ఇదేం ఫిట్టింగ్..మాస్టర్?
గతంలో మిత్రుడొకడు..’షకీలా నన్ను మోసం చేయదు’ అనే టైటిల్ తో ఆర్టికల్ రాయండి అన్నాడు. అర్ధం కాక అదేంటి అన్నాడు. అవునండీ షకీలా సినిమాకి పోస్టర్స్ చూసి వెళితే ఆవిడెప్పుడూ నన్ను మోసం చేయలేదు..ఆవిడ తరహా శృంగార భంగిమలు ఉన్నాయి..కానీ మన తెలుగులో చాలా సినిమాలు పోస్టర్స్ ,ప్రోమోస్ చూసి ధియోటర్ కి వెళితే అలాంటిదేమీ అక్కడ కనపడదు..గమనించండి…అంటూ ఆవేదన చెందుతూ చెప్పుకొచ్చాడు. ఆ మేటర్ అప్పుడు పూర్తిగా అర్ధం కాలేదు..కానీ ఫిటింగ్ మాస్టర్ సినిమా చూస్తే అర్ధమయింది. టైటిల్,పోస్టర్స్ చూసి ఏదో గొప్ప (పోనీ సాధారణ)కామిడీ చిత్రరాజం చూద్దామని ధియోటర్స్ కి పరుగెడితే అంతా సీరియస్ సినిమా. పాత .శోభనబాబు,రోజాల సర్పయోగం సినిమాను మార్చి మనమందు పెట్టాడు.దాంతో కామెడీ సినిమా చూపిస్తారనుకుంటే..ఇలాంటి ఫిటింగ్ పెట్టారేంటి మాస్టర్..అని భోరున ఏడ్వాలనిపిస్తుంది.
జిమ్ మాస్టర్ గా(ప్చ్) పనిచేసే సంపత్(అల్లరి నరేష్)కి ప్రేమలంటే ఎందుకనో తీవ్రమైన అసహ్యం. దాంతో అలాంటిదేమన్నా పొరపాటున అతని కంటబడితే ఎదుటివాళ్ళకి(మనకు కూడా) విరక్తి పుట్టేలా క్లాస్ పీకుతూంటాడు. ఇది గమనించి వింతగా అనిపించిన ఓ డబ్బున్న పనిపాటా లేని అమ్మాయి మేఘన(మదాలస శర్మ) అతన్ని ఎలాగయినా ప్రేమ ముగ్గులోకి దింపుతానని ప్రతిజ్ఞ పూని రంగంలోకి దూకుతుంది. దాంతో ఇలాంటి అవాకాశం కోసమే ఎదురు చూస్తున్నట్లు సంపత్ దానికీ బ్రేక్ వేసి ఆ అమ్మాయి ఇంటికెళ్ళి తల్లి తండ్రులను కలిసి మీ అమ్మాయి జాగ్రత్త అని చెప్పేసి..కన్నవాళ్ళ ప్రేమ చాలా గొప్పది అని పనిలో పనిగా ఆమెకీ క్లాస్ పీకేసి బయిటపడతాడు. ఏమిటీ ఇతగాడికి మెంటలా…. వయిస్సులో ఉండి ఇలాంటి విచిత్రమైన కబుర్లు చెబుతున్నాడేంటి అని మనం ఆశ్చర్యపడే లోగా ఓ వ్యక్తిని ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చంపేస్తాడు. తేరుకునేలోగా తన ప్రేమ రాయిబారం నడపటానికి మేఘన తన అన్నని అమెరికానుంచి పిలిపిస్తే అతన్ని చంపేస్తాడు. ఎవరీ సంపత్..ఎందుకిలా చంపుతున్నాడు. చంపే సమయంలో అతనికి ఎందుకు గతం గుర్తు వస్తున్నట్లు పాజిటివ్ ఫిల్మ్ ఎందుకు కనపడుతోంది. అన్న విచిత్రమైన సమాధానాలు స్వయంగా తెలుసుకోవాలంటే…తెరమీద చూడటమే ఉత్తమం. అప్పటి దాకా ఆగలేని వారికో క్లూ..హీరోకో ఎన్టీఆర్ రాఖీ లాంటి ఫ్లాష్ బ్యాక్ సెకెండాఫ్ లో ఉంటుంది. కథ ఊహించగల్గేదే…అంత ఊహాశక్తి లేకపోతే…
ఇక స్క్రిప్టు మొత్తం పకడ్బందీగా చిన్నమెత్తు కామెడీ అనేది లేకుండా.. అన్ని జాగ్రత్తలూ తీసుకునే ఇవివి తన స్వీయ బ్యానర్ ఈ సినిమాని నిర్మించారు. అయితే మరెందుకు తీసాడు అంటే…అనవరసంగా కొడుకు కామెడీలంటూ చిన్న హీరోగా మిగిలిపోతున్నాడు…అని బాధపడి యాక్షన్ హీరోగా చూపాలన్ని తపనతో ఫైట్స్ చేయించి చూపించటానికి ఈ సినిమా తీసాడని మనకి అర్ధమయిపోతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో హీరో కేవలం పగ తీర్చుకునే కధ అని ఫిక్సయి తీయాలంటే పోలిక అని కాదు కాని గజనీ రేంజ్ స్టాండర్డ్ (ఫెరఫెక్ట్ స్క్రిప్టు ఉండాలి..అలాగే గజనీలో ఇంటర్నెల్ కాంప్లిక్ట్ జ్ఞాపక శక్తి తగ్గిపోవటం,విలన్ కి తెలిసి తప్పించుకోవాలని చూడటం ఉంటాయి) అంతేగాని వెళ్ళి విలన్స్ ని సైలెంట్ గా చంపేసి తన పని చూసుకుంటున్నాడంటే అది సహనానికి పరీక్షే. పోనీ అలా పగ తీర్చుకునే ప్రాసెస్ లో అతను ఏదన్నా తెలుసుకుని పదిమందికి ఉపయోగపడేలా తయారయితే ఓ భారతీయుడు సినిమానో,రాఖీనో అయ్యేది. అలాంటిదేం లేకపోవటమే నధింగ్ మాస్టర్ గా మిగిల్చింది.
ఇన నటీనటుల్లో నరేష్ ఎప్పటిలాగేనే బాగా చేద్దామనే ప్రయత్నం చేసాడు. కానీ మరీ జిమ్ ట్రైనర్ అనీ అందరినీ పైట్స్ చేసి చిత్కక్కొట్టేస్తున్నాడంటే నమ్మశక్యం కాదు. అలాగే హీరోయిన్ గా మదాలసా శర్మ తన భారీ అందాలుతో తెరనిండా పరిచింది.రౌడీ అయిపోవాలనే జీవీతాశయం తో హీరో చేసే హత్యలను మీదేసుకునే పాత్రలో అలీ కనిపించినా నవ్వించలేకపోయాడు. అలాగే అలీ అనుచరులుగా జయ ప్రకాష్ రెడ్డి,చలపతిరావు ఈ మధ్య కాలంలో ఇలాంటి నీరసమైన పాత్రు చేసుండి ఉండరు.
ఇక మేజర్ గా అనిపించిన పెద్ద లోపం. దర్శకుడుగా ఇవివి కమిట్ మెంట్ తో తీసినట్లుండటకపోవటమే. ఎందుకంటే కధ ద్వారా ఆయన చెప్పే విషయం అమ్మాయిలను…కొంత మంది ప్రేమ,పెళ్ళి అని మోసగించి, కెమెరాలలో బంధించి మార్కెటింగ్ చేసుకుంటున్నారని.. వారికి దూరంగా ఉండమని…అలాగే ప్రేమ పెళ్ళి అనేవి మంచివి కావని..అయితే ఇలాంటి కథ చెప్పేటప్పుడు ఇవివి తాను కూడా ఆ భావాలు నమ్మాలి కదా. అలా కాకుండా అవకాశమున్నచోటల్లా ఆడపిల్లలతో ఎక్సపోజింగ్ చేయిస్తూండటం చూస్తుంటే…ఆయన ఏది ఆశించి ఈ సినిమా చేసారు అనేది అర్ధమవుతుంది. అలాగే ఎప్పుడూ ఇవివి సినిమాల విజయాలకు తోడుండే వేగెష్న సతీష్ కలం ఈ సారి సరైన మాటలు రాయలేక పోయింది.
ఏదైమైనా ఈ మధ్య వరస విజయాలతో చిన్న చిత్రాల పెద్ద హీరోగా వెలుగుతున్న నరేష్ కి తండ్రే విలన్లా తయారై ఫిట్టింగ్ మాస్టర్ వంటి పెద్ద ఫ్లాప్ లివ్వటం దారుణమనిపిస్తుంది. అయితే ఇవి దిష్టిచుక్కల్లా మిగులుతాయని ఆశిద్దాం. ఇక ఇప్పటికీ ఈ సినిమాకు వెళ్ళాలనిపిస్తే… త్వరగా బయిలుదేరటం మేలు..ఎందుకంటే బయిట మౌత్ టాక్ బాగోలోదు. ఏ క్షణమైనా ధియోటర్ వదిలి సినిమా పరారవ్వవచ్చు. అయినా కామెడీ సినిమా చూపిస్తారనుకుంటే..ఇలాంటి ఫిటింగ్ పెట్టారేంటి మాస్టర్..
బ్యానర్ : ఇవివి.సినిమా
నటీనటులు: అల్లరి నరేష్,మదాలసా శర్మ,షాయేజి షిండే,సుధ,చంద్రమోహన్,సైరాబాను తదితరులు.
స్క్రిప్టు: తాడి బలరామ్,వేగేష్న సతీష్
డాన్స్: చిన్ని ప్రకాష్ అండ్ కో
ఆర్ట్ : కెవి సుబ్బారావు
సంగీతం : ఎస్.చిన్నా
ఫైట్స్ : రామ్ లక్ష్మన్,విజయ్
కెమెరా : ప్రసాద్ బాబు
కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం,నిర్మాత: ఇవివి సత్యనారాయణ
రిలీజ్ తేది : 14,జనవరి 2009
Filed Under: featured • lead • తెలుగు • భారతీయ సినిమా • సమీక్ష
“నరేష్ కి తండ్రే విలన్లా తయారై ” దగ్గర నచ్చారు.. చాలా సార్లు ఈవీవీ “ఏదో తీసేద్దాము” అనుకున్నప్పుడల్లా ఏదో అయిపోవడం చూసాము (ఆరుగురు పతివ్రతలు, మొన్న ఇంకొటేదో వచ్చింది – నరేష్ తోనే). అలా కాకుండా, ఆయనకీ తెలిసిన మార్గం లో వెడితే అక్కడక్కడా embarrass చేసినా (డబల్ మీనింగ్ డైలాగ్స్ లాంటి వాటి వల్ల), కొంచెం గుర్తు వుంచుకొనే సినిమాలు తియ్యగలడు అనిపిస్తుంది.
ఈ సినిమాను ఎలా భరించారండీ బాబూ! నేను అరగంట చూసి పారిపోయాను.
ఎక్కడైనా heroine కాని సాంగ్ దగ్గర కాదని…
90 దశకం వరకు హాస్యం అనే పదానికి మంచి అర్ధం ఉండెది, కీర్తిశెషులు జంధ్యాల గారి పుణ్యాన!
వారి శిష్యుడు ఇ వి వి గారు మాత్రం .. దీనికి కొత్త భాష్యం వెలికి తీసెరు… వెకిలి వేషాలు, కుటుంబ సభ్యులతొ చూడలేని సినిమాలు.
అల్లరి నరేష్ ని హీరొ గా పెట్టి EVV తీసె సినిమాలు చూస్తుంటె ” అసలు నరేష్ ఇవివి సొంత కొడుకేనా ? ” అనే అనుమానం కలుగుతుంది నాకు … EVV జంధ్యాల గారి శిష్యుడన్నప్పుడు , నరేష్ ని నటకిరీటి రాజెంద్రునితో పొల్చినప్పుడు బాధ కలుగుతుంది …
“గతంలో మిత్రుడొకడు..’షకీలా నన్ను మోసం చేయదు’ అనే టైటిల్ తో ఆర్టికల్ రాయండి అన్నాడు.”
హ హ బాగా దెబ్బతిన్నాడు తెలుగు సినిమాలు చూసి.
జాలేస్తుంది!
తమ గోతిని తామే తవ్వేసుకునే వాళ్ళని చూస్తుంటే ,
ఇలాంటి సినిమాలు తీసి వాళ్ళు, చూసి మనం
పెద్దలు చెప్పింది నిజమే
ఎవరి ఖర్మకు వాళ్ళే బాధ్యులు పూర్తిగా
@రామేశబాబు,
ఎవ్వడొ ఖర్మకి మనం బాధితులం అవుతున్నాము…
@Uttara,
మరే! మరిచేపోయాను, ఆ బాధలో! వేరొకరి కర్మ మనకు ఖర్మ! నిజమే మా బాగా పట్టేసారు సుమీ!