అందరమ్మల్లా అతని అమ్మ కూడా అక్షరభ్యాసం చేయిచింది.కాకపొతే చిన్న పలకమీద కాదు. వెండితెర మీద సినిమాను చూపించి.అందరు పిల్లల్లాగే అతను చిన్నప్పుడు పుస్తకాలను చదివాడు.కాని చిన్న పిల్లల కధల పుస్తకాలు మాత్రం కాదు. అర్థం కాకపొయినా కానీ చలం,శ్రీ శ్రీ లను తిరగేసాడు.
సెలవులకు హైదరాబాదు వచ్చి అందరూ చార్మినార్ చూసి ఏమైనా మారుతారో లేదో కాని అతను మాత్రం జె.యెన్ .టీ.యూ చూసి తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆధునిక భారతీయ సినిమాలో ఆజాద్ హింద్ ఫౌజ్ లాంటి ఫ్యాక్టరిని ని స్థాపించిన రాంగొపాల్ వర్మ వద్ద కలిసి పనిచేసి తన జీవితానికి అసలైన గమ్యాన్ని తెలుసుకున్న యువ దర్శకుడు పాము శ్రీను.ఈయన దర్శకత్వం చేసిన మొదటి సినిమా ‘ వేట ‘. ఈ నెల 23 వ తేది నాడు విడుదల అవుతుంది. ఆ సంధర్భముగా అతని జీవితం, సినిమా, మార్కెట్ అనుభవాలతో ఆత్మీయంగా….
తొలి గోరుముద్ద లా సినిమాను చూపించింది మా అమ్మ
ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే….
మహబూబబాద్ అని చిన్న ఊరు.మానాన్నది. ఓ చిన్న మిలటరి భొజన హొటల్. మా ఊరిలొ మాదే మొదటి హొటల్ కావడము తో చాలా బాగా నడిచేది.తరువాత మా నాన్న తాగుడికి బానిస కావడము ….మాఇంటిబాధ్యత అంతా మా పెద్దన్నయ్య నారాయణ తీసుకొవడం జరిగింది. హొటల్ నాశనము అయిపొయినది.
ఇక సినిమా పట్ల నాకు ఆసక్తి యెలా కలిగిందంటే…?.. మా అమ్మ కు సినిమాలు చాలా బాగా ఇష్టం. సినిమాల్లో మా అమ్మ కు యేం అర్థమవుతదో…నాకు తెల్వదు . కాని మా అమ్మ కొత్త సినిమా వస్తే చాలు వెల్లిపొయేది. యేప్పుడైన తొడువస్తే చుట్టుపక్కల వాళ్ళు వచ్చేవారు.
నేను మా ఇంట్లో అందరికంటే చిన్నవాడిని.కాబట్టి అమ్మ ఎటు వెలితే అటు వెళ్ళడం చెసే వాడిని. నాకు చాలా బాగా గుర్తు.బహుశా.. నా ఆరో ఏట అనుకుంటా.. నేను అమ్మ యెటువెలితే అటువెళ్ళటం అలవాటు కదా.అలానే అమ్మ ఫలాన థియేటర్ కి వెల్లిందని తెలిసి నేను వెళ్ళాను.ఒక సారి అమ్మ వెల్లి పొయి టికట్ట్ల కోసం.క్యూ లొ నిల్చుంది.ఆ రొజు థియేటర్లో బాగా రద్దీగా ఉంది. జనాలు కొట్టుకొంటునారు.ఆ జనాల మధ్యలో ఎక్కడో ఉంది అమ్మ. నేను చిన్న పిల్లాడిని కాబట్టి జింగ్ జింగ్ మంటు ఆ జనాల్లోదూరిపొయి ఎలాగో అలా అమ్మవద్దకు వెల్లిపోయా.ఆ జనం లో నేను థియేటర్ కి రావడం చూసి మా అమ్మ షాక్ అయింది.ఇక ఆ జనం లో వీడితో సినిమ చూడడం కష్టం అనుకుందో ఏమో కాని..ఆరొజు అమ్మ సినిమా చూడకుండానే ఇంటికి వచ్చింది. అలా… మా అమ్మా సినిమాను అంత ఎక్కువ గా ఇష్టపడటం వలన, బహూశా నేనూ సినిమా అంటే ఇష్టపడటం మొదలయ్యిందేమో! అలా సినిమా అంటే ఇష్టం యేర్పడ్డాని కి కారణం మా అమ్మే.
ఇక్కడ నుంచి ….
నాకు 8th class , నుంచే తెలుగు పుస్తకాలు చదవడం అలవాటయ్యింది. అది ఎలా అంటే..మా రెండొ అన్నయ్య కృష్ణ కాకతీయ యూనివర్సిటిలొ యం .ఏ చేస్తున్నాడు. ‘చలం’ ,’ కొకు’ , ‘ శ్రీ శ్రీ’ …ఇలా ఆయన చాలా చదివే వాడు.ఆయన లేనప్పుడు ఆయన గదిలొ వెళ్ళి…అర్థం కాకపొయిన నేను చదివే వాడిని..ఎందుకంటే చాల మంచిగ అనిపించేవి.
ఇలా పుస్తకాలను చదువుతున్న నన్ను చూసి మా అన్న తీసుకెళ్ళి పుస్తకాలను అద్దె కిచ్చే షాపు పరిచయం చేసాడు.అక్కడ నాకు, యండమూరి, మల్లాది ,ఇలా ఈతరం రచయితల పుస్తకాలు పరిచయం అయ్యాయి.
అందరికంటే ఎక్కువగా…యండమూరిగారి ..నీ పొరాటం నువ్వు చెయ్యాలి..అనే ‘ఆనందొ బ్రహ్మ ‘ నవల నా జీవితాన్ని మార్చేసింది. ఆ నవల చదివాక నాకు నేను ఇండివీడ్యువల్ గా మారిపొయా నన్ను నేను నిరూపించుకొవాలి నన్ను నేను నిలబెట్టుకొవాలి కదా..అని
అలా…వరంగల్ లో డిగ్రీ చేస్తుండగా, విజువల్ మీడియ మీద,తెలుగు లిటరేచర్ బుక్స్ ,నాటకాల మీద పిచ్చి మొదలయ్యింది. అలా ఒకసారి సమ్మర్ వెకేషన్స్ లొ హైదరాబాద్ వస్తే మా రిలేటివ్స్ లొ ఒకాయన జె. యెన్. టీ. యు లో ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నాడని తెలిసింది.అసలు అలాంటి ఒక కొర్సు వుంటుందని నాకు తెలియదు.ఆపుడు ఫొటొగ్రఫి పుస్తకాలు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఫొటోగ్రఫి ఒక art form లా అనిపించింది అదే మొదట సారి. ఎంట్రన్స్ రాస్తే సీటొచ్చింది. అప్పటి వరకు ఫొటోగ్రఫర్ అవ్వాలని జీవితం లొ ఎప్పుడు అనుకొలేదు. కాని మొదట ఇంట్లో ఒప్పుకొలేదు.”నువ్వు పోయి ఫొటొ లు తీయడం నేర్చుకోవడమెందుకు ఆ ఫొటొ ల షాపు ఏదొ ఇక్కడే పెట్టుకొ “అని అన్నారు.ఇక చివరికి ఎలాగో ” సరే పోరా” అని మా అమ్మ తన చెవిదిద్దులు తీసి ఇచ్చింది(సినిమాల్లో అమ్మ సెంటిమెంట్ లా
) కాని నేను అవితీసుకోకుండా ఒక ఫ్రెండు దగ్గర అప్పు తీసుకొని హైదరాబాదు వచ్చాను.
అక్కడ ఉండగా ఫస్ట్ సెమిస్టర్లొనే మా సీనియర్ ఒకతను వచ్చి ఒక అడ్వటైజింగ్ స్టుడియో లొ పనివుంది అంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయ్యాను. అలా అడ్వటైజింగ్ ప్రపంచం తొ పరిచయం అయ్యింది. కోర్సు కూడా అయిపొయింది.
అలా జీవితంలో ఫేడ్ అవట్ లు ఫేడ్ ఇన్ లు వేసాక…..
సీన్-రాం గొపాల్ వర్మ గారి మనసులో ఫస్ట్ ఇంప్రెశన్
ఆ సమయంలోనే సినిమా బ్రోచర్స్, పోస్టర్స్ ప్రింట్ చేసే లక్ష్మణ్ ఎలే పరిచయం అయ్యారు. అప్పుడు ఆయన రాం గొపాల్ వర్మ ‘ అనగనగ ఒక రోజు ‘ సినిమ పోస్టర్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. అప్పుడంతా కట్ అండ్ పేస్ట్. ఇప్పుడున్నట్లుగా ఇంకా ఫొటొ షాప్ అందుబాటులొ రాలేదు.
బొమ్మలన్ని కట్ చేసి స్ప్రే చేసే వారు. అది చూసి నేను “ఇదేంటి. ఇంతకష్టం అవసరం లేదు కదా.మామూలుగా మేము మల్టిపుల్ ప్రింటింగ్ చేస్తాము కదా.” అన్నాను. ఆయన ఆశ్చర్యముగా “అదేంటి అదెలా చేస్తారు” అన్నారు.
అప్పుడు ఆయన్ను లాబ్ కి తీసుకొచ్చి లైఫ్ సైజు ఫొటో గ్రాఫు ను మల్టిపుల్ ప్రింటింగ్ వెసి చూపించా. ఆయన ఆశ్చర్యపోయాడు. “అరే ఇదేదో బావుంది…లెట్స్ డూ ఇట్” అని మొత్తం ఆర్డర్ మాకిచ్చెసారు. చాల పెద్ద ఆర్డర్ తీసుకొచ్చానని అడ్వటైజింగ్లో మా బాస్ అంజి బాబు గారు చాలా ఆనంపడ్డారు. నన్ను పువ్వుల్లొ పెట్టిచూసుకున్నారు.
అలా లక్ష్మన్, నేను, అంజి బాబు గారు , రాత్రి పగలు అనే తేడ లేకుండా బాగ కష్టపడి ప్రింట్లు వేసే వాళ్ళం.అలా క్రమ క్రము గా రాము గారి ఆఫీసుకు వెళ్ళడం అలవాటయ్యింది. అలా రాము గారి దృష్టి లొ పడటం ఆయన పరిచయం కావడం జరిగినది.
దాని తరువాత ఆయన ‘ దెయ్యం ‘ సినిమాకు ఫొటొ సెషన్ చెయ్యమన్నారు. ” సరే సర్” అన్నాము.తెల్ల చీరలొ ఓ మోడెల్ ని తీసుకొని , ఓ పెద్ద స్మశానాన్ని రెంటుకి తీసుకొని బాగా కష్టపడి ఇరవై ముఫ్ఫయి రోల్స్ వరకు ఫొటొలు తీసాను. తరువాత ఆయనకు తీసుకెల్లి చూపిస్తే. ఆయన బాగా కోప్పడ్డారు. ఎందుకుతిట్టారా అని మొదట అర్థము కాలేదు. కధ ప్రకారం హిందు స్మశానము కావాలి , నేను తీసిన ఫొటొల్లో శిలువలున్న క్రిష్టియన్ స్మశానం కనిపిస్తుంది. ప్రతి ఫొటో లొ శిలువలు ఉన్నాయి.
కధ లొ వున్న అ చిన్న ముక్క. ఆ విషయం మనకు తెలియదు కదా.నేను చాలా నిరాకు గురి అయ్యాను. ఇక ఆ దెబ్బతో రాము గారితో పనిచెయ్యడం ఇక కష్టమేమో అని అనుకున్నాను. రాము గారికి ఒక సారి కొపము వస్తే జీవితములో మరొ సారి ఆ మనిషి మొహం చూడడు.అది ఆయన పధ్ధతి
ఇక ఆ రాత్రంతా బాగ కష్టపడి ఉన్నఫొటొల్లో కొన్ని తీసుకొని ఆ ఫొటొలతోనే, స్మశానము తెల్లచీరలోఓ దెయ్యం బ్లాక్ బ్యాక్ డ్రాప్ కాన్సెప్ట్ ఒకటి డెజైన్ చేస్తే అది లక్ష్మణ్ కి చూపిస్తే అయనకు నచ్చింది. వెంటనే అయనతో ‘దెయ్యం ‘ టైటిల్ రాయించి అప్పటికప్పుడు అంటే.. మీరు నమ్మండి నమ్మక పొండి. రాత్రి నాలుగు గంటల సమయములో మేము నిక్కర్లు లుంగీల మీదే ఓ పాత టీ వి యెస్ సుజుకి ఉండేది దానిమీదే ముగ్గరం అలానే వెళ్ళి పంజాగుట్టలో రాము గారి ఇంటి తలుపులు కొట్టాము.రాము గారి అమ్మగారు వచ్చి తలుపు తీసి మా వేషాలు చూసి భయపడ్డారు.
రాము గారు బయటకు వచ్చి చూసి బాగున్నాయి అని మెచ్చుకున్నారు. అది రాం గొపాల్ వర్మ గారి దగ్గర నాకు దొరికిన ఫస్ట్ బెస్ట్ ఇంప్రషన్.
కట్ చేస్తే
రాము గారికి నచ్చితే చాల బాగా చూసుకుంటారు. మంచి అవకాశాలు ఇస్తారు.కాబట్టి ‘దౌడ్ ‘ సినిమాకు స్టిల్ ఫొటో గ్రాఫర్ గా పనిచేసే రవిందర్రెడ్డి.(ఇప్పుడు ప్రెస్ ఫొటొ గ్రాఫర్ ) కి ఏదో యాక్సిడెంట్ కావడం తో అల్టర్ నేటివ్ గా నేను ‘ దౌడ్’ సినిమాకు స్టిల్ ఫొటో గ్రాఫర్ గా పనిచేసే చేసే అవకాశం వచ్చింది. సినిమా స్టిల్ల్స్ ఎలా తియ్యాలో నాకు తెలియదు. సినిమ స్టిల్ అంటే ఆపేసి తీసేది అని, అలా బొమ్మల్లా నిలబెట్టి పొజులు ఫొటొ లు తీస్తారనే విషయమే తెలియదు. నేను మాత్రం…
కెమేర ఎంత స్పీడుగ రన్ అవుతుందొ నా కెమేరా కూడ అంతే స్పీడు తో ఫొటో లు తీసాను.నేను తీసిన అన్ని ఫొటొ లు అలా పేర్చుకొని చూస్తే సీను మొత్తం కనపడేది. నేను అలా తీస్తూ వెళ్ళిపోయాను నా పధ్ధతిలో .అది చూసి రాము గారు చాలా బాగా ఇంప్రెస్స్ అయ్యారు. అలా రాము గారు చాల క్లొజు అయిపొయారు. అలా వరుసగా ‘దౌడ్ ‘ ,’ సత్య’ ఇలా దాదాపు నాలుగు సంవత్సరాలు బాంబే లో ఉన్నాను.
నాకు దర్శకత్వం నేర్పిన సినిమా ‘సత్య ‘
‘సత్య’ సినిమా షూటింగ్ మొదలయింది. అసలప్పుడు మేమెవరం ఇంత ట్రెండ్ సెట్టింగ్ సినిమా అవుతుందని అనుకోను కూడ అనుకొలేదు.ఆ సినిమాకు పనిచేసేటప్పుడు రాము గారు ఓ సారి చెప్పారు, “ఎటువంటి పరిస్థితుల్లోను ఈ సినిమాలో ఒక్క ఇమేజ్ కూడ వదలొద్దు” అని.”ఒక వేళ నేను కుదరదు వద్దు అని చేప్పినా కాని నన్ను పక్కకు తొసేసి నువ్వు తీసెయ్యి” అని చెప్పారు.
అలా షూటింగ్ లొ ఫొటో లు తీయ్యడం తొ పాటు నేను ఇంటికొచ్చి నా పర్సనల్ ఇంటరెస్టు తో ఆ రోజు జరిగిన వాటిని షాట్ బై షాట్ రాసుకునే వాడిని. అలా సత్య సీనిమా మొత్తం చేసుకున్నా.షూటింగ్ లో రాము గారు ఎప్పుడూ కొత్త యాంగిల్స్ డిస్కస్ చేసే వారు. అలా రాము గారితొ చేస్తూ వుండడం వలన ఒహొ డైరెక్షన్ అంటే ఇది అని నాకు అర్థమవుతూ వచ్చింది.నటులతో ప్రొడక్షన్ తో, ఇలా డీల్ చెయ్యాలి. కధను ఇలా డీల్ చేయ్యాలి.స్క్రీన్ ప్లే అంటే ఇలా రాసుకొవాలి. అలా అన్నీ రాము గారిని చూసి నేర్చుకున్నాను.
‘ ఏ నాడు నేను ఆయనకు డైరెక్షన్ ఇంటరెస్టు ఉంది సర్ “అని చెప్పలేదు. కాని ఒకరోజ ఆయన అసిస్టెంటులకు తెలిసాక నన్ను ఆటపట్టించే వారు. ఆయన ఓ సారి “నీకు ఈ పిచ్చి పట్టిందా” అని అడిగారు. దాని తరువాత ‘ ప్రేమ కధ ‘ సినిమా కు కూడ అలానే ప్రాక్టీస్ చేసా. అలా నేను దర్శకుణ్ణవ్వాలని నిర్ణయించుకున్నాను.
అసిస్టెంట్ డైరెక్టర్ గా….ఎంట్రీ
సరిగ్గా అదే సమయములో ఇక్కడ హైదరాబాదులో దాము( బాలాజి అసలు పేరు.) అని మిత్రుడు డ్రీంస్ అని ఒక సినిమా మొదలు పెట్టాడు. ఆయన స్వతహాగ కవి , చాలా చాలా మంచి వ్యక్తి. కొత్త డైరెక్టరు, కొత్త యూనిట్. దానిక్కూడ లక్ష్మణ్ ఆర్ట్ డైరెక్టర్.నా డైరెక్షన్ ఇంటరెస్టు తెలిసిన లక్ష్మణ్ ‘సరే ‘ అని అయన వద్ద చేర్పించాడు.అప్పటికి ఆయన వద్ద 8 మంది అసిస్టెంట్ దర్శకులు వున్నారు. నేను డిగ్రి నుండి ’ప్రేమ కథ’ వరకు తీసిన నా వర్క్ స్టిల్ల్స్ అన్ని ఒక పెద్ద బాక్సులొ వేసుకొని అన్ని ఆయనకు చూపించాను. అవన్ని చూసి ఆయన చాల ఇంప్రెస్స్ అయ్యి ఫొటొగ్రఫి చేయ్యొచ్చు కదా అన్నారు అది వద్దనుకొనే నేను వచ్చాను అని చేప్పెసాను. డైరెక్షన్ డిపార్ట్ మెంటులో ఉంటాను అని చెప్పాను, ఆయన సరె మరి ఆయన సాలరీ ఏమి ఇవ్వలేను అని అన్నాకూడా సరే అని జాయిన్ అయిపొయాను.
కాని ఆయన మాత్రం మరి స్టిల్స్ కూడ నువ్వే తియ్యి దానికి మాత్రం ప్రొడ్యూసర్ డబ్బులిస్తాడు అంటే సరే వచ్చిన డబ్బులు చెరి సగం పంచుకుందామని చేప్పి ఫొటొలు తియ్యడానికి నా జూనియర్ అయిన డేవిడ్ ను పిలిచాను.నేను డేవిడ్ కల్సి అసిస్టంట్ డైరెక్టర్ గా మరియు స్టిల్ ఫొటొగ్రాఫర్ లు గా చేసాము.నాకన్న ముందున్న అసిస్టంట్ డైరెక్టర్లు అప్పుడు బయట సీనియర్స్ కాబట్టి నాకు సినిమ రాజకీయాలన్ని చేప్పెవారు. నాకు ఈ పిచ్చి రాజకీయాలన్ని ఏంటో అర్థం అయ్యేవి కావు. నాకు సినిమా అంటే పిచ్చి కాబట్టి సీనిమా సెట్స్ పైనా జునియర్ ఆర్టిస్టులకు ఎవరన్నా పొరపాటున అడిగితే నేను వారికి అన్ని విషయాలు ఎలా నటించాలి ఏంటి అనేది మొత్తం చేప్పేవాడిని..ఇదంతా డైరెక్టర్ బాలాజి గారు గమనిస్తున్నారన్న విషయం నాకు తెలియదు. అలా సినిమా జరుగుతుంది.సాంగ్స్ స్టేజ్ కి వచ్చేసరికి నేను ఆయన చాల క్లొజ్ అయిపొయాం.
ఆ ప్రొడ్యూసర్లతొ..ఆయన ఏవో గొడవల్లో బిజి గా ఉండి సాంగ్స్ తీసె బాధ్యత నాకు ఇచ్చారు. నాకు అది చాల పెద్ద విషయం ఎందుకంటే అసిస్టంట్ డైరెక్టర్ గా జాయిన్ అయిన మొదటి సీనిమాకే ఇలాంటి అవకాశం రావడం చాల పెద్ద విషయం.
ప్రతి ఫ్రేం చాల చక్క గ ఉండాలి అని 24 గంటలు బాగా ఆలోచించి చాల కష్టపడి ఆ సినిమాకు సాంగ్స్ తీసాను.అలా ఆ సినిమాను పూర్తి చేసాము.
ఈ మధ్యలొ ఒక ఫ్రెండు వచ్చి ప్రైవేటు సాంగ్స్ ఆల్బం చేద్దామంటే చేసాము.అదే సమయములో హైద్రాబాద్ బ్లూస్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా చాలా ఇన్స్పైర్ చేసింది.ఎందుకంటే పెద్దగా లైటింగ్ ఏమి వాడకుండా ఖర్చు ఏమి లేకుండా కొత్త ఆర్టిస్టులతొ చేసి కూడ హిట్ చేయ్యొచ్చు అని అది నిరూపించింది.
అప్పుడు చక్రి అనే ఒక ఫ్రెండ్ రమణ అని ఒక ఫ్రెండ్ ని తీసుకొచ్చాడు. ‘లైఫ్’ అనే సినిమా పేరు తొ మొదలెట్టాము.స్క్రిప్ట్ మొత్తం రాసుకున్నాము. తరువాత మ్యూజిక్ డైరెక్టరు ఎవరిని తీసుకుందాము అని అలొచిస్తూండగా మిత్రుడు సిధ్ధార్ధ (పవన్ కల్యాణ్ క్రియేటివ్ టేములొ పనిచేసి ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ.. వరంగల్ హెడ్ గా ఉన్నారు) ఆయాన మన చక్రి కూడ సినిమా అవకాశాల కొసం తిరుగుతున్నాడు కదా అని అంటే అవును నిజమే అని 5 లక్షలు ఖర్చు చేసి చక్రి సారధ్యం లొ ఓ ఆరు పాటలు రికార్డ్ చేయించాము.
అంతలొ మా ఫ్రెండు డైరెక్టరు రమణ కి ఎవరో ఒక ప్రొడ్యూసర్ కల్సితెలుగులో కాదు హిందిలో చేద్దామని బాంబే తీసుకెల్లాడు.ఇక ఈ రికార్డింగ్ చేయించిన ఈ తెలుగు పాటలు అవసరం లేదు. అప్పుడు చక్రి ఆ అల్బం తీసుకెళ్ళి పూరి కి వినిపించాడు. అప్పుడు పూరి బాచి సినిమా తీస్తున్నాడు. ఆ పాటలు విన్నపూరి చక్రి కి అవకాశం ఇచ్చాడు.అలా మా టీంలో చక్రి మొదట క్లిక్ అయ్యాడు.
డిజిటల్ ఫిల్మ్ ప్రయోగాలు
తరువాత అప్పుడే డిజిటల్ ఫిల్ములు అనే కాన్సెప్ట్ మొదలైంది. మన దగ్గరున్న కధలు సినిమాలుగ తియ్యలంటే ఒక నిర్మాతని ఒప్పించాలి.అదంతా లేకుండా ఒక డిజిటల్ కెమేరా తీసుకొని స్వతంత్రముగా మన ఫిల్ములు మనమే తీసుకుందాము అని ఆ ప్రయత్నం మొదలు పెట్టాము.
అనంత్ అనే ఒక మంచి ఫ్రెండ్ దర్శకత్వం లో ఆయన రాసిన కధని ఒక అధ్భుతమైన సర్రియలిజం కధ తో “చేద ” అనే డిజిటల్ ఫిల్మ్ ఒ అరునేలలు కష్టపడి చేసి సారధి స్టూడియో లో డిజిటల్ ఫిల్ముల ప్రదర్శనలో ప్రివ్యూ వేస్తే జనానికి అర్థం కాలేదు. శరత్ అని అనంత్ ఫ్రెండ్ 2లక్షలు ఖర్చు చేసారు ఈ సినిమా కోసం
సొ అలా డిజిటల్ ఫిల్మ్ ల వలన కూడ ఏమీ లాభం లేదని మళ్ళీ మేయిన్ స్ట్రేం సినిమాల మీద పడ్డాము.
మాలో విపరీతమైన సంఘర్షణ మొదలయ్యింది ఈ క్రమములోనే పెళ్ళికావడము ఇంకా బాధ్యత లు పెరిగాయి. కాని రెగ్యులర్ సినిమా కధలు మేము రాయలేక పొయే వాళ్ళం.ఒక హీరో పదిమందిని కొడితే గాల్లో ఎగరడం ఇలా చెప్పలేక నిర్మాతల వద్ద ఫెయిల్ అవుతూ వచ్చాము. అలా అవతల కధ వినే ప్రొడ్యూసర్ కి సినిమా గురించి తెలిసి ఉండాలి అని అనులోవడం తప్పే అని తెలిసింది. ఇప్పుడు మనం ఏమైనా చెబితే ఏ ప్రొడ్యూసరు నేర్చుకోడు..కాబట్టి జనానికి ఏది నచ్చుతుందో అది తియ్యాలి అని నిర్ణయించుకున్నాము. మంచి కమర్షియల్ సినిమా కధ కొసం మొదలు పెట్టాలని అనుకున్నాము.
డబ్బుల కోసం జీవితం గడవడం కొసం మాత్రమే మళ్ళీ కో డైరెక్టరు గా కుమార్ వర్సెస్ కుమారి సినిమా చేసాను. అప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ రాజేష్ గారికి నామీద మంచి నమ్మకం కుదిరింది.ఆ సినిమాతో ఆయనకు చాలా లాస్ వచ్చింది.
‘వేట ‘ సినిమా ప్రారంభం.
మళ్ళీ ఓ మూడునెలల తరువాత ఆయన ఫొను చేసి ఒ యాభై లక్షల్లో సినిమా చేద్దామంటే ఆయనకు ఓ చిన్న కధ చెప్పాను. అది ఆయనకు చాల బాగ నచ్చింది. ఆయన 20,000 అద్వాన్సు గా ఇచ్చేంతవరకు కూడ నేను ఒక్క అక్షరం ముక్క కూడ రాయలేదు. ఎందుకంటే అంతకుముందు చాల మంది ప్రొడ్యూసర్లకి కధలు చెప్పడం కధలు రాయడం చేసినా ఎవరు డబ్బులు ఇయ్యకా సినిమా అవకాశాలు ఇవ్వక విసుగు వచ్చింది.అడ్వాన్స్ ఇచ్చేంతవరకు కధ రాయడం మొదలు పెట్టలేదు.కరక్టుగా పదిరొజుల్లో స్క్రిప్ట్ పూర్తి చేసాను.
ఎట్టి పరిస్థితుల్లొనూ ఈ సినిమాకు ఆయన పెట్టిన డబ్బులు పొవద్దు అని ఒకే ఒక లక్ష్యం తొ ఈ సినిమా ను చేసాను. ఎందుకంటే కుమార్ వర్సెస్ కుమారి సినిమాతొ ఆయన చాల పొగొట్టుకున్నారు. మళ్ళీ ఈ సినిమా పొతే ఆయన మళ్ళీ రొడ్డుమీదకు వస్తారు. కాబట్టి ప్రొడ్యూసర్ సేఫ్ కావాలి అని సినిమా చేసాను మొదట.
ఇది నా మొదటి సినిమా చాలా అద్భుతముగా నన్ను నేను నిరూపించుకొవాలి అనే ఛాలెంజులు ఏమీ లేకుండా అంతా చాల శ్రధ్ధగా చాల పకడ్బందిగా చాలా మంచి కో ఆపరేషన్ తొ సినిమా పూర్తిచేసాము. లైట్ బాయ్ నుంచి హీరో వరకు అంతా మంచి గా సప్పొర్ట్ చేసారు. అందరు ఈ సినిమా మా ప్రాణం అనుకొని చేసారు.
మొత్తనికి … మొదటి కాపి వచ్చింది..
చిన్న సినిమా మార్కెటింగ్ కష్టాలు…
మా సినిమా ఒక థ్రిల్లర్ . పాటలు లేవు.ఇప్పుడు నాకు సినిమా దర్శకత్వం చేయ్యడం ఒక ఎత్తు దానిని మార్కెట్ చేయ్యడం మరొ ఎత్తు అని చిన్న సినిమాకు ఉన్న అసలైన కష్టాలు తెలిసాయి. సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్లంతా ఇందులో పాటలు లేవని, ఫైట్లు లేవని, కొంతమంది ఇందులొ పెద్ద స్టార్ క్యాస్టింగ్ లేదని ఇలా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పిపోవడం మొదలైంది. మొట్టమొదటి సారి ఫిల్మ్ మార్కెట్ ఇంత దారుణముగా ఉంటదా అని తెలిసి నేను బాధపడ్డాను. బాలాదిత్య,చిత్రం శ్రీను, బాబు మొహన్, నర్సింగ్ యాదవ్ ఇలా మంచి నటులు ఉన్నా కాని ఇంకా పెద్ద ఆర్టిస్టులు లేకపొతే మార్కెట్ ఉండదని తెలిసి చాల షాక్ అయ్యాను. ఇప్పుడున్న తెలుగు సినిమా మార్కెట్ ఏంటంటే ఒక జగపతి బాబు, ఒక శ్రీకాంతుల రేంజు నుంచి మొదలవుతుంది. ఇంకా కొత్తవాళ్ళతొ ఐతే ఒక హ్యపి డేస్ , వినాయకుడు లాగా అయితే అది వేరుగా ఉంటది.ఎందుకంటే ఒక ఎక్స్పెక్టెషన్ ఉంటుంది కాబట్టి. కాని ఇలా ఒక రేంజు కు కిందున్న వాళ్ళతో తీస్తే మార్కెట్ చాలా కష్టం అని తెలిసొచ్చింది.
ఇలా ఒకదాని తర్వాత ఒకటి….
బాలాదిత్యా ని పొస్టర్ మీద వెయ్యడం కన్నా హ్యపి డేస్ లాగ కొత్త కుర్రొళ్ళ పొస్టర్లని వేస్తే లాభమని తెలిసింది. సినిమా బాగుంది, చాల చక్కగా తీసారు, అని అన్నారు కాని రిలీజు కు ఎవరు ముందుకు రాలేదు. అప్పుడనిపించింది సత్యజీత్ రే లాంటి వాళ్ళు ఎలా కష్టపడ్డరో కదా అని. ఒక డిస్ట్రిబ్యూటర్ అనే వాడు సినిమా చూసే పధ్ధతి వేరు అని తెలుసుకున్నాను. చాల వరకు కమర్షియల్ అంశాలనే వాళ్ళు చూస్తారు. తప్పిస్తే చాలా మంది కి సినిమాలో ఉన్న కంటెంట్ అవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్ కొసం కధల్ని మార్చుకొవాల్సిన పరిస్థితి ఇలా తీస్తే వాళ్ళకు నచ్చదేమో అని మనల్ని మనం చంపుకొవాల్సిన అఘాయిత్యం ఏర్పడుతుంది.
ఇది నా ఒక్క విషయమే కాదు ప్రతి కొత్త డైరెక్టరు ఫేస్ చేస్తున్నాడు. ముఖ్యముగా చిన్న సినిమాలకు. కొత్తదనం చూపాలి అనుకుంటే శేఖర్ కమ్ముల లాగానో వర్మా లాగానో సొంత డబ్బులుంటే నొ ప్రాబ్లం.
చిన్న సినిమా ల పరిస్థితులు
చిన్న సినిమా నిర్మాతలు ఈ మధ్యన ఫిల్మ్ నగర్ లొ ధర్నా చేసారు అని అందరికి తెలిసిన విషయమే.కాని ఎందుకు చేసారో చాలా మందికి సరిగా తెలియదు. సురేష్ గారు, దిల్ రాజు గారు, ఇంకా మరికొందరు ఇలా పెద్ద నిర్మాతల చేతుల్లొనే అన్ని ధియేటర్లు ఉన్నాయి.మాకు ధియేటర్లు ఖాలీగా లేవు, ఉన్నా కాని అంత అంత రెంట్స్ కట్టుకుంటూ సినిమాను నడిపించుకొనే స్థితిలో మేము లేము అని షేరింగ్ లొ అయితే మేము చేయ్యగలము అని డిమాండు చేసారు.
ఇది అందరికి తెలిసిన విషయం.
కాని మామూలు ప్రజలకి ఈ గోల అర్థం కాలేదు.విషయం ఏమిటంటే మనము ఒక సినిమాను ఆడించుకొవాలంటే ఒక థియేటర్ను అద్దెకు తీసుకొవాలి. ఆ అద్దే వచ్చేసి ఒక మంచి థియేటర్ అయితే ఒక వారానికి లక్ష రూపాయలనుంచి లక్షన్నర వరకు ఉంటుంది. మొదట ప్రొడ్యూసర్ , ఈ డబ్బుని మొదట కట్టాలి తరువాత పబ్లిసిటీ చెసుకొవాలి. తరువాత మేయింటనెన్సు చూసుకొవాలి. తరువాత ,థియేటర్ వాళ్ళు మోసం చేయ్యకుండా కలెక్షన్లు చూసుకొవాలి. ఇదంతా చేస్తే ఒక చిన్న ప్రొడ్యూసర్ కి ఏమి మిగులుతుంది? ఊరు పేరు లేని కొత్త హీరొ తొ మీరు ఒక సినిమా తీసారు, ఊరంతా ఓ వంద పొస్టర్ లు పెట్టారు. ఎందుకొస్తారు జనం.మొదట గ్యారంటి గా రారు. పది మందో ఇరవై మందో వచ్చి సినిమా చూసి బావుంది అంటే మరొ వంద మంది వస్తారు. ఈ వందమంది ఎప్పుడొస్తారు మీకు? థియేటర్ ఎప్పుడు ఫుల్ అవుతుంది.అయినా కూడా ప్రొడ్యూసర్ ఈ వారం మొత్తం కట్టాల్సిందే. ఇది ఒక్క థియేటర్ గురించి నేను చేప్పేది. ఇలా స్టేట్ వైడ్ గా ఒ ఇరవై ధియేటర్లలొ వేసారు అనుకొండి.ఇరవై లక్షలు కట్టాలి.అంటే జనానికి మీది మంచి సినిమా అని తెలవడానికి మొదటి వారం సినిమ హాలులొ ఉంచాలంటే ఇరవై లక్షలు కట్టాలి అంటే ఆ ఇరవై లక్షలు పొయినట్లే. ఇప్పుడు ఎంత చిన్న సినిమా చేసినా కూడా కనీసం 60 ,70 లక్షలు అవుతాయి.అంటే 60 లక్షలతో ఒకరు సినిమా తీసి ఇలా థియేటర్ల అద్దెలుకట్టి పబ్లిసిటీ చేసుకొనే సరికి ఎంతవుతుంది.కనీసం ఒక కొటిన్నర అవుతుంది. ఇలా వుంటే చిన్న ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి?
సినిమ హిట్ అవుతే బతుకుతాడు.లేకపొతే అంతే. మీరు తీసిన సినిమా చాల మంచి సినిమా అని టాక్ వచ్చింది. చూడాలంటే సినిమా థియేటర్లో ఉండాలికదా.ఈ రెంటు సిస్టం తీసెయ్యండి. మేయింటనెన్సు చెరిసగం కట్టుకుందాము. ఉదాహరణకు మొదటి రొజు కలేక్షను ఓ అయిదు వేలు వచ్చిందనుకోండి అది షేర్ చేసుకుందాము. 30% :70% ,లెక, 60% 40%, అనో. అది చాల బాగుంటుంది. చిన్న నిర్మాతలకు మంచిది. క్షేమము గా ఉంటారు.ఇందులొ విజయం సాధించారు సంతోషం. నిజం చెప్పాలంటే ఇది పెద్ద సినిమాలకు కూడ మంచిదే.ఇప్పుడు భయపడకుండా చిన్న చిత్రాల నిర్మాణం చాల చక్కగా చేయ్యొచ్చు. చిన్న సినిమా నా పెద్ద సినిమా అనేది కాకుండ ఏ కధ చేస్తున్నాము అనేది ముఖ్యం.
రేపటి దర్శకులు కావాలనుకుంటే…
ఒకటి.
ముఖ్యంగా కధా మీద పట్టువుండాలి. అంటే…..లాజిక్. అది ఎలా వస్తుంది అంటే..సాహిత్యం మీద కొద్దొ గొప్పోఅవగాహన ఉండాలి.కనీసం మన తెలుగు రచయితల రచనలు అయిన చదివి ఉండాలి. లిటరేచర్ లెకుండా సినిమా లేదు అనేది నా అభిప్రాయం. డైరెక్టర్ దగ్గర పనిచేసినా అసిస్టెంట్ పనులతొ పాటు అబ్జర్వ్ చెయ్యండి. అసిస్టెంట్ పనులు అందరు చేస్తారు.దానితొ పాటు కేవలం మీరు లైఫ్ లాంగు కొ డైరెక్టర్ గా ఉండాలనుకుంటే మీకు మేనేజ్మెంట్ వస్తే చాలు.
రెండు
మార్కెట్ ను గమనించండి.ఏ సినిమా ఎంతకు అమ్ముడుపొతుంది ఎందుకు అమ్ముడుపొతుంది తెలుసుకోండి. రాము గారు ఒక సారి చేప్పారు, ఫ్యూచర్ లొ జీరొ రిస్కు బేసుడు సినిమాలు వస్తాయని. అంటే మరేం లేదు , ఒక ప్రాజేక్టు అనుకుంటే ,దానికి ఎంత మార్కెట్టు ఉంది అనేది ముందే బేరీజు వేసుకుటే ఆ మార్కెట్టు కు లొబడే నువ్వు బడ్జెట్ ను డిజైన్ చేసుకొని ఆ బడ్జెట్ మీద కధ రాసుకొని సినిమా తీయడం. ఇది అసిస్టంట్ డైరెక్టర్లు ఇప్పటినుంచి ప్రాక్టీస్ చేస్తే మీకు అవకాశం వచ్చేనాటికి ఒక క్లారిటి వస్తుంది. అప్పుడు మీ ప్రొడుసర్ సెఫ్ హ్యండ్స్ లొ ఉంటాడు.
మూడు.
ప్రతి ఐడియాను ఎప్పటికప్పుడు రాసుకొండి. చర్చిస్తుండండి. స్క్రిప్ట్స్ ఇప్పటినుంచే రాయడం మొదలుపెడితే రేపు మీ ఒక సినిమా అయినాక మీవద్ద మరో నాలుగు స్క్రిప్ట్స్ సిద్ధంగా ఉంటాయి లేకపొతే మీ వద్ద తీసిన ఒక్క సినిమ స్క్రిప్ట్ మాత్రమే ఉంటుంది. మాదంతా సినిమా ప్రపంచం. సినిమాలో బతుకుతాము అనికాకుండా చుట్టూ సమాజములొ జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకొండి.సమాజము లేకుండా సినిమా లేదు.
నాలుగు
ప్రతిఒక్కరికి కూడాను రామాయణం మహాభారతము తెలిసివుండాలి.
అయిదు
మీ శ్రమ
సినిమా సక్సెస్ అంటే…
సినిమా హిట్టు అనేది ట్రేడు వర్గాలమీదనే ఆధారపడి వుంటుంది. సినిమా ను ఎంతలొ తీసారు? ఎంతకు అమ్మారు? ఎంత కలెక్ట్ చేసింది? అనే ఈ మూడు విషయాలమీదనే అంతా ఆధారపడి వుంటుంది.సక్సెస్ అనేది డబ్బుతొ ముడిపడివున్న విషయం అందులొ అనుమానమే లేదు. కమర్షియల్ సినిమా ఆర్ట్ సినిమా లేదు . కేవలం మంచి సినిమా చెడ్డ సినిమా అంతే.మంచి సినిమా అంటే జనాలు ఎక్కువగ ఇష్టపడ్డది. అంత మాత్రాన అది గొప్ప సినిమా అని చేప్పలేము. ఇప్పుడు పధేర్ పాంచాలిని రిలీజు చేస్తే హౌస్ ఫుల్ కాకపొవచ్చు. ప్రక్కన థియేటరులొ పొకిరి సినిమా వేస్తే పొకిరి హౌస్ ఫుల్ అవుతుంది. ఏందుకంటే పధేర్ పాంచాలిని సినిమా చూడాలనుకుంటే ముందు మనకు టేస్టు ఉండాలి, నాలెడ్జు ఉండాలి ముఖ్యంగా అర్థం చేసుకునే మనసు ఉండాలి. పొకిరి లాంటి సినిమాలు చూడాలంటే ఇంతగొడవవుండదు. అంతమాత్రాన పధేర్ పాంచాలిని మంచి సినిమా కాదని చెప్పలేము.
భవిష్యత్తు
మంచి సినిమాలు తియ్యాలని.
మీకు, నవతరంగానికి కృతజ్ఞతలు. చాల చక్కటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్
విజయవర్ధన్ says:
సైఫ్ గారు,
చాలా బాగా వ్రాసారు. ఇప్పటి సినిమా నిర్మాణంలో వున్న సాధక బాధకాలు అందరికి అర్థం అయ్యే లాగా బాగా వ్రాసారు. పాము శ్రీను గారికి ధన్యవాదాలు వారి అనుభవాలను పంచుకున్నందుకు. అలాగే వారి మొదటి సినిమా “వేట” విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.
విజయ్
Somasekhar, Mahaboobnagar says:
@విజయవర్ధన్,
Vijay garu
meerintha baga reply ichcharante py matter antha chadive untaru, nakantha opika ledu kani mee meeda nammakam undi. meelage nenu korukuntunna.
somasekhar, mahaboobnagar.
ceenu says:
@vijayvardhangaaru…,ఎప్పుడో రాయవలసిన బయోగ్రఫి ఇప్పుడే రాసేస్తే శీను తర్వాత తీసే సినిమాలకు రాయడానికేమి మిగలదేమో
చందు says:
మంచి పరిచయ వ్యాసం సైఫ్ గారు. కాకపోతే “రేపటి దర్శకులు కావాలనుకుంటే…” గురించిన విషయాలు ఇంత తొందరగా చెప్పకూడదేమో!!
ఆల్ ది బెస్ట్ శ్రీను. RGV శిష్యుడు అనిపించుకోవాలి అని ఆశిస్తూ..
కె.మహేష్ కుమార్ says:
ఇన్ని నిజాలు ఇండస్త్రీలో ప్రవేశించకుండానే నవతరంగం పాఠకులు తెలుసుకుంటున్నారు. ఇంత కంటే education మరోటి లేదు.
రమేష్ పంచకర్ల says:
దర్శకుడు పాము శ్రీను అనుభవాలను శ్రీ సైఫ్ అలి గొరే సయ్యద్ గారు చాలా చక్కగా అక్షరీకరించారు.
చిన్న సినిమా మార్కెటింగ్ కష్టాలు, చిన్న సినిమాల పరిస్థితులు యథాతధంగా వివరించి సినిమా అంటే రంగుల ప్రపంచం ఒక్కటే కాదు అని “నవతరంగం” సభ్యులకు తెలియచెప్పిన తీరు ప్రసంశనీయం.
Jonathan says:
Hi srinu,
‘Veta’ success avvalani korukotunnanu….good luck
శ్రవణ్ says:
మంచి అర్టికిల్. చాలా ఇంఫర్మేటివ్‌గా వుంది. ఇండస్ట్రీ గురించి తెలిసీ తెలియకుండా నేను రాసిన పోస్టు “సినిమా తీద్దాం రా!” ఇక్కడ చదవగలరు.
http://sraavanam.wordpress.com/2008/03/20/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%A4%E0%B1%80%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BE%E0%B0%82-%E0%B0%B0%E0%B0%BE/
shree says:
“ఇర్వై సంవత్సరాలు గా Industry లో వున్నాను…నన్నే Football ఆడుకున్నారు… Tollywood లో మాఫీయా నడుస్తుందని…చిన్న నిర్మాతలు బ్రతకడమే కస్టంగా వుందని…తన కొడుకు సినెమా ప్రదర్షనలో చాలా ఇబ్బంది పెట్టారని బాబు మోహన్ ఏడుస్తు media ముందు చెప్పడం నీనింకా మర్చిపొలేదు… కాని అసలు అక్కడ ఏమి జరిగిందో ఈ వ్యాసం చదివాక clear గా అర్దం అయ్యింది”
ఇంతకి ఆ సినెమా “సమ్మక్క–సారక్క మహత్యం”.
థేంక్స్ సైఫ్ , నాకైతే “టాలివుడ్” Postmortem రిపోర్ట్ చదువుతున్నట్టుంది….
రామేశబాబు says:
సినీ ప్రపంచం లో చక్కని స్థానం కోసం మీరు సాగించే “వేట” విజయం పొందాలని ఆశిస్తూ
Kasyap says:
ప్రతిఒక్కరికి కూడాను రామాయణం మహాభారతము తెలిసివుండాలి. — A Base Story
.
Jonathan says:
Hi srinu…..
Meee movie ni ela chhudagalanu…..hyd lo e theater lo releasing ayyindi??? plz telupa galaru…..
sivaji says:
ventane cinema chustha, veta konasaginchandi..all the best…sivaji // if possible give directors mail id for riview
శివాజీ says:
తెలుగు సినిమా వ్యపారం ఎలా జరుగుతుందొ…అక్కడ రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో నవతరంగంలొ రాస్తే బావుంటూంది కదా pamu srinu garu…శివాజీ
శివాజీ says:
మీలాంటి యువదర్శకులు టాలెంట్ పూల్ ఠయారు చెయ్యొచు కదా?
కుక్క కాటుకు చెప్పు దెబ్బలా.రాజకీయాలకు చెక్ పెట్టడానికి వేరె రూట్ కనిపెట్టొచ్హు కదా?..sivaji
మురళి says:
మంచి పోస్ట్ సైఫ్ గారు. పాము శ్రీను గారు మీకు ఆల్ ది బెస్ట్..
ravi says:
tega nachavu guru mana cinemalakashtala gurinchi chala baga cheppav
Satya SKJ says:
ప్రతి పుస్తకానిక్ సంపుటి ఉన్నట్తు అలి గారి …..తొలి గోరుముద్ద లా సినిమాను చూపించింది మా అమ్మ …….. చాలా నచ్చింది.
ఫ్లాష్ బాక్ లోకి…. అన్నపుడె మీలొ ఉన్న ప్రతిభ ఎంటొ తెలిసింది…
నా ప్రియతమ దర్సకుడి గురంచి మీ విధానం క్లుప్తంగా, చూసినట్టుగ ఉంది.
ఇది బహుశా మొదట విషయం లొ ఉండాలి -
…..ప్రతిఒక్కరికి కూడాను రామాయణం మహాభారతము తెలిసివుండాలి……….
మీకు, మీ పనికి 100% సార్థకత చేరాలని ఆకాంక్షిస్తు ..
kanth says:
ee cinima success aaie director gariki manchi peru ravali, alage tana valla padimandiki work dorakali.
wish u all the best directore
sss says:
vijayam antay vellalsina dari ayipoyindani kadu appuday modalyindani ardam.srinu gariki adi ippuday modalyindi. all the best sir
kanth says:
srinu garu ippuday vijayam anay darilo adugu pettaru.vijayam antay vellalsina dari ayipoyindani kadu appuday modalyindani ardam. all the best sir
కమెర్షియల్ ఫిల్మ్ మేకర్ « Rayraj Reviews says:
[...] rayraj పై ఫిబ్రవరి 6, 2009 “నవతరంగం” లో పాముసీను ఇంటర్వ్యూ లో మహేష్ గారు వ్యాఖ్యానించినట్టు, [...]
Ramakrishna Prasad says:
శ్రీను గారికి…
ంఈ బ్లాగు చదివి చాలా ఆనందంగా ఉంది. చిన్న సినిమా కష్తాలు తెలిసాయి. జీవితంలొ సంఘర్షన గురించి….
సినిమా వాల్ల మీద గౌరవం పెరిగింది…
మంచి జరగాలని….
shree says:
>>>ఈ రెంటు సిస్టం తీసెయ్యండి. మేయింటనెన్సు చెరిసగం కట్టుకుందాము. ఉదాహరణకు మొదటి రొజు కలేక్షను ఓ అయిదు వేలు వచ్చిందనుకోండి అది షేర్ చేసుకుందాము. 30% :70% ,లెక, 60% 40%, అనో. అది చాల బాగుంటుంది. చిన్న నిర్మాతలకు మంచిది. క్షేమము గా ఉంటారు.”ఇందులొ విజయం సాధించారు సంతోషం”….
ఈ రోజు పేపర్ లో ఈ విషయం మీద ఇంకా ఏమి తేల్చలేదని ఇచ్చారు….చూసారా….
ఈ విషయం మీద మూడు నెలల నుంచి పోరాడుతున్నా ఇంకా ఏమి తేల్చలేదని…చిన్న నిర్మాతల సంఘం ఈ రోజు పేపర్ లో ప్రకటన(లేదా న్యూస్) ఇచ్చారు…ఈ నెల 28 వరకు తేల్చాలని కోరారు….
ఇంకో విషయం ఇకనుంచి సినెమా కి టాక్ష్ నంబర్ ఆఫ్ ప్రింట్స్ మీద ఆధార పడి వేస్ఠారని ఆ మద్య ఈనాడు లో వచ్చింది….
అంటే ప్రింట్స్ 20 కన్నా తక్కువైతే ఒక్కొక్క ప్రింట్ కి 5,000/
20-40 ఐతే ఒక్కొక్క ప్రింట్ కి 10,000
80-120 ఐతే ఒక్కొక్క ప్రింట్ కి 20.000
అలా అన్న మాట…
మరి చిన్న సినెమా….???
kolord97@gmail.com says:
nir-matha gaari tingari tastes, n intereferences gurinchi raya ledendukano, thaggindaa emi?
కొత్తపాళీ says:
this is one of the best pieces on present day telugu film industry I read. COngratulations to Syed and Sreenu.