తెలుగులో స్క్రిప్ట్ రాయండిలా-celtx పరిచయం

celtx-feature

***************************************************
NOTE: This article is just an introduction to the software and as it was written more than 2 years ago when the application is still in the early stages of its development. The actual software is updated to accommodate more features in the last 2 years. So please do visit the original site for more info and most of your questions will be answered from there.
I’ll try to add some troubleshooting issues that NT readers facing while using this at the end of this article. This is just to give a short answer to the problem, but there might be alternative solutions that do exist. So please do continue adding your suggestions as comments and will update the post accordingly.
***************************************************
celtx అనేది open source వారు ప్రవేశపెట్టిన script Pre-Production software. మీకు ఇంతకు ముందే finale draftతో పరిచయం ఉంటే ఆ అనుభవంతో celtxతో దూసుకుపోవచ్చు. ఇది ఉచితం కూడాను. ఒకవేళ మీరు ఇప్పటివరకూ ఎటువంటి సాఫ్ట్ వేర్ ఉపయేగించి ఉండకపోతే తెలుగులో స్క్రిప్ట్ వ్రాయడానికి అవసరమైన కొన్ని మెళకువలు నేర్పడమే ఈ వ్యాసోద్దేశ్యం. ఇది కేవలం నాకు తెలిసినది నవతరంగం పాఠకులతో పంచుకునేందుకు మాత్రమే. మీకింకా ఏమైనా జతచేయాలనిపిస్తే మీ సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయమని మనవి.

ముందుగా తెలుగులో స్క్రిప్ట్ వ్రాసేందుకు రెండు సాఫ్ట్ వేర్ లను install చేసుకోవాలి.

1.తెలుగులో వ్రాయడానికి barahaIME కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2.స్క్రిప్ట్ వ్రాసేందుకు అవసరమైన celtx కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇప్పుడు ముందుగా మనకు ఒక చిన్న కధ అవసరం.  ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక జోక్‍ని తీసుకుందాం.

జోక్:

టీచర్: హోంవర్క్ లో మీ నాన్న హెల్ప్ చేశాడా ?

రణధీర్: లేదు టీచర్, అంతా ఆయనే చేశాడు.

ఇప్పుడు ఈ చిన్న సన్నివేశాన్ని celtxలో వ్రాద్దాం.

installation తర్వాత celtxని ఓపెన్ చెస్తే splash page వస్తుంది.

అందులో project templetsలో film అనే టెంప్లెట్‍ని సెలెక్ట్ చేసుకోండి.

{ స్క్రిప్ట్ వ్రాసేందుకు అవసరమైన షార్ట్ కట్స్ కోసం ఇక్కడ ప్రయత్నించండి. }

మొదటగా scene heading. ఇక్కడ ప్రస్తుత సన్నివేశం ఎక్కడ జరుగుతుందో వివరించాలి.

ఆంగ్లంలో దీనిని మూడు పదాలతో వ్రాస్తారు.

1.INT/EXT . ఇది interior లేక exterior పదాలకు షార్ట్ ఫామ్.

2.location. ఇది ప్రదేశమును తెలియజేసే పదం.

౩.time. సమయాన్ని తెలియజేయడానికి.

ఉదా: INT.CLASS ROOM.MORNING

అంటే తర్వాత వచ్చే సన్నివేశం మొత్తం క్లాస్‍రూం లోపల ఉదయంపూట జరుగుతున్నట్టు. ప్రతి సన్నివేశానికి ఈ scene heading తప్పనిసరి.

ఈ షార్ట్ కట్స్ ని మన తెలుగులో వ్రాసేందుకు Tools>options>Script లోకి వెళ్ళి INT/EXT words  అని ఉన్నచోట ’లోపల,బయట ’ అని వ్రాసుకోవచ్చు. అదే విధంగా DAY/NIGHT wordsలో ’ఉదయం,సాయంత్రం,రాత్రి..మొదలగు పదాలను ’ జతచేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా నిర్వచించుకుంటే మనం స్క్రిప్ట్ వ్రాసేప్పుడు ’బ’ అని వ్రాయగానే ’బయట’ అనే పదం ఐడెంటిఫై అవుతుంది.

ఇప్పుడు పై ఉదాహరణను తెలుగులొ ఈ విధంగా వ్రాసుకోవచ్చు.

ఉదా: లోపల.తరగతి గది.ఉదయం.

ఈ విధంగా scene heading వ్రాసిన తర్వాత return/enter కొడితే ఆటోమెటిక్‍గా actionలోకి వెళ్ళిపోతుంది. మీరు drop down menuను గమనించినట్టైతే అక్కడ కూడా సీన్ హెడ్డింగ్ నుండి యాక్షన్ కి మారిపొవడం చూడొచ్చు. { celtxలో సీన్ హెడ్డింగ్ తర్వాత action , ఆ తర్వాత charecter, dialog ఫాలో అవుతాయి.}

మనం ఒక్కసారి పైన ఉదహరించుకున్న సన్నివేశాన్ని వ్రాసుకుంటే ఇవన్నీ అర్ధం అయిపోతాయి. ఇప్పుడు ఈ క్రింది చెప్పిన వరుసలో వ్రాసుకుంటూ వెళ్లండి.

అ. scene heading అని ఉన్న చోట.

౧. ’లోపల.తరగతి గది.ఉదయం’ అని టైపు చెయ్యండి.

౨.return/enter కొట్టండి.(drop down menuలో scene heading నుండి actionకి మారడం గమనించండి)

ఆ. ఇప్పుడు యాక్షన్ ని ఈ క్రింది విధంగా టైప్ చెయ్యండి.

“టీచర్‍కి పిల్లలు హోమ్ వర్క్ చూపిస్తూంటారు. రణధీర్ హోంవర్క్ బుక్ చూపిస్తుంటాడు.”

return/enter కొట్టండి.(drop down menuలో action అలానే ఉండడం గమనించండి)

tab కొట్టండి(drop down menuలో action నుండి Characterకి మారడం గమనిమ్చండి)

ఇ. ఇక్కడ Character(పాత్ర)ని ఈ విధంగా టైప్ చెయండి.

“టీచర్”

return/enter కొట్టండి.(drop down menuలో character నుండి dialogకి మారడం గమనించండి)

ఈ. ఇక్కడ Dialogని ఈ విధంగా టైప్ చెయండి.

” హోంవర్క్ చేయడంలో మీ డాడీ హెల్ప్ చేసారా? “

return/enter కొట్టండి.(drop down menuలో dialog నుండి characterకి మారడం గమనించండి)

ఉ. ఇక్కడ Character(పాత్ర)ని ఈ విధంగా టైప్ చెయండి.

“రణధీర్”

return/enter కొట్టండి.(drop down menuలో character నుండి dialogకి మారడం గమనించండి)

ఊ. ఇక్కడ Dialogని ఈ విధంగా టైప్ చెయండి.

“లేదు టీచర్… మొత్తం మా డాడీనే చేసాడు.”

________________________________________________

ఇప్పుడు మరో యాక్షన్(అదే సీన్‍లో) వ్రాయాలనుకుంటే return/enterని రెండుసార్లు, మరో సీన్‍ మొదలుపెట్టాలనుకుంటే return/enterని మూడుసార్లు కొట్టండి. మళ్ళీ పైన చెప్పిన విధంగానే(’అ’ నుమండి మొదలు పెట్టి) వ్రాసుకుంటూ పోవచ్చు.

పైన చెప్పుకున్న ఉదాహరణలో మనం పాత్ర హావభావాల్ని కూడా జతచెయవచ్చు. అందుకు parenthetical అనే toolని వాడాలి.

పైన చెప్పిన వరుసక్రమంలో ‘ఇ’ తర్వాత, ’ఈ’ కి ముందు ఈ విధంగా చెయ్యండి.

ఇ.2      Ctrl+5 కొట్టండి.(drop down menuలో dialog నుండి Parentheticalకి మారడం గమనించండి)

“ఆశ్చర్యంగా” అని టైప్ చెయ్యండి.

return/enter కొట్టండి.(drop down menuలో Parenthetical నుండి dialogకి మారడం గమనించండి)

—————————————————————-

పై విధంగా సన్నివేశాలను కూర్చుకుంటూ పోవడమే. మీ స్క్రిప్ట్ తయారైపోతుంది.

dropdown menuనుండి పై ఉదాహరణలో మనం ఉపయోగించని టూల్స్ మూడు మిగిలిపొయాయి.అవి

1.Transition : ఒక సన్నివేశం నుండి ఇంకో సన్నివేశానికి లింక్ చేసుకోవడానికి ఉపయేగించుకోవచ్చు.

2.Shot : షాట్ ఎలా ఉండాలో వివరించుకోవడానికి ఉపయోగపడుతుంది.

3.text: మధ్య మధ్యలో నోట్ add  చేసుకోవడానికి వాడుతారు.

తర్వాత file menu నుండి save project as select చేసి homework అనే పేరుతో save చేయండి. ఇప్పుడు project tool barలో ఉన్న Script>Export Script option ని సెలెక్ట్ చెయ్యండి. మీ స్క్రిప్ట్ word formatలో చూసుకోవచ్చు. అలానే మీ  .celtx fileని collaboraters ఎవరైనా ఉంటే ఎడిట్ చేసేందుకు వాళ్ళకు పంపించుకోవచ్చు.

ఇప్పుడు ప్రాక్టీసు కోసం నవతరంగంలో ఇప్పటికే ప్రచురించిన వినాయకుడు స్క్రిప్ట్ ని తెలుగీకరించొచ్చు. ఆసక్తి కలవారు ఒక్కొక్కరూ ఐదు పేజీల చొప్పున వ్రాసుకుంటే మనకీ అలవాటు పడుతుంది, ఈ స్క్రిప్ట్ ని తెలుగులోకి తీసుకొచ్చినట్టుంటుంది. స్టార్టింగ్ ప్రాబ్లెం ఉండకూడదు కాబట్టి మొదటి ఐదు పేజీలను అనువదించే భాధ్యతను నేను తీసుకుంటున్నాను. మిగతా భాగంలో భాగస్వాములుకావడం కోసం త్వరపడండి. మీ సలహాలు, సూచనల కోసం ఎదురుచూస్తూ..

******************************************************
Update1
(14th May 2011)
PDF output:
Englishలో వ్రాసిన స్క్రిప్ట్ అయితే celtxలో ఉన్న ‘Type/PDF’ ద్వారా PDFగా export చేసుకోవచ్చు. అదే తెలుగు లేదా వేరే ఇతర భాషలలో వ్రాసిన స్క్రిప్ట్‍ని PDFలోకి మార్చాలంటే ఈ option పనిచెయ్యదు. మీరు విన్దొవ్స్ వాడుతున్నట్టైతే cutePDF అనే driverని install చేసుకుని print tool ని వాడండి. printer drop down selection లో cutePDW write ని సెలెక్ట్ చెయ్యండి. అదే MAC OS/Linux అయితే print tool ని వాడి save as PDF’ అనే option సెలెక్ట్ చేసుకోండి.

saving to word file or any other text format:
ఇది ఒక అనవసర ప్రక్రియ. wordలోకి convert చెయ్యడం వల్ల celtx వాడడంవల్ల కలిగే ప్రయోజనాలన్నిటినీ కోల్పోతాం. ముఖ్యంగా formating. మీకు MS Wordలో వ్రాయడం సులభమనిపిస్తే celtx వాడాల్సిన పనేలేదు.

writing telugu scripts in Mac OS and Linux:
ఇది కొంచెం కష్టతరమైన ప్రక్రియ. windows లో barahaIME install చేసుకుంటే అది celtx లో కూడా పని చేస్తుంది. కానీ OSX/LINUX లలో ఇలా celtx లోపల పనిచేసే font writer ఏదీ నాకు తెలిసి లేదు. మీరు lekhini వంటి ఆన్లైన్ సైట్‍లు వాడి copy/paste చేసుకోవచ్చు. లేదా SCIM input method లాంటివి వాడి వేరే word అప్లికేషన్స్‍లో వ్రాసి copy.paste చేసుకోవచ్చు. లేదంటే Virtualboxని install చేసుకొని ఏదైనా windows light version install చేసుకొంటే barahaతో పాటు ఇతర windows applications కూడా వాడుకోవచ్చు.
మీకు ఓపిక ఉంటే నేను తయారు చేసిన అప్లికేషన్ ఒకసారి ప్రయత్నించొచ్చు. కానీ ఇది ఇంకా శైశవ దశలోనే ఉందని మనవి. ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Also checkout these 3 videos to understand more features.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

శంకర్

రచయిత:

36 Comments to “తెలుగులో స్క్రిప్ట్ రాయండిలా-celtx పరిచయం”

  • మంచి సమాచారం. నేను download చేసి చూసాను. celtix గురించి తెలియక ముందు మేము google spreadsheet వాడి script తయారు చేసుకొన్నాం ( మా ముఖ్య ఉద్దేశ్యం, “sharing, collaborative publishing”). ఇవి celtix లో కూడ సాధ్యమని అందులో ఉన్న context menu లు చూసిన తర్వాత అర్ధం అయ్యింది.

  • శంకర్ గారు, Final Draft కొందామా అని ఆలోచిస్తున్న సమయములో మీ టపా నా నిర్ణయాన్ని మార్చింది. Final Draft లో unicode support లేదని విన్నాను. Celtx ఒక వరం అవుతుంది. మీ వ్యాసానికి ధన్యవాదాలు.

  • యూనీకోడ్ ఉంటే ఇక దడదడలాడించడమే! ధన్యవాదాలు.

  • ఓహో, ఓపెన్ సోర్సు పరికరం! మంచి పరిచయం. రెండు మూడు తెరపట్టులు (screenshots) కూడా జతపరచి ఉంటే బాగుండేది.

    ఓపెన్ సోర్సు కనుక ఈ మృదుపరికరాన్ని తెలుగీకరించడానికి ప్రయత్నించవచ్చు. వారి భాషలలోనికి తెలుగుని చేర్చమని తెలుగు స్థానికీకరణకి నేను తోడ్పడతానని వారికి వర్తమానం పంపాను. చూద్దాం.

  • Thank you

  • Now let us translate it into telugu…

  • refering to above comment…i mean “Vinayakudu script”….

  •   just testing      

  • http://wiki.celtx.com/index.php?title=Category:Translating_Celtx

    ఎవరన్నా ఆసక్తి ఉన్న వారు ఈ మృదులాంత్రాన్ని తెలుగులో మార్చగలరు.

  • నేను నావంతుగా మొదటి సీన్‍ని ట్రాన్స్లేట్ చేసేసాను. తర్వాతి సీన్ ఎవరు చేయాలనుకుంటున్నారో చెప్తే వాళ్ళకు మొదటి సీన్ పంపిస్తాను. మిగతా సీన్లు కూడా అక్కడే జతచేస్తే కంటిన్యుటీ ఉంటుంది. మీరు ఇప్పటికే మొదలు పెట్టి ఉంటే జస్ట్ కాపీ పేస్ట్ చేయొచ్చు.

  • తెలుగు వెర్షన్ ఇక్కడ చూడొచ్చు. అలానే మీ ఫైల్‍ని కూడా అప్లోడ్ చేయొచ్చు.
    http://prakamya.org/elgg/pg/groups/280/-/

  • నమస్తే శంకర్ గారు ఇ పరికరం చల బాగింది కని కొన్ని ఉదాహరణ ఉంటే చల బాగుండెది సర్
    !

  • ee site chala bagundi

  • మామూలుగా నేను తెలుగు లో వ్రాయటానికి http://quillpad.in/editor.html ని వాడుతను, ఇది చాలా సులభం, ఇది అన్ని భారతీయ భాషలలో పనిచేస్తుంది, మన వెబ్‌సైట్ లో కూడా ఇన్‌స్టాల్ చెయ్యవచ్చు, తప్పు స్పెల్లింగ్ కొట్టిన పదం సరిపోతుంది, గూగల్ , మరికొన్ని ప్రముఖ వెబ్‌సైట్ లు దీని టెక్నాలజీ వాడుకుంటున్నాయి, విడ్జెట్ ద్వారా ఫ్రీ గా మన వెబ్‌సైట్ లో కూడా తెలుగు టైపింగ్ ఇన్‌స్టాల్ చెయ్యవచ్చు, ఉదాహరణకి చూడండి http://reddyyouth.com/blog.php?user=pulisreekanth&blogentry_id=1 దీనిని నేను ఇన్‌స్టాల్ చేశాను.

    ఉంటాను

    శ్రీకాంత్

    • moththaaniki nee site nee cool ga present chesaav kadaa!!!!

  • anthaa meeru cheppinattu chesaanu…but one problem…
    export script chesthe note pad lo save avuthundi…telugu text raavatledu…word file, telugu lo kavaalante em cheyali…

    • @వెంకట్: వర్డ్ ఫైల్ లో సేవ్ చెయ్యడానికి వీలుపడదు. అది compatible కాదు.pdf గా సేవ్ చెయ్యొచ్చు.

      • thanks for the reply…pdf lo elaa save cheyalo chepthaara

        • పిడిఎఫ్ గా సేవ్ చేయాలంటే అందుకు ఉపయోగపడే సాఫ్టువేరు
          యుటిలిటీ ని ముందుగా కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి.
          అలాంటి ఒక యుటిలిటీ cute pdf writer

          Celtx లేదా ఇతర సాఫ్టువేర్లలో ప్రింట్ కమాండ్ లో పైన
          పేర్కొన్న pdf print utility ని ఎన్నుకుని, మన
          అవసరం మేరకి ప్రింటింగ్ ప్రాపర్టీస్ మార్చుకుని pdf file
          గా సేవ్ చేసుకోవచ్చును.

  • Hai Mahesh..

    I have installed Anu Script Manager in my system. I am unable to write Telugu in celtx. you said using Unicode ,we can do wonders.. tell me ,how can i write in telugu in celtx. and about this unicode also..

  • Hai Shankar
    U said install Barahme software. after installing what to do to write telugu in celtx. tell me clearly how to write telugu in celtx step by step. Or after installing anu script manager if i need to write in telugu in celtx, tell me what to do ?

  • hai mahesh..
    Thank you so much

    can you tell me is there any way i can write in telugu in celtx using anu script manager apple keyboard option. ?

    • @సౌమ్య: You can use inscript and type/ Then paste it on to celtx and format settings

    • బరహా డైరెక్టు (/ఐఎమ్ఈ) ని ఉపయోగించగలిగే టైపింగు
      ఎడిటర్లలో / సాఫ్టువేరులలో ప్రముఖ్ ఐఎమ్ఈ కూడా
      చక్కగా పని చేస్తుంది.

      ప్రస్తుతం నవతరంగం సైటులో కుడివైపు పైన కనిపించే టైపింగు
      ఉపకరణం ప్రముఖ్ లైబ్రెరీ స్క్రిప్టు తో చేయబడినదే. ఇది బరహా
      లాగే సులువైన ఉపకరణం. కంప్యూటర్లో ప్రముఖ్ ఐఎమ్ఈ కోసం
      vishalon.net చూడవచ్చును.

      అలాగే ఆపిల్ కీబోర్డు లేఅవుట్ అలవాటు ఉన్నవారు వీవెన్
      రూపొందించిన ఆపిల్ కీబోర్డు మేపింగ్ వాడవచ్చు.

  • mahesh garu nenu alredy use celtex use chestunanu kaani meeru intha manchi concept mana kotha vallaku parichayam chesi dani gurchi anni vivaralu vallaku telapadam naaku chaala anandam ga undi ….meeru ee vishayam lo new comers ki chaala protsaqham istunaru n na trupununchi chaala trhanks

  • hai mahesh..

    I did n’t get you. can you please tell me clearly..where to write and where to paste ..please..

    • @సౌమ్య: http://tdil.mit.gov.in/keyoverlay.htm
      లో మీకు inscript సాఫ్ట్ వేర్ అలాగే కీబోర్డ్ లే అవుట్ దొరుకుతుంది. దానిలో ఉన్న ఒక html ఫైల్ సహాయంతో మీరు off line కూడా టైప్ చేసుకోవచ్చు. అక్కడ టైప్ చేసింది celtx లో పేస్ట్ చేసుకుని ఫార్మాట్ చేసుకోవచ్చు.

    • @ Sowmya,

      I use SCIM input method on Ubuntu. I presume same should work on Mac as both are unix based systems. Install SCIM from this site http://www.scim-im.org. Then go to any text editor or celtx right click(Cmd+click on Mac) and in drop down menu select ‘input methods > SCIM input method’. Then you should be able to use telugu. The procedure is for Ubuntu, I’ll try installing it on Mac this evening and can let you know if there is any thing different has to be done by tomorrow.

  • హాయ్..

    celtx లో తెలుగు లో రాసిన దాని font size పెంచుకొనే అవకాశం వుందా.. లేదన్నట్టు గా నేను చదివాను.
    ఒకవేళ ఆ సైజు మార్చాలనుకుంటే ..దానిని ms word లో కాపీ చేసుకోమని సలహా ఇచ్చారు మిత్రులు. అయితే..నేను ms word లో కాపీ పేస్ట్ చేస్తే..కేవలం బాక్స్ లు కనిపిస్తున్నాయి. office 2007 లో ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుందన్నారు. అదీ చేసి చుసాను. అప్పుడూ నాకు బాక్స్ లు గా నే వస్తోంది. ఇదే office 2007 లో మహేష్ గారు చక్క గా తెలుగు టైప్ చేస్తున్నాననీ, అదీ నేను వాదుతున్న barahaIME తో నే అని అన్నారు. నాకు మాత్రం ఇలా ఎందుకు వస్తుంది..office 2007 లో barahaIME సహాయం తో తెలుగు నేను టైప్ చేస్తుంటే నాకు కేవలం బాక్స్ లు గానే పడుతోంది. నా సమస్య కు పరిష్కారం తెలుపగలరు. మీరెవరైనా మరే రకం గా నైనా ..celtx లొ script లో font size పెంచారా..తెలుపగలరు.

    • you may have to install telugu fonts in your system, some thing like pothana.

    • regarding font size. Do you mean the output font size or the editor font size. The second is possible just by changing the display option from 100% to 200% on the top right corner. I don’t know how to format the output to bigger format. I will do some tests and will try to answer that later.

  • నేను అడిగేది అవుట్ పుట్ సైజు గురించే శంకర్ గారూ.. పి.డి.ఎఫ్ లో ప్రింట్ తీసుకొనేప్పుడు నాకు కొంచెం పెద్ద సైజు అక్షరాలు కావాలి. ఇవి బాగా చిన్న గా వుండి, చదవటానికి సరిగ్గా అనిపించటం లేదు..
    నాకు ఓ సందేహం.. మీరు డైరెక్ట్ గా ఎమ్.ఎస్ ఆఫీస్ 2007 లో sa అని టైప్ చేయగానే తెలుగు స అని వచ్చే విధం గా టైప్ చేయగలుగుతున్నారా..
    ప్లీజ్.. ఏమీ అనుకోకుండా ఆ 2007 software తో పాటు ఇంకా ఏమైనా అడిషినల్ గా install చేయవలసిన వి వున్నాయేమో కొద్దిగా చూసి చెప్పగలరా ..?

    • default celtx output size is courier 12. this is sdandard font size for some hollywood studios, and there is no way to change it. when you write in telugu it renders the fonts to match that size, so the output is fixed. Did you print to the PDF as I mentioned. It is big enough to read for me.

      regarding office 2007, I’m not sure if the Baraha input method works or not. Can you try this tool and let me know if thats any help. http://specials.msn.co.in/ilit/Telugu.aspx

  • sanakar garuu.. i installed that mIcrosoft indic telugu input . but i don’t know how to use it. because it is not there in my all programs list. please tell me after installing that what to do.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories