Menu

Monthly Archive:: January 2009

సుజాత

స్త్రీ పాత్రలకి ప్రముఖ స్థానమూ, సామాజిక అన్వయమూ కల్పించడం బిమల్ రాయ్ నిర్మించిన చిత్రాల్లోని మౌళిక లక్షణం. అందుకే ఆయనని మహిళా చిత్రాల దర్శకుడిగా అభినందిస్తారు. ఆయన సినిమాల్లో ఆకలి, శ్రమ, నిజాయితీ, అంటరాని తనమూ, నిరుద్యోగమూ వంటి అనేక సామాజిక అంశాలు ప్రధాన ఇతివృత్తాలయ్యాయి. ఆయన చిత్రాలు సుజాత, నౌకరీ, పరక్, పరిణీత, లాంటివి విశేష మన్ననలు పొందాయి. ఆయన నిర్మించిన ‘దో భీగా జమీన్’ లాంటి ఆఫ్ బీట్ చిత్రాలు దేశ విదేశాల్లో విమర్శకుల

ష్…ఇది చాలా మంచి ఊరు-సినిమా సమీక్ష

లేత వయసుల ప్రేమలు-వాటిని సమర్ధించే మతిలేని మాటలు, నాలుగు సుమోలు ఒక్కుదుటన ఇరవై అడుగులు పైకి లేచి ఒక దానితో ఒకటి ఢీ కొట్టుకుని పచ్చడైపోయినా-సుమోల్లో ఉన్న జనాలంతా హాయిగా దిగడం, కధకి ఏకోశానా సంబంధంలేని సన్నివేశాలను, వెకిలి హాస్యాలను – చూసి విసిగి పోయారా? అయితే ‘ష్’ చూడండి! ‘హైదరాబాద్ బ్లూస్’ నగేష్ కుకునూరి, ‘ఆనంద్’ శేఖర్ కమ్ముల, ‘గమ్యం’ క్రిష్ — వీరంతా యన్నారైలు. సినిమా మీద పిచ్చి ప్రేమతో వెనక్కొచ్చి మనకు మంచి

వాత్సల్య నిధి చక్రపాణి -యన్.టి.రామారావు

1949వ సంవత్శరం నుంచీ నాకూ విజయాసంస్థకూ ఒక అనుబంధం ఏర్పడింది.నా సొంత ఇంటికంటె వాహినీ స్టుడియో చొరవ,నా కుటుంబసభ్యులకంటె కూడా,శ్రీనాగిరెడ్డి-చక్రపాణి గార్లతో ఆప్యాయత,ఆనాడుచిత్ర నిర్మాణం అంటే ఒక మహత్తరకార్యంగా భావించేవాళ్ళము.అంత భావనలో కూడా ఆ చక్రపాణి గారు చటుక్కున ఇచ్చే సూచనలు వింటూ వుంటే ఏమిటిలా మాట్లాడతారు అనిపించేది.ఏదో తేలని సమస్యతో సతమతమవుతూ,అతి ముఖ్యమైన సన్నివేశాన్ని ఎలా మలచాలో తెలియక మా పెద్ద దర్శకులందరూ తికమకపడుతూ ఉంటే‘ఏంది ఇది ఇట్టా చేస్తే పోలా’అని తేలిగ్గా,సూక్ష్మంగా,విజ్ఞతతో ఆ చిక్కుల్ని

” రాంగొపాల్ వర్మ ని కలిసాకే నా లైఫ్ మారింది.” దర్శకుడు పాము శ్రీను

అందరమ్మల్లా అతని అమ్మ కూడా అక్షరభ్యాసం చేయిచింది.కాకపొతే చిన్న పలకమీద కాదు. వెండితెర మీద సినిమాను చూపించి.అందరు పిల్లల్లాగే అతను చిన్నప్పుడు పుస్తకాలను చదివాడు.కాని చిన్న పిల్లల కధల పుస్తకాలు మాత్రం కాదు. అర్థం కాకపొయినా కానీ చలం,శ్రీ శ్రీ లను తిరగేసాడు. సెలవులకు హైదరాబాదు వచ్చి అందరూ చార్మినార్ చూసి ఏమైనా మారుతారో లేదో కాని అతను మాత్రం జె.యెన్ .టీ.యూ చూసి తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆధునిక భారతీయ సినిమాలో ఆజాద్ హింద్ ఫౌజ్

అస్కార్ నామినేషన్స్

అస్కార్ నామినేషన్స్ రేపు రానున్నాయి. ఈ సందర్భంగా ఏయే సినిమాలకు నామినేషన్స్ రావొచ్చో, వచ్చిన వాటిలో చివరకు గెలిచేదెవరో అంచనా వేస్తూ వ్రాసిన వ్యక్తిగత అభిప్రాయం ఇది. మీరు కూడా మీ అంచనాలు వ్యాఖ్యల ద్వారా తెలిచేయండి. Best Picture ఈ విభాగంలో నాకు నచ్చిన ఐదు సినిమాలు The Wrestler Frost/Nixon Gran Torino[Winner] Slumdog Millionaire Milk ఈ సినిమాలు కూడా బాగానే ఉన్నాయి Curious Case of  Benjamin Button Revolutionary Road