మ..స..క(మస్కా రివ్యూ)

maska-lead

ముందుగా పాత చిరంజీవి సినిమాల్లో లాగ హీరోయిన్స్ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు అవటం(అయినా వాళ్ళకీ విషయం తెలియదు),అలాగే వాళ్ళిద్దరూ ఒకిరికి తెలియకుండా మరొకరు హీరోతో ప్రేమలో పడటం వంటి ట్విస్టులు,తుపాకీలో ఒకే బుల్లెట్ ఉంది,గేమ్ ఆడుదాం,అంటూ హీరోయిన్స్ ఒకరికొకరు తుపాకీలు గురిపెట్టుకోవటంవంటి టెన్షన్ బిల్డప్ సీన్స్,హీరోయిన్ ఫొటోతో ఆమెవెరో తెలియకుండానే హీరో నాటకమాడటం,తర్వాత ఆమె ప్రత్యక్ష్యమయ్యి హీరోని ఇరుకున పెట్టడం( రాజేంద్రప్రసాద్ బ్రహ్మచారి మొగుడు) వంటి కొత్త ట్విస్టులతో మస్కా కథ తయారు చేసిన కొత్త రచయిత సూర్యని మొచ్చుకోవాలి. ఎందుకంటే సీనియర్స్ బి.గోపాల్,ఎమ్.ఎస్.రాజు వంటి వారిని మెప్పించటం సామాన్యమైన పనికాదు కదా.

ఆ కథేంటో..

ప్రపంచంలో ఎవరినీ లక్ష్య పెట్టకుండా…లక్ష్యమంటూ(పనిలో పనిగా పెద్ద చదువు కూడా) లేకుండా తిరిగే క్రిష్(రామ్)కి గయ్యాలి వదిన(ఝాన్సీ) పోరు తట్టుకోలేని విధంగా ఉంటుంది. విసుగెత్తిన (మారదాం అనుకోడు) మన హీరో అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటాడు.అయితే అతను చదివు ఫ్లస్ టు ఫెయిల్ కి అంత సీన్ లేదు కాబట్టి..అమెరికా వెళ్ళబోయే ఓ అమ్మాయిని ప్రేమలో పడేస్తే ఆమె వెనుకే వెళ్ళిపోవచ్చుకదా అని ఓ ప్లాన్ గీస్తాడు. అలాంటి అమ్మాయికోసం(పాట పాడుకుంటూ) వెతుకుతూంటే మంజు(షీలా)తారసపడుతుంది. అయితే రెండు నెలల్లో అమెరికా చెక్కేసే ఆ చక్కని చుక్కకు తను పెళ్ళాడబోయే వాడిపై కొన్ని విచిత్రమైన అభిప్రాయాలు ఉంటాయి.వాటిల్లో ముఖ్యంగా ఆ కాబోయేకి లవర్..సిగెరెట్,మందు వంటి అలవాట్లు ఉండాలి(ఎందుకంటే తాను మాన్పించమని చెప్పటానికి),అలాగే అతను భగ్న ప్రేమికుడు అయ్యుడాలి..వగైరా..వగైరా. ఆమె అభిరుచులన్నీ దొంగచాటుగా తెలుసుకున్న క్రిష్ ఆమెకు మస్కా వేయటానికి నిర్ణయించుకుంటాడు. అందులో బాగంగా తనో అమర..భగ్న ప్రేమికుడుని అన్నట్లు బిల్డప్ ఇస్తూ..సిగెరెట్లు,మందు మొదలెడతాడు. అంతేగాక తనకు దొరికన ఓ ఫొటో లో అమ్మాయి(హన్సిక)ను చూపుతూ..తన మాజీ లవర్ అని అబధ్దమాడతాడు(ఇది అజిత్ వాలి సినిమా నుండి లిఫ్ట్ చేసిన ఎపిసోడ్). ఇవన్నీ నమ్మి సంతృప్తి చెంది ప్రేమలో పడిపోయిన మంజు తన లవ్ ప్రపోజల్ పెట్టడానికి రెడీ అవుతుంది. అయితే అప్పడే ఆ క్షణానే మన హీరో చూపిన ఫొటోలోని అమ్మాయి..హన్సిక ప్రత్యక్ష్యమవుతుంది. అప్పుడు క్రిష్ ఏం చెప్పి మేనేజ్ చేసాడు. ఇంతకీ హన్సిక ఎవరు..ఇలాంటి లవ్ స్టోరీలోకి పోస్టర్స్ లో చూపుతున్నట్లుగా యాక్షన్ ఎపిసోడ్స్,విలన్స్(ముఖేష్ రుషి,ప్రదీప్ రావత్) ఎలా ఎంటర్ అయ్యారు అనేది తెలియాలంటే…తెరపై చూడాల్సిందే.

ఎన్నోసార్లు హిట్టయిన కథే కదా..సమస్యేంటి

హీరో పాత్ర కథకి సంభంధం లేకుండా కొనసాగటంతో ప్యాసివ్ గా మారటం పెద్ద డ్రా బ్యాక్. అలాగే తను భుజాన వేసుకోబోయే హీరోయిన్ సమస్య ఎక్కడో క్లైమాక్స్ దాకా రివిల్ కాదు. దాంతో ఆ సమస్యే తెలియని వాడు ఏం ఎదిరించి మన మన్ననలు అందుకుంటాడు. అలాగే రెగ్యులర్ గా కధలో విలన్ ఉన్నప్పుడు బుద్ది చెప్పడమనే ఎపిసోడే ఉంటేనే కిక్. అయితే ఒక్క డైలాగ్ తో విలన్ మనస్సు మార్చి క్లైమాక్స్ తేల్చేయటం మరో డ్రా బ్యాక్.(అంత చిన్న డైలాగు ముందే చెప్పేస్తే మన ఓపిక సేవ్ అయ్యేది కదా అన్పించటం అతి సహజం).అదే ఇంతకు ముందు రామ్ చేసిన రెడీలో ఆ విలన్స్ మనస్సు మార్చడమే నవ్వులు కురిపించి సినిమాను నిలబెట్టింది. అన్నిటికంటే ముఖ్యంగా హీరోకి సరైన క్యారెక్టర్ లో క్లారిటీ లేదు.కాసేపు ఇద్దరు హీరోయిన్స్ నీ ప్రేమిస్తున్నానంటాడు.తర్వాత ఒకరి వైపే మ్రొగ్గు చూపుతూంటాడు. అలా పేలవమైన కథ,కథనాలు సినిమాను ముంచేసాయి.అలాగే ఫ్లాష్ బ్యాక్ అని హీరో చెప్పే ఎపిసోడ్..అజిత్ వాలిని గుర్తు చేస్తే…అలా కాఫీ షాపులో కూర్చని మాట్లాడుకోవటం జూమ్ బరాబర్ జూమ్ ని తడుముతుంది. ఇక గోడదూకి హీరోయిన్ ఇంట్లోకి వచ్చే సీన్ ఇడియట్ ని ఇంకా మర్చిపోలేదేనిపిస్తుంది. అలాగే స్పైడర్ మెన్ లోని పైనుంచి(తలక్రిందులుగా) వంగి ముద్దు పెట్టుకనే సీన్ కూడా పెట్టారు. ధూమ్-2లోదే అనుకుంటా తుపాకీ సీన్ (ఎప్పటనుంచే మనవాళ్ళు వాడుతున్నదే అనుకోండి).

నట విన్యాసాలు

నటుల్లో రామ్ ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ ని మాటిమాటికీ గుర్తు చేస్తూ జీవించాడు. హన్సిక,షీలా యధాశక్తి తమ అందచందాలను ఆరబోసారు.విలన్స్ ప్రదీప్ రావత్,ముఖేష్ రుషి గత బి.గోపాల్ చిత్రాల పంధాలోనే వెళ్ళి న్యాయం చేసారు. ఇక దర్శకుడుగా బి.గోపాల్ చెయ్యదగిన సినిమా కాదనిపిస్తుంది.యాక్షన్ ఎపిసోడ్స్,ఎమోషన్స్ అధ్బుతంగా పండించిన ఆయన లవ్ ఎపిసోడ్స్ సరిగా డీల్ చేయలేదనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడా ఆ లవ్ ఫీల్ కలగదు.సంగీతపరంగా చక్రి రొటీన్ పాటలే ఇచ్చాడు. ఇంతకు ముందు ఎమ్.ఎస్.రాజు బ్యానర్ లో చేసిన సినిమాల్లో పాటలు సినిమా పూర్తయ్యాక ధియోటర్ నుంచి వచ్చేటప్పుడు హంట్ చేసేవి..హమ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఇప్పుడా మ్యాజిక్ మిస్సయింది. ఎడిటింగ్, కెమెరా సినిమా స్టాండర్డ్ లోనే ఉన్నాయి.

ఫైనల్ గా

ఏదైమైనా మకర సంక్రాంతి రోజున మెగా నిర్మాత ఎమ్.ఎస్.రాజు మరో మెగా దర్శకుడు బి.గోపాల్ తో కలిసి ఓ బ్రహ్మాండమైన మాస్ ఎంటర్టైన్మెంట్ రెడీ చేసాం రండని పిల్చి ప్రేక్షకులకు మస్కా కొట్టే ప్రయత్నం చేసారు. రాజుగా పేరుపడి ఎన్నో హిట్స్ ఇచ్చిన ఎమ్.ఎస్.రాజుగారు ఇట్లాంటి సినిమాలతో బ్యానర్ వాల్యూని మసక బరచటం నిరాశే. బ్యానర్ వ్యాల్యూ,హన్సక,షీలా ఎక్సపోజింగ్ ప్రొమోలు,రామ్ క్రేజ్ ధియోటర్ దాకా జనాన్ని లాగినా..మౌత్ టాక్ ముంచే ప్రమాదం ఉంది. ఇక ఈ సినిమాను ఏ అల్లరి నరేష్ కామెడీ సినిమాలాగానే ఊహించుకుని వెళితే ఫరవాలేదనిపిస్తుంది. కాబట్టి ఆ కోణంలో ట్రై చేయగలిగే మీరూ..నిర్మాత సేవ్ అవుతారు.

బ్యానర్:సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
నటీనటులు:రామ్,హన్సిక,షీలా,ముఖేష్ రుషి,ప్రదీప్ రావత్,తెలంగాణా శకుంతల,బ్రహ్మానందం,ఎమ్.ఎస్.నారాయణ,పరుచూరి వెంకటేస్వరరావు,సునీల్ తదితరులు
కథ: సూర్య
రచన: పరుచూరి బ్రదర్స్
స్క్రీన్ ప్లే:ఎమ్.ఎస్.రాజు
సంగీతం:చక్రి
కెమెరా:శేఖర్.వి.జోసెఫ్
ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్షన్: రామ్-లక్ష్మన్
నిర్మాత:ఎమ్.ఎస్.రాజు
దర్శకత్వం:బి గోపాల్
రిలీజ్ డేట్:జనవరి 14,2009

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

22 Comments to “మ..స..క(మస్కా రివ్యూ)”

  • so ఇంకో తేలుగు సినెమా రిలీస్ అయ్యింది….

  • ‘వాలి’ సినిమాలో అజిత్ సిమ్రన్ కు చెప్పే జ్యోతిక ట్రాక్ ని మొత్తం సినిమా కథగా మలుచుకున్నారన్నమాట! మరో రోటీన్ తెలుగు సినిమా అన్నట్లుంది. అంటే ఖచ్చితంగా హిట్ అవుతుందేమో. మనోళ్ళకు కావలసింది అంతేగా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించే హీరో,అందాలు ఆరబోసే హీరోయిన్లూ, తలాతోకా లేకుండా విరుచుకుపడే వలన్లూ, మతిలేని కామెడీ,మరిచిపోదగ్గ పాటలూ…కానివ్వండి..మన బ్రతుకులింతే!

    • @కె.మహేష్ కుమార్,

      హ్హాహ్హాహ్హా … బాగా సెలవిచ్చారు మహేష్ గారు ..గోహత్యా పాతుకంతొ సమానం అని తెలిసి కూడ ఇలాంటి సినిమాలు చూస్తాము … అంతటితొ ఆగక ఉత్తమ కుటుంబ కథా చిత్రాలు అని నందులు , పందులు అర్పించుకుంటాం … ఛీ ! వెధవ జన్మ … ఇంకెంత కాలమో ఇలా ?

  • “విసుగెత్తిన (మారదాం అనుకోడు) మన హీరో అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటాడు.”
    అసలు మారదాము అనుకుంటే మనకు సినిమా మొత్తం చూసే భాధ తప్పును కదా? ప్రేక్షకులను హింస పెట్టడమే అసలు లక్ష్యమేమో? అసలు ఎం.ఎస్. రాజు చక్రి ని ఎందుకు ఎంచుకున్నాడో? మన ఖర్మ కాలి

  • చెత్త సినిమాలొస్తున్న తెలుగు సినిమా కి ఒకే ఒక హిట్టు కావాలి. అప్పుడు అందరూ మళ్ళీ అలాంటి సినిమాలే తీసుకోవచ్చు.
    అప్పుడెప్పుడు సమరా….అంటే దాన్ని పట్టుకుని మొన్న మొన్నటి దాకా లాగారు.
    ఆ తర్వాత ఒక్కడు అంటే దాన్ని ఇంకా లాగుతున్నారు.
    ఇక పోకిరి లో ట్విస్ట్ ….ఇప్పుడీ చివరాఖరి ట్విస్ట్ సినిమాల గోల.
    what next?

    • @శిద్దారెడ్డి వెంకట్,
      మన వాల్లని చూస్తే కామంతొ రగిలెపొయె పిషాచుల్లా ఉన్నారని అనిపిస్తుంది, ఒక్క హిట్ సినిమా దొరుకుతె దని సంగతంతె……

      కొత్త వాల్లు కూడ ఏం చేస్తున్నారు, వచ్చి రాని, తెలిసి తెలియని పిల్లల్ని పెట్టి ప్రేమ దొమ అని కబుర్లు చెప్పి అనందపడిపొతున్నరు అంతె-

      ఇవి చూసి బడి పిల్లలు, ఎదిగి ఎదగని పిల్లలకి ఒ అమ్మాయి కావలి అనె అలొచల్ని కలిగిస్తున్నాయి……ఓ కొత్త దర్షకుడా చూడు ఈలొకన్ని, అడపిల్లలు గిల్లి కజ్జాలు దాటి చూస్తె ఓ అద్బుతమైనా ప్రపంచం ఉన్నది….

  • >>>“విసుగెత్తిన (మారదాం అనుకోడు) మన హీరో అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటాడు.”
    ఇది ఏమి పిచ్చి మన సినిమా వాళ్లకి ..

    మస్కా కాస్తా…. తుస్కా అయిపొయిందా!
    నెను అసలు ఈ సారి మన యెం.స్. రాజు గారు ఏ హింది సినిమ కాపి కొడతారొ అనుకున్నా!

    మొత్తానికి అన్ని వండి వార్చారు… సినిమ చూడాలి అన్న బాధను తప్పించేరు … దన్యవాధాములు!

  • అందరికీ తెలుసు, కానీ ఏమి చేస్తాము మన ఖర్మ అనుకుని అదే చూసేస్తుంటాము. పండుగ కదా, ఏదైనా భరించేస్తాము తిట్టుకుంటూనే ఉంటాము, చూస్తూనే ఉంటాము. అదిగో తెలుగు జనమంతా తెగ చూసేసారు కాబట్టి మనమేదో కళాఖండం తీసేసామనుకుంటారు, విజయోత్సవ సభలు, విజయ యాత్రలు….. అబ్బో! నానా హడావిడి. అదేదో పులి అనేసుకొని మరెన్నో నక్కలు వాతలు పెట్టేసుకుంటాయి. ఆ ఖర్మని ఈ సంవత్సరమంతా భరించాల్సి వస్తుంది, ఇప్పుడు కక్కుర్తి పడితే. తెలుగు వాళ్ళు లారా జాగ్రత్త మీ భవిష్యత్తు మీ చేతులలోనే ఉంది మరి!

    • @రామేశబాబు,
      chaala baaga chepparu…..

  • “ఇంతకు ముందు ఎమ్.ఎస్.రాజు బ్యానర్ లో చేసిన సినిమాల్లో పాటలు సినిమా పూర్తయ్యాక ధియోటర్ నుంచి వచ్చేటప్పుడు హంట్ చేసేవి..హమ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం.”

    ఇంతకు ముందు ఎం ఎస్ రాజు సినిమా పాటలు haunt చేసేవి…ఈ సినిమా పాటలు hunt చేస్తాయి

  • thnx suryaprakash gaaru, chaala honest gaa review ichinanduku. :)
    ilaanti movies ki life undakoodadu future lo..lets hope.

    my honest doubt: I have seen ur reviews is thatstelugu.com also. I wonder Y a honest person like u is writing
    in that biased,stupid website.
    I myself couldnt control my emotions while reading some of the most wasteful matter in that website. They just write whatever they think. They dont have credibility. They dont care either. That website is biased, (i think towards-TDP).

    • @shriedhar, సూర్యప్రకాశ్ గారు దట్స్ తెలుగులో చేసేది వృత్తి(అక్కడా సినిమాలమీదే రాస్తారు). నవతరంగానికి రాసేది ప్రవృత్తి. కాబట్టి, ఒకదాంట్లొ భుక్తి మరోదాంట్లో ఆత్మతృప్తీ పొందుతున్నట్లు లెక్క. ఇలా అడిగి ఆయన పొట్టకొట్టకండీ బాబూ!

  • జోశ్యుల గారూ థట్స్ తెలుగులో ఈ సినిమాకి మీ రేటింగ్ సూపర్.కానీ రిలీజ్ అయిన వెంటనే రివ్యూలు రాసేవారుగా.ఈ మధ్య ఏమిటి ఒకరోజు దాటాకా రాస్తున్నారు?ఏమన్నా ప్రత్యేక కారణముందా?

  • DEAR FRIENDZ..

    NINUD PANDAGA ROJU VELTHEY..MIND YEKKADA MASKA BARUTHOUNDO NANI..KANUMA ROJU VELLA…
    PRODUCER,DIRECTOR IDDARLU SERNIORS KADA…MOVIE BAVUNTUNDILE..ANUKUNNA NA ASHALANNI ..ADI ASHLAYYYAI ..
    CLARITY MISS AYYINA HERO CHARACTERISATION..
    SCREENPLAY B GOPAL CHESADANTE..WE CAN`T BELIVE it..ANTHA WEAK GA …BAD GA UNDI …
    YE `SILPAM` ANTHA GA PANDALEDHU….
    konni scenes club chesi ..cut and paste la unnai…
    over all ga…Maska .,.MAAKU…..disappointemnteeeeeeeee..migilchindi…
    Action movies ni chala baaga handle chese senior most director…youthful story ni handle cheylekapoyaru anipinchindi naaku!!!!

  • Hi RAM

    MASKA..KOTTALEKAPOYAVU..
    BUT U ROCKED STEPS YAR..

  • తెలుగు సినిమా చూసినప్పుడల్లా మైండు బ్లాక్ అవుంది. ఆదే పాత రోత కొత్త మొరిలో, ఎప్పుడూ అవ్వె రికార్డింగు డాన్సులు, వెటకారలు ఏవడోభానమతి చేసినట్లు అవె అరుపులు పెడ బొబ్బలు.

    ఎ సినిమా చూసిన ఎమున్నది గర్వకారనం

    నేటి సినిమా చరిత్ర సమస్తం లేఖి తనం….

  • ఇంత పద్దతి గా సూర్య ప్రకాష్ గారు ఈ సినిమాని గురంచి సమీక్ష వ్రాసినా….సినిమాల మీద ఉన్న పిచ్చి తో ఈ సినిమా కి వెళ్ళాను…….

    మన దర్శకుడు బి.గోపాల్…. “మీరు మన తెలుగు సినిపరిశ్రమని ఎంత మార్చలని ప్రయత్నించినా మేము మాత్రం మారం అని ……మా సినిమా లో ఎప్పుడు విల్లన్లు ఒక ఫొటొ పట్టుకొని వీరిని మీరు ఎక్కడైన చూసార అని అడుగుతూ ఉంటారు …? మన దరిద్రానికి సినిమా లో ఇది ఒక ట్విస్ట్ అన్నమాట”…

    ఇంకొక దర్శకుడుని చూస్తే మీ సినిమా ఎందుకు ఫ్లప్ అయింది అంటే “మేమింతే…మేమంతే” అని ఇంటర్విలు ఇస్తాడు

  • సినిమా సంగతి ఏమో కానీ.. గమనించారో లేదో .. పాటల్లో మన చక్రిగారి గొంతు లేదు. :) ) నేనింతే సినిమా పాటలను ఆయన తన గొంతుతో పాడి చెడగొట్టేసారు కదా… (అంటే.. వేరే వాళ్ళు పాడుంటే, బావుండేదని కాదు. ;) ) ఆ శిక్ష నుంచైనా మనల్ని రక్షించారు. :)

    • @Pradeep, ఎందుకు లేదండి బాబు, కల్లోకి దిల్లోకి,కలగన్నా అని రెండు హింస పాటలు అతగాడే పాడాడు

      • @గోపీచంద్, oh, నేనసలు సరిగ్గా విన్నానో లేదో ! పోయినసారి “నేనింతే”లో ఆయన గొంతు విని తట్టుకోలేక పొయ్యా..
        ఇది బానే ఉంటే, చక్రి కాదేమో పాడింది అనుకున్నా.. :)

  • హలొ, తెలుగు సినిమా ఒక అధ్భుతమని నాకు నిన్న అరుంధతి చుసక తెలిసింది.

  • నాదో విషాద గాథ! మాదాపూర్ లోని హైటెక్ థియేటర్ లో 16 న అరుంధతి రిలీజ్ అని టికెట్స్ బుక్ చేయమంటే మా ఆయన వాళ్ళ ఆఫీసులో కుర్రాళ్లకు అప్పగించారు. వాళ్ళేమో హాల్లో ఏ సినిమా ఉందో చూడకుండా తెచ్చారు టికెట్లు. ఆ విధంగా నేను రివ్యూలు చదివాక కూడా మస్కా చూడాల్సి వచ్చింది. ఇంతా చేసి అరుంధతి రిలీజ్ ఆలస్యం అవుతుందని నాకేం తెలుసు?

    సింగిల్ టేక్ లో చేసిన రామ్ స్టెప్పులు తప్ప ఇంకేం లేదు ఈ సినిమాలో!

    విష్ణువర్ధన్ రెడ్డి, మీ కామెంట్ కేక! విలన్లు ఫొటోలు పట్టుకుని….హ హ!

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories