెలుగు లో రాయి, లేకపోతే, ఇంగ్లీష్ లో రాయి.
ఆంతే కాని, dat dis cumin ఏంటి? అదేం భాష?
మార్తాండ says:
టైటిల్ లో డీసెన్సీ ఉండాల్సిన అవసరం లేదనుకుంటున్నారా ఈ సినిమా అభిమానులు?
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
q&A పుస్తకరచయిత వికాస్ స్వరూప్ ను గురించిన ఒకమంచి పరిచయవ్యాసం సాక్షి దినపత్రికలొ
http://sakshi.com/Main/WeeklyDetails.aspx?Newsid=20173&categoryid=5&subcatid=13
మార్తాండ says:
ఈ సినిమా తీసిన వాళ్ళు అంత అమాయకులు అంటే నేను నమ్మను. “స్లమ్ డాగ్” అని టైటిల్ పెట్టింది మురికివాడ వాసుల్ని కించపరచడానికే. డబ్బున్న వాళ్ళు, హైయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మురికివాడ వాసుల్ని ఎంత హీనంగా చూస్తారో నాకు తెలుసు. మా ఇల్లు ఉన్నది బ్యాంక్ ఉద్యోగులు ఉండే కోలనీలో. నేను దళితవాడ పక్కన ఉన్న ఒక బిల్డింగ్ లో ఒక పోర్షన్ అద్దెకి తీసుకుని వ్యాపారం పెట్టాను. “అక్కడ ఆఫీస్ ఎందుకు పెట్టావు, ఆ ఏరియా వాళ్ళు మంచోళ్ళు కారు” అని నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. అది దళితవాడే కావచ్చు కానీ అది మెయిన్ రోడ్ పక్క ఉంది కాబట్టి నా దగ్గరకి వచ్చే కస్టమర్స్ కి లొకేషన్ అనుకూలంగానే ఉంటుంది అని సమాధానం చెప్పాను. మా ఆఫీస్ ఉన్న ఏరియాలో షాపుల రెంటు కూడా తక్కువ. దళితులు ఎక్కువగా ఉన్న ఏరియాలో బిజినెస్ పెట్టడానికి వ్యాపారులు అంత తొందరగా ముందుకు రారు. అక్కడ స్థలం చీప్ గా దొరుకుతుందని షాపులు కట్టేసిన వాళ్ళు రెంటు తక్కువ నిర్ణయించడానికి కారణం అది దళితుల వీధి కావడమే. మా కంటే ఎన్నో రెట్లు డబ్బున్న వాళ్ళైన బాలీవుడ్ నిర్మాతలకి మురికివాడ వాసులపైన నీచమైన అభిప్రాయం లేదంటే నేను నమ్మను.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
@మార్తాండ గారు,మీరన్నట్లు”ఎన్నో రెట్లు డబ్బున్న వాళ్ళైన బాలీవుడ్ నిర్మాతలకి మురికివాడ వాసులపైన” ఈ సినిమా నిర్మాతలు బాలీవుడ్ వారు కాదండి.కొందరు సాంకేతికనిపుణులు,నటీనటులు,కధారచయిత ఇలా కొందరు మాత్రమే భారతీయులు.వికీపీడియాలో వివరాలకోసం
http://en.wikipedia.org/wiki/Slumdog
మార్తాండ says:
మన తెలుగువాళ్ళేమి తక్కువ గడ్డి తినలేదు. “కంత్రీ” సినిమాలో అంబేద్కర్ విగ్రహం దగ్గర క్రిమినల్స్ తిరుగుతున్నట్టు చూపించారు. దాని గురించి డైరెక్టర్ ని అడిగితే అంబేద్కర్ విగ్రహం దగ్గర షూటింగ్ తియ్యడం ఏక్సిడెంటల్ గా జరిగిందని సమాధానం చెప్పాడు. ఆ సినిమాలో మురికివాడ వాసుల్ని కించపరిచే డైలాగులు కూడా ఉన్నాయి. దాని గురించి మాత్రం డైరెక్టర్ సమాధానం చెప్పలేదు.
Sai Brahmanandam Gorti says:
“స్లం డాగ్ మిలియనీర్” సినిమా పై గొల్లపూడి గారు రాసిందీ, దానిపై వచ్చిన వ్యాఖ్యలూ అన్నీ చూసాను. అందరూ డేనీ బోయిల్ ని తప్పు పట్టేరు. కాదనను. కానీ ఈ సినిమా మూల కథ రాసింది భారతీయుడు. పైగా ఆయన అంతర్జీతయ దౌత్యవేత్త కూడాను. అలాంటి వ్యక్తి రాసింది సినిమాగా తీస్తే అందరూ డేనీ బాయిల్ పై విరుచుకుపడితే ఆశ్చర్యం వేసింది. మన దేశం గురించి చెత్తగా రాసిన భారతీయుణ్ణి వదిలేసి, అది సినిమా తీసినాయినపై ధ్వజం ఎత్తడం నేనంగీకరించలేక పోతున్నాను. మన దేశాన్ని, సంస్కృతినీ దిగజార్చేదీ, చీదరించుకునేది భారతీయులే! తూలనాడేది మనమే! నవల రాసిన వికాస్ స్వరూప్ గార్ని వదిలేసి అందరూ మూకుమ్మడిగా డేనీ బోయిల్ని తన్ని తగలేస్తే నవ్వొచ్చింది. ముందు ఆ వికాస్ స్వరూప్ గార్ని ఉతకండి. చెండాలపు రాతలు రాసే వాళ్ళు సగం తగ్గుతారు.
ఎప్పుడైనా కుదిరితే, ఉదయాన్నే ఏడు గంటలకి ముంబయిలో సయాన్ నుండి చెంబూరు మీదుగా మాహుల్ ఒక్కసారి వెళ్ళి చూడండి. రోడ్డుకి అటూ ఇటూ బారులుగా కాల కృత్యాలు తీర్చుకునే అనేకమంది కనిపిస్తారు. వారికి కనీస సౌకర్యాలు లేవు. సిగ్గూ, శరమూ వదిలి పెట్టి రోడ్డు మీదే మలమూత్ర విసర్జన చేయాల్సొచ్చిన దౌర్భాగ్య స్థితిలో వున్న వాళ్ళని చూస్తే జాలేస్తుంది. నేను ఇరవై ఏళ్ళ క్రితం ముంబైలో పనిచేసాను. అప్పుడు చూసినవి ఇవి. ఈ మధ్యనే రెండేళ్ళ క్రితం ముంబై వెళ్ళితే, ఫ్లైవోవర్లూ, కార్లూ పెరిగాయి కానీ రోడ్డుకి అటూ ఇటూ ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునే వారి సంఖ్యా మాత్రం తగ్గ లేదు. కనీస సదుపాయాలు లేవు. కొంచెం బాధ కలిగించినా పరిస్థితి ఇదే! ఒక్కసారి కలకత్తాలో కొత్త హౌరా బ్రిడ్జి దగ్గర చూడండి. ఒక పక్క ధన గంగ, రెండో పక్క మురికి గంగ, బ్లాక్ అండ్ వైటు సినిమాలా కనిపిస్తాయి. మనం సర్దుకుపోయినా, మన దేశానికొచ్చిన వారు దీన్ని బీదరికం క్రిందనే జమ కడతారు. ఇప్పటికీ అనేక చోట్ల మనకి పరిశుభ్రతా లోపం కనిపిస్తూనే ఉంటుంది. ఇవన్నీ ఎండగడుతూ రాసుంటే బావుండేది. కేవలం సినిమా పేరు చూసి మనం గొంతు చించుకోడం శుద్ధ దండగ. క్రికెట్ లో ఓ మోస్తరు జట్టుని అండర్ డాగ్స్ అని సంబోధిస్తారు. 1983 వర్ల్డ్ కప్ లో ఇండియా అండర్ డాగ్స్ అనే అభివర్ణించారు. అండర్ డాగ్స్ అనేది ఒక వాడుక. ఇలా ప్రతీ పదానికీ అర్థాలూ, పెడర్థాలూ పీక్కోడం అనవసర కంఠ శోష.
pullayya says:
picchi palu rakaalu ani….
pullayya says:
nenu pattina kundelu ki muudey kaallu ani kuda..
Venkat says:
ఇండియన్ షాపు లో $2/ కి స్లమ్ డాగ్ డివిడి దొరికింది. చాలా ఆశ్ఛర్యం వేసింది. ఏందుకంటే ఇంకా ధియేటర్ రన్ కంప్లీట్ గాలేదు గదా అని. కాపీ ఎక్కడిదో తెలుసా ఫాక్స్ వాళ్ళు అస్కార్ అవార్డ్ రివ్యూకోసం డిస్ట్ర్ర్ బ్యూట్ చేసిన పర్సనల్ కాపీ.. హతవిధీ పైరసీ ఎంత దూరం పాకిందో చూడండి.
మార్తాండ says:
చెత్త సినిమాలకి కూడా పైరసీ మార్కెట్ ఉంటుందా?
గీతాచార్య says:
ఆస్కార్ రప్పించిన రహ్మాన్.
అసలు ఇంత గోల బదులు రహ్మాన్ కి ఆస్కార్ వచ్చినందుకు సంతోషిద్దాం. ఈ సినిమా వల్లే కదా అతనికి అలాంటి అవకాశం వచ్చింది. ఎవరెన్ని మాటలు అన్నా, ఎన్ని వివాదాలు ఉన్నా ఆస్కార్ అవార్డ్ లు కొన్ని standards మీద ఆధారపడి ఇస్తారు. వాటి విలువ ఖచ్చితంగా మన నండీ అవార్డ్ ల కన్నా, jaateeya అవార్డ్ ల కన్నా ekkuve. Because they are based on some standards.
అవి andaledanemo, లేక పోతే ఒక dakshina bhaarateeyudu alaa moodu aaskaarla వరకూ vellaadanemo amitaabjee కి కోపం వచ్చింది. ఆయన అసలు బాధ dhoom 2 sinimaalo natanaki abhishek కి అవార్డ్ raaledanemo ఏదో కారణం వల్లే alaa అని ఉంటాడు. slumdog is equivalent to underdog. Nothing more.
రహ్మాన్ కి shubhaakaankshalu చెప్పండి చాలు.
Note: Because of net problems, some of the comment is in Tenglish. I express my sorry to u all.
రాకేశ్వర రావు says:
ఈ వ్యాసం నవతరంగంలో ప్రచురించడానికి పూర్తిగా అనర్హం. రచయితకు వున్న nationalist inferiority complex ని ఇలా నలుగురి మధ్యలో అఘోరిస్తూ చెప్పకోవడం తప్ప ఇందులో ఏం లేదు. ఇలాంటి ఎమోషనల్ టపాలు ప్రచురించే ముందు పునరాలోచన అవసరం. ఇటువంటి ఆలోచనారీతికీ, హిందూ సంస్కారానికి అభ్యంతరకరమని water, fire వంటి సినిమాలను నిషేధించమనే శివసేన వారి ఆలోచనారీతికీ పెద్ద తేడా లేదు. IMHO.
K మహేశ్ కుమార్ says:
రాకేశ్వర్రావు వ్యాఖ్య చూసి, నేను ఈ మధ్యరాసిన వ్యాసమొకటి గుర్తొచ్చింది. అదిక్కడ ప్రచురిస్తున్నాను.
ఈ మధ్యకాలంలో భారతీయ గుర్తింపుకు గొడ్డలిపెట్టంటూ చర్చించిన రెండు విషయాలు, అర్వింద్ అడిగ రాసిన ఆంగ్ల నవల “వైట్ టైగర్”, అలాగే డానీ బోయెల్ తీసిన “స్లండాగ్ మిలియనీర్” సినిమాల గురించి. ఒకటి బీహార్ చీకటి నుంచీ వచ్చి, ఢిల్లీలోని ఆధునిక ప్రపంచం లోని ధగధగల నడుమ హంతకుడుగా మారి, IT విప్లవానికి ఆదిబిందువైన బెంగుళూరు వెలుగులో గౌరవనీయమైన వ్యాపారస్థుడిగా మారే ఒక యువకుడు జీవితాన్ని చిత్రించే నవల. మరొకటి, ముంబై మురికి కూపంలో పుట్టిపెరిగి, మాఫియా సామ్రాజ్యపు అంచుల్ని తడిమి చూసి, ఆగ్రా వీధుల్లో తాజ్ మహల్ సాక్షిగా విజయవంతమైన వీధి జీవితాన్ని అనుభవించి, భారతీయ ఔట్సోర్స్డ్ అభివృద్ది చిహ్నమైన కాల్ సెంటర్లో కాఫీ-టీలు అందిస్తూ, చిన్ననాటి ప్రేమకోసం కోటీశ్వరుడయ్యే టీవీ షో హాట్ సీటెక్కి, అనుమానంతో పోలీసుల ‘షాక్ టీట్మెంట్’ తీసుకుని చివరకు డబ్బుతోపాటూ అమ్మాయినీ దక్కించుకునే ఒక “అండర్ డాగ్” కథతో తీసిన సినిమా.
ఈ రెండూ ఇంగ్లీషులో, ఇంగ్లీషువాళ్ళకోసం రాసిన,తీసినవి. కాకపోతే అవి భారతదేశం మీద కాబట్టి మనోళ్ళకి మహకోపమొచ్చేసింది. “హాఠ్! ఆర్థిక అసమానతల అభినవ భారతదేశంలో ఎంత aspirational క్రైముంటే మాత్రం ఇలాంటి చీకటి కోణాన్ని ప్రపంచానికి చెప్పేస్తావా, అదీ ఇంగ్లీషులో రాసి” అని ఒకడి మీద నిప్పులు చెరిగితే, మరొకడ్ని “మాదగ్గర మురికివాడలుంటే నీకేంటి? 70 MM స్టీరియో సౌండ్లో ప్రపంచానికి చాటడానికి నువ్వెవడివి?(అదీ ఇంత బాగా)” అని తీవ్రంగా గర్హించేసారు. మనోళ్ళు జపించే మరో మంత్రం ఏమిటంటే, ‘ఈ రెండూ అభివృద్ధి పధంలో విలసిల్లుతున్న భారతదేశ పరిస్థితిని కించపరిచేవిధంగా పనిచేసాయి’ అని. ఇక్కడే నాకు ‘అత్త తిట్టినందుక్కాదుగానీ…తోడికోడలు నవ్వినందుకు ఈ మంట’ అనే సామెత గుర్తొచ్చింది.
మనదేశంలో ఆర్థిక అసమానతలుంటే ఫరవాలేదు. కానీ దానిగురించి మనం సరదాగా (ఈ నవల ఒక black comedy) కూడా మాట్లాడుకోకూడదు. కళ్ళెదురుగా మురికివాడలు. దుర్భరమైన జీవితాలూ అనుభవించే ప్రజలుండొచ్చు. కానీ వాటిగురించి ఎవరైనా గుర్తుచేస్తే మాత్రం మనకు సహించదు. సమస్యలు మనకు పట్టవు. వాటి గురించి ఎవరైనా ఆరాతీస్తేమాత్రం కోపమొస్తుంది. పైగా అది బయటోడు చెబితే ఇంకా మహచెడ్డ కోపమొస్తుంది. ఈ నవలా, సినిమా గొప్ప కళాఖండాలు కాకపోవచ్చు, కానీ మన మేకప్ వేసుకున్న మురికిముఖాల్ని మళ్ళీ చర్చల్లో బయటపడేలా చేసాయి. అసలు సమస్యనొదిలేసి falls prestige కోసం ప్రాకులాడే మన కుత్సిత మధ్యతరగతి మనోభావాల్ని బయల్పరిచేలా చేసాయి.
అభివృద్ధి ఫలాలు కనీసం వాసనచూడని లోకం మనదేశంలో ఉందని గ్రహించకపోతే, చీకటిలోనే మగ్గిపోతున్న బ్రతుకులు నడిబజార్లో కారు అద్దంపై టకటకా కొట్టి బిక్షమడుగుతున్నాయన్న స్పృహ లేకపోతే… మిగిలేది the great Indian Development story అనే ఎండమావి. ‘కుక్క’లకోసం, ‘పులుల’ కోసం మాత్రమే కొట్టుకుంటూ మనుషుల్ని మరిచిపోయే మన మరుభూమి సంస్కృతి. బహుశా మనకు అదేకావాలి. మనుషులకన్నా, సమస్యల్ని తీర్చే సమాధానాలకన్నా, కొట్టుకోవడానికి కారణాలే కావాలి. రండి కొట్టుకుందాం!
Sree Divya says:
I totally agree that “slumdog Millionaire” deserves an Oscar award. But another movie which is based on a similar theme is “Salaam Bombay”. This movie is directed by Mira Nair and was also nominated Oscar under the “Best Foreign Film” category. I somehow felt that “Salaam Bombay” took my breath away. It was very honest and savvy depiction of the characters and very close to the reality. I never felt I was watching just another movie but I was totally engrossed in the movie. Mira Nair’s choice of artists in the movie, capturing subtle emotions of the characters and Bombay in neon lights was impeccable and impressive. But the storytelling and screenplay of the movie gives more of a feel of a documentary rather than a commercial film.
On the other hand, Slumdog Millionaire has a tight screenplay and a creative and fascinating storyline. It touches upon the wide range of issue in India. In addition, Rahman has given a wonderful music and background score. I couldn’t agree with some of the things in the movie like the beggar telling about Benjamin Franklin on a dollar note and the childhood love and jamaal searching and finding finding his long lost love. I also felt that the climax was very dramatically carved, but all this made it more of a feature film and appealed to a vast set of audience.