కంగ్రాట్స్ …
రాష్ట్ర ప్రభుత్వం 2007 యేడాదికి గాను నంది అవార్డులు ప్రకటించింది. ‘మీ శ్రేయోభిలాషి’ ఉత్తమ చిత్రంగా, చందమామ ఉత్తమ కుటుంబకథా చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ ద్వితీయ చిత్రంగా హ్యాపీడేస్ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా వెంకటేష్(ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే), నటిగా ఛార్మికౌర్(మంత్ర), ఉత్తమ దర్శకుడిగా కృష్ణవంశీ అవార్డులు అందుకోనున్నారు. ఉత్తమ సహాయనటుడిగా జగపతిబాబు(లక్ష్యం), సహాయ నటిగా జానకి, అల్లూరామలింగయ్య అవార్డుకు ఉత్తేజ్ ఎంపికయ్యారు.ఉత్తమ సంగీత దర్శకుడు మిక్కీ.జె.మేయర్(హ్యాపీడేస్) చిరుత సినిమాలో నటనకు రామ్‌చరణ్‌తేజ్ కు జ్యూరీ అవార్డు లభించింది.
ఉత్తమ మూడవ చిత్రం :లక్ష్యం
ఉత్తమ కుటుంబ చిత్రం :చందమామ
ఉత్తమ ప్రేక్షకాదారణ పొందిన చిత్రం :ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే
ఉత్తమ ప్రతినాయకుడు: మురళి శర్మ(అతిధి)
ఉత్తమ బాలనటి :వర్షిణి
ఉత్తమ మొదటి చిత్రం దర్శకుడు: రవి తెనాలి(ముహూర్తం)
ఉత్తమ స్క్రీన్ ప్లే :శ్రీను వైట్ల(ఢీ)
ఉత్తమ పాటల రచయిత :వెనిగెళ్ళ రాంబాబు(మీ శ్రేయాబిలాషి)
ఉత్తమ కథా రచన :బలభద్రపాత్రుని రమణి(మధుమాసం)
ఉత్తమ డైలాగులు: రమేష్ గోపి(ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే)
ఉత్తమ ఎడిటర్ :కోటగిరి వెంకటేశ్వరరావు(యమదొంగ)
ఉత్తమ ఛాయా గ్రాహకుడు: సి.రాంప్రసాద్(మున్నా)
ఉత్తమ ఆర్ట్ దర్శకుడు: శ్రీనివాస రాజు(చందమామ)
ఉత్తమ నృత్య దర్శకత్వం :నోబుల్ (దేశముదురు)
ఉత్తమ గాయకుడు కార్తీక్:(హ్యాపీడేస్..ఓ మై ప్రెండ్)
ఉత్తమ గాయని :కౌసల్య(సత్యభామ)
నంది అవార్డు గ్రహీతలందరికీ పేరుపేరునా ‘నవతరంగం’ శుభాకాంక్షలు తెలుపుతోంది.
చండీదాస్ says:
ఏ పేరున అయితేనేం మొత్తం ఐదు చిత్రాలకు ‘ఉత్తమ ‘ తగిలించారు.అసలీ లెక్కన ఉత్తమ పదమూడో చిత్రం, ఉత్తమ ఎనభై ఏడో చిత్రం అని ఓ వంద వరకూ పారేస్తే పోయేది. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవార్డులు సరేగానీ, ఓ క్రిటిక్ గా మీరే సినిమాల్ని ‘ఉత్తమం ‘ అంటారో తెలుసుకోవాలని ఉంది.మీ లిస్ట్ ఒకటి వేసెయ్యకూడదూ?
sasank says:
Avunu prakash gaaru mee list veyyandi……baaguntundhi.
కె.మహేష్ కుమార్ says:
2007 కి గానూ నవతరంగం అవార్డులని మనమూ ప్రకటిద్దాం!
Satya SKJ says:
క్రిందటి ఏడాది కంటె ఈసారి … పర్వాలేదు అనిపిస్తొంది!
మహ నటుడు విశ్వ విఖ్యాత నట సార్వభ్యౌమ – నందమూరి తారక రామరావు గారు ఉన్నపటి నంది బహుమతి ప్రతిష్త .. ఇప్పుడు ఎందుకొ లేదు!
ఏ సినిమ చూసినా ఏమున్నది గర్వకారణం … ఎంత సేపు త్యెతక్కలు .. కొట్టు కొవడం తప్ప…
శిద్దారెడ్డి వెంకట్ says:
ఉత్తమ మొదటి చిత్రం దర్శకుడు: రవి తెనాలి(ముహూర్తం)—-ఇదేం సినిమా?
ఉత్తమ బాలనటి :వర్షిణి—ఈ అమ్మాయి మన శేషు గారు సమీక్షించిన గులాబీలు సినిమాలో అమ్మాయా?
శిద్దారెడ్డి వెంకట్ says:
“2007 కి గానూ నవతరంగం అవార్డులని మనమూ ప్రకటిద్దాం!”
@మహేశ్
2007 అంటే కష్టం కానీ మొన్ననే వెళ్ళిపోయిన 2008 కి ఇద్దామంటే మరి ప్లానింగ్ స్టార్ట్ చేద్దాం.
విజయవర్ధన్ says:
“ఉత్తమ మొదటి చిత్రం దర్శకుడు: రవి తెనాలి(ముహూర్తం)” ఎవరైనా ఈ సినిమా చూసివుంటే, ఒక టపా వ్రాయమని విన్నపం.
కె.మహేష్ కుమార్ says:
@వెంకట్: అచ్చుతప్పు అది 2008 సంవత్సరమే! మొదలెట్టండి.
teja says:
1983: ఉత్తమ మూడవ చిత్రం: సాగర సంగమం
2007: ఉత్తమ మూడవ చిత్రం :లక్ష్యం
ప్చ్..నంది అవార్ద్స్ ఎంత దిగజారిపొయాయి!
మేడేపల్లి శేషు says:
@ వెంకట్. 2007 నంది అవార్డుల్లో, ఉత్తమ బాలనటి అవార్డు పొందిన ‘వర్షిణి’ ‘గులాబీలు’ చిత్రంలో ప్రధానపాత్ర పోషించిన అమ్మాయే. ఈసారి వర్షిణికి ‘అమూల్యం’ సినిమాకు ఈ అవార్డు వచ్చింది (అక్కినేని కుటుంబరావుగారి దర్శకత్వం). వాళ్ల నాన్నగారు ఈరోజు ఉదయమే ఫోను చేసి ఈ విషయం చెప్పారు. ‘అమూల్యం’ సిడి కూడా త్వరలో పంపిస్తానన్నారు. అది అందగానే చూసి, సమీక్ష రాస్తాను. ఫిబ్రవరిలో హైదరాబాదు వెళ్తున్నాను. అక్కినేని కుటుంబరావుగారి అనుమతితో ‘గులాబీలు’, ‘అమూల్యం’ చిత్రాలను ‘నవతరంగం’లో పెట్టాలని నా ఉద్దేశం.
గోపీచంద్ says:
ఉత్తమ మూడవ చిత్రం :లక్ష్యం ??????
ఇంకా యేమనుకోవాలి ? మన ఖర్మ రా బాబు అనుకోవాలి
srikanth says:
మీ శ్రేయోభిలాషి సినెమా తీసిన నిర్మాతే ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి కనిపించే ఒక సినెమా కి నిర్మాత మరి…నంది ఎమిటి ఎమైనా ఇస్తారు…
శిద్దారెడ్డి వెంకట్ says:
@srikanth,
ఈ సినిమా వరకూ పెద్ద రికమండేషన్లు ఉండుండకపోవచ్చనే అనిపిస్తుంది. 2007 లో వచ్చిన సినిమాల్లో ఇదొక మంచి సినిమా.
తెలు'గోడు' says:
నంది అవార్డులపై ఎలాంటి గొడవలో ఇది లింక్ చదవండి…అర్ధమవుతుంది.
కోకాపేట ఆంటీ(ఝాన్సీ)పై దుమారం..
http://thatstelugu.oneindia.in/movies/spotnews/2009/01/after-one-year-of-release-tulasi-movie-150109.html
శిద్దారెడ్డి వెంకట్ says:
@తెలు’గోడు’,
ఈ విషయం పై జ్యూరీలో ఉన్న తెలంగాణీయుడు, నవతరంగం సభ్యుడు ఆనంద్ గారేమంటారో అడుగుదాం.
అబ్రకదబ్ర says:
నాకెప్పట్నుండో పెద్ద అనుమానం. ‘ఉత్తమ చిత్రం’, ‘ఉత్తమ దర్శకుడు’ అని రెండు వేర్వేరు అవార్డులెందుకు? ఉత్తం చిత్రం తీసినోడే ఉత్తమ దర్శకుడు కావాలి కదా. అది ఒక సినిమాకి, ఇది ఒక సినిమాకి ఇవ్వటంలో తిరకాసేంటి?
శంకర్ says:
హాలివుడ్‌లో అయితే కధ స్క్రీన్‌ప్లే దర్శకత్వం వేరు వెరు వ్యక్తులు చేస్తారు కాబట్టి అక్కడ అన్ని విభాగాలకి వేరు వేరు అవార్డులుంటాయి. ఇక్కడ అన్నీ ఒక్కరెగా కాబట్టి మీరు చెప్పినట్టే ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకత్వం ఉత్తమ స్క్రిన్‌ప్లేలాంటివన్నీ ఒకరికే రావాలి. అప్పుడు మిగతావాళ్ళ సంగతేంటీ. అందుకనే ఇలా అందరికీ సమానంగా పంచుతున్నారనుకుంటా.