మన వాడు మళ్ళీ (ఏఆర్‌ రెహ్మాన్‌కు ‘గోల్డెన్‌గ్లోబ్‌’ అవార్డు)

arrahman-feature

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ ప్రతిభకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సినీ సంగీత ప్రపంచంలో అత్యున్నతంగా భావించే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును సాధించిన తొలి భారతీయునిగా రెహమాన్‌ రికార్డులకెక్కాడు. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రానికిగాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డుకూడా లభించింది. సైమన్‌బ్యుఫోయ్‌ ఈ అవార్డు గెలుచుకున్నారు. ఇదే చిత్రంలోని జయహో పాటకుగాను గీత రచయిత గుల్జార్‌కు ఉత్తమ గీతరచయిత అవార్డు లభించింది. ఇంకా ఇదే చిత్రానికిగాను డాన్‌బోయ్ల్‌కు ఉత్తమ దర్శకుడు అవార్డు కూడా లభించింది. భారతీయ రాయబారి వికాస్‌స్వరూప్‌ రాసిన ఓ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని అనిల్‌కపూర్‌, ఇర్ఫాన్‌ఖాన్‌లతో నిర్మించారు. ముంబయిలోని ఓ మురికివాడలో నివసించే జమాల్‌ అనే వ్యక్తి తన ప్రేమను గెలిచేందుకు ఓ భారతీయ రియాల్టీషోలో పాల్గొని మొదటి బహుమతి గెలవటం దీని ఇతివృత్తం. ప్రపంచంలో మరోసారి భారతీయులని తల గర్వంగా ఎత్తుకునేలా చేసిన ఈ సంగీత సరస్వతికి నవతరంగం కృతజ్ఞతలు చెప్పుతూ..అభినందనలు తెలుపుతోంది.

గోల్డన్ గ్లోబ్ విజేతల పూర్తి వివరాలు:

Best film (drama)
Slumdog Millionaire
Also nominated: The Curious Case of Benjamin Button, Frost/Nixon, The Reader, Revolutionary Road

Best film (musical or comedy)
Vicky Cristina Barcelona
Also nominated: Burn After Reading, Happy-Go-Lucky, In Bruges, Mamma Mia

Best director
Danny Boyle (Slumdog Millionaire)
Also nominated: Stephen Daldry (The Reader), David Fincher (The Curious Case of Benjamin Button), Ron Howard (Frost/Nixon), Sam Mendes (Revolutionary Road)

Best actor (drama)
Mickey Rourke (The Wrestler)
Also nominated: Leonardo DiCaprio (Revolutionary Road), Frank Langella (Frost/Nixon), Sean Penn (Milk), Brad Pitt (The Curious Case of Benjamin Button)

Best actress (drama)
Kate Winslet (Revolutionary Road)
Also nominated: Anne Hathaway (Rachel Getting Married), Angelina Jolie (Changeling), Kristin Scott Thomas (I’ve Loved You So Long), Meryl Streep (Doubt)

Best actor (musical or comedy)
Colin Farrell (In Bruges)
Also nominated: Javier Bardem (Vicky Cristina Barcelona), James Franco (Pineapple Express), Brendan Gleeson (In Bruges), Dustin Hoffman (Last Chance Harvey)

Best actress (musical or comedy)
Sally Hawkins (Happy-Go-Lucky)
Also nominated: Rebecca Hall (Vicky Cristina Barcelona), Frances McDormand (Burn After Reading), Meryl Streep (Mamma Mia), Emma Thompson (Last Chance Harvey)

Best supporting actor
Heath Ledger (The Dark Knight)
Also nominated: Tom Cruise (Tropic Thunder), Robert Downey Jr (Tropic Thunder), Ralph Fiennes (The Duchess), Philip Seymour Hoffman (Doubt)

Best supporting actress
Kate Winslet (The Reader)
Also nominated: Amy Adams (Doubt), Penelope Cruz (Vicky Cristina Barcelona), Viola Davis (Doubt), Marisa Tomei (The Wrestler)

Best foreign language film
Waltz with Bashir
Also nominated: The Baader Meinhof Complex, Gomorrah, I’ve Loved You So Long

Best animated feature film
Wall-E
Also nominated: Bolt, Kung Fu Panda

Best screenplay
Simon Beaufoy (Slumdog Millionaire)
Also nominated: David Hare (The Reader), Peter Morgan (Frost/Nixon), Eric Roth (The Curious Case of Benjamin Button), John Patrick Shanley (Doubt)

Best original song
The Wrestler (The Wrestler)
Also nominated: Down to Earth (Wall-E), Gran Torino (Gran Torino), I Thought I Lost You (Bolt), Once In A Lifetime (Cadillac Records)

Best original score
AR Rahman (Slumdog Millionaire)
Also nominated: Alexandre Desplat (The Curious Case of Benjamin Button), Clint Eastwood (Changeling), James Newton Howard (Defiance), Hans Zimmer (Frost/Nixon)

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

12 Comments to “మన వాడు మళ్ళీ (ఏఆర్‌ రెహ్మాన్‌కు ‘గోల్డెన్‌గ్లోబ్‌’ అవార్డు)”

  • Rehman…rocks…!!!

  • congrats to A.R.Rahman and also to late Heath Ledger.

  • Rahman.. India is proud of you..!
    You truly deserve it.. :)

  • The achievement is still lesser to ARR, for a such wonderful music ….
    Irfan Khan’s performance is absolutely … rocking and not to mention the guest appearance fo Anil Kapoor.
    Atleast now the film makers should wakeup and not to commercialize the media…

  • “…thanks to billion people from India”- ‘Allah Rakha Rahman’ You Rock! Congratulations.

  • మంచి వార్త.
    త్వరలో రహమాన్ తో నవతరంగంలో ఇంటర్వ్యూ చేద్దాం.
    రెవుల్యూషనరీ రోడ్ సినిమా చూసి ఇక కేట్ కి ఆస్కార్ గ్యారంటీ అనుకున్నాను. గోల్డన్ గ్లోబ్ వచ్చింది. ఆస్కార్ కూడా వస్తుంది. ఈ సారి బెస్ట్ యాక్ట్రెస్ మరియు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కూడా కేట్. బెస్ట్ యాక్టర్ కి చాలా పోటీలా ఉంది. డి కాప్ రివల్యూషనరీ రోడ్ లో చింపేసాడు. కానీ wrestler లో మికీ అంత కాదు.milk లో షాన్ పెన్ కూడా చాలా బాగా చేశాడు.
    చూడాలి ఆస్కార్ ఎవరికి వస్తుందో.
    ఈ మధ్య కాలంలో హాలీవుడ్ లో ఇన్ని మంచి సినిమాలు, ఇన్ని మంచి performances ఉన్న సంవత్సరంగా 2008 గుర్తుండిపోతుంది.

  • ఇది మన భారతీయులందరికి గర్వకారణం. రహమాన్ గారికి ధన్యవాదాలు మరియు అభినందనలు.

  • నిజానికి, రహమాన్ ఈ సినిమాకి అంత గొప్ప స్వరాలేమీ ఇవ్వలేదు. ఇతర ఎంట్రీలతో పోలిస్తే ఇది మెరుగేమో కానీ, రెహమాన్ ఇతర సినిమా ఆల్బమ్స్‌తో పోలిస్తే మాత్రం స్లమ్‌డాగ్ సంగీతం నాసిరకమే. ఏదేమైనా ఇది రహమాన్ ప్రతిభకి తగ్గ గుర్తింపు. ఇదే ఊపులో ఆస్కార్ కూడా కొల్లగొడతాడని ఆశిద్దాం.

    • @అబ్రకదబ్ర, రోజా,బొంబాయి,దిల్ సే సినిమాలతో పోలిస్తే స్లమ్ డాగ్ సంగీతం మనకు గొప్పగా అనిపించకపోవచ్చు. కానీ మిగతా ప్రపంచానికి ఈ కొత్తతరహా సంగీతం (విపరీతంగా)నచ్చింది. అందుకే పట్టంకట్టారు. అదీ రెహమాన్ గొప్పతనమే కదా!

  • నమస్కారం అబ్రకదబ్ర గారు,

    చాలా బాగా విశ్లేషించారు. ఏది ఏమైనా రహ్మాన్ గారికి ఆస్కార్ దక్కాలని నిండు మనసుతో కోరుకుందాం…

  • Now da award gained momentam..its name and fame…

    hatesoff ..
    music scientist AR Rehaman…

  • ఏ.ఆర్. రెహెమాన్ కు ఆస్కార్ అవార్డ్ రావడం భారతీయులంతా సంతోషించదగ్గ విషయమే, కానీ ఆ సినిమాలోని సంగీతం రెహెమాన్ స్థాయికి తగినట్టుగా ఉందా అని రెహెమాన్ అభిమానులుగా మాకు అర్థం కాని విషయం. రోజా,దిల్ సే,బొంబాయి వంటి ఎన్నో సినిమాలలో రెహెమాన్ అందించిన సంగీతం మాత్రం శ్రోతల మనసుల్లో కలకాలం ఉండిపోతుంది. ఐతే భారతీయులు అందరూ గర్వపడవలసింది రెహెమాన్ గురించే తప్ప స్లండాగ్ సినిమా గురించి ఎంత మాత్రం కాదు.ఎందుకంటే ఆ సినిమా, భారతీయుల మనోభావాలను కించపరిచే విధంగా ఉండడం బాధాకరం.భరత జాతిని కేవలం ఒక నెగెటివిటిని చూపించి సొమ్ము చేసుకోవడం తప్ప
    మరేమీ కాదు.

    డా.రావికంటి మురళి .
    కరీంనగర్.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories