ఒక నవ్వుల యుగం ముగిసింది. ప్రముఖ హాస్య నటుడు నాగేష్(75) ఈ రోజు(శనివారం-31 జనవరి) మద్యాహ్నం చెన్నైలోని సిటీ హాస్పటల్ లో తుది శ్వాస వదిలారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన గత కొంత కాలంగా హాస్పటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.
దక్షిణాదిలోని తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం బాషల్లో వేయి చిత్రాలకు పైగా నటించిన నాగేష్ అసలు పేరు గుండూరావు. కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన(సెప్టెంబర్ 27, 1933) ఆయన చిన్నప్పుడే అదృష్టాన్ని వెతుక్కుంటూ చెన్నై వెళ్ళిపోయారు.తనను తాను నిరూపించుకున్నాకే ఇంటికొస్తానని చెప్పి వెళ్ళినాయన మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డారు. నానా రకరకాల ఉద్యోగాలు చేసారు…(రైల్వేతో సహా)..అవే తనకు రకరకాల మనుష్యులను,ప్రవర్తనలును దగ్గరగా గమనించటానికి ఆదారమయ్యిందనేవారు. చెన్నైలోని వెస్ట్ మంబళంలో పాటల రచయిత వాలి,నటుడు శ్రీకాంత్ లతో రూమ్ పంచుకునే వారు.
రైల్వేలో పనిచేస్తున్న సమయంలో కంబ రామాయణం అనే తమిళ నాటకం చూడటం తన కొలిగ్స్ వేస్తూండగా చూడటం తటస్ధించింది. అది చూసాక ఆ నటులు కన్నా తను బాగా చేయగలననిపించి..రైల్వే కల్చరల్ అశోసియేషన్ వారిని కలసి తర్వాత షో లో యాక్ట్ చేసారు.అందులో ఆయన పాత్ర కడుపు నొప్పితో బాధ పడే వ్యక్తి పాత్ర. అప్పుడు అప్పటి తమిళ సూపర్ స్టార్ యంజిఆర్ ఛీఫ్ గెస్ట్ గా అటెండయ్యారు.స్టేజిపై నాగేష్ అభినయ సామర్ధ్యాన్ని పొగుడుతూ మాట్లాడారు. తర్వాత నాగేష్ చాలా నాటకాల్లో పలు పాత్రలు చేసారు. ఆ సమయంలో బాలాజీ అనే నిర్మాత ఆయనకు సినిమాల్లో వేషం ఇచ్చి బ్రేక్ ఇచ్చారు. తర్వాత కాలంలో ఆయన యంజిఆర్ తో గాఢమైన స్నేహాన్ని కొనసాగించారు.
అయితే ఆ తర్వాత నాటక రంగాన్ని ఆయన మర్చిపోలేదు. అప్పటి నుంచి దాదాపు వెయ్యి సినిమాల పైదాకా భారతీయ భాషల్లో నటించి తన ప్రతిభా పరిమళాలు అంతటా వెదజల్లారు. హాలీవుడ్ కామిడీ నటుడు జెర్రీలూయిస్ ని అమితంగా ఇష్టపడే ఆయన ప్రారంభం రోజుల్లో అతన్ని అనుకరించేవారు. తర్వాత తనకంటూ స్వంత స్టైల్ ఏర్పాటు చేసుకుని ప్రపంచాన్ని తన కామిడీ పంచ్ లతో గెలిచారు. సర్వర్ సుందరం వంటి ఎన్నో అద్బుతమైన సినిమాలు అందించారు.
అలాగే ఆయన హాస్యనటుడు గానే కాకుండా కమల్ హాసన్ అపూర్వ సహోదరులు వంటి సినిమాల్లో విలన్ కూడా నటించి మెప్పించారు. ఇక మైకల్ మదన్ కామరాజులోనయితే ఆ చేసిన నటనకు నవ్వని వారుండరు.అలాగే నమ్మవార్ (తెలుగులో ప్రొఫిసర్ విశ్వం)లో నటనను మర్చిపోవటం కష్టమేనంటారు ఆయన అబిమానులు. చివరగా కమల్ దశావతారంలో ముస్లిమ్ గెటప్ లో కనిపించి అలరించారు. కమల్-నాగేష్ స్నేహం గురించి తమిళ పరిశ్రమలో చాలా గొప్పగా చెప్తూంటారు.
ఇక మహా దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో ప్రారంభం రోజుల్లో రజనీకాంత్ ఓ సన్నివేశంలో ఎక్సప్రెషన్స్ ఇవ్వటానికి ఇబ్బందిపడుతూంటే..అప్పుడు ఆయన అదే నాగేష్ అయితే ఈ సన్నివేశానికి ఐదు ఎక్సప్రెషన్స్ ఇచ్చి ఏది కావాలో తీసుకోమంటాడు అన్నారు. ఈ విషయాన్ని రజనీ ఇప్పటికీ గుర్తు చేసుకుంటూంటారు. నాగేష్ సినిమా కోసమే పుట్టిన వ్యక్తి..వినోదపరచటానికే జీవితాన్ని అంకితం చేసారు అంటారు.
అలాగే నాగేష్ తెలుగులో డి.రామానాయుడు నిర్మించిన మొరటోడు అనే చిత్రాన్ని డైరక్ట్ చేసారు.తెలుగులో నాగేష్ అనగానే గుర్తు వచ్చే చిత్రాలు తొలిప్రేమ,అల్లరి మొగుడు,రాముని మించిన రాముడు,వేటగాడు,కొండవీటి సింహం,జస్టిస్ చౌదరి,శ్రీరంగ నీతులు,వసంత గీతం,హంతకులు దేవాంతకులు,సావాసగాళ్ళు,గడసు పిల్లోడు,సాహసమే నా జీవితం తదితరులు.
ఏదైమైనా నాగేష్ కన్నా గొప్ప వాళ్ళు రావచ్చు.తక్కువ వాళ్ళు రావచ్చు. కాని నాగేష్ లాంటివారు రారు. తలుచుకోగానే పెదాలుపై నవ్వులు పూయించే…ఆయన ఈ రోజు నవ్వునే ఏడ్పించారు. నవతరంగం ఆయన మృతికి మనసారా శ్రధ్ధాంజలి ఘటిస్తోంది.
pappu says:
నిజమే..నవ్వుకే ఏడుపు తెప్పించారు(విరగ బడి నవ్వితే వచ్చేవి కన్నీళ్ళే కదా),ఇప్పుడు ఆయన వెళ్ళిపోతూ….
varudhini says:
A great man – the tamil movie of him viz., – “Edur Neechhal”- (edureeta) unforgettable action as hero of the movie. A great comedian poet in “raja raja chozhan” who can forget him! May his soul keep the devas in heaven in laughing and smiling moods always!
cheers
zilebi.
వరూధిని says:
మరో నక్షత్రం తారజువ్వలా ఆకాసినికి ఎగిరి పొయింది. తమిళుల కి తీరని లోటుని కలిగించింది. అంతకన్న ఎక్కువ గా సినీ లొకానికి తీవ్ర లోటు.
ఆకాసానికి ఎగిరి పొయిన నక్షత్రం అక్కడ నెలవున్న స్వాములకి ఇక నవ్వడానికి కడుపులు పట్టుకునేంతగా తమ కామెడి పండిస్తుందని ఆసిస్తూ-
జిలెబి
baleandu says:
The great comedy actor in South Indian Cinema. He is not only a great comedian, but a great actor. He acted in several languages in different roles. But not recognised by the Government with any awards like padmasri, doctorate etc., (subject to correction). He played a hardcore villian in “Vichitra sodarulu” (tamil dubbing) and a professor father of a girl in “Nammavar”(Prof. Vishawm in telugu – Kamal’s movie). At the time of sudden death of his girl his reaction to that news is very much astounding. I felt very sad to know about his demise. May God rest his soul in peace.
అరిపిరాల says:
మంచి వ్యాసం.
చిన్న సవరణ:”కమల్ హాసన్ అపూర్వ సహోదరులు వంటి సినిమాల్లో విలన్…” మీరు చెప్పేది తమిళ చిత్రమైతే “అపూర్వ సహోదరగళ్” తెలుగులో “విచిత్ర సోదరులు”
సుజాత says:
నగేష్ హాస్యం వెకిలిగా ఉండకపోవడం హాయిగా ఉంటుంది. బృందావనం సినిమాలో ఆయన పాత్ర ఉండేది కొద్ది సేపే అయినా కడుపుబ్బ నవ్విస్తుంది. భామనే…లో కూడా! ఈ సందర్భాంగా ఏదైనా మూవీ ఛానెల్లో సర్వర్ సుందరం సినిమా వేస్తే బాగుండు. ఇంతవరకూ ఆ సినిమా చూడలేదు.
పప్పు గారు చెప్పినట్లు నవ్వుకే ఏడుపు తెప్పించారు.
రామేశబాబు says:
నగేశ్! సర్వర్ సుందరం ఆయన లేకపోతే చూడలేం, బహుశా అది తీసుండేవారు కాదేమో ఆయనే లేకపోతే. అప్పుడప్పుడు చూడటమే కాని పెద్దగా పరిచయం లేదు. ఐతే ఆయనకు పరిచయమే అక్కరలేదనుకోండి. సవ్యసాచి కాబోలు నిర్దేశకత్వం కూడా చేసారని ఇప్పుడే తెలిసింది. ఆణిముత్యాలను పోగొట్టుకుంటున్నాము. జోశ్యులవారూ ఇది బాగుంది “అంతకంటే గొప్పవాళ్ళూ రావచ్చు, తక్కువవాళ్ళను చూడొచ్చు కాని నగేశ్ మాత్రం నగేశే అన్నది నిర్వివాదం.
KUMAR says:
మీ లిస్టు లో భామనే సత్యభామనే ఎలా మర్చిపోయారో తెలియట్లేదు.
ఎనీ వే చాల బాగా రాసారు.
నవ్వు కే ఏడుపు తెప్పించడం నిజం గా నిజం
కుమార్