Menu

Monthly Archive:: January 2009

ఆర్సన్ వెల్స్ – చివరి భాగం

(మొదటి భాగం తరువాయి) 1915 మే 6న అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం కెనోషా పట్టణంలో ఓ ధనిక కుటుంబంలో జన్మించిన ఆర్సన్ వెల్స్ సంగీతకారిణి అయిన తల్లిద్వారా చిన్నతనంలొనే పియానో, వాయులీనం వంటి వాయిద్యాలను ఉపయోగించటం నేర్చుకున్నాడు. అతనికి ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. ఎనిమిదేళ్ల ప్రాయంలో తల్లి, పదమూడేళ్లప్పుడు తండ్రి కాలం చేశారు. చిన్నప్పటినుండీ వెల్స్ దృష్టి చదువు కన్నా కళల మిద ఎక్కువ ఉండేది. టీనేజ్‌లో కొచ్చేటప్పటికే అతను ఐరోపాని రెండు సార్లు చుట్టిరావటమే

మరో మంచి దర్శకుడు – హరి చరణ్

“విశ్వనాథ్ గారు సినిమాలు తీయడం ఎందుకు మానుకున్నారంటే వారు తీసిన సినిమాలకి వ్యాపర పరంగా లాభసాటి లేదు. మంచి సినిమాలు రావడం లేదూ అని బాధ పడేకన్న ఎవరైనా ఒక చిన్న మంచి ప్రయత్నం చేస్తే దానికి మీరు చేయూత నివ్వండి. సినిమాకి వెళ్ళి చూడండి. బాగోలేదని ఎవరో చెప్పారని చూడ్డం మానేస్తే చిన్న సినిమాలు తీసేవాళ్ళుండరు. ఎవరైనా మంచి ప్రయత్నం చేస్తే మీవంతు సహకారం అందిచండి. వారికి మరింత ప్రోత్సాహం ఇవ్వండి…” చాల కాలం క్రితం

వరూధిని చిత్రప్రచారం సమీక్షలు

గత అక్టోబరు 27 న ఆ రోజుల్లో ఒప్పందాలు ఎలా ఉండేవి అన్న శీర్షికతో,నటసార్వభౌముడు సామర్ల వెంకట రంగారావు గారి మొదటి సినిమా `వరూధిని’అగ్రిమెంటు గురించి http://navatarangam.com/2008/10/actor-agreements/ మన పాఠకులకు అందించాము.అ సినిమాకు సదరు నిర్మాతదర్శకులు జరిపిన ప్రచారం గురించి ఇక్కడ తెలుసుకుండాం.

ధూళిపాళ అంటేనే శకుని అనేంతలా…..

ధూళిపాళ, ఈ పేరు వినగానే మనకి సాధారణంగా ఒక కామన్ డైలాగ్ గుర్తొచ్చేస్తుంది ఆ పాత్రతో సహా.. “అని గట్టిగా అనరాదు,వేరొకరు వినరాదు, అనిమిత్త క్రోధంతో అసూయాగ్రస్థుడై రారాజు రాజసూయానికి వెళ్ళలేదంటుంది ఈ వెర్రి లోకం, ఒకవేళ నీవు పోకపోయిననూ యాగమా ఆగునది కాదు, పోయినచో స్వజనుల మీది సమాదరణతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది, ఎదిరి బలాన్నీ, బలగాన్ని కనిపెట్టే అదనూ చిక్కుతుంది. వేయేల కురుసార్వభౌముడు మాననీయుడూ,మంచివాడన్న కీర్తి నువ్వు దక్కించుకో,ఆపైన కొంచపు వంచన

విరిసిన సినీ “పద్మా”లు

ప్రముఖ నటుడు కృష్ణ కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేసే పద్మభూషణ్‌ అవార్డుకు ఎంపిక అయ్యారు. అలాగే హాస్య నటుడు బ్రహ్మానందంకు పద్మ శ్రీ అవార్డు లభించింది. అలాగే పద్మశ్రీ అవార్డులు ప్రముఖ హిందీ నటి ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌కు, నటుడు అక్షయ్‌ కుమార్‌ కి, సాను భట్టాచార్జీ, ఉదిత్‌ నారాయణ్‌లకు కళారంగంలో కృషికిగాను లభించాయి. ఇది ‘పద్మానందం’ తన తల్లిదండ్రులు బ్రహ్మానందం అనే పేరు పెట్టినందుకు సార్థకత చేకూరిందని, గతంలో ఎన్నో అవార్డులు, రివార్డులు తనను వరించిన పొంగిపోకుండా