Menu

Monthly Archive:: January 2009

2008 లో యూరోపియన్ సినిమాలు-1

2008 లో నేను చూసిన సినిమాల గురించి రాస్తున్న వ్యాసావళి లో రెండో వ్యాసం ఇది. ఈ సీరీస్ లో వచ్చిన మొదటి వ్యాసం (2008:ఫ్రెంచ్ సినిమాలు) ఇక్కడ చదవొచ్చు. Hooked-రొమానియా గత సంవత్సరం రెండు మంచి రొమానియన్ సినిమాలు చూడడం అదీకాక పత్రికల్లో రొమానియన్ న్యూ వేవ్ వచ్చేసిందని తెగ వ్రాయడంతో ఈ సంవత్సరం వచ్చిన మంచి రొమానియన్ సినిమాలు చూద్దామని ఎదురు చూసినప్పటికీ రొమానియా నుంచి ఈ సంవత్సరం ఒక్కటే మంచి సినిమా వచ్చిందనుకుంటాను.

సినిమాపరిశ్రమలోనికి రావాలనుకుంటున్నారా?

సినిమా పరిశ్రమ ఎంతో మందికి కలల సౌధం, కొంత మంది కలకంటూనే జీవతం గడిపేస్తారు, మరికొందరు ప్రయత్నాలు చేయ్యటం గురించి ఆలోచిస్తారు, ఇంకొందరు ప్రయత్నాలలోనే అలసిపోతారు, కాని ప్రతి ఒక్కరి కల చాలా అందంగా ఉంటుంది, అ కల నిజమయినప్పుడు కలిగే అనుభూతి జన్మనిచ్చే తల్లికి కలిగే అనుభూతి స్థాయిలో ఉంటుంది అంటే సాధారణ జనులకు వింతగా అనిపించినా అలా కలలు కనే వారికి, ఆ కలలు సాకారం చేసుకున్న వారికి ఇట్టే అర్దమవుతుంది. సినిమా పరిశ్రమలోకి

మన వాడు మళ్ళీ (ఏఆర్‌ రెహ్మాన్‌కు ‘గోల్డెన్‌గ్లోబ్‌’ అవార్డు)

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ ప్రతిభకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సినీ సంగీత ప్రపంచంలో అత్యున్నతంగా భావించే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును సాధించిన తొలి భారతీయునిగా రెహమాన్‌ రికార్డులకెక్కాడు. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రానికిగాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డుకూడా లభించింది. సైమన్‌బ్యుఫోయ్‌ ఈ అవార్డు గెలుచుకున్నారు. ఇదే చిత్రంలోని జయహో పాటకుగాను గీత రచయిత గుల్జార్‌కు ఉత్తమ గీతరచయిత అవార్డు లభించింది. ఇంకా ఇదే చిత్రానికిగాను డాన్‌బోయ్ల్‌కు

నంది అవార్డులు 2007

కంగ్రాట్స్ … రాష్ట్ర ప్రభుత్వం 2007 యేడాదికి గాను నంది అవార్డులు ప్రకటించింది. ‘మీ శ్రేయోభిలాషి’ ఉత్తమ చిత్రంగా, చందమామ ఉత్తమ కుటుంబకథా చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ ద్వితీయ చిత్రంగా హ్యాపీడేస్‌ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా వెంకటేష్‌(ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే), నటిగా ఛార్మికౌర్(మంత్ర)‌, ఉత్తమ దర్శకుడిగా కృష్ణవంశీ అవార్డులు అందుకోనున్నారు. ఉత్తమ సహాయనటుడిగా జగపతిబాబు(లక్ష్యం), సహాయ నటిగా జానకి, అల్లూరామలింగయ్య అవార్డుకు ఉత్తేజ్‌ ఎంపికయ్యారు.ఉత్తమ సంగీత దర్శకుడు మిక్కీ.జె.మేయర్(హ్యాపీడేస్) చిరుత సినిమాలో నటనకు రామ్‌చరణ్‌తేజ్‌ కు

మరో రీకాప్

బాలీవుడ్ సినిమాలపై రాసి తెలుగు-తమిళాల గురించి రాయకుండా ఉంటే ఎలా? అన్న సందేహం నా గురించి నాకే కలిగి మరో రీకాప్ వ్యాసంతో వస్తున్నాను. తెలుగు-తమిళ సినిమాల్లో కూడా నాకు ఈ సంవత్సరం చూసిన సినిమాల్లో కాస్త వైవిధ్యం కనిపించింది. అయితే, బాలీవుడ్ లెవెల్లో కాదు. ఒక విషయం మాత్రం అర్థమైంది. తమిళులైనా కాస్త వెరైటీ కథాంశాలతో తీయగలరు కానీ, తెలుగు వారిలో మాత్రం అలాంటి కథా వైవిధ్యం ఇప్పట్లో రాదేమో అనిపించింది. ఇక్కడ నేను రాస్తున్న