ప్రముఖ సినీ నిర్మాత త్రివిక్రమరావు మృతి
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ తెలుగు సినీ నిర్మాత టి.త్రివిక్రమరావు ఈ రోజు హైదరాబాద్ లో కన్నుమూశారు. విశాఖపట్నానికి చెందిన త్రివిక్రమరావు స్వర్గీయ ఎన్.టి. రామారావుతో గల పరిచయంతో, ఆయన ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు తదితర ప్రముఖ నటులతో పలు చిత్రాలు నిర్మించారు.
ఆయన ఎన్టీఆర్‌తో నిర్మించిన జస్టిస్ చౌదరి చిత్రం అప్పట్లో రికార్డులు తిరగరాసింది. ఆయనకు, ఎన్టీఆర్‌కు ఎంతో పేరు తెచ్చింది. ఖైదీ రుద్రయ్య, ఆహ్వానం వంటి పలు చిత్రాలను ఆయన నిర్మించారు. హిందీలో సైతం అప్పటి అగ్రనటుడు జితేంద్ర హీరోగా పలు చిత్రాలు నిర్మించారు. ఆయన ఆఖరు సినిమా బద్రి..పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చింది. కొంతకాలంగా నిర్మాణరంగానికి ఆయన దూరంగా ఉన్నారు. త్రివిక్రమరావు మృతికి నవతరంగం శ్రధ్ధాంజలి ఘటిస్తూ…..