Menu

Monthly Archive:: January 2009

కమ్లి-ఈ రోజు దూరదర్శన్ లో

KNT శాస్త్రి దర్శకత్వంలో నందితా దాస్,షఫి ప్రముఖ పాత్రల్లో నటించగా హరి చరణ ప్రసాద్ నిర్మించిన ’కమ్లి’ సినిమా గురించి ఇంతవరకూ విని వుండడమే కానీ చూసే అవకాశం కలిగుండకపోవచ్చు. అదృష్టవశాత్తూ ఈ సినిమాని ఈ రోజు (ఆదివారం) దూరదర్శన్ వారు రాత్రి పదకొండింటికి (Jan 11th, 11PM-IST)కి ప్రదర్శించనున్నారు. గత సంవత్సరం జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చలన చిత్రంగా అవార్డు పొందడమే కాకుండా, ఈ సినిమాలో నటించిన నందితా దాస్ ఉత్తమ నటిగా నంది

చక్రపాణీయం

చక్రపాణీయం-ఒక పరిచయం నూతనసంవత్శరం లో నవతరంగం పాఠకులకు ఒక అపురూపమైన కానుకను అందిస్తున్నాము.బహుముఖప్రజ్ఞాశాలి ‘చక్కన్న’గా అందరికీ చిరపరచితులైన దివంగతచక్రపాణి గారి ఆప్తులు,సన్నిహితులు,అభిమానులు,ఇలా ఎందరో తమతమ జ్ఞాపకాల దొంతరలను అపురూపంగా అందించిన ’చక్రపాణీయం’ నుంచి వ్యాసాలు ఇకపై నవతరంగంలో. ’చక్రపాణీయం’ శ్రీచక్రపాణి స్మృతిసంపుటిని చక్రపాణి-కొలసాని ఫౌండేషన్,4-22-27,ఐతానగరం, తెనాలి522 201వారు మార్చి,1997న ప్రచురించారు. సుప్రసిద్ధ పత్రికాసంపాదకుడు,అనువాదకుడు, స్క్ర్రీన్ ప్లే రచయిత,చలనచిత్రనిర్మాత,దర్శకుడు,విమర్శకుడు,మహామేధావి చక్రపాణి స్మృతిసంపుటి కి సంపాదకత్వం వహించినవారు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య, పిహెచ్.డి. వారు ఈ గ్రంధప్రారంభం లోనే The

2008 లో ఫ్రెంచ్ సినిమాలు

సౌమ్య గారు రాసిన 2008 Bollywood రౌండప్ చూసాక చాన్నాళ్ళుగా రాయాలనుకుంటూ వున్న ఈ వ్యాసాన్ని అర్జంటుగా రాసెయ్యాలనిపించింది. 2008 సంవత్సరంలో 2007 కంటే తక్కువ సినిమాలు చూసాను. అలా అని 2008 లో మరీ తక్కువ సినిమాలు చూసానని కాదు. సగటు మూవీ గోయర్ కంటే కాస్తా ఎక్కువ సినిమాలే చూసుంటాను.వాటిల్లో నాకు నచ్చిన వాటిని కొన్నింటిని గుర్తు చేసుకునే ప్రయత్నం ఇది. ముందుగా నాకు నచ్చిన ఫ్రెంచ్ సినిమాలతో మొదలుపెడ్తాను. 1) The Class

గాడ్‌ఫాదర్ – తెరవెనుక కథ

ప్రపంచ సినీ చరిత్రను తిరగరాసిన గాడ్‌ఫాదర్ సినిమా నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. మాఫియా ఆధారంగా తీయబడిన ఈ సినిమా చిత్రీకరణ మొదలవడానికి నిజమయిన మాఫియా ఎన్నో ఆటంకాలు కలిగించింది. అమెరికాలోని పలు నగరాల్లో ఇటాలియన్లు నిరసన ప్రదర్శనలు జరిపారు. నిర్మాతకు బెదిరింపులు వచ్చాయి. అప్పటి ప్రముఖ మాఫియా బాస్ ఈ సినిమాను ఆపడానికి తన బలాన్ని బలగాన్ని ఉపయోగించాడు. నిర్మాత చివరకు మాఫియా చెప్పిన ఆంక్షలకు తలవంచవలసి వచ్చింది. ఒక వైపు న్యూయార్క్

బాలీవుడ్-2008

కొత్త సంవత్సరం వచ్చి ఇన్నాళ్ళౌతుంది, ఇప్పటిదాకా ఎవరూ నవతరంగంలో 2008 లో తాము చూసిన సినిమాల రౌండప్ రాసినట్లు లేరు. అందుకే నేనే మొదలుపెడుతున్నా 🙂 బాలీవుడ్-08 నా వ్యాసాంశం. ఈ ఏడాది నేనే మారానో లేక బాలీవుడ్ లోనే వైవిధ్యం ఎక్కువైందో నాకు తెలీదు కానీ, నాకు మాత్రం బాలీవుడ్ నచ్చింది. భిన్న రకాలైన కథా వస్తువులతో సినిమాలొచ్చాయి. మన సినిమాలు ప్రపంచమంతా చూసేంత క్లాసిక్ గా ఉండాలి అన్న దృష్టితో చూస్తే బహుశా నేననే