మనకు తెలియని మన ఘంటసాల

ghantashala

ఈ రోజు డిసెంబర్ 4వ తారీఖు. ‘అయితే ఏమిటి?’ అంటారా? ఈ రోజు మన గాన కళానిధి, అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జన్మదినం. 1922 జనవరి నాలుగున కృష్ణా జిల్లా చౌటుపల్లి గ్రామంలో జన్మించారాయన.

అంతకుమించి, మిగిలిన వివరాలలోకి వెళ్ళకుండా, ‘మనకు తెలియని మన ఘంటసాల’ అని ఎందుకన్నానో చెప్తాను. ఘంటసాల ఒక తెలుగు సినీ నేపధ్యగాయకుడిగా మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయన గాన గాంధర్వం ఒక్క తెలుగు భాషకే పరిమితం కాలేదు. తమిళం, కన్నడం, మళయాళం, సింహళం, చివరకు హిందీలో కూడా పాడారన్న విషయం బహుశా ‘నవతరంగం’ పాఠకుల్లో చాలామందికి తెలిసి ఉండొచ్చు కాని, సామాన్య జనాలకు తెలిసింది చాలా తక్కువ. ఒకవేళ తెలిసిన వాళ్లైనా ఆ పాటలు ఎప్పుడూ విని ఉండకపోవచ్చు.

ఈ సంవత్సరం ఫిబ్రవరి 11 న ఘంటసాల వర్ధంతికి ఒక నెల రోజుల ముందు నేను ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం వారికి ఒక ఉత్తరం రాస్తూ, ఆ రోజున ఘంటసాల గురించి మొక్కుబడి కార్యక్రమం కాకుండా, ఆయన ఇతర భాషల్లో పాడిన పాటలతో పొందుపరిచిన (తెలుగు పాటలతో పాటు) కార్యక్రమం ప్రసారం చెయ్యమని సూచించాను. హైదరాబాదులోనే నూకల ప్రభాకర్ అని ఒకాయన ఉన్నారని, ఘంటసాల పాటల మీది ప్రేమతో ఆయన ఘంటసాల తెలుగులో పాడిన ఎన్నో అరుదైన పాటలతోపాటు, ఇతర భాషల్లో పాడిన పాటలుకూడా, ఎంతో శ్రమకోర్చి సేకరించారని, ఆయనను సంప్రదించి ఒక కార్యక్రమాన్ని చేయమని ప్రభాకర్ గారి వివరాలు ఆకాశవాణి వారికి అందజేశాను.

ప్రభాకర్ గారి గురించి నాకెలా తెలిసిందంటే – కొంతకాలం క్రితం ఒకసారి హైదరాబాదు వెళ్ళినప్పుడు, ఘంటసాల గారి కూతుళ్ళలో ఒకరైన డా. ఘంటసాల శ్యామల గారిని కలవటం జరిగింది. ఆమె ద్వారానే ప్రభాకర్ గారి గురించి నాకు తెలిసింది.

నా సూచనను మన్నించి, ‘ఆకాశవాణి’ వారు ప్రభాకర్ గారిని తమ స్టూడియోకి రప్పించి, ఫిబ్రవరి 10న ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేశారు (ఆరోజు ఆదివారం కాబట్టి). అయితే, అది FM Rainbow లో ప్రసారం చేశారు. నేను ఢిల్లీలో DTH ద్వారా హైదరాబాదు రేడియో ప్రసారాలు వినగలిగినా, DTH లో FM Rainbow ప్రసారాలు రావుగనుక, వినలేకపోయాను. తర్వాత ప్రభాకర్ గారు నాకు ఈ మొత్తం కార్యక్రమాన్నీ మెయిల్లో పంపించారు.

అది ఈ రోజున ‘ఘంటసాల జన్మదినం’ సందర్భంగా ‘నవతరంగం’ సభ్యులతో పంచుకోవాలని నాకు అనిపించింది. అరుదైన ఈ ఘంటసాల పాటలు అందరూ వినే అవకాశం ‘నవతరంగం’ నిర్వాహకులు కలుగజేస్తారని ఆశిస్తాను.

ఈ పాటలు ఎలా సేకరించిందీ, ఎలా భద్రపరిచిందీ నూకల ప్రభాకర్ గారు కార్యక్రమంలో వివరించారు కాబట్టి నేనిక్కడ మళ్ళీ ప్రత్యేకంగా పేర్కొనటంలేదు. ఈ కార్యక్రమాన్ని గురించి మీ అభిప్రాయాలు నేరుగా ప్రభాకర్ గారికే ఈ క్రింది చిరునామాకు తెలియజేయండి.
E-mail: prabhayen@yahoo.com
Cell: 9440674477
ఘంటసాల శ్యామల గారి చిరునామా: shyamala_ghantasaala@yahoo.com

——————————————————–

ఘంటశాల-రేడియో కార్యక్రమం-మొదటి భాగం

ఘంటశాల-మొదటి భాగం

ఘంటశాల-రేడియో కార్యక్రమం-రెండవ భాగం

ఘంటశాల-రెండవ భాగం

ఘంటశాల-రేడియో కార్యక్రమం-మూడవ భాగం

ఘంటశాల-మూడవ భాగం

——————————————————–

కొన్ని అరుదైన చిత్రాలు

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

20 Comments to “మనకు తెలియని మన ఘంటసాల”

  • ప్రోగ్రాం చాలా ఆసక్తికరంగా సాగింది. కృతజ్ఞతలు

  • శేషు గారూ,
    ఇంత మంచి ప్రోగ్రామ్ ని అందరితో పంచుకున్నందుకు మీకు వేల వేల ధన్యవాదాలు.

  • ఘంటసాల గారు నాకు తెలిసి మూడే మూడు కాన్సర్ట్స్ ఇచ్చారు. అందులో ఒకటి షికాగీ అమెరికాలో 1973 లో ఇచ్చారు. అందులో పాడిన పాటలు నా మిత్రుడొకాయన రికార్డ్ చేసి అవి ఎం పి 3 ఫార్మాట్ లో నాకిచ్చారు. ఆ పాటలన్నీ నా దగ్గరున్నాయి. అందులో అరుదైన ఒక పాట ఉంది. అది “జన గణ మన” గీతం. వీలయితే నవతరంగంలో పెడదాం.

    ఆ పాటలో ఇంకో గొప్పతనం ఏమిటంటే – జగమే మాయ పాట సినిమాలో ఎలా పాడారో యథాతధంగా అలాగే స్టేజి మీద పాడారు. సాధారణంగా నేటి గాయకులెవరూ అలా పాడరు. కాస్తయినా అటు ఇటూ వరస చిన్నగా మార్చి పాడతారు.

    -సాయి బ్రహ్మానందం

  • గొర్తి-గారు,

    మీరు చెప్తున్న షికాగో కచేరీ 1970 చివరల్లో లో ఇచ్చినది. ఘంటసాల విదేశ పర్యటన (అమెరికా, జర్మనీ, …) చేసినది 1970/71ల్లో. ఆ సందర్భంలోనే వెలువడ్డ పుస్తకం: “భువన విజయం” (సం: వి.ఎ.కె.రంగారావు) . ఆయన, కేవలం అమెరికాలోనే, మూడు కంటే ఎక్కువే కచేరీలే ఇచ్చారు. మనకి ఈరోజు దొరుకుతున్నది రెండు. న్యూయార్క్, షికాగో. షికాగో కచేరి చాలా కాలంగా (సుమారు 2001 ప్రాంతంనుండి) సుసర్ల సాయి గారి సైటులో అందుబాటులో వుంది. న్యూయార్క్ కచేరీ సుమారు 1978-79 ప్రాంతం నుండి L.P గాను, తరువాత cassette గాను, ఇప్పుడు సి.డి గాను దొరుకుతుంది.

    ఈ మధ్య కాలంలో, పైన రేడీయో ప్రోగ్రాములో ప్రముఖంగా ప్రస్తావించబడిన కె.వి.రావు, డొక్కా శంకర్ గార్లు కలకత్తాలో యిచ్చిన కచేరీ సంపాదించగలిగారు. ఈ మూడు concerts మీరు ఇక్కడ http://www.ghantasala.info/inhisvoice/index.html వినవచ్చు. అలాగే మరిన్ని ఆడియోలు ఇక్కడ: http://www.ghantasala.info/theman/index.html

    మీరు చెప్తున్న జనగణమన పాట కలకత్తాలో పాడినది.

    – శ్రీనివాస్

    కొ.మె. పై వాక్యాలు రాస్తూ మొదటి భాగం విన్నాను. మొదట్లో వినిపించిన “నీ చిరునామా ఏమి” (ఆరుద్ర రచన) పాట మొదటిసారి 1987 లో, అదీను మద్రాసు స్టేషన్ లో (అప్పట్లో ఆ వూళ్ళో చదువుకునేవాణ్ణి) విన్నప్పుడు పొందిన అనుభవం మాటల్లో చెప్పలేను. తర్వాత పదేళ్ళకి, ఒక ఇండియా ట్రిప్‌లో, మళ్ళీ విజయవాడ స్టేషన్‌నుండి రికార్డు చేసుకోగలిగాను.

  • మంచి ఆడియో..మన లెగసీ ఇంకా బతికుంది అంటే ప్రభాకర్ గారిలాంటోళ్లవల్లనే. నాకు బాగా గుర్తు, గుంటూర్లో మా కుటుంబ స్నేహితులు శ్రీ పత్రి కృష్ణమూర్తి గారి దెగ్గరచాలా అరుదైన గ్రామోఫోన్లు ఉండేవి. ఈసారి దేశం వెళ్లినప్పుడు వాళ్ల అబ్బాయ్ని అడగాలి.

  • నిన్న రాత్రి ఎనిమిదిన్నరకు దూరదర్శన్ సప్తగిరి చానెల్ వారు, ఘంటసాల గారిపై చాలా చక్కని కార్యక్రమం ప్రసారం చేశారు. ఇది ఆయనతో ఇదివరలో చేసిన ఇంటర్వ్యూ నేపధ్యంగా సాగింది. కార్యక్రమంలో సినిమా క్లిప్పింగులతో పాటుగా, ఆయన పాటలకు రాసుకున్న notations కూడా చూపించడం బాగుంది. ఆ కార్యక్రమం నేను tape recorder లో రికార్డు చేసుకున్నాను. (పోయిన సంవత్సరం ప్రసారమైన కార్యక్రమం కూడా రికార్డు చేసుకున్నాను – అదీ ఆయన మాటలతో కూర్చినదే). ఈ ప్రోగ్రాం రెండో భాగం ఈ రోజు మద్యాహ్నం ఒకటిన్నరకు ప్రసారమవుతుంది. కాని నేను ఆఫీసుకు వచ్చేశాను కాబట్టి అది వినే/చూసే అవకాశం నాకు లేదు. మళ్ళీ ఎప్పుడైనా పునఃప్రసారం చేస్తారేమో చూడాలి.

    పరుచూరి శ్రీనివాస్ గారు “త్యాగయ్య” సినిమాకు రాసిన వ్యాఖ్యల్లో (సౌమ్య గారి సమీక్షకు) ఒకచోట ఘంటసాల కనపడతారు, గుర్తుపట్టారా? అని అడిగారు. తలపాగా ధరించిన ఆయనను గుర్తుపట్టడం కొంచెం కష్టమే. కాకపోతే, సప్తగిరి వారు బాణం గుర్తు పెట్టి మరీ చూపించారు. చాలా ఆనందమేసింది.

  • కృతజ్ఞతలు శేషుగారు! ఆద్యంతం అద్భుతంగా ఉంది. ప్రభాకర్ గారికి అసంఖ్యాక ధన్యవాదాలు.

  • బ్రహ్మానందం గారు గాని, పరుచూరి శ్రీనివాస్ గారు కాని, ఘంటసాలగారి ‘జనగణమన’ గీతాన్ని ‘నవతరంగం’ సభ్యులతో పంచుకుంటారని ఆశిస్తాను.

  • శేషు-గారు, ఆ పాట ఘంటసాల వెబ్ సైట్ పైన వుంది. పైన లింక్ ఇచ్చాను. గమనించగలరు.

    – శ్రీనివాస్

  • శేషుగారూ! ఈ కార్యక్రమాన్ని ఆసాంతం ఆసక్తితో విన్నాను. మీ సలహా పాటించి, అమరగాయకుడు ’ఘంటశాల’గారి మీద ఇంత మంచి కార్యక్రమం రూపొందించి ప్రసారం చేసిన ఆకాశవాణి వారు అభినందనీయులు. ఘంటశాలగారు ఇతర భాషల్లో గీతాలాపన చేశారన్న విషయం చాలామందికి తెలియదు. శ్రోతలకు ఈ విషయం తెలియజేస్తూ ఘంటశాలగారు పాడిన ఆణిముత్యాల్లాంటి పాటలను సేకరించి ఈ కార్యక్రమం ద్వారా వారికి వినిపించిన ప్రభాకర్‍గారికి ధన్యవాదాలు. ఘంటశాలగారి పేరు కొన్నిచోట్ల ’ఘంటశాల’గా మరికొన్నిచోట్ల ’ఘంటసాల’గా రాస్తునారు. ఏది ఒప్పు.

    రెండుచింతల భానుప్రసాద్

  • భానుప్రసాద్గారు ! ఘంటసాల కరెక్ట్ .
    సేషుగారు ! నవతరంగాన్ని నాకు పరిచయం చేసినందుకు కృతగ్యతలు . నాన్నగారి గురించి విశేషాలు చెప్పమని అడిగారు . మమ్మల్ని విశేషంగా ప్రభావితం చేసిన గొప్ప తండ్రి , స్ఫూర్తి ఆయన . ఎవరికైనా ఏదైనా ప్రత్యేకించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే అడగండి , చెప్తాను .
    అభినందనలతో ,
    శ్యామల

    • howmuchever we know about him, i feel something more is in store. please give the details of his journey in the cine field. please give the links to download songs of my alltime favourite singer. sree gurubhyo namaha.

    • I am proud to talk to the daughter of our beloved greatest singer Shri Ghantasaala venkateswara rao. you are so luckey to be the daughter of Ghantasaala.
      He is the lone singer the total world to remember for ever.His Bhagavadgeeta superb. No match in the world.He and his songs are “na bhooto na bhavishyathi” In fact I wonder are there any words in any language to describe or praise Ghantasaala. we are proud to be Telugu people and for living when Ghantasala lived.(samakaalikilu)
      (sorry I could not type in telugu because of our computer is not having such facility)

  • శ్యామల గారూ,

    మీరు మీ నాన్న్న గారి గురించి చెప్పిన అమెరికాలో చెప్పిన రెండు మాటలు – వినండి.

    http://www.sahitinandam.com/Ghantasala/029_005_Syamala.mp3

    శ్రీనివాస్ గారూ, మీరు చెప్పిన లింకులు విన్నాను. కానీ అందులో కొన్నిపాటలు వేరే కాంసర్ట్స్ నుండి పెట్టారు. నా దగ్గరున్నవి మాత్రం చికాగో కాంసర్ట్ వే! అలాగే హాయి హాయిగా పాట – వినండి. తేడా మీకే తెలుస్తుంది.

    ఇంకా ఇందులో ఘంటసాల గారిపై శ్రద్ధాంజలి కూడా ఉంది. ఎ ఎన్ ఆర్, పి బి శ్రీనివాస్, బాలమురళీల అభిప్రాయాలూ ఉన్నాయి. వీలయితే వినండి.

    http://www.sahitinandam.com/Ghantasala

    - సాయి బ్రహ్మానందం గొర్తి

    • Sir,

      Sri Balamurali’s shraddhanjali voice is not available in the given website address. hope steps will be taken to update the same.

      thanks a lot for providing us the great antique songs.

      your efforts are highly appreciable .

      satyasai.

  • గొర్తి-గారు,

    మీరు ఆ “హాయిహాయిగా పాట” అమెరికాలో, అదీను, షికాగో concertలో పాడారని అనుకుంటుంటే నేను చెప్పగలిగిందేమీ లేదు. అలాగే 1971లోనే ఆయన కుమార్తె శ్యామలగారు *అమెరికాలో* ఆ మాటలు మాట్లాడారు అనుకుంటే కూడా.

    ఆ పర్యటనలో జిక్కి ఆయనతో లేరు, ఆయన కుటుంబ సభ్యులు కూడా యెవరూ లేరు! 1971 నాటికి ఆ “హాయిహాయిగా” పాటని 1957లో (మొదటిగా సినిమలో) పాడినంత శక్తితో పాడగలిగే ఆరోగ్య పరిస్థితుల్లోను లేరు. ఆ రికార్డింగు ఆయన సమర్పించిన ఒక జనరంజని కార్యక్రమంలోనిది. శ్యామల-గారి గొంతుతో కలిపి “హే లోకప్రియ శ్యామలా” (టింగురంగా, 1952) అన్న పాట నూకల ప్రభాకర్ గారు (అక్కడ మీరు ఆయన గొంతు వినవచ్చు.) 2005-06 లో రికార్డ్/ఎడిట్ చేశారు. చివరిగా, ఆ “శ్రద్ధాంజలి” ఘంటసాల దివంగతులైన రోజు రేడియోలో ప్రసారమైన కార్యక్రమం.

    మీరు పైన ఇచ్చిన లింకులోని files వేర్వేరు ప్రోగ్రాములనుండి సంగ్రహించిన సంకలనం. ఇవన్నీ ఘంటసాల వెబ్‌సైట్‌లోనివి.

    సెలవు,
    – శ్రీనివాస్

    P.S. This is my last comment on this thread.

  • Srinivas garu,

    One of my friends who gave me these songs told me this. I was not in US at that time. I was not even 8 years old. I relied on his words. I trust you as well.

    My apologies if I hurt you.

    Thanks
    -Brahmanandam

  • శ్రీనివాస్ గారూ,

    ఘంటసాల పాడిన ‘జనగణమన’ విన్నాను. ఈ పాట, ఆయన పాడిన ‘ఝండా ఊంచా రహే హమారా’, అలాగే మరికొన్ని దేశభక్తి గేయాలు, ఆగస్టు 15, జనవరి 26 వంటి సందర్భాల్లో స్కూళ్ళల్లో వినిపిస్తే ఎంత బాగుంటుంది. కాని ఆ రోజున కూడా, పిల్లలతో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈనాటి సినిమాల్లోని మాస్ పాటలకే డాన్స్ నేర్పించి వేయిస్తున్నారు.

  • ఘంటసాల గారి వాషింగ్టన్ ప్రోగ్రాం (న్యూయార్క్, షికాగొ కాకుండా) నేను సేకరించడం జరిగింది.
    నవతరంగం వారు ఇస్ఠపడితే నేను పంపించగలను.

  • రమేష్ గారికి,మహానుభావులు ఘంటసాల స్వరం వినిపించమంటారా అని అడుగుతారేమిటి సార్?
    మీరు venkat.thedirector@googlemail.com కి ఒక మెయిల్ పంపండి

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories