Menu

ప్రకటన-వెంటనే కావలెను

వెంటనే కావలెను-ప్రేక్షకులు: తెలుగు సినిమా

వేగంగా అభివృధ్ది చెంది దేశంలోనే రెండో స్ధానంలో ఉండి మరింత విస్తరించటానికి రెడీ గా ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు ఈ క్రింద తెలిపిన అర్హతలు కల వారు కావెలెను. భారీ బడ్జెటులతో నిర్మించే మా నీచమైన చిత్రాలకు భారీగా ప్రేక్షకులు కావలెను.

అర్హతలు

  • రెండు కళ్లతో సరిగ్గా చూడగలిగినారు (మెదుడు లేకపోవటం మరీ బెస్ట్)
  • ఎటు వంటి చెత్త చిత్త తీసినా ఆహా..అధ్బుతం అనుకుంటూ చూసే ఓపిక ,తీరిక అత్యవసరం.
  • ప్రతి సినిమా ఎలా ఉన్నా హిట్ గా ప్రచారం చేయగల సామర్ధ్యం
  • టిక్కెట్టు ధర ఎంతైనా నవ్వుతూ ఖర్చు పెట్టగల ఔదార్యం
  • ఒకే కథను పదే పదే చూపినా అద్బుతం అనగల హృదయ వైశాల్యం
  • సమాజంలో గౌరవనీయ వర్గాలని చౌకబారుగా చూపినా విమర్శించకుండా ఎంజాయ్ చేయగలగటం
  • నటనంటే తెలియని నటవారసులు నటిస్తూంటే..జీవిస్తూన్నారని టప్పట్లు తో ఆశ్వీదరించటం.
  • ఆడియో రిలీజ్ రోజునే సూపర్ హిట్ పాటలు అంటే నిజమే అని నమ్మేయటం.
  • టివీ లో సెకన్ సెకన్ కి చూపే యాడ్స్ చూసి సినిమా హిట్టు అనే నిర్ణయానికి రావటం.
  • మూస వదలని సినిమాలకే మాస్ సినిమాలని పేరు పెట్టి పొగడటం
  • సినిమా నిండా ఇతర భాషా నటీనటులు నిండిపోతే ‘జాతీయ సమైక్యత’ అని మురవటం.
  • తెలుగు సినిమాల్లో పొరపాటున కూడా తెలుగు వెతికే ప్రయత్నం చేయకపోవటం.
  • కథని,హీరోయిజాన్ని డామినేట్ చేసే గ్రాఫిక్స్ ని ఎంకరేజ్ చేయటం..వాళ్ళని టెక్నికల్ దర్శకులని ఆకాశానికి ఎత్తటం.
  • మేగ్జిమమ్ రీమేక్,ఫ్రీమేక్ చిత్రాలనే చూస్తానని ప్రతిజ్ఞ చేయటం.

ఇలా పై లక్షణాలు కలవారు ప్రేక్షకులగా మారటానికి రోజు మొత్తం మీద సంపాదించిన మొత్తం తీసుకుని మీ దగ్గర థియేటర్ కి రాగలరు. ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టి మేం తీసే చెత్త సినిమాని ఇరవై రూపాయల సిడితో చూడకూడదు.

ముందు వచ్చిన వారికి ముందు బాధపడే అవకాశం.

త్వరపడండి..తెర ఎదుటపడండి

ఇట్లు

తెలుగు సినీ పరిశ్రమ

(వరస పరాజయాలతో విలజిల్లుతున్న తెలుగు సినీ పరిశ్రమ ఇటువంటి ప్రకటన ఇవ్వటం తప్ప వేరే దారి లేదు)

13 Comments
  1. రెండుచింతల భానుప్రసాద్ December 23, 2008 / Reply
  2. tata December 23, 2008 / Reply
  3. a2zdreams.com December 23, 2008 / Reply
  4. జాన్ అప్పారావు December 23, 2008 / Reply
  5. మేడేపల్లి శేషు December 24, 2008 / Reply
  6. janahita December 26, 2008 / Reply
  7. Jonathan December 29, 2008 / Reply
  8. JAYA January 8, 2009 / Reply
  9. తాడేపల్లి January 24, 2009 / Reply
  10. Balaji sanala April 6, 2011 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *