Menu

‘అరుంధతి’ మాయాజాలం

71హారర్. ఫేంటసీ,సోషియో-ఫేంటసీ లాంటి పదాలు హాలీవుడ్ లో సినిమాల్ని   (genre గా) విభజించడానికి ఉపయోగిస్తే,ఈ ప్రక్రియల్నన్నింటినీ కలగలిపి మన తెలుగువాళ్ళు సినిమాలు తీసేస్తారు. అన్నీ కలిపిన కలగూరగంప కాబట్టి ఏ పేరుతో పిలవాలో తెలీక,  “మాయాజాల చిత్రాలు” అని నేనే ఒక genre కనిపెట్టేసా! ఇలాంటి మాయాజాల సినిమాలు విఠలాచార్యనుంచీ మన తెలుగుకి వారసత్వంగా వస్తే, ఈ కథనరీతిని మరోమెట్టుకు తీసుకెళ్ళిన visionary నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి అని ‘అమ్మోరు’ సినిమా నిరూపించింది. ‘అంజి’ నిరాశపరిస్తే,ఇప్పుడు ‘అరుంధతి’ తన సత్తాను నిరూపించిందని చెప్పక తప్పదు.

చందమామ కథకు పదునైన కథనాన్నీ, పొందికైన గ్రాఫిక్స్ ని సందర్భోచితమైన సొగసుల్నీ అద్దితే అరుంధతి సినిమా అవుతుంది. 80 సంవత్సరాల క్రితం గద్వాల్ సంస్థానంలో పశుపతి అనే దుర్మార్గుడైన  ఒక అఘోరా మాంత్రికుడికీ(సోనూసూద్) ఒక అభిమానవతి అయిన రాజకుమారి అరుంధతి- జేజమ్మ (అనుష్క)కీ మధ్య జరిగిన ఘటన మళ్ళీ ఈ అధునిక కాలంలో పునరావృతం అవుతుంది. అరుంధతిగా మళ్ళీ పునర్జన్మ ఎత్తిన జేజమ్మను ఆ అఘోరా క్షుద్ర ఆత్మ ఎలా కష్టాలపాలు చేసేప్రయత్నం చేసింది, ఆ కష్టాలను ఒక ముస్లిం తాంత్రికుడు అన్వర్(షయాజీ షిండే) సహయంతో ఎలా అధిగమించిందీ అనేది కథ.

10arundh121ఇప్పటివరకూ కేవలం అలంకారప్రాయమైన పాత్రలకో లేక అంగప్రదర్శనకు పరిమితమైన హీరోయిన్ గా ఉన్న అనుష్క ఈ సినిమాలో నటనా పరంగా మంచి ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. అభిమానవతి,సాహసి, రాకుమారి జేజమ్మగా తన గంభీరమైన నటన ఒక ఎత్తయితే మూఢనమ్మకాలని కొట్టిపడేసే ఒక అధునిక యువతి, తన జీవితంలో ప్రత్యక్షంగా అనుభవమయ్యేసరికీ ఏంచెయ్యాలో పాలుపోని కలవరపాటుకు గురవుతూ చివరకు తన కలవరపాటుని ధైర్యంతో పక్కకునెట్టి కార్యసాధనకు పూనుకునే మరొక పాత్రలో అనుష్క నటన ప్రశంసనీయం. తన ఎత్తు, విగ్రహం, స్క్రీన్ ప్రెజెంన్స్ ఈ పాత్రకు వన్నెతెచ్చాయి. స్త్రీలోలుడైన పశుపతిగా ఆ తరువాత అఘోరా మాంత్రికుడిగా సోనూ సూద్ ఆకట్టుకుంటాడు. ముస్లిం తాంత్రికుడిగా షయాజీ షిండే తన సహజమైన హడావిడి నటనను ప్రదర్శించినా, ఆ పాత్ర ఔచిత్యం ఆ పాత్రకు రాసిన తెలివైన సంభాషణల వలన గుర్తుంచుకోదగ్గదిగా మిగిలింది. ఆకాలానికీ ఈ కాలానికీ వారధిగా మిగిలిన పాత్రలో మనోరమ తన తమిళ నటనను ఒలికించింది. తాతయ్యగా కైకాల సత్యనారాయణ నటన సందర్భోచితంగా ఉంది. మిగతా పాత్రలు కేవలం ఉనికేతప్ప ప్రాముఖ్యత లేనివి కాబట్టి పెద్దగా చెప్పుకోవల్సిన అవసరం లేదు.

ప్రత్యేకమైన కామెడీ ట్రాక్, అనవసరమైన పరిచయ దృశ్యాలూ లేకపోవడం కథనం రీత్యా ఈ సినిమాకు చాలా “ప్లస్” అయ్యే విషయాలు. జేజమ్మ అఘోరాను చంపే దృశ్యంలో వచ్చే నృత్యం మరింత బాగా తీసుండొచ్చు. అరుంధతి పెళ్ళి సందర్భంగా సాగే పాట ఒక అనవసరం. ‘కోటి’ సమకూర్చిన సంగీతం సాంప్రదాయబద్ధంగా ఉన్నా, సినిమా స్థాయికి తగ్గట్లుగా అస్సలు లేదు. ముఖ్యంగా నేపధ్యసంగీతం ఈ సినిమాకు పెద్ద లోటు.అత్యంత కీలకమైన దృశ్యాలలో అత్యంత పేలవమైన నేపధ్యసంగీతాన్ని సమకూర్చి సినిమా స్థాయిని దిగజార్చడంలొ కోటి తనవంతు కృషి చెసారు.అంతేకాక సినిమాలోని ముఖ్యమైన ఘట్టాల్లోవచ్చే నేపధ్యగీతాన్ని భాషరాని, భావం పలుకలేని కైలాష్ ఖేర్ తో పాడించి పాపంకూడా కట్టుకున్నారు. గ్రాఫిక్స్ హాలివుడ్ స్థాయిలో లేకపోయినా, భారతీయ సినిమాలో ఈ స్థాయి విజువల్ క్రియేషన్ ఇదే ప్రధమం అనుకోవచ్చు. ఈ సినిమాకు ఒక pan Indian appeal ఉందనిపిస్తుంది. దర్శకుడిగా కోడిరామకృష్ణ చేసింది నటులదగ్గరనుంచీ నటన రాబట్టడం ఒక్కటే కాబట్టి అందులో తనవంతు సహకారం అందించారనే చెప్పాలి.

చివరిగా, ‘అరుంధతి’ ఒక మాయాజాలం. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి నమ్మకానికీ, సినిమాపట్ల తనకున్న passion కీ చిహ్నం.అస్సలు నిరాశపరచని చిత్రం. ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం.

58 Comments
 1. చందు January 19, 2009 /
 2. vamshi January 19, 2009 /
  • vamshi January 19, 2009 /
 3. pappu January 19, 2009 /
 4. హనుమంత రావు January 19, 2009 /
 5. Harsha January 19, 2009 /
 6. సుజాత! January 19, 2009 /
  • రామేశబాబు January 19, 2009 /
 7. shree January 19, 2009 /
 8. విష్ణువర్థన్ రెడ్డి January 19, 2009 /
 9. అబ్రకదబ్ర January 19, 2009 /
  • అబ్రకదబ్ర January 19, 2009 /
 10. Soujanya Kumar M D January 20, 2009 /
 11. VENKAT.B January 20, 2009 /
  • ravi January 24, 2009 /
 12. శ్రీ January 21, 2009 /
 13. Reddy Ganta January 21, 2009 /
 14. గోపీచంద్ January 21, 2009 /
  • Somasekhar, Mahaboobnagar January 25, 2009 /
 15. sreedhar January 22, 2009 /
  • Sarath January 25, 2009 /
 16. గోవిందయ్య January 23, 2009 /
   • గోవిందయ్య January 27, 2009 /
   • చెత్తపాళీ January 28, 2009 /
   • చెత్తపాళీ January 28, 2009 /
   • గోపీచంద్ January 26, 2009 /
   • గోపీచంద్ January 26, 2009 /
 17. sreedhar January 23, 2009 /
 18. గోవిందయ్య January 23, 2009 /
 19. kalyan January 23, 2009 /
  • రామేశబాబు January 25, 2009 /
   • kalyan January 26, 2009 /
 20. kalyan January 28, 2009 /
 21. చందు January 29, 2009 /
 22. Chetana February 6, 2009 /
 23. అజిత్కుమార్ March 19, 2009 /
 24. N.Ravindra March 22, 2009 /
 25. Priya Iyengar March 23, 2009 /
 26. Satyam March 25, 2009 /
 27. PASUPATHI April 3, 2009 /
 28. ravi July 13, 2009 /
 29. prabhakarreddy January 19, 2010 /
 30. prabhakarreddy January 19, 2010 /
 31. prabhakarreddy January 19, 2010 /
 32. prabhakarreddy January 19, 2010 /