Menu

Monthly Archive:: January 2009

తడి ఆరని జ్ఞాపకం ‘లిటిల్ ఏంజెల్’

అదేంటో గాని బి. నర్సింగరావు గారి ‘హరివిల్లు’ చిత్రాన్ని గుర్తు చేసుకుంటూంటే…ఓ అధ్బుత మైన శ్రీలంక చిత్రం గాఢంగా మనస్సులో మెదిలింది. అయితే ఈ సినిమానే ప్రత్యేకంగా ఎందుకు మెదిలిందో నేను చెప్పను…చదివిన తర్వాత మీకే అర్ధమవుతుంది. “Punchi Suranganavi” (లిటిల్ ఏంజిల్) టైటిల్ తో 2002 లో వచ్చిన ఈ సినిమా దర్శకుడు Somaratne Dissanayake కి అనేక అవార్డులు రివార్డులు సంపాదించి పెట్టి అనేక ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడింది. ఈ చిత్రంలో కథ సంపత్

డోంజోకో (1957)

అకీరా కురోసావా దర్శకత్వం వహించిన చిత్రం ఇది. కథ విషయానికి వస్తే: ఒక మురికివాడలో ఒక యజమానురాలు తన పాడుబడిన గదిని అద్దెకు ఇస్తుంటుంది. అందులో కూలి పని చేసుకొనే తాగుబోతులు, జూదగాళ్ళు, వ్యభిచారిణి, దొంగ, జీవితంలో అన్ని కోల్పోయినవారు కొందరు ఉంటారు. కొత్తవారు వస్తూ పోతుంటారు.దొంగకు (తొషిరో మిఫునె) దొంగతనాలు చేయడానికి, విడిపించడానికి యజమాని అండదండలు ఉంటాయి. యజమానురాలు తన భర్త ముసలివాడు కావడంతో దొంగతో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. దొంగకు ఆమె అంటే ఇష్టం

ఇద్దరు

ఇద్దరు (1964)-సత్యజిత్ రే లఘు చిత్ర పరిచయం మనకు అంటే భారతీయులకు రే సిన్మాలు సినిమా పాఠ్యగ్రంథాలు. మన వాడు కదా అని మనం కితాబు ఇచ్చుకోవడం కాదు.ఉద్దండులైన ప్రపంచ సినీ దర్శకులే రే సినిమాలను కొనియాడారు. రే సినిమాలు చూడని వారికి “రే సినిమాలు చూడకపోవడం అంటే, సూర్య చంద్రులను చూడకుండా జీవించడం” అన్న జపాన్ సినీ దర్శక దిగ్గజం అకిరా కురోసావ మాటల కంటే మంచి పరిచయ వాక్యాలు లేవు. ఆ రే కృతి

ప్రకామ్య-కల నిజమవుతుంది.

ప్రపంచంలోని వివిధ దేశాలలో ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ ఊపందుకుంటోంది.అమెరికా, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో ఇండిపెండెంట్ సినిమాలు పెద్ద ఎత్తున నిర్మించబడుతున్నాయి. మిగిలిన వాటితో పోలిస్తే ఇండిపెండెంట్ సినిమాల్లో పనిచేసేవారికి ఎక్కువ స్వాతంత్ర్యం ఉంటుంది. ఈ కారణం చేతనే ఇండిపెండెంట్ సినిమాలు మైన్ స్ట్రీమ్ సినిమాలు స్పృశించని అంశాలు కలిగివుంటాయి. ఇండిపెండెంట్ సినిమా అంటేనే ఎక్కువ బడ్జెట్ లేకుండా తక్కువ ఖర్చుతో తీసే సినిమాలు. ఇలాంటి సినిమాలకు పని చేసేవారు చాలా వరకూ ఉచితంగానో లేదో తక్కువ జీతానికో