నేనే దేవుడ్ని

WWW.OKGOT.COM

శివపుత్రుడు(పితా మగన్) ఫేమ్ బాల మరో సంచలనానికి తెర లేపారు. తాజాగా ఆయన రూపొందించిన నాన్ కడవుల్ (తమిళ)Naan Kadavul  చిత్రం పోస్టర్స్ అంతటా ఆసక్తి రేపి చర్చనీయాంశమవుతున్నాయి. దాదాపు రెండేళ్ళ  పాటు చిత్ర నిర్మాణం జరుపుకున్న  ఈ చిత్రం సంక్రాంతి రోజున రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అలాగే  ఈ సినిమాలో ఆర్య,పూజ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

పవిత్ర పుణ్య క్షేత్రం కాశి లోని సాధువులు(అఘోరా తరహా) చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. భవిష్యత్తును అలవోకగా దర్శంచటం,వేరే మానసిక ప్రపంచంలో విహరించటం,నిద్రా,ఆహారం వంటివి పట్టించుకోకపోవటం వంటి వాటిల్లో నిష్టాణులు అయిన సాధువుల జీవన శైలి,ప్రవర్తన,ఎదుర్కొనే సవాళ్ళు వంటివి ఇందులో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ చిత్రంలో  ప్రధాన పాత్రలు ఆర్య  సాధువుగా కనిపిస్తే…పూజ ఓ గుడ్డి బిచ్చగత్తెగా గా కనిపించనుంది.

స్టార్ డమ్ పట్టించుకోకుండా అత్యంత సహజ పాత్రలతో ఈ చిత్రాన్ని తీసారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం మొన్న జనవరి మొదటి తేదీన రిలీజై సంచలనం సృష్టిస్తోంది. ఇక నాన్ కడవుల్ అంటే నేనే దేముడ్ని అని అర్ధం .కధాంశం గురించి దర్శకుడు బాలా చెబుతూ మనిషిలో ఉండే భగవంతుడ్ని ఆవిష్కరించటమే ఈ సినిమా లక్ష్యం అంటున్నారు. అక్కడ హిట్టయితే తెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకూ ఈ విభిన్నమైన పోస్టర్స్/ట్రైలర్ చూస్తూండిపోవటమే.

ట్రైలర్

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

6 Comments to “నేనే దేవుడ్ని”

  • పిచ్చివాళ్లు, కాష్ఠాలు, బూడిద పూత .. బాలకి బాగా ఇష్టమైన సబ్జెక్టుల్లాగున్నాయి. ఇంతకు ముందు సినిమాలూ అలాంటివే (సేతు, పితామగన్, నందా). ఇదీ అలాగే ఉన్నట్లుంది.

  • love, faction tappa imka ye stories leka goddu poyina industry ki , chusi bore kodutunna manaki idi nijam ga variety cinema.

  • This video has been removed due to terms and conditions violations :(

  • konchem different ga..unde vi chesthundau e BALA N bai

  • My review coming up very soon. Watch this space very carefully! :)

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories