Sorry Bhai! (2008)

sorrybhai-lead

ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో రకరకాల కథాంశాలతో సినిమాలు వస్తున్నాయి. కొత్తదనం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారని తీస్తున్నారో లేక దర్శకుల్లోనే ఆ తాపత్రేయం ఎక్కువైందో తెలీదు కానీ, రకరకాల కథనాలతో, కథాంశాలతో సినిమాలు వస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటే ఈ “సారీ భాయ్”. పూర్తిగా మహా గొప్ప సినిమా అని చెప్పేంత దృశ్యం లేదు కానీ, ఒకట్రెండు సార్లు చూసుకుని నవ్వుకోవచ్చు. (I don’t give up : మనవాళ్ళేదో కెవ్ అని పక్క దేశాలు కూడా విరగబడి చూసేంత సినిమాలు తీస్తారని ప్రతి సినిమాలోనూ ఎదురుచూడ్డం అలవాటు ఐపోయింది లెండి నాకు. )

కథ: సిద్ధార్థ్ (శర్మన్ జోషి), హర్ష్ (సంజయ్ సూరి) అన్నదమ్ములు. వారి తల్లిదండ్రులు నవీన్ (బొమన్ ఇరానీ), గాయత్రి (షబానా ఆజ్మీ). మన కథలో ఐదో పాత్ర ఆలియా (చిత్రాంగదా సింగ్). సినిమా మొదటి దృశ్యం తరువాత “పదకొండేళ్ళ క్రితం” నాటి ఫ్లాష్ బ్యాక్ కి వెళుతుంది. సిద్ధార్థ్ ఒక సైంటిస్టు. సృష్టిలో ప్రతిదానిలోనూ ప్రాణం ఉందని అతని సిద్ధాంతం. దాన్ని నిరూపించే ప్రయత్నాల్లో ఉంటాడు. మారిషస్ లో ఉన్న అతని సోదరుడు హర్ష్ తన ప్రేయసిని పెళ్ళి చేసుకుంటున్నానని, ఇంట్లోవారిని రమ్మని ఫోన్ చేస్తాడు. ఉన్నట్లుండి కొడుకు ఎవర్నో పెళ్ళి చేసుకుంటా అనడంతో గాయత్రి అంత తేలిగ్గా ఒప్పుకోలేకపోతుంది. సిద్ధార్థ్ ఏదో ఒకటి చేసి తల్లిని ఒప్పించి తల్లితండ్రులతో సహా మారిషస్ వెళతాడు. హర్ష్ బిజీ ఉద్యోగ జీవితం వల్ల ఆలియానే వీళ్ళని ఊరు తిప్పుతూ ఉంటుంది. ఆమెలో హర్ష్ తనతో సమయం గడపడం లేదనీ, తన ఇష్టాలను పట్టించుకోడం లేదు అన్న అసహనం ఉంటుంది. ఈ సమయంలోనే సిద్ధార్థ్, ఆలియా ఒకరినొకరు ఇష్టపడతారు. సిద్ధార్థ్ అన్న పెళ్ళి చేసుకోబోయే మనిషిని నేను ఇష్టపడటం ఏమిటి అని తన్ను తాను అదుపు చేసుకుంటూ ఉంటాడు. కానీ, ఆలియా తన మనసు విప్పి సిద్ధార్థ్ కి చెప్పేస్తుంది. ఒకానొక సమయంలో ఇద్దరూ ఒకటౌతారు. హీరో(ల) తల్లి వీరిద్దరి సంబంధాన్ని అనుమానిస్తున్న సమయంలోనే అసలు విషయం కుటుంబంలో అందరికీ తెలిసిపోతుంది. సమస్య ఎలా పరిష్కారమైంది అన్నది మిగితా కథ.

శర్మన్ జోషి ని సైంటిస్టుగా ఊహించుకోడం కాస్త కష్టంగా ఉండింది కానీ, అతను మాత్రం చాలా బాగా చేసాడు, ఎప్పటిలాగే. గొప్ప కామిక్ టైమింగ్, జీవం ఉట్టిపడే మొహం, నటనలో ఉండే ఈజ్ – మూడు కలిసి శర్మన్ జోషి తెరపై కనిపించినంతసేపూ సినిమాలో బోర్ అన్నదే లేకుండా చేసాయి. సంజయ్ సూరి పర్వాలేదు. బొమన్ ఇరానీ -షబానా అజ్మీ గురించి ఇక చెప్పాలా? ఇద్దరి మధ్యా సమన్వయం చక్కగా ఉంది. వీరిద్దరి మధ్యా నడిచే సంభాషణలు కూడా నవ్వించాయి. అతనికి అస్తమానం తన భార్యని టీజ్ చేయడమే పని. ఆ ప్రక్రియలో వచ్చే డైలాగులు, దానికి షబానా స్పందనలు, వీరి మధ్య శర్మన్ జోషీ హావభావాలూ – చూస్తేనే తెలుస్తుంది ఎంత నవ్వుకుంటామో. చిత్రాంగదా సింగ్ ఇలాంటి పాత్రలకి అతికినట్లు సరిపోతుందేమో అనిపించింది ఈ సినిమా చూస్తే. “హజారో ఖ్వాహిషే ఐసీ” చిత్రంలో ఆమె పాత్రకీ, ఈ చిత్రంలోని పాత్రకి ఒక విధంగా ఆలోచిస్తే పోలికలు బానే ఉన్నాయి. అందుకే అనుమానం వచ్చింది – ఈ పాత్ర, దీనికి రాసిన సంభాషణలు చిత్రాంగద ని దృష్టిలో ఉంచుకునే రాసారేమో అని.

కథ ముప్పావు భాగం దాకా బానే సాగింది కానీ, నాకు ఆ ముగింపే కాస్త డల్ గా అనిపించింది. అంతవరకూ సరిగ్గా హ్యాండిల్ చేసుకున్న దర్శకుడు ముగింపు విషయంలో కాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండు అనిపించింది. అలాగే, శర్మన్ జోషీ, చిత్రాంగదలు ఇద్దరూ శారీరికంగా ఏకమయ్యే దృశ్యాలు అసలుకే పెద్ద అవసరం లేదనిపిస్తే, అంతసేపు చూపడం ఇంకా అనవసరం ఏమో అనిపించింది. కానీ, బహుశా, వ్యాపారపరంగా చూస్తే, వారికి సబబనిపించి ఉండవచ్చు. దర్శకుడు పాత్రలకి నటీనటులని బాగా ఎంపిక చేసుకున్నాడు. ఎవరి పాత్రకి వారు సరిగ్గా సరిపోయారు. ఈ సినిమా మొత్తానికైతే మంచి టైంపాస్ సినిమా. చాలా చోట్ల బాగానే నవ్వుకోవచ్చు. ప్రధానంగా శర్మన్ జోషీ, బొమన్ ఇరానీల సినిమా ఇది.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

సౌమ్య

రచయిత:

8 Comments to “Sorry Bhai! (2008)”

  • నాకూ అలాగే అనిపించింది. దర్శకుడు ఓనీర్ కి ఇలాంటి కథ నల్లేరుపై బండి నడకలాంటిది. కానీ ద్వితీయార్థంలో కొంత పట్టు సడలినట్టనిపించింది. షబానా ఆజ్మీ పాత్ర చాలా complex పాత్ర. అంత పరిణితి చెందిన నటికాబట్టే పోషించగలిగిందిగానీ..ఇంకెవరన్నా అయితే ఎబ్బెట్టుగా తయారయ్యేది. హీరోల సంగతి పక్కనబెడితే చిత్రాంగదా సింగ్ కి నేను పెద్ద ఫంకా నైపోయాను. She rocks.

  • Hi Mahesh Garu,

    Nenu Jonathan ni okasari medaggara ‘ Ore Kadal’ DVD teesukuvellanu, i like to meet you once and talk to you about my one of my script.

    this is my number 9703199898

    JV

  • @జానథన్: నాకొకసారి mail చెయ్యండి (mahesh.kathi@gmail.com)

  • >>హిందీ మన జాతీయభాష అయినంతమాత్రానా, హిందీ సినిమాలు మన జాతీయ సినిమాలు ఎలా అవుతాయో నాకు అర్థంకాని విషయం.
    మహేష్‌గారు, మీకు అర్థం కాని విషయం ఏమిటంటే, హిందీ మన జాతీయ భాష కానే కాదు.

    http://www.indiastudychannel.com/forum/14208-Hindi-NOT-National-language-India.aspx

  • @నవీన్ గార్ల: మీరు చూపించిన లంకెలోకి వెళ్ళి చూసాను. కానీ అక్కడున్నది సగం కథ మాత్రమే. నాకూ సందేహం కలిగి కొన్ని Government of India sites లేదా వాటి అనుబంధ సంస్థల లంకెలు చూసాను. అవి ఇక్కడ ఇస్తున్నాను చూడండి.
    http://india.gov.in/knowindia/official_language.php
    http://india.gov.in/outerwin.htm?id=http://www.rajbhasha.gov.in

  • ఈ సినిమాకు ప్రేరణ Steve Carell నటించిన Dan in Real life (2007) అనిపిస్తుంది. కధా పరం గా చూస్తే, దీన్లో లాగే తమ్ముడు ప్రేమించిన అమ్మాయి అన్నతో సన్నిహితం గా మెలిగి, వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్ఠపడటం, ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకి చెప్పలేక నలిగిపోవటం. ఒకవేళ మీరు ఆ సినిమా చూడకపోతే చూడండి.

    http://www.imdb.com/title/tt0480242/

  • నాకైతే ఈ సినిమా ఎందుకో బ్లేమ్ ఇట్ ఆన్ రియో కి దగ్గరగా అనిపించింది.

    ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. ఇదే కథను మన దేశంలో చెప్పొచ్చు కదా. ఎందుకు మారిషశ్ లో తీసుకెళ్ళడం. అదేంటో నాకిలా విదేశాల్లో తీసే దేశీ సినిమాలు పెద్దగా నచ్చవు. కానీ చిన్న కథను బాగానే చివరి వరకూ బాగానే లాక్కొచ్చాడు.

    అలాగే ఈ సినిమా ఎవరైనా చూడాలనుకుంటే చిత్రంగధా సింగ్ కోసం తప్పక చూడాలి. చాలా బావుంది.చాలా బాగా చేసింది కూడా…..అందం-నటన కాంబినేషన్ ఉన్న చిత్రాంగధా మరిన్ని సినిమాల్లో వస్తే బావుణ్ణు.

  • వేణు గారూ,
    మీరు ఆంధ్రఫోల్క్స్ లో సమీక్షలు, సినిమా కబుర్లు రాస్తుంటారు కదా! మీరు ఆ వేణు ఒకరేనా?
    ఒకరే అయితే మీరూ నవతరంగంలో చేరాలని ఇదే మా అహ్వానం.
    మీకు ఇష్టమైతే navatarangam at gmail dot com కి మైల్ చేయండి.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories