Menu

కృష్ణవంశీ అసిస్టెంట్ కావాలంటే..

తెలుగు సినీ పరిశ్రమ మెల్లిగా కార్పోరేట్ పద్దతులు వంటబట్టించుకుంటోంది. అందులో భాగంగా శేఖర్ కమ్ముల వంటి నూతన తరం దర్శకులు తమ దగ్గర దర్శకత్వ విభాగంలో చేరుదామనుకునే వారికి టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు క్రియేటివ్ దర్శకుడుగా పేరు సంపాదించుకున్న కృష్ణ వంశి కూడా అదే రూటులో పయినిద్దామనుకుంటున్నారు. ఆయన వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేయాలనుకునే వారికి ఓ పరీక్ష నిర్వహిస్తున్నారు.రెండు రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆ పేపరు..లో ఉన్న అంశాలు ఇవి.(యధాతథంగా…)

1.మీకు నచ్చిన సినిమా -(ఎందుకు)- పాత సినిమా-

నేటి సినిమా-

2. మీకు నచ్చిన దర్శకుడు -ఎందుకు

3.మీకు నచ్చిన పుస్తకం

4. మీకు నచ్చిన సంఘటన

5.మీకు నచ్చని సంఘటన

6.భవిష్యత్తులో దర్శకుడు అవ్వాలన్న మీ నిర్ణయానికి ఇప్పుడు మీరు చేస్తున్న హోమ్ వర్క్

7. మీకు ఎలాంటి సినిమా చెయ్యాలనుంటుంది

8.ఎంతవరకు చదవుకున్నారు..చదువు మన సినిమాకి ఉపయోగపడుతుందా

9.సినిమాల్లోని దర్శకత్వ శాఖ కాకుండా మిగతాశాఖలపై మీ అవగాహన

10. నేటి రాజకీయాలపై సగటు మనిషిగా మీ స్పందన.

పది నుంచి ఇరవైలైన్లకు మించకుండా

కృష్ణవంశీ గురించి కాకుండా

ఆసక్తి ఉన్నవారంతా కృష్ణవంశి ఆఫీసుకు వెళ్ళి అప్లికేషన్ తీసుకుని, వారిచ్చే ప్రశ్నలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ట్రై చేసేవారికి బెస్ట్ ఆఫ్ లక్.

6 Comments
  1. shree January 30, 2009 /
    • ravi January 30, 2009 /
  2. Sai Brahmanandam Gorti January 31, 2009 /
  3. kolord97@gmail.com February 28, 2009 /